హాయ్ కియోస్క్ ముందు భాగం , స్మార్ట్ కియోస్‌్కలో ఫ్రీ కాలింగ్, చార్జింగ్ పోర్టల్
‘ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది.. ట్రైన్ మరో 15 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఈ లోపు ప్లాట్‌ఫారమ్‌పై ఎక్కడో ప్లగ్ పాయింట్ వెదుక్కుని చార్జింగ్ పెడితే మహా అయితే 10 శాతం చార్జ్ అవుతుంది. ఇప్పుడా చింతే లేదు.. ఇకపై 100 శాతం చార్జింగ్‌ని కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో చేసుకోవచ్చు.’
రైలెక్కడానికి స్టేషన్‌కు చేరుకున్నారు. సేఫ్‌గా రీచ్ అయ్యానని ఇంటికి చెయ్యాలని ఫోన్ చేస్తే బ్యాలెన్స్ నిల్ అని వాయిస్ మెసేజ్. అరె అని బెంగ పడాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా.. దర్జాగా ఇంటికి కాల్ చేసుకోవచ్చు.
ఇలా.. ఎన్నో సౌకర్యాల్ని సూపర్‌ఫాస్ట్‌గా అందించేందుకు దేశంలోనే తొలిసారిగా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చేస్తోంది. అదే.. హాయ్. పూర్తిగా చెప్పాలంటే.. హ్యూమన్ ఇంటరాక్టివ్ ఇంటర్‌ఫేస్. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లోని మొదటి ప్లాట్‌ఫామ్‌లో గురువారం నుంచి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వస్తున్న హాయ్ సేవల విశేషాలివీ..
సాక్షి, విశాఖపట్నం: హాయ్ .. (హెచ్‌ఐఐ..హ్యూమన్ ఇంటరాక్టివ్ ఇంటర్‌ఫేస్) అని పిలిచే ఈ స్మార్ట్ డిజిటల్ కియోస్‌్క, డిజిటల్ బిల్ బోర్డు కలిసి ఉండేలా సేవలందించే ఓ సిస్టమ్. ఒడిశాకు చెందిన నెక్సైటీ స్టార్టప్ కంపెనీకి చెందిన బృందం దీన్ని రూపొందించింది. రైల్వే స్టేషన్‌లో సగటు ప్రయాణికుడు పొందాల్సిన అన్ని సౌకర్యాలు హాయ్ ద్వారా అందనున్నాయి. ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌లో గురువారం నుంచి హాయ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఎలా ఉంటుందీ హాయ్..?
►ఒక్కో హాయ్ కియోస్‌్కలో 50 ఇంచీల ఎల్‌ఈడీ స్క్రీన్లు వెర్టికల్ మోడ్‌లో ఉంటాయి. ముందు, వెనుక భాగాల్లో రెండు స్క్రీన్లు ఉంటాయి.
►ముందు భాగంలోనూ, వెనుక భాగంలోనూ 6 చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి.
►కియోస్క్ కుడి వైపున 10 ఇంచీల ఇంటరాక్టివ్ టేబుల్ ఉంటుంది.
►అదే విధంగా రెండు యూఎస్‌బీ పోర్టులు, ల్యాప్‌టాప్ చార్జింగ్ కోసం ఒక త్రీ పిన్ ప్లగ్ ఇంటరాక్టివ్ టేబుల్ కింద ఉంటుంది.
హాయ్ అందించే సేవలివీ..
►హాయ్ కియోస్క్ ద్వారా ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు.
►మొబైల్స్‌కు కేవలం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే ఫుల్ ఛార్జింగ్ పూర్తయ్యేలా సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం ఉంది.
► రైళ్ల రాకపోకల టైం టేబుల్, ట్రైన్ రన్నింగ్ స్టేటస్‌ను కియోస్క్‌లో ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా తెలుసుకోవచ్చు.
►అదే విధంగా గూగుల్ మ్యాప్, సిటీ మ్యాప్‌లు ఇంటరాక్టివ్ ట్యాబ్లెట్‌లో పొందుపరిచి ఉన్నాయి. ఏయే ప్రాంతాల్లో, ఏ సందర్శనీయ స్థలాలున్నాయి? ఎక్కడికైనా వెళ్లాలంటా ఆ ప్రాంతం ఎంత దూరంలో ఉంది .. ఇలా ఏ వివరాలైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు.
►ఫ్రీ కాల్స్ సౌకర్యం ఉన్నందున ప్రాంక్ కా ల్స్, ఫేక్ కాల్స్‌తో పాటు బెదిరింపు కా ల్స్ చేసే ప్రమాదముంది. అందుకే, కా ల్స్ చేసే ప్రతి ఒక్కరి ముఖాన్ని స్కాన్ చేస్తుంది. ఎవరు, ఎక్కడికి కాల్ చేశారో వారి ఫోటో నిక్షిప్తమవుతుంది. ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని కాల్ చెయ్యాలని ప్రయతి్న స్తే ఫోన్ కాల్ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం 33 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.
►ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రజోపయోగమైన సమాచారంతో పాటు ప్రకటనలు కూడా ప్రదర్శించవచ్చు. దీని ద్వారా వాల్తేరు డివిజన్‌కు ఆదాయం కూడా రానుంది.
ప్రయాణికుల సౌకర్యం కోసమే..
రైల్వే ప్రయాణికులు స్టేషన్లలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గాల్ని అన్వేíÙంచాలని నిర్ణయించుకున్నాం. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే హాయ్. రైల్వే స్టేషన్‌కు వచ్చిన సగటు ప్రయాణికుడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, సాఫీగా ప్రయాణం సాగించేలా హాయ్ డిజిటల్ కియోస్‌్కని రూపొందించాం. తొలిసారిగా విశాఖలో సేవలు ప్రారంభిస్తున్నాం. మిగిలిన రైల్వేస్టేషన్లకు విస్తరించేందుకు కృషి చేస్తాం.
– చిరంజీవి నాయక్, నెక్సైటీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment