నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దొంగలు రెచ్చిపోయారు. స్థానిక అంబెడ్కర్ చైరస్తాలో ఉన్న నాలుగు దుకాణాల్లో దొంగలు పడి నగదు ఎత్తుకెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి స్థానిక ఫొటోస్టూడియో సహా మరో మూడు దుకాణాల షటర్లు పగలగొట్టి దొంగలు చోరీలకు పాల్పడ్డారు.
బుధవారం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీల ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు. చోరీలకు పాల్పడింది. గురుగోవింద్‌నగర్‌కు చెందిన యువకులుగా అనుమానిస్తున్న పోలీసులు గురుగోవింద్‌నగర్‌లో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు.