కమ్మలు పెట్టుకునే చెవి రంధ్రాలు కొందరికి మరీ సాగినట్టు కనిపిస్తాయి. కొందరికైతే సాగిన చెవి రంధ్రాలు తెగిపోయి కూడా కనిపిస్తాయి. పెద్ద పెద్ద ఆభరణాలు ధరించడం వల్ల... వయసు పైబడి చర్మం బలహీనంగా మారడం వల్ల ఇలా జరుగుతుంటాయి. ఈ సమస్యకు రెండు పద్ధతుల ద్వారా చికిత్స ఉంటుంది.
కార్టిలేజ్ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా బలహీనంగా ఉన్న చెవి రంధ్రాన్ని పూర్తిగా మూసేసి, ఆ ప్రాంతంలో చర్మాన్ని శక్తిమంతం చేస్తాం. తర్వాత మళ్లీ రంధ్రం చేస్తాం. ప్లాప్ మెథడ్ ద్వారా చెవిరంధ్రాన్ని పూర్తిగా మూసేయకుండా చిన్నదిగా మారుస్తాం. ఈ పద్ధతులకు ఒక గంట సమయం పడుతుంది. ఆ తరువాత గంటలో ఇంటికి వెళ్లిపోవచ్చు.
నోట్: బరువున్న ఆభరణాలు దీర్ఘకాలం ఉపయోగించకూడదు. ఏ వయసు వారైనా ఈ చికిత్స చేయించుకోవచ్చు. ఆసుపత్రిని బట్టి రూ.10-15 వేలు ఖర్చు అవుతుంది.
- డా. మురళీమనోహర్ రెడ్డి, ప్లాస్టిక్ సర్జన్
చెవి రంధ్రం సాగితే!
Published Wed, Feb 12 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
Advertisement
Advertisement