చూసేందుకు చిన్నదే..కానీ ఆదరణ పెద్దది..! | Jewelry Boxes Encase Curtis Talwst Santiagos Elaborately | Sakshi

చూసేందుకు చిన్నదే..కానీ ఆదరణ పెద్దది..!

Jan 27 2025 5:55 PM | Updated on Jan 27 2025 6:09 PM

Jewelry Boxes Encase Curtis Talwst Santiagos Elaborately

ఆభరణాల పెట్టెలో భారీ విశ్వం, నాలుగు అంగుళాలకు మించని మినీ బీచ్‌లో బృందాల జలకాలాటలు, అతి పెద్ద గొడపై నిలిచిన అతి చిన్ని డబుల్‌ థ్రెషోల్డ్‌... అబ్బురం అనిపించే ఈ సూక్ష్మ చిత్ర కళ ఇప్పుడు ప్రపంచంలో పెద్దగా ప్రజాదరణ పొందుతోంది. ఆర్ట్‌ గ్యాలరీలు, ఆర్ట్‌ ఫెయిర్స్‌లో ఈ కళ కొత్తగా ఆకట్టుకుంటుంది. ప్రపంచ ఆర్ట్‌ ప్రియులు కళ ఇలా రూపు మారడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఆర్ట్‌ మార్కెట్‌ను మినియేచర్‌ ఆర్టిస్టులు ఏలేస్తున్నారు అని ప్రశంసిస్తున్నారు

దేశీయ మినియేచర్‌
ఇటీవల కాలంలో భారతదేశంలో అనేక మినీయేచర్‌ పెయింటింగ్‌ స్కూళ్లు పుట్టుకువచ్చాయి. ప్రతి ఒక్కటి దాని సాంస్కృతిక, ప్రాంతీయ, చారిత్రక సందర్భాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా ఆకట్టుకుంటున్నది మొఘల్‌ స్కూల్‌ ఆఫ్‌ మినియేచర్‌. దీనిలో కిషన్‌గఢ్‌ శైలి, రాధా కృష్ణుల దైవిక ప్రేమలు మరింత ప్రత్యేకమైనవి. పహారీ స్కూల్‌ హిమాచల్‌ ప్రదేశ్, జమ్మూలోని కొండ ప్రాంతాలలో అభివృద్ధి చెందింది. దక్కన్‌ స్కూల్‌ పర్షియన్, టర్కిష్, భారతీయ అంశాల కలయికను ప్రదర్శిస్తుంది. సూక్ష్మ చిత్రాలలో వెలసిన పచ్చని ప్రకృతి దృశ్యాలు, అద్భుతమైన థీమ్‌లో ఇవన్నీ విభిన్నంగా ఉంటాయి. 

విదేశాలలో సూక్ష్మ కళ
సంవత్సరాల క్రితం కెనడియన్‌ మినియేచర్‌ ఆర్టిస్ట్‌ శాంటియాగో తనదైన పనితనంతో ఇంట్లోనే చిన్న చిన్న పెయింటింగ్స్‌ వేస్తూ, శిల్పాలు చెక్కుతూ ఉండేవాడు. కెనడియన్‌ కలెక్టర్‌ బ్రూస్‌ బెయిలీ శాంటియోగోను కలిసినప్పుడు అతని కళా నైపుణ్యాన్ని చూసి కొంతకాలం ‘ఓపికపట్టండి’ అని చెప్పాడట. శాంటియాగో నవ్వుతూనే కాలక్రమంలో అందరూ వదిలేసిన వుస్తవులను అతి చిన్న నమూనా బొమ్మలను తయారుచేశాడు. ఒక జత కఫ్‌లింగ్‌లకు సరిపోయేంత పెట్టెలో ఒక సముద్రాన్నే సృష్టించాడు. 

కాలక్రమంలో కళాభిరుచిగలవారు ఈ సూక్ష్మ కళ ప్రాముఖ్యతను గుర్తిస్తారని అతను నమ్మాడు. ఈ విషయాన్ని బెయిలీ ప్రస్తావిస్తూ ‘2018లో శాంటియాగో పని తనాన్ని చూసినప్పుడు, నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇన్నాళ్లకు నిజమయ్యింది’ అంటాడు. ఇటీవల గ్యాలరీలలో అతి చిన్న కళాకృతులు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘మనుషుల ఆలోచనలు ఎలా మారతాయో చూడటం ఆసక్తికరంగా ఉంది’ అంటాడు శాంటియాగో. 

2010 చివర 2020ల ప్రారంభంలో సూక్ష్మ కళ అత్యున్నత శిఖరాలకు వెళ్ళిన సమయంగా చెప్పుకోవచ్చు. దీనిని యువ చిత్రకారులు చాలా ముందుకు తీసుకెళ్లారు. ఈవిషయం గురించి శాంటియోగో వివరిస్తూ ‘నేను ఇంతటి ఆదరణను ఊహించలేదు. ఆర్ట్‌నెట్‌ ప్రైస్‌ డేటాబేస్‌ ద్వారా సెకండరీ మార్కెట్‌లో ప్రదర్శించిన ఆర్ట్‌ను పరిశీలిస్తే కిందటి సంవత్సరం దాదాపు 2 మిలియన్లకు అమ్ముడైన పెయింటింగ్‌ ఉంది. అదేవిధంగా డిజిటల్‌ పెయింటింగ్‌లు, సైక్లాడిక్‌ మాస్క్,  జపనీస్‌ హెల్మెట్‌ స్టాండ్‌ వంటివి ఉన్నాయి. 

మెక్సికోలో సూక్ష్మ ఆర్ట్‌ గ్యాలరీ
మహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉన్నారు. అప్పుడు వారి చూపు తమ ఇంటీరీయర్‌ వైపు మళ్లింది. అప్పుడే తమలోని సృజనకు పదును పెట్టినవారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది. షార్ప్‌ టైలర్‌ అనే కళాకారుడు మెక్సికో నగరంలో ‘లులు’ అనే సూక్ష్మ ఆర్ట్‌ గ్యాలరీని నడిపేవాడు. ఆ తరువాత లాస్‌ ఏంజిల్స్‌లోని పెద్ద స్టూడియోకు తన చిత్రకళను మార్చాడు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తమ దేశీయ సంస్కృతికి కళాకారులు అద్దం పడుతూనే ఉన్నారు.  

సోషల్‌ మీడియా ప్రభావం
పరిమాణంతో సంబంధం లేకుండానే  సోషల్‌ మీడియాలో ఈ చిత్రకళా ప్రదర్శన నిత్యం జరుగుతూనే ఉంది. అతి పెద్ద గోడలపైన అతి చిన్న కళాకృతి ఆసక్తిని రేపుతుంది.‘ చిత్రాలలో అంతర్లీనంగా ఉన్న సున్నితత్వం తోపాటు రహస్యం దాగుంటుంది. దానిని కనుక్కోవడంలో చేసే ప్రయత్నం అత్యంత మనోహరంగా ఉంటుంది’ అంటున్నారీ కళాకారులు.  

(చదవండి: భారత్‌ యువకుడిని పెళ్లాడిన గ్రీకు అమ్మాయి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement