రైళ్లలో ప్రయాణిస్తూ దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే బిహార్ గ్యాంగ్ విశాఖ రైల్వే పోలీసులకు చిక్కింది.
రైళ్లలో ప్రయాణిస్తూ దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే బిహార్ గ్యాంగ్ విశాఖ రైల్వే పోలీసులకు చిక్కింది. శనివారం మధ్యాహ్నం కాకినాడ- విశాఖ ప్యాసింజర్ రైలు నుంచి దిగిన ఆరుగురు సభ్యుల బిహార్ ముఠాను జీఆర్పీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు నేతృత్వంలో సిబ్బంది పట్టుకున్నారు. వారి నుంచి రూ.6 లక్షల విలువ చేసే 250 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్‌కు తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.