
ముంబై: రిలయన్స్ జుయల్స్ 14వ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పటికే కొనసాగుతున్న ‘ఆభర్’ జుయలరీ కలెక్షన్ విక్రయాల పండుగను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. చేతితో రూపొందించిన వినూత్నమైన బంగారం, వజ్రాల చెవి ఆభరణాలు ఇందులో ప్రత్యేకమని సంస్థ తెలిపింది. నూతన శ్రేణి చెవి రింగులను ఆవిష్కరించడంతోపాటు.. ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 1 వరకు చేసే కొనుగోళ్లపై ఆభరణాల తయారీ చార్జీల్లో 20 శాతం తగ్గింపునిస్తున్నట్టు సంస్థ తెలిపింది.