ఎత్తు తక్కువ ఉన్నవారు పొడవుగా కనిపించాలన్నా, సన్నగా ఉన్నవారు కొంచెం బొద్దుగా కనిపించాలన్నా ఈ చిన్న చిన్న కిటుకులు పాటించాలి...
ఎత్తు తక్కువ ఉన్నవారు చిన్న అంచు(బార్డర్) లేదా అసలుఅంచు లేని చీరలు కట్టుకుంటే పొడువుగా కనిపిస్తారు.చర్మరంగుకు దగ్గరగా ఉండే రంగు దుస్తులను ధరిస్తే మీ రూపం పొడువుగా కనిపిస్తుంది. సన్నగా ఉన్నవారు అలంకరణలు ఎక్కువ ఉన్న అంటే గ్రాండ్‌గా ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులు, చీరలు కట్టుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు.నలుపు, ఎరుపు, నీలం.. వంటి బాగా ముదురు రంగు దుస్తుల మీదకు బంగారు ఆభరణాలు ధరిస్తే అందం రెట్టింపు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బొద్దుగా ఉన్నవారు చర్మం రంగు దుస్తులు ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు.బొద్దుగా, ఎత్తు తక్కువ ఉన్నవారు చారల దుస్తులు, చీరలు ధరించాలంటే.. నిలువు చారలున్నవి ఎంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment