సరికొత్త ఫ్యాషన్‌ : నగరంలో బ్యాంబూ బట్టలు.. | Latest fashion bamboo clothes check details here | Sakshi
Sakshi News home page

సరికొత్త ఫ్యాషన్‌: నగరంలో బ్యాంబూ బట్టలు..

Published Wed, Jan 29 2025 4:28 PM | Last Updated on Wed, Jan 29 2025 4:42 PM

Latest fashion bamboo clothes check details here

సరికొత్త ఫ్యాషన్‌కు నాంది 

పర్యావరణహితంతో పాటు చర్మసంరక్షణ 

వినూత్నంగా ‘హౌస్‌ ఆఫ్‌ స్వాషా’ 

సాక్షి, సిటీబ్యూరో: ప్రతి ఒక్కరూ అధునాతన జీవనశైలి కోసం పరుగెడుతున్న రోజులివి. ఈ ప్రయాణంలో ఫాస్ట్‌ఫార్వర్డ్‌ ఫ్యాషన్‌  అందరినీ ఆకర్షించడంతో పాటు ఎన్నో వినూత్న మార్పులకు నాంది పలుకుతోంది. ప్రస్తుత కాలంలో సుస్థిరత, మన్నిక తగ్గిపోతుందని, ముఖ్యంగా ఫ్యాషన్, ఫ్యాబ్రిక్‌ రంగాల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందన్నది నిపుణుల మాట. ఇందులో భాగంగా నగరవాసులకు మన్నికతో పాటు పర్యావరణహితమైన దుస్తులను అందిస్తామంటున్నారు స్వాతి, షాచి. వీరు ప్రారంభించిన హౌస్‌ ఆఫ్‌ స్వాషా వినూత్నంగా బేంబూ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన టీ షర్టులు, సాక్స్‌లు అందిస్తున్నారు. వివిధ రాష్ట్రాలర్ల ఆన్‌లైన్‌ వేదికగా తమ సేవలందిస్తూనే హైదరాబాద్‌లో మాత్రం భౌతికంగానూ స్టోర్‌ ప్రారంభించి సరికొత్త సంస్కృతికి నాంది పలికారు.  

నూతనత్వానికి వేదిక.. 
బ్యాంబూ ఫ్యాబ్రిక్‌ అనేది చర్మానికి సున్నితత్వాన్ని, అలర్జీల నుంచి రక్షణతో పాటు స్కూల్‌ చిన్నారులకు ఈ ఫ్యాబ్రిక్‌ సాక్సులు యాంటీబ్యాక్టీయల్‌ సంరక్షణను అందిస్తాయని వ్యవస్థాపకులు తెలిపారు. వినూతనత్వాన్ని అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్‌ ముందుంటుందని, ఈ నేపథ్యంలోనే నగరంలోని జూబ్లీహిల్స్‌ వేదికగా స్టోర్‌ ప్రారంభించారని పేర్కొన్నారు. పర్యావరణహితమైన బ్యాంబూ ఫ్యాబ్రిక్‌తో పాటు రసాయనాలు వినియోగించని పంటల నుంచి సేకరించిన కాటన్, కాలిఫోరి్నయాలో మాత్రమే లభించే పీమా కాటన్‌తో హౌస్‌ ఆఫ్‌ స్వాషా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ పీమా కాటన్‌ ప్రపంచవ్యాప్తంగా ఒక శాతం మాత్రమే ఉంటుంది.  

అంతా హ్యాండ్‌మేడ్‌... 
ఆఫర్లలో వస్తున్నాయని నాణ్యతలేని దుస్తులు కొని రెండు, మూడు సార్లు ధరించి పక్కన పడేయడం ఈ తరం అలవాటుగా మారింది. దీని వల్ల పర్యావరణానికి హాని కలుగుతోంది. దీనికి స్వస్తి పలకాలనే లక్ష్యంతో హౌస్‌ ఆఫ్‌ స్వాషా ప్రారంభించాం. ఎలాంటి ప్రచారాలు చేయకపోవడం వల్ల తక్కువ ధరకే కస్టమర్లకు అందించగలుగుతున్నాం. మిషనరీ వాడకుండా చేనేతకారులతో వీటిని తయారు చేస్తున్నాం. కుట్టడం, కలరింగ్, డిజైనింగ్‌ అన్నీ మనుషులతోనే చేయిస్తున్నాం. వస్త్రరంగ ఉత్పత్తులపై జైపూర్, అహ్మదాబాద్, కోయంబత్తూర్‌ వంటి విభిన్న ప్రదేశాల్లో పర్యటించి పలు అంశాలను సేకరించి నాణ్యతలో మెళకువలు పాటిస్తున్నాం. ఈ మధ్య నగరంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఉద్యాన్‌ ఉత్సవ్‌లో  ప్రశంలు పొందాం. 
– స్వాతి, వ్యవస్థాపకురాలు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement