నగలు... కష్టాలు! | Deepika Padukone Puts Shoot On Hold | Sakshi
Sakshi News home page

నగలు... కష్టాలు!

Published Sun, Apr 16 2017 12:54 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

నగలు... కష్టాలు!

నగలు... కష్టాలు!

రాణి పద్మిని జీవితం ఆధారంగా సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పద్మావతి’. ఈ చిత్రం షూటింగ్‌కి ఇప్పటికే పలు ఆటంకాలు ఎదురయ్యాయి. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ సినిమాని ఆపివేయాలని కొందరు వివాదం రేపారు. ఆ తర్వాత ఈ చిత్రం లొకేషన్‌లో ఓ ప్రమాదం జరిగింది. ఇప్పుడు టైటిల్‌ రోల్‌ చేస్తోన్న దీపికా పదుకొనె కారణంగా షూటింగ్‌కి ఆటంకం ఏర్పడింది.

మహరాణి పాత్ర కాబట్టి బరువైన ఆభరణాలు ధరిస్తున్నారు దీపిక. సుకుమారి శరీరం ఈ నగలను మోయలేకపోతోందట. నగలు మాత్రమే కాదు.. ఈ చిత్రం కోసం ఆమె ధరిస్తున్న కాస్ట్యూమ్స్‌ బరువు కూడా ఎక్కువేనట. ఈ భారం మోయలేక దీపిక నానా అవస్థలు పడుతున్నారని సమాచారం. దీపిక మెడ దగ్గర నొప్పి మొదలైందని వినికిడి. భరించలేనంత నొప్పి కావడంతో షూటింగ్‌లో పాల్గొనలేకపోయారట. దాంతో సంజయ్‌ లీలా భన్సాలీ దగ్గర అనుమతి తీసుకుని, రెస్ట్‌ తీసుకుంటున్నారని బాలీవుడ్‌ టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement