గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని బస్టాండు సమీపంలో బస్సుకోసం నిలబడిన ఒక వృద్ధుడికి మాయమాటలు చెప్పి అతని వద్ద నుంచి రూ.4 లక్షల విలువైన బంగారు నగలు దోచుకెళ్లారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. మంగళగిరి సమీపంలోని నవులూరుకు చెందిన ప్రకాశరావు(70) అనే వృద్ధుడు నిత్యం బంగారు చైను, బ్రాస్‌లెట్, చేతి వేళ్లకు ఉంగరాలతో తిరుగుతుంటాడు.
ఇది గమనించిన దుండగులు ఆయనను వెంబడించారు. ఆదివారం మధ్యాహ్నం మంగళగిరి బస్టాండులో బస్సుకోసం వేచి ఉండగా మాటల్లోపెట్టి అతని వద్దనుంచి బంగారు చైను, బ్రాస్‌లెట్ దోచుకెళ్లారు. ఈమేరకు అతను మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ చేసిన వస్తువుల విలువ రూ.4 లక్షలు ఉంటుందని అతను పోలీసులకు తెలిపాడు.