మూడు రోజులు.. వెయ్యి కోట్లు! అంబానీ అంటే అట్లుంటది మరి.. | Mukesh Ambani Spending Rs 1000 Crore On Anant Ambani And Radhika Merchant Pre Wedding Functions, See Details Inside - Sakshi
Sakshi News home page

Anant Ambani Pre Wedding Expenses: మూడు రోజులు.. వెయ్యి కోట్లు! అంబానీ అంటే అట్లుంటది మరి..

Published Fri, Mar 1 2024 8:36 PM | Last Updated on Sat, Mar 2 2024 11:07 AM

Mukesh Ambani Spend Rs 1000 Crore on Anant Radhika Pre Wedding - Sakshi

ధనవంతుల ఇళ్లలో పెళ్లి అంటే ఖర్చు భారీగా ఉంటుందని అందరికి తెలుసు.. అలాంటిది ప్రపంచ కుబేరులలో ఒకరు, భారతదేశంలో అత్యంత సంపన్నులు అయిన 'ముఖేష్ అంబానీ' ఇంట పెళ్లి అంటే మాటలా? ఈ రోజు చాలా మంది మనసులో మెదిలే ప్రశ్న అంబానీ ఇంట జరుగుతున్న ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలకు ఎంత ఖర్చు చేయనున్నారు. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

లక్షల కోట్లకు అధిపతి అయిన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్, ఎన్‌కోర్ హెల్త్‌కేర్ అధినేత 'వీరెన్ మర్చంట్' కుమార్తె రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైపోయాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారు.

ప్రీ వెడ్డింగ్ వేడుకలలో ఫుడ్ లిస్ట్ చూస్తేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. తినడటానికి 2500 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్, రాత్రి డిన్నర్ కోసం ఇలా చాలానే వంటకాలను తయారు చేస్తున్నారు. 

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ రోజు నుంచి మొదలైన 'అనంత్, రాధిక' ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు 1000 మంది సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్టార్ క్రికెటర్స్, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వీరి కోసం ఇప్పటికే ప్రత్యేక వసతులను ఏర్పాటు చేశారు.

అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు 120 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 1000 కోట్లు) ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రీవెడ్డింగ్‌గా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఆయన ఆస్తిలో అది కేవలం 0.1శాతం మాత్రమే అని పలువురు చెబుతున్నారు.

ఇదీ చదవండి: 10 భారతీయ కంపెనీ యాప్‌లపై కన్నెర్రజేసిన గూగుల్‌!

అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పర్ఫామెన్స్ చేయనున్న 'రిహాన్నా'కు ఏకంగా  8 నుంచి 9 బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 66 కోట్ల నుంచి రూ. 74 కోట్లు. దీన్ని బట్టి చూస్తే అంబానీ తన కొడుకు పెళ్లి కోసం ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement