
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకలు సోషల్ మీడియాలో ట్రెండిగ్‌లో నిలుస్తున్నాయి. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు దేశ విదేశాలకు చెందిన సెలబ్రిటీలు, కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అనంత్, రాధిక ప్రీవెడ్డింగ్ వేడులకు ఉత్సాహంగా పయనమైన యుఎస్ టిక్‌టాకర్, కంటెంట్ క్రియేటర్ జూలియా చాఫ్‌కు వింత అనుభవం ఎదురైంది. బిలియనీర్ అంబానీ కుటుంబంపై నెలల తరబడి వీడియోలు చేసిన ఆమెకు అంబానీ ఇంట పెళ్లి సందడికి హాజరవ్వాలనేది డ్రీమ్. కానీ ఊహించని పరిస్థితి ఎదురైంది.. స్టోరీ ఏంటంటే..
అంబానీ ఫ్యామిలీనుంచి అందిన ఆహ్వానం నేపథ్యంలో జూలియా చాఫ్ ఉత్సాహంగా సోమవారం ఇండియాకు బయలుదేరింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇంతలో ఏజియన్ ఎయిర్‌లైన్స్ లో నాలుగు బ్యాగుల లగేజీ మొత్తాన్ని పోగొట్టుకుంది. ఏథెన్స్‌లో చిక్కుకుపోయింది. దీంతో సంబంధిత ఎయిర్‌లైన్ ట్యాగ్ చేస్తూ మరో పోస్ట్ పెట్టింది. మొత్తానికి లగేజీ తిరిగి దొరకడంతో తన కలను సాకారం చేసుకుంది. అంబానీ ఇంట జరిగిన వేడుకలకు హాజరైంది. ఈ వీడియోపై ఇంటర్నెట్ సంచలనం ఓరీ స్పందించాడు.
కాగా జూలియా చాఫ్‌తో జెమ్ డీలర్ కూడా. అంబానీ కుటుంబానికి చెందిన డైమండ్, లగ్జరీ ఆభరణాల గురించి ఈమెకు తెలిసినంతగా ఇండియన్ మీడియాకు కూడా తెలియదట. దీనికి సంబంధించిన కంటెంట్‌తోనే జూలియా బాగా పాపులర్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment