jannaram
-
అమ్మా.. పురుగుల మందు తాగిన.. నన్ను క్షమించమ్మా!
సాక్షి, మంచిర్యాల: ‘ఉద్యోగం రాదోమోననే భయంతో పురుగుల మందు తాగిన.. అమ్మా.. నన్ను క్షమించమ్మా? అని ఆ కొడుకు చివరిసారిగా మాట్లాడిన మాటలు ఆ కన్నతల్లి జీర్ణించుకోలేకపోతోంది. చేతికందిన కొడుకు చేదోడువాదోడుగా ఉంటాడనుకుంటే అర్ధంతరంగా తనువు చాలించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మృతుడి తండ్రి, ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన దాసరి శేఖర్–సుజాత దంపతులకు కొడుకు శ్రీకాంత్ (25), కూతురు ఉన్నారు. కూతురుకు వివాహం జరిపించారు. శ్రీకాంత్ బీటెక్ చదివాడు. ఇటీవల ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాశాడు. తక్కువ మార్కులు వస్తాయని భావించి ఉద్యోగం రాదని దిగులు చెందాడు. ఇదే బెంగతో ఈనెల 10న రాత్రి 11గంటల ప్రాంతంలో ఇంట్లో పురుగుల మందు తాగాడు. ‘పరీక్షలో తక్కువ మార్కులు వస్తాయి.. ఉద్యోగం రాదేమోననే భయంతో పురుగుల మందు తాగిన.. నన్ను క్షమించమ్మా’ అని తల్లి సుజాతతో చివరిసారిగా మాట్లాడాడు. అంతలోనే అపస్మారక స్థితికి చేరాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని మేదరిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్ ఆస్పత్రి కి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఎదిగివచ్చిన కొడుకుపై పుట్టెడు ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు చివరి మాటలు తలుచుకుని రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తానాజీ తెలిపారు. చదవండి: (Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష) -
ఒకే గ్రామానికి చెందిన యవతితో ప్రేమ.. ఎన్నిసార్లు తిరిగినా ఒప్పుకోవడం లేదని..
సాక్షి,జన్నారం(మంచిర్యాల): ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్‌లో జరిగింది. ఎస్సై సతీశ్, మృతుడి తల్లి సత్తవ్వ తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ గ్రామానికి చెందిన గొలాట రమేశ్ – సత్తవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు కార్తీక్ సంతానం. జన్నారం ప్రభుత్వ పాఠశాలలో కార్తీక్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొన్ని రోజులుగా గ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. ఎన్నిసార్లు తిరిగినా యువతి అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన కార్తీక్ ఈనెల 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగాడు. తర్వాత తన స్నేహితుడు నాగుల హరీశ్‌కు ఫోన్‌చేసి తాను పురుగుల మందు తాగినట్లు చెప్పాడు. వెంటనే హరీశ్ తన స్నేహితులు రమేశ్, వెంకటేశ్‌తో కలిసి కార్తీక్ ఇంటికి వెళ్లారు. అప్పటికే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ప్రైవేట్ వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్ సూచన మేరకు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కార్తీక్ తల్లి సత్తవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. చదవండి: ఫోన్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్.. భర్తపై అనుమానంతో.. -
‘రైస్‌మిల్ వద్దకు కాపలాకు వెళ్తున్న.. పొద్దున్నే వస్తా’ అని ఇంట్లో చెప్పి..
సాక్షి, జన్నారం(ఆదిలాబాద్): ‘నేను రైస్‌మిల్ వద్దకు కాపలాకు వెళ్తున్న.. పొద్దున్నే వస్తా’ అని ఇంట్లో చెప్పి వెళ్లిన వ్యక్తిని మృత్యువు ద్విచక్రవాహనం రూపంలో కబళించింది. ఈ ఘటన జన్నారం మండలం మొర్రిగూడలో జరి గింది. మృతుని భార్య రాజేశ్వరి, ఎస్సై సతీశ్ తెలి పిన వివరాల ప్రకారం... గ్రామంలోని ఎస్సీకాలనీకి చెందిన దుర్గం రాజన్న(50) ఓ రైస్‌మిల్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి 9 గంట ల ఇంట్లో భోజనం చేసి రైస్‌మిల్ కాపలాకు వెళ్తున్నానని భార్యకు చెప్పి సైకిల్‌పై బయల్దేరాడు. ప్రధాన రహదారి వెంట వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వానహం(ఏపీ01ఆర్2594) అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజన్న తలకు తీవ్రగాయాలు కావడంతో స్పృహ కోల్పోయాడు. ద్విచక్ర వాహనంపై వచ్చిన దస్తురాబాద్ మండలం మల్లాపూర్‌కు చెందిన ఎలగందుల అనిల్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన జాడి సు రేందర్ రాజన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రాజేశ్వరి, ఆమె సోదరుడు కామెర రాజం సంఘటన స్థలానికి చేరుకుని ప్రైవేట్ వాహనంలో జన్నారం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సూచన మేరకు జగిత్యాలకు, అక్కడి నుంచి కరీంనగర్ అసుపత్రికి తరలించారు. రాత్రి 12 గంటలకు కరీంనగర్ ఆసుపత్రిలో మృతి చెందాడు. చదవండి: పోలీస్ కస్టడీకి డ్రగ్ పెడ్లర్ టోనీ.. బడా‘బాబు’ల బండారం బయటపడేనా? మృతదేహంతో ఆందోళన.. అజాగ్రత్తగా ద్విచక్రవాహనం నడిపి రాజన్న మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి బంధువులు మొర్రిగూడ ప్రధాన రహదారిపై మృతదేహంతో రా స్తారోకో చేశారు. వారికి గ్రామస్తులు, గ్రామ పెద్దలు సుధాకర్‌నాయక్, మహేందర్, రాజం మద్దతు తెలి పారు. దండెపల్లి ఎస్సై సాంబమూర్తి సిబ్బందితో కలిసి మొర్రిగూడకు చేరుకుని రాస్తారోకో విరమించాలని సూచించారు. దీంతో గ్రామస్తులు ఎస్సై తో వాగ్వాదానికి దిగారు. ఆందోళన కారులను సముదాయించడంతో రాస్తారోకో విరమించారు. రాజన్న కు ఇద్దరు కుమారులున్నారు. భార్య ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. చదవండి: శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. భార్య, అత్తను కిరాతకంగా.. -
పుట్టినరోజే.. చివరి రోజు..!
సాక్షి, జన్నారం(ఖానాపూర్): పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకుని ఆనందంగా గడిపిన యువకుడికి ఆ రోజే వందేళ్లు నిండాయి. బర్త్‌డే రోజు కొత్త మొబైల్ కొనుక్కుంటానని ఇంట్లో చెప్పి వెళ్లిన అతడిని టాటాఏస్ వాహనం రూపంలో వచ్చిన మృత్యువు బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన జన్నారం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. మృతుడి అన్నయ్య జూల రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం అక్కపెల్లిగూడ గ్రామానికి చెందిన జూల మల్లయ్య, పోశవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్నకుమారుడు శివకృష్ణ(20) హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చాడు. మంగళవారం పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో గడిపి, మొబైల్ కొనేందుకు బైక్‌పై జన్నారానికి బయల్దేరాడు. ఇందన్పల్లి వద్ద వేగంగా వచ్చిన టాటాఏస్ వాహనం శివకృష్ణ బైక్‌ను ఢీకొట్టింది. చాలా సేపయినా ఇంటికి రాకపోవడంతో రామకృష్ణ ఫోన్ చేసినా కలువలేదు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒకరు ఫోన్ చేసి ‘శివకృష్ణకు యాక్సిడెంట్ అయింది, తీవ్రంగా గాయపడ్డాడని’ తెలిపాడు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని 108 వాహనంలో శివకృష్ణను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనల మేరకు మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. చదవండి: అక్రమ కట్టడాలపై మున్సిపల్ శాఖ నజర్.. బీపాస్’తప్పనిసరి.. బైపాస్ లేదు! ఉదయం శుభాకాంక్షలు.. రాత్రికి నివాళి శివకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బంధువులు, స్నేహితులు మంగళవారం ఉదయం శుభాకాంక్షలు తెలుపుతూ తమ మొబైల్లో వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నారు. అంతలోనే అతను మృతి చెందిన విషయం తెలియడంతో రిప్ అంటూ నివాళులర్పించారు. ఈ ప్రమాద విషయంపై ఎస్సై మధుసూదన్‌రావును సంప్రదించగా యువకుడు మృతి చెందిన విషయం నిజమేనని, కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు. చదవండి: ట్యాంక్‌బండ్‌పై రోడ్డు ప్రమాదం.. మూడేళ్ల చిన్నారి దుర్మరణం -
కూతురు కులాంతర వివాహం.. భవిష్యత్‌పై బెంగతో..
సాక్షి, జన్నారం(ఖానాపూర్): కులాంతర వివాహం చేసుకున్న కూతురిని అల్లుడు తీసుకెళ్లడం లేదని, కూతురి భవిష్యత్‌పై బెంగతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని లింగయ్యపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై తానాజీనాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగయ్యపల్లి గ్రామానికి చెందిన గూడ సత్తయ్య, వరలక్ష్మి దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు నాగలక్ష్మి ఆరు నెలల క్రితం రోటిగూడకు చెందిన వెంకటేశ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కొద్దిరోజులకే ఆమెను ఇంట్లో వదిలి వెళ్లిన అల్లుడు తిరిగి తీసుకెళ్లడం లేదు. దీంతో మనస్తాపం చెందిన వరలక్ష్మి(48) ఆదివారం రాత్రి ఇంటి పక్క ఉరేసుకుంది. మృతురాలి భర్త సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. స్థల వివాదంలో నిండు ప్రాణం బలి సాక్షి, సిరికొండ(బోథ్): చిన్న స్థల వివాదం చిలికిచిలికీ గాలివానగా మారి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన మండలంలోని రాంపూర్‌గూడలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాథోడ్ ఉమ్మజీ(32), రాథోడ్ మహదులు ఇద్దరు వరుసకు బాబాయి, కొడుకులు. వీరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. రాథోడ్ మహదు మూడు రోజుల క్రితం మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టాడు. కాగా ఈ స్థలంపై ఇరు కుటుంబాలు గొడవకు దిగాయి. ఆదివారం రాత్రి రాథోడ్ మహదు, కుటుంబ సభ్యులతో కలిసి రాథోడ్ ఉమ్మజీపై దాడి చేయగా ఉమ్మజీ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రాథోడ్ మహదు, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణకుమార్ అన్నారు. ఉమ్మజీకి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు, రెండు నెలల మగ కవల పిల్లలు ఉన్నారు. -
సాసర్‌వెల్స్ సక్సెస్; వన్యప్రాణులు ఖుష్
వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి ఇబ్బంది రాకుండా తెలంగాణ అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ సాసర్‌వెల్స్ (నీటి తొట్టీలు) సత్ఫలితాలిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్లోని జన్నారం, ఇందన్పల్లి, తాళ్లపేట అటవీ రేంజ్‌లలో సుమారు 90 వరకు నీటితొట్టీలను ఏర్పాటు చేశారు. సంబంధిత బీట్ అధికారి, బేస్‌క్యాంపు సిబ్బంది నీటితొట్టీల్లోని నీటిని పర్యవేక్షిస్తూ.. అయిపోగానే ట్యాంకర్ల ద్వారా నింపుతారు. రెండు స్క్వైర్ కిలోమీటర్లకు ఒక నీటితొట్టీని ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలోని వన్యప్రాణులు నీరు తాగడానికి అనుకూలంగా ఉంటోంది. అడవిలో వాగులు, కుంటల్లో నీరు ఎండిపోతున్న నేపథ్యంలో నీటితొట్టీలు వన్యప్రాణుల దాహం తీరుస్తున్నాయి. గతేడాదివి 60 నీటితొట్టీలుండగా ఈ సంవత్సరం మరో 30 కొత్తవి నిర్మించారు. కాగా, నీరు తాగడానికి వచ్చిన వన్యప్రాణులు అధికారులు అమర్చిన సీసీ కెమెరాకు చిక్కాయి. ఈ దృశ్యాలను పరిశీలిస్తే సాసర్‌వెల్స్ సత్ఫలితాలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎఫ్‌డీవో మాధవరావును సంప్రదించగా ఎప్పటికప్పుడు నీటితొట్టీలను పరిశీలిస్తున్నామని, సిబ్బంది వారానికి రెండు రోజులు నీటిని పోసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. – జన్నారం(ఖానాపూర్) -
ఒకరిది ఆకలి వేట..మరొకరిది బతుకు బాట!
జన్నారం: ఈ చిత్రంలో కనిపిస్తున్న రెండు జీవులదీ ఒకటే లక్ష్యం. ఓ జీవిది బతుకుబాట అయితే.. మరో జీవిది ఆకలివేట. జన్నారం అటవీ డివిజన్లో కనిపించిన ఈ దృశ్యాన్ని ఎఫ్‌డీవో తన కెమెరాలో బంధించారు. దుప్పిని వేటాడేందుకు అడవికుక్క కాచుకుని ఉండగా.. కుక్క నుంచి తప్పించుకు పరుగుతీసేందుకు దుప్పి సిద్ధంగా ఉంది. కాగా, ఒకప్పుడు అటవీలో పచ్చదనంగా ఉంటూ అనేక జంతువులు ఉండేవి. అదే ఇప్పుడు పచ్చదన కరువైంది. దాంతో శాఖాహర జంతువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇక వాటిపైనే ఆధారపడే మాంసాహర జంతువులు కూడా ఈమధ జనావాసాల్లోకి ప్రవేశించి ప్రమాదాల బారిన పడుతొన్నాయి. ఇక, వేసవీ సమీపిస్తొన్న కొలది నీటిజాడ కరువైంది. అందుకే జంతువులన్ని ఆహరం కోసం, నీటి అన్వేషనలో ఒక చోటు నుంచి మరొ చోటుకు వలన పోతున్నాయి. కరీనంనగర్, జన్నారం, అడవీ, జంతువులు, వలసలు చదవండి: అంతా సినీ ఫక్కీ: 20 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. -
కరోనా : హాయిగా.. స్వేచ్ఛగా విహరిస్తాం
కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. వన్యప్రాణులకు మాత్రం వరంగా మారింది. జన సంచారం, పశువులు, కాపరుల అలజడి లేకపోవడంతో వన్యప్రాణులు హాయిగా.. స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. వేటగాళ్ల ఉచ్చు నుంచి తప్పించుకొని తిరిగే మూగజీవాలు.. ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో.. ఏ మాత్రం భయపడకుండా తిరుగుతున్నాయి. ప్రకృతి ఒడిలో పూర్తిగా మమేకమవుతున్నాయి. అటవీ అధికారులు సైతం వాటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ జోన్‌లోని జన్నారం అటవీ ప్రాంతంలో, నాగర్‌కర్నూలు జిల్లా నల్లమలలో, ములుగు, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని అభయారణ్యంలో వన్యప్రాణుల కదలికలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. జన్నారం : కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో నెల రోజులుగా అటవీ ప్రాంతంలో జన సంచారం లేకపోవడంతో వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ప్రధాన రహదారికి కూత వేటు దూరం అటవీ ప్రాంతానికి వెళ్తేనే.. లేడి పిల్లలు చెంగు చెంగున పరుగులు పెడుతున్నాయి. నీలుగాయిలు, మెకంలు, దుప్పులు, అడవి దున్నలు, సాంబర్లు ఇలా.. ఒక్కటేమిటి ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. కాసేపు సరదాగా ఆడుకుందాం అనే రీతిలో కనిపిస్తున్నాయి. వీటికి తోడు గ్రామాల్లో తిరిగే కొండముచ్చులు, కోతులు కూడా అడవిబాట పట్టాయి. దీంతో నిత్యం కోతులతో ఇబ్బందులు పడుతున్న జనానికి కాస్త ఉపశమనం లభించినట్లయింది. కాగా, వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాసర్ వెల్స్, కుంటలు, సోలార్ పంపుసెట్లు, ర్యాంపు వెల్స్, నీటి చెలిమెలు తవ్వారు. జన్నారం డివిజన్ పరిధిలో సుమారు 20 సోలార్ పంపుల ద్వారా నీటి వసతి కల్పిస్తున్నారు. వాటి ద్వారా నీటిని కుంటల్లోకి వదులుతున్నారు. కన్హా టైగర్ రిజర్వ్‌లో ఏర్పాటు చేసిన మాదిరిగా ప్రకృతి సిద్ధమైన నీటి చెలిమెలు తవ్వించారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల ఓ పులి సంచారం ఎక్కువైంది. తాండూర్, నెన్నెల ప్రాంతాల పరిధిలో పులి సూర్యాస్తమయం కాకుండానే జనారణ్యంలోకి వస్తోంది. ఇక జన్నారం అటవీ రేంజ్‌లలో వివిధ రకాల పక్షులు దర్శనమిస్తున్నాయి. కొంగల విహారం కనువిందు చేస్తోంది. అరుదైన పక్షులు విజిలింగ్డక్స్, పేయింటెడ్ స్టోర్క్స్, బ్లాక్నెక్డ్, ఉలినెక్డ్ పక్షులు దర్శనమిస్తున్నాయి. ఈ పక్షులు దేశంలో అరుదుగా కనిపిస్తాయని అటవీ అధికారులు తెలిపారు. -
‘లాలూ’కు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది'
సాక్షి, జన్నారం : అవినీతికి పాల్పడి.. జైలుకు వెళ్లిన లాలూప్రసాద్యాదవ్కు పట్టిన గతే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పడుతుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పైడిపెల్లిగార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎముకలేని నాలుకతో అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడు మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ‘గ్రామజ్యోతి అంటూ అధికారులను గ్రామాల్లో పరుగులు పెట్టించారు. జిల్లాకు రూ.8వేల కోట్ల వరకు అవుతుందనే భయంతో దానిని పక్కన పెట్టారు. మన ఊరు, మన ప్రణాళిక’ తీసుకొచ్చారు. అదికూడా డబ్బుతో కూడుకున్నదని గ్రహించి దానిని పక్కనబెట్టారు. ఇప్పుడు 30 రోజుల ప్రణాళిక అని అధికారులను గ్రామాల్లో పరుగులు పెట్టిస్తున్నారు..’అని విమర్శించారు. మోసాలతో ఉద్యమాలు నడిపి, మోసాలతోనే పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచదేశాలు ప్రధాని నరేంద్రమోదీని పొగుడుతున్నాయని, కానీ.. కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో బీజేపీ బలవంతంగా నాలుగు సీట్లు గెలిచాయంటూ హేళన చేస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలు కేసీఆర్‌ను బయటకు పంపే రోజులొస్తాయని తెలిపారు. ఎన్నికల సమయంలో అందరికీ రైతుబంధు డబ్బులు జమ చేయించిన కేసీఆర్.. ఇప్పుడెందుకు ఆలస్యం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రుణమాఫీపైనా స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారన్నారు. అప్పులతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తామని, రానున్న రోజుల్లో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఎంపీ దృష్టికి జర్నలిస్టుల సమస్యలు జర్నలిస్టుల సమస్యలను ఎంపీ సోయం దృష్టికి తీసుకెళ్లారు. జన్నారం ప్రెస్‌క్లబ్ తరఫున వినతిపత్రం అందించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇళ్లు నిర్మించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు మల్లారెడ్డి, రమాదేవి, కృష్ణ జలాల కమిటీ చైర్మన్ రావుల రాంనాథ్, రాష్ట్ర నాయకుడు మున్నరాజు సిసోడియా, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి సట్ల అశోక్, జన్నారం మండల అధ్యక్షుడు గోలి చందు, బీజేవైఎం నాయకులు కొండపల్లి మహేశ్, మండల నాయకులు సూర్యం, వీరాచారి, సుగుణ, కవిత తదితరులు పాల్గొన్నారు. -
మా కొడుకును అప్పగించండి..
సాక్షి, జన్నారం(ఖానాపూర్): కనిపించకుండా పోయిన తమ కుమారుడిని అప్పగించాలని జన్నారం మండలం పొన్కల్‌కు చెందిన బచ్చల రాజం దంపతులు పోలీసు అధికారులను వేడుకుంటున్నారు. రాజం రెండవ కుమారుడు బచ్చల సతీశ్ కొన్నేళ్లుగా ఉట్నూర్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఉట్నుర్‌లో జరిగిన దొంగతనం కేసులో సతీశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈనెల 17 పోలీసులు ఇంటికి వచ్చి సతీశ్ గురించి అడిగే వరకు తమకు విషయం తెలియదన్నారు. గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన తమ కుమారుడి ఆచూకీ తెలపాలని కోరారు. ఈ విషయంపై జన్నారం ఎస్సై తహసీనోద్దీన్‌ను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, ఉట్నూర్‌లో జరిగిన ఓ దొంగతనం కేసులో సతీశ్ నిందితుడని తెలిసిందన్నారు. -
ప్రాణం తీసిన బిస్కెట్ ప్యాకెట్
జన్నారం(ఆదిలాబాద్): పైకప్పు రేకుపై పడిన బిస్కెట్ ప్యాకెట్ తీసుకునే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ బాలుడు చనిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా జనానరం మండలం తిర్మన్‌గూడకు చెందిన మార్కారి లక్ష్మి, గంగన్న దంపతుల కుమారులు నరేశ్(12), రాజేశ్(12) ఇందన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. శుక్రవారం ఉదయం టీ, బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని డాబాపైకి వెళ్లారు. అన్నదమ్ములు ఒకరి చేతిలోని బిస్కట్ ప్యాకెట్‌ను మరొకరు సరదాగా లాక్కునేందుకు యత్నించారు. ఈ ప్రయత్నంలో ఆ ప్యాకెట్ డాబా ముందరి రేకులపై పడిపోయింది. దీనిని తీసుకురావడానికి నరేశ్ రేకులపైకి దిగాడు. అయితే, ఇంటికి విద్యుత్ సరఫరా చేస్తున్న సర్వీస్ తీగ తెగి రేకులను తాకి ఉంది. దీంతో నరేశ్ కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. అతడిని కాపాడే క్రమంలో రాజేశ్ గాయాలై పడిపోయాడు. వెంటనే రాజేశ్‌ను జన్నారం ఆస్పత్రికి తరలించారు. -
జన్నారం తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు
జన్నారం(మంచిర్యాల): విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. జన్నారం తహశీల్దార్‌గా పని చేస్తున్న సత్యనారాయణ విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించారంటూ ఆర్డీవో ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. భూ వివాదం పరిష్కరంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదు అందడంతో పూర్తిస్థాయి విచారణ చేపట్టిన ఆర్డీవో, తహశీల్దార్‌పై చర్యలు తీసుకున్నారు. -
అర్హులైన వారినే ఎంపిక చేస్తాం
జన్నారం: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బస్తీ పథకం కింద అర్హులైన వారినే ఎంపిక చేస్తామని తహశీల్దార్ సత్యనారాయణ పెర్కోన్నారు. అందుకే మొదటి విడతగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం మండలంలోని ధర్మారంలో గ్రామ సభ నిర్వహించి దళితుల నుంచి ధరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం నుంచి 40 ధరఖాస్తులు వచ్చాయని, అందులో నలుగురిని ఎంపిక చేశామని చెప్పారు. ఎంపికలో ఎలాంటి అక్రమాలు జరిగే ప్రసక్తి లేకుండా అందరి సమక్షంలోనే ఎంఫిక చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ ప్రణవ్‌కుమార్, మార్కేట్ కమిటీ వైస్ చైర్మన్ సతీశ్‌కుమార్, ఆర్ఐ సంతోశ్, టీఆర్ఎస్ నాయకులు సత్యం, ఎమ్మార్పీఎస్ నాయకులు రాజరాం తదితరులు పాల్గోన్నారు. -
సైకిల్ పోయిందని ఆత్మహత్య చేసుకోవాలనుకుని..
జన్నారం : సైకిల్ ఎవరో ఎత్తుకెళ్లారు. ఎదైనా పని చేసి డబ్బులు సంపాదించి తిరిగి సైకిల్ కొనుక్కోవాలనే పట్టుదలతో వచ్చిన విద్యార్థి తీరుకు మెచ్చి సొంత డబ్బులతొ సైకిల్ కొనిచ్చాడో సామాజిక కార్యకర్త. అయితే ఈ క్రమంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడని తెలుసుకున్న స్థానిక ఎస్సై ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఇంద్రవెల్లి మండలం కొండపూర్ గ్రామానికి చెందిన బట్టి రాజన్న, లక్ష్మిల కుమారుడు అంకూస్. అంకూస్ ఉట్నూర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వీతీయ సంవత్సరం చదువుతున్నాడు. రెండు కిలోమీటర్ల దూరంలో గల మేనెజ్మెంట్ హాస్టల్లో ఉంటున్నాడు. ఇటీవల ఉట్నూర్‌లో జరిగిన గిరి ఉత్సవ్ కార్యక్రమంలో అంకుల్ సైకిల్ దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే సైకిల్ కొనడం తల్లిదండ్రులకు భారమవుతుందనే ఉద్దేశ్యంతో తాను హాస్టల్ నుంచి జన్నారం వరకు పని కోసం వచ్చినట్లు వెళ్లాడు. పని చేసి సైకిల్ కొనుక్కోవాలని, నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో జన్నారంలో నీటి ప్లాంట్ నడిపిస్తున్న సామాజిక కార్యకర్త భూమాచారి వద్దకు వచ్చి ఎదైనా పని ఇప్పించాలని కోరాడు. లేకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని వేడుకున్నాడు. అయితే పూర్తి వివరాలు కోరగా అంకుల్ జరిగిన విషయం తెలిపాడు. ఆయన మానవతా హృదయంతో స్పందించి సొంత డబ్బులతో సైకిల్ కొనిచ్చాడు. ఎస్సై ప్రసాద్ సమక్ష్యంలో సైకిల్‌ను ఆ విద్యార్థికి అందజేశారు. విద్యార్థికి ఎస్సై కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా భూమాచారిని ఎస్సై అభినందించారు. -
ఆరేళ్ల తర్వాత ఊరిలోకి లింగుబాయి
జన్నారం : కుష్టువ్యాధి కారణంగా గ్రామ బహిష్కరణకు గురైన మహిళ ఆరేళ్ల తర్వాత గ్రామంలోకి చేరింది. మానవహక్కుల సంఘం ఉభయ రాష్ట్రాల కార్యదర్శి ఆత్రం భుజంగరావు, లీగల్ సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపకుడు మదాసు మధుకర్ శ్రమ ఫలించి ఇల్లు చేరింది. మురిమడుగు గ్రామ పంచాయతీ పరిధి కొమ్ముగూడెంకు చెందిన పెంద్రం లింగుబాయి(40) ఆరేళ్ల క్రితం కుష్టుబ్యాధి బారిన పడింది. ఈ విషయం గ్రామస్తులకు వ్యాధి తమకూ అంటుకుంటుదనే అపోహాతో లింగుబాయిని గ్రామం నుంచి పంపించారు. గ్రామ శివారులోని ఓ పాకలో ఉంచారు. అప్పటి నుంచి ఆమె ఒక్కరే అక్కడ ఉంటోంది. కొడుకు తీసుకొచ్చిన అన్నం తిని అక్కడ నివసిస్తోంది. ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న భుజంగరావు, మధుకర్ ఆ గ్రామానికి వచ్చి ఆమె పరిస్థితి తెలుసుకున్నారు. వివరాలు తెలుసుకుని గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. విషయూన్ని అధికారుల దృష్టికీ తీసుకెళ్లారు. బుధవారం వారితోపాటు లెప్రా సొసైటీ సభ్యులు, సర్పంచ్ రాంచందర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు శోభ, వైద్యాధికారి శ్రీనివాస్ గ్రామాన్ని సందర్శించి లింగుబాయికి వైద్య పరీక్షలు చేశారు. కుష్టువ్యాధి అంటువ్యాధి కాదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని నచ్చజెప్పారు. గ్రామస్తులు అంగీకరించడంతో లింగుబాయి తన సొంత ఇంటికి చేరింది. అధికారులు స్వయంగా ఆమెను గ్రామంలోకి తీసుకొచ్చారు. కాగా, ఇందన్పల్లి గొండుగూడలో కూడా మడావి మారుబాయి అనే వృద్ధురాలికి కుష్టువ్యాధి సోకింది. ఆమెనూ గ్రామం నుంచి బహిష్కరించాలని గ్రామస్తులు నిర్ణయించినట్లు తెలుసుకుని వారు వెళ్లి నచ్చజెప్పారు. కార్యక్రమంలో లిప్రా సొసైటీ ప్రాజెక్ట్ అధికారి రామనుజాచారి, సభ్యులు కిషన్రావ్, పోతన, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
అభయారణ్యం వింతలు చెప్పే అధ్యయన కేంద్రం
జన్నారం : కవ్వాల్ పులుల రక్షిత ప్రదేశంలోని వింతలు, విశేషాలు, వాటి ప్రత్యేకతలు, జంతువుల రకాలు, అరుపుల గురించి తెలియజేయడానికి మండలకేంద్రంలోని అటవీశాఖ నర్సరీ పర్యావరణ అధ్యయన కేంద్రంలో చిత్రపటాల రూపంలో పొందుపరిచారు. పర్యాటకులకు అడవిలోని అద్భుతాలను తెలియజేయాలనే ఉద్దేశంతో అటవీశాఖ రెండేళ్లక్రితం అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అధ్యాయన కేంద్రం ఎదురుగా అడవి దున్నల ఫొటోలు ప్రత్యక్షంగా చూస్తున్నట్లు కనిపిస్తున్నారుు. పర్యాటకులను ఎంతగానే అకట్టుకుంటున్నా యి. కేంద్రం లోపల పులులు, చిరుతలు, ఎ లుగుబంట్లు, నక్కలు, వివిధ రకాల జంతువు ల చిత్ర పటాలు ఉంచారు. లోపల ఒక ఎలక్ట్రికల్ బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డుపై జంతువుల వద్ద ఉన్న బటన్ నొక్కితే ఆ జంతువు అరుపు వినిపించేలా ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలు ఇక్కడ చాలా ఆనందంగా గడుపుతారు. అధ్యయన కేంద్రం ఆవరణలో వివిధ రకాల పక్షుల ఫొటోలు, అడవి జంతువుల ఫొటోలను మనం గమనించవచ్చు. వేసవి వినోదానికి అధ్యయన కేంద్రం తోడ్పడుతుంది. జన్నారం బస్టాండ్ నుంచి అర కిలోమీటర్ దూరంలో కేంద్రం ఉంటుంది. బస్టాండ్ నుంచి ఆటోల ద్వారా వెళ్లవచ్చు. కాలినడకన కూడా వెళ్లవచ్చు. -
సీఎం కుటుంబానికే ఆసరా
జన్నారం : మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే ఆసరా కల్పించి..పేదలను విస్మరించారని మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ విమర్శించారు. ఒక ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇవ్వమని చెప్పిన సీఎం.. తన ఇంటో మాత్రం నలుగురికి ఎందు కు పదవులు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం జన్నారం మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. గంటపాటు అంబేద్కర్‌చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాథోడ్ రమేశ్ మాట్లాడుతూ..తెలంగాణ వస్తే ఇంటిం టికీ ఉద్యోగం ఇప్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ తన కుటుంబంలో కొడుకు, కూతురు, అల్లుడు, వియ్యంకుడికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. పేదల కడుపు కొట్టి పెద్దలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. కళ్లు, కాళ్లు లేని వారి పింఛన్లు తొలగించి తీరని అన్యాయం చేశారన్నారు. కేసీఆర్‌ను గద్దె దించితేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ నాయకులను ఊళ్లలోకి రానివ్వకుండా అడ్డుకుంటే పింఛన్లు వస్తాయన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట కూడా ధర్నా చేశారు. అధికారులు సమాధానం చెప్పే వరకు కదలమని కూర్చున్నారు. దీంతో తహశీల్దార్ శ్రీనివాస్ వచ్చి ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిం చారు. కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు కొంతం శంకరయ్య, సుధాకర్‌నాయక్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్ రియాజొద్దీన్, ఎంసీపీఐ యూ మండల కార్యదర్శి కట్టెకోల నాగరాజు, టీడీపీ రాష్ట్ర నాయకుడు రాజేశ్వర్, జిల్లా నాయకులు కాసెట్టి లక్ష్మణ్, నాయకులు నర్సింహులు, బద్రినాయక్ పాల్గొన్నారు. ఖానాపూర్‌లోనూ ధర్నా, రాస్తారోకో ఖానాపూర్ : పింఛన్ల కోసం మండల పరిషత్ కార్యాలయం ఎదుట శనివారం టీడీపీ ధర్నా నిర్వహించింది. ఇందులోనూ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ పాల్గొని మాట్లాడారు. ఖానాపూ ర్ మండలంలో గతంలో 8 వేల పింఛన్లు ఉండ గా ఇప్పుడు నాలుగు వేలే ఉన్నాయని, ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పింఛన్లు తొలగించారో అర్థమవుతుందన్నారు. ఇంటికో ఉద్యోగం, అర్హులందరికీ పింఛన్లు, రైతులకు నిరంతరం విద్యుత్ వంటి కల్లబొల్లి మాటలతో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని టీడీపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్ పేర్కొన్నారు. తహశీల్దార్ నరేందర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ రాథోడ్ రాము, పీఏసీఎస్ చైర్మన్ వెంకాగౌడ్, ఉపసర్పంచ్ కారింగుల సుమన్, కడెం మాజీ ఎంపీపీ రాజేశ్వర్‌గౌడ్, నాయకులు శ్రీనివాస్, రాజేందర్, రాజేశ్వర్, నయిం, నిట్ట రవి, వీరేశ్, లక్ష్మణ్, గంగన్న పాల్గొన్నారు. -
మండిపడ్డ పండుటాకులు
జన్నారం : అర్హుల పింఛన్లు కూడా తొలగించారని మండలంలోని చింతగూడ, రోటిగూడ గ్రామాలకు చెందిన సుమారు 300 మంది వృద్ధులు, వితంతులు, వికలాంగులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. చింతగూడ గ్రామ ప్రధాన రహదారిపై రెండు గంటలకుపైగా బైటాయించి ఆందోళన చేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఎస్సై స్వామి సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంపీడీవో, తహశీల్దార్లు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పే వరకు వెళ్లేది లేదని వారు భీష్మించుకు కూర్చున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాదవత్ సుధాకర్‌నాయక్ మాట్లాడుతూ పేదల పొట్టలు కొట్టి పెద్దలకు ఈ ప్రభుత్వం దోచి పెడుతుందని విమర్శించారు. గతంలో ఇచ్చిన పింఛన్లను తొలగించి వృద్ధుల ఉసురుపోసుకుంటుందన్నారు. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువదని పేర్కొన్నారు. ఎస్సై కలుగజేసుకుని ఆందోళనకారులను పక్కకు పంపించారు. తహశీల్దార్ రవీందర్ అక్కడికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బద్రినాయక్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట.. మండలంలోని కవ్వాల్, ఇందన్పల్లి, కామన్పల్లి, దేవునిగూడ గ్రామాలకు చెందిన వృద్ధులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైటాయించారు. అరగంటపాటు ఆందోళన చేశారు. వీరికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం పార్టీలు మద్దతు తెలిపాయి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కనికరం రాజన్న మాట్లాడుతూ పింఛన్ తొలగించి ప్రభుత్వం పేదల ఉసురుపోసుకుంటుందన్నారు. పింఛన్లు తొలగించి ముసలి వాళ్లకు ఆసర లేకుండా చేసిందన్నారు. అధికారుల నుండి స్పందన రాకపోవడంతో అంగడీబజార్ రహదారిపై రాస్తారోకోకు దిగారు. గంటపాటు రాస్తారోకో చేశారు. ఎస్సై స్వామి కలగజేసుకొని అధికారులతో మాట్లాడిస్తామని నచ్చజెప్పి వారిని తిరిగి కార్యాలయాలకు తీసుకెళ్లారు. ఎంపీడీవో శేషాద్రి ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు అంజన్న, నాయకులు గోపాల్, కొండగొర్ల లింగన్న , కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌నాయక్, టీడీపీ నాయకుడు ప్రభాకర్, సర్పంచ్ వెంకటరాజం పాల్గొన్నారు. కాగజ్‌నగర్ కమిషనర్‌ను నిర ్బంధించిన కౌన్సిలర్లు కాగజ్‌నగర్ రూరల్ : పింఛన్ల పంపిణీపై నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ కంచె కుమారస్వామిని కౌన్సిలర్లు ఆయన కార్యాలయంలో నిర్భంధించారు. ఈ నెల 8న ప్రభుత్వం ఆసరా పథకం పేరుతో నూతన పింఛన్లు మంజూరు చేయగా కొంత మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని కౌన్సిలర్లు కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. ఆసరా పేరుతో అందరికీ పింఛన్లు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం మంజూరులో ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. అట్టహాసంగా పథకాన్ని ప్రారంభించి కొంత మంది లబ్ధిదారులకు ఎందుకు విస్మరించారన్నారు. తమ వార్డుల్లో అర్హులైన నిరుపేదలు ఉన్నా వారికి పింఛన్లు మంజూరు చేయకపోవడంతో అర్హులు నిరాశకు గురవుతున్నారన్నారు. కొంత మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేయడంతో తామూ సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం ఏ ప్రాతిపాదికన పింఛన్లు మంజూరు చేస్తోందో ప్రజలకు స్పష్టం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్‌ను కార్యాలయంలో నిర్బంధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీవో నెంబర్ 17 ప్రకారం అర్హులైన వారందికీ పింఛన్లు మంజూరు చే స్తామని చెప్పడంతో కౌన్సిలర్లు శాంతించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సిందం శ్రీనివాస్, దేశ్‌ముఖ్ శ్రీనివాస్, కనుకుంట్ల శివప్రసాద్, రాజేందర్, నియాజుద్దిన్, జానిమియా, నాయకులు షబ్బీర్‌హుస్సేన్, పంజాల మురళీగౌడ్, శ్రీరాం, మహేశ్, దెబ్బటి శ్రీనివాస్, సలీం పాల్గొన్నారు. -
ప్రణాళిక ప్రకారం రక్షణ కల్పించాలి
జన్నారం : అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ ప్రణాళికబద్ధంగా ఉండాలని దూలపెల్లి ఫారెస్ట్ అకాడమీ డెప్యూటీ డెరైక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్, మేనేజ్మెంట్పై జన్నారం అటవీ శాఖ కమ్యూనిటీ హాలులో ఇస్తున్న మూడు రోజుల శిక్షణలో భాగంగా సోమవారం ఫారెస్ట్ లా పై అధికారులకు అవగాహన కల్పించారు. వన్యప్రాణులు వేటాడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నిందితుడికి శిక్ష పడాలంటే ఎలాంటి సెక్షన్లతో కేసులు పెట్టాలో వివరించారు. అలాగే కలప స్మగ్లింగ్‌కు పాల్పడిన వారిపై ఎలాంటి కేసులు పెట్టాలో, కలప అక్రమ రవాణా నిరోధానికి ఏం చేయాలో తెలిపారు. ఒక్కోసారి కేసు ఏ సెక్షన్ కింద నమోదు చేయాలో తెలియక కేసులు నీరుగారిపోయే ప్రమాదం ఉన్నందున, ఆచి, తూచి వ్యవహరించాలని సూచించారు. తెలియకపోతే వేరే వారి సహాయం తీసుకోవాలని స్పష్టం చేశారు. దోషులకు శిక్ష పడేలా చూడాలని తెలిపారు. హెక్ట్కాస్ సంస్థ నిర్వాహకుడు ఇమ్రాన్, వివిధ డివిజన్లకు చెందిన రే ంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు పాల్గొన్నారు. -
పంటల బీమా ఇలా..
జన్నారం : అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతిని రైతులు నష్టాల పాల వుతుంటారు. అలాంటి వారికి చేయూతనందించేం దుకు ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేస్తోంది. జిల్లాలో ఏయే పంటలకు బీమా వర్తిస్తుం ది.. ఎలా దరఖాస్తు చేసుకోవాలనే అంశాలపై మండల వ్యవసాయాధికారి మధులత వివరించారు. పంటల బీమా పథకాన్ని ఈ నెల 31వరకు పొడిగించారు. మొక్కజొన్న, కందులు, పెస లు, పత్తి, వరి, పసుపు, సోయాబీన్ తదితర పంటలకు బీమా పథకం వర్తిస్తుంది. సోయాబీన్ పంటకు గ్రామాన్ని యూనిట్‌గా పరిగణిస్తారు. రైతులు భూమికి సంబంధించిన పట్టాదారు, పాసుపుస్తకం, పంటలు వేసినట్లు వ్యవసాయ అధికారి ధ్రువీకరణ పత్రంతో వ్యవసాయ కార్యాలయంలో అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకుల నుంచి రుణాలు పొందే రైతుల నుంచి బీమా ప్రీమియం మినహాయించుకుని ఇస్తారు. మిగితా రైతుల సోయాబీన్, పత్తి పంటలకు ఎకరాకు రూ.585 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వీటితోపాటు రైతు ఆధార్ కార్డు, రేషన్‌కార్డు జీరాక్స్ అందజేయాలి. విపత్తుల ద్వారా పంట నష్టపోతే పత్తి, సోయాబీన్ పంటలకు ఎకరానికి రూ.12వేలు చొప్పున పరిహార అందుతుంది. బీమా చేసుకున్న తీరు ఇదీ.. ఖానాపూర్ నియోజకవర్గంలో పదిశాతం మంది రైతులు కూడా పంటలకు బీమా చేసుకోలేదు. జన్నారం మండలంలో సుమారు ఐదు వేల మంది రైతులు ఉండగా ఒక్కరూ బీమా చేయించలేదు. కడెం మండలంలో 22,353 మంది రైతులకు గాను 30 మంది, ఉట్నూర్ మండలంలో 4 వేల మందికి గాను ఐదుగురు, ఇంద్రవెల్లి మండలంలో 8,210 మందికి గాను 22 మంది రైతులు బీమా చేయించారు. -
రూ.8.29లక్షలు పట్టివేత
జన్నారం, న్యూస్‌లైన్ : ఎన్నికల నేపథ్యంలో తనిఖీ చేస్తున్న అధికారులు శనివారం పెద్దమొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీం లీడర్, డెప్యూటీ తహశీల్దార్ జాడి రాజలింగం తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న ఐచర్ వ్యాన్‌ను ఇందన్పల్లి చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేయగా మంథనికి చెందిన డ్రైవర్ మారిశెట్టి కుమార్ వద్ద రూ.3,84,205 లభించాయి. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న వ్యాన్‌ను తనిఖీ చేయ గా డ్రైవర్ నాంపెల్లి ఓదెలు వద్ద రూ.3,44,860 లభించాయి. వీరిని ప్రశ్నించగా ఆదిలాబాద్‌లోని జగదాంబ జిన్నింగ్ మిల్లులో పత్తి అమ్మి డబ్బులు తెస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ నుంచి పెద్దపెల్లికి వెళ్తున్న వ్యాన్‌ను తనిఖీ చేయగా.. ప్రయాణికుడు సాగర్, సంతోష్‌ల వద్ద రూ.లక్ష లభించాయి. వారు కూడా పత్తి విక్రయించి డబ్బు తెస్తున్నట్లు తెలిపారు. ఆధారాలు చూపిస్తే డబ్బు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఎస్సై బుద్దే స్వామి, ఏఆర్ ఎస్సై ఉత్తం, కానిస్టేబుల్ అశోక్, టీం సభ్యులు ఆత్రం రవీందర్, రాకేశ్, భూమాచారి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
60 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ
సీపీఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి జన్నారం, న్యూస్‌లైన్ : జిల్లాలో 60 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ స్థానాల్లో సీపీఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి తెలిపారు. సోమవారం పొన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆ పార్టీ డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రజల పక్షాన అనేకసార్లు పోరాటాలు చేసి, వారి ఇబ్బందులు తొలగించేలా కృషి చేశామన్నారు. కార్మికులు, రైతులకు మద్దతుగా ఎన్నోసార్లు పోరాడమని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. జిల్లాలో అనేక వనరులు ఉన్న వాటిని వినియోగించుకోవడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. ఏజెన్సీలో ఏటా గిరిజనులు పిట్టల్లా రాలిపోతున్నా ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 17 మధ్య తరగతి ప్రాజెక్టులు మంజూరు చేసినా వాటిని నిర్మించడంలో పాలకులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల పక్షాన పోరాడేందుకు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అంతకుముందు రేండ్లగూడకు చెందిన ఆకుల జయంత్, ర వి సీపీఎం పార్టీలో చేరారు. ీ సపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కె.రాజన్న, డివిజన్ కార్యదర్శి పోతు శంకర్, మండల కార్యదర్శి పిల్లి అంజన్న, నాయకులు గోపాల్, కే.లింగన్న, నాగెల్లి నర్సయ్య, చుంచు నారాయణ, గందం రవి పాల్గొన్నారు. -
జిల్లాను వీడని వర్షం
జన్నారం, న్యూస్‌లైన్ : జిల్లాను అకాల వర్షం వీడడం లేదు. జన్నారం మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యా యి. గంటపాటు కురిసిన వర్షానికి మండల కేంద్రంలోని సినిమా హాలుకు వెళ్లే రోడ్డు నీటి తో నిండింది. వరదలు పారాయి. మండలంలోని కామన్పల్లి, కవ్వాల్, కలమడుగు, ఇందన్పల్లి, రేండ్లగూడ, రాంపూర్, తిమ్మాపూర్, తపాలపూర్ తదితర గ్రామాల్లో మామిడి తోటల్లోని చెట్ల పూత రాలింది. తీవ్రంగా న ష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తాండూర్‌లో తాండూర్ : మండలంలో గురువారం మధ్యాహ్నం గంటపాటు ఉరుములు, మెరుపులతో కూ డిన భారీ వర్షం కురిసింది. కొ న్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. మాదారం-3 ఇంక్లైన్ నర్సాపూ ర్ ప్రాంతాల్లో జొన్న చేను నేల వాలింది. నాలుగై దు రోజు లుగా వర్షం కురుస్తుండడంతో శెనగ వేర్లు కుళ్లిపోయి పంట నష్టపోయే ప్రమా దం ఉంది. ఇప్పటికే మామిడి రైతు లు పూత, పిందెలు రాలి తీవ్రం గా నష్టపోయారు. గురువారం కురిసిన వర్షం మరింత నష్టపర్చింది. వర్షానికి కూలిన ఇళ్లు భీమిని : మండలంలో గురువా రం ఈ దురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మెట్పల్లి గ్రామ పంచాయతీ పరిధి ఏసయ్యపల్లిలో దుర్గం తమ్మయ్య ఇం టిపై చెట్టు విరిగి పడింది. దీంతో ఇంటి పైకప్పు ధ్వంసమైంది. దు గుట చంద్రయ్య, కోట శాంత ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. వెంకటాపూర్‌లో ఇందూరి లచ్చన్న ఇల్లు నేల మట్టమైంది. కన్నెపల్లిలో శనిగారపు చం టయ్య, మోర్ల మల్లేశ్, బాబాజీ ఇంటి పైకప్పులు ధ్వంసమయ్యాయి. భీమి ని, మెట్పల్లి, కన్నెపల్లి గ్రామాల్లో ఉల్లితోపాటు వివిధ రకాల కూరగాయల పంటలు దె బ్బతిన్నాయి. తహశీల్దార్ శ్రీనివాస్‌రా వు వెంకటాపూర్ గ్రామాన్ని సందర్శించి ఇళ్లు కూలిపోయిన బాధితులను పరామర్శించారు. తక్షణ సాయం కింద 25 కిలోల బియ్యం అందజేశారు. గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మొలకలు వచ్చిన పొద్దుతిరుగుడు కుంటాల : ఇటీవల కురిసిన అకాల వర్షాలతో మిర్చి, పత్తి, మొక్కజొన్న, గోధుమ పంటలు దెబ్బతిన్నాయి. మండలంలోని వెంకూర్ గ్రామంలో పొద్దుతిరుగుడు పంట నేలకొరిగి మొలకలు వచ్చాయి. దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కెరమెరిలో.. కెరమెరి : మండలంలో గురువారం ఉద యం 11గంటల ప్రాంతంలో భారీ వర్షం కురి సింది. ప్రధాన రహదారులు చిత్తడిగా మారా యి. గోయేగాం, ధనోరా, ఝరి, రింగన్ఘా ట్, కెరమెరి గ్రామాల్లో రోడ్లు బురదగా మారడంతో పాదచారులు, వాహన చోదకులు ఇ బ్బందులు ఎదుర్కొన్నారు. గోయేగాం పాఠశాల ఆవరణ వర్షపు నీటితో నిండిపోయింది. రింగన్‌ఘాట్ వద్ద నిర్మిస్తున్న రో డ్డు కారణంగా కాంట్రాక్టర్లు పక్కనుంచి మట్టిదారి నిర్మించారు. వర్షం వచ్చినప్పుడల్లా బురదగా మారుతోంది. దీంతో ఇప్పటివరకు సు మారు 25మంది వాహనదారులు జారిపడ్డారు. వేమనపల్లిలో.. వేమనపల్లి : మండలంలోని లింగాల గ్రా మంలో గురువారం రాత్రి కురిసిన అకాల వ ర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు నాగెపెల్లి గ్రామంలో 20 గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. నాలుగు ఇళ్లు నేలమట్టం అ య్యాయి. వందల ఎకరాల్లో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంట నేలవాలింది. గంటన్నరపాటు కురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వరి పొలాల్లో నీరు చేరి నష్టపోయినట్లు లింగాల గ్రామానికి చెందిన చౌదరి శంకర్ తెలిపాడు. 200 ఎకరాల్లో పొద్దు తిరుగుడు, 400 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. మరో వారం రోజుల్లో చేతికందే పొద్దుతిరుగుడు పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేలకొరిగిన పంటలు దహెగాం : మండలంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. లగ్గాం, కుంచవెల్లి, మాడవెల్లి, ఐతపల్లి తదితర గ్రామాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. గాలివాన కు చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. కన్నెపల్లి నుంచి మాడవెల్లికి సరఫరా అవుతున్న 11కేవీ లైన్‌పై చెట్లు పడడంతో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కుంచవెల్లిలో వ్యవసాయానికి విద్యు త్ సరఫరా చేసే స్తంభాలు పడిపోయాయి. మాడవెల్లిలో రాదండి శంకర్, వరిమడ్ల పోచ య్య ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. -
ఉద్యోగం రాదనే బెంగతో ఆత్మహత్య
జన్నారం, న్యూస్‌లైన్ : ప్రభుత్వ ఉద్యోగం రాదనే బెంగతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తపాలపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై పొన్నం సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. తపాలపూర్ గ్రామానికి చెందిన గుంటుకు భరత్(24) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. పదిహేను రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు లేవని, భవిష్యత్ పాడవుతుందని కుటుంబ సభ్యులతో మదనపడేవాడు. మనస్తాపం చెందిన భరత్ గురువారం సాయంత్రం పురుగుల మందు తాగి ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి తల్లిదండ్రులు గంగన్న, భారతి, ఇద్దరు సోదరులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. భార్య మందలించిందని భర్త.. దండేపల్లి : మండలంలోని మాకులపేట, లక్ష్మీకాంతపూర్ గ్రామాల్లో ఇద్దరు వ్యక్తులు వేర్వేరు కారణాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాకులపేట గ్రామానికి చెందిన బోడకుంటి శ్రీనివాస్(40) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. భార్యకు తెలియకుండా రూ.2వేలు అప్పు చేశాడు. మద్యంమత్తులో వాటిని పడేశాడు. కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేక బాధపడుతుంటే తాగుడు మానకుండా అప్పు ఎందుకు చేశావని భార్య సత్తవ్వ అతడిని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలిస్తుం డగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఆయనకు భార్య సత్తవ్వ, కూతురు శ్రుతి ఉన్నారు. తండ్రి మందలించాడని కొడుకు.. మండలంలోని లక్ష్మీకాంతపూర్ గ్రామానికి చెందిన జెల్లపెల్లి స్వామి(22) గొర్రెలు మేపేందుకు వెళ్లకపోవడంతో తండ్రి లింగయ్య మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన స్వామి గురువారం రాత్రి ఇంటి వద్దే పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి లక్సెట్టిపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి సమయంలో చనిపోయాడు. స్వామికి భార్య మల్లవ్వ, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీనివాస్ వివరించారు. జీవితంపై విరక్తితో.. కుభీర్ : మండలంలోని బెల్గాం గ్రామానికి చెందిన ఆదేపువాడ్ శంకర్(36) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై టి.సంజీవ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌కు భార్యాపిల్లలు, అన్నదమ్ములు లేకపోవడంతో ఇతర గ్రామాల్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరి జీవితంపై విరక్తి చెంది బుధవారం స్వగ్రామానికి వచ్చాడు. గురువారం ఉదయం చేనులో పురుగుల మందు తాగి చనిపోయాడు. గ్రామస్తులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చికిత్సకు డబ్బుల్లేక.. ఆదిలాబాద్ రూరల్ : జైనథ్ మండలం రోడ్ మేడిగూడ గ్రామానికి చెందిన జె.ఆనంద్‌రావు(30) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జైనథ్ ఏఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్‌రావు కొన్నేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయాడు. చికిత్స కోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తీసుకెళ్లారు. డబ్బులు లేకపోవడంతో రెండోసారి చికిత్సకు తీసుకెళ్లలేదు. దీంతో వ్యాధి తీవ్రం కావడం, చికిత్సకు డబ్బులు లేకపోవడంతో గురువారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడి భార్య రేవతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వివరించారు.