మృతదేహంతో ఆందోళన చేస్తున్న బంధువులు
సాక్షి, జన్నారం(ఆదిలాబాద్): ‘నేను రైస్‌మిల్ వద్దకు కాపలాకు వెళ్తున్న.. పొద్దున్నే వస్తా’ అని ఇంట్లో చెప్పి వెళ్లిన వ్యక్తిని మృత్యువు ద్విచక్రవాహనం రూపంలో కబళించింది. ఈ ఘటన జన్నారం మండలం మొర్రిగూడలో జరి గింది. మృతుని భార్య రాజేశ్వరి, ఎస్సై సతీశ్ తెలి పిన వివరాల ప్రకారం... గ్రామంలోని ఎస్సీకాలనీకి చెందిన దుర్గం రాజన్న(50) ఓ రైస్‌మిల్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి 9 గంట ల ఇంట్లో భోజనం చేసి రైస్‌మిల్ కాపలాకు వెళ్తున్నానని భార్యకు చెప్పి సైకిల్‌పై బయల్దేరాడు. ప్రధాన రహదారి వెంట వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వానహం(ఏపీ01ఆర్2594) అతివేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రాజన్న తలకు తీవ్రగాయాలు కావడంతో స్పృహ కోల్పోయాడు. ద్విచక్ర వాహనంపై వచ్చిన దస్తురాబాద్ మండలం మల్లాపూర్‌కు చెందిన ఎలగందుల అనిల్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన జాడి సు రేందర్ రాజన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రాజేశ్వరి, ఆమె సోదరుడు కామెర రాజం సంఘటన స్థలానికి చేరుకుని ప్రైవేట్ వాహనంలో జన్నారం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సూచన మేరకు జగిత్యాలకు, అక్కడి నుంచి కరీంనగర్ అసుపత్రికి తరలించారు. రాత్రి 12 గంటలకు కరీంనగర్ ఆసుపత్రిలో మృతి చెందాడు.
చదవండి: పోలీస్ కస్టడీకి డ్రగ్ పెడ్లర్ టోనీ.. బడా‘బాబు’ల బండారం బయటపడేనా?
మృతదేహంతో ఆందోళన..
అజాగ్రత్తగా ద్విచక్రవాహనం నడిపి రాజన్న మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి బంధువులు మొర్రిగూడ ప్రధాన రహదారిపై మృతదేహంతో రా స్తారోకో చేశారు. వారికి గ్రామస్తులు, గ్రామ పెద్దలు సుధాకర్‌నాయక్, మహేందర్, రాజం మద్దతు తెలి పారు. దండెపల్లి ఎస్సై సాంబమూర్తి సిబ్బందితో కలిసి మొర్రిగూడకు చేరుకుని రాస్తారోకో విరమించాలని సూచించారు. దీంతో గ్రామస్తులు ఎస్సై తో వాగ్వాదానికి దిగారు. ఆందోళన కారులను సముదాయించడంతో రాస్తారోకో విరమించారు. రాజన్న కు ఇద్దరు కుమారులున్నారు. భార్య ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు.
చదవండి: శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. భార్య, అత్తను కిరాతకంగా..
Comments
Please login to add a commentAdd a comment