watch man
-
‘రైస్‌మిల్ వద్దకు కాపలాకు వెళ్తున్న.. పొద్దున్నే వస్తా’ అని ఇంట్లో చెప్పి..
సాక్షి, జన్నారం(ఆదిలాబాద్): ‘నేను రైస్‌మిల్ వద్దకు కాపలాకు వెళ్తున్న.. పొద్దున్నే వస్తా’ అని ఇంట్లో చెప్పి వెళ్లిన వ్యక్తిని మృత్యువు ద్విచక్రవాహనం రూపంలో కబళించింది. ఈ ఘటన జన్నారం మండలం మొర్రిగూడలో జరి గింది. మృతుని భార్య రాజేశ్వరి, ఎస్సై సతీశ్ తెలి పిన వివరాల ప్రకారం... గ్రామంలోని ఎస్సీకాలనీకి చెందిన దుర్గం రాజన్న(50) ఓ రైస్‌మిల్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి 9 గంట ల ఇంట్లో భోజనం చేసి రైస్‌మిల్ కాపలాకు వెళ్తున్నానని భార్యకు చెప్పి సైకిల్‌పై బయల్దేరాడు. ప్రధాన రహదారి వెంట వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వానహం(ఏపీ01ఆర్2594) అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజన్న తలకు తీవ్రగాయాలు కావడంతో స్పృహ కోల్పోయాడు. ద్విచక్ర వాహనంపై వచ్చిన దస్తురాబాద్ మండలం మల్లాపూర్‌కు చెందిన ఎలగందుల అనిల్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన జాడి సు రేందర్ రాజన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రాజేశ్వరి, ఆమె సోదరుడు కామెర రాజం సంఘటన స్థలానికి చేరుకుని ప్రైవేట్ వాహనంలో జన్నారం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సూచన మేరకు జగిత్యాలకు, అక్కడి నుంచి కరీంనగర్ అసుపత్రికి తరలించారు. రాత్రి 12 గంటలకు కరీంనగర్ ఆసుపత్రిలో మృతి చెందాడు. చదవండి: పోలీస్ కస్టడీకి డ్రగ్ పెడ్లర్ టోనీ.. బడా‘బాబు’ల బండారం బయటపడేనా? మృతదేహంతో ఆందోళన.. అజాగ్రత్తగా ద్విచక్రవాహనం నడిపి రాజన్న మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి బంధువులు మొర్రిగూడ ప్రధాన రహదారిపై మృతదేహంతో రా స్తారోకో చేశారు. వారికి గ్రామస్తులు, గ్రామ పెద్దలు సుధాకర్‌నాయక్, మహేందర్, రాజం మద్దతు తెలి పారు. దండెపల్లి ఎస్సై సాంబమూర్తి సిబ్బందితో కలిసి మొర్రిగూడకు చేరుకుని రాస్తారోకో విరమించాలని సూచించారు. దీంతో గ్రామస్తులు ఎస్సై తో వాగ్వాదానికి దిగారు. ఆందోళన కారులను సముదాయించడంతో రాస్తారోకో విరమించారు. రాజన్న కు ఇద్దరు కుమారులున్నారు. భార్య ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. చదవండి: శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. భార్య, అత్తను కిరాతకంగా.. -
నేపాలీ దంపతుల చోరీ కేసు: దేశం విడిచిపెట్టి పోలేదు!
సాక్షి, హైదరాబాద్: టెలికంనగర్‌లోని వ్యాపారి ఇంట్లో భారీ దొంగతనం చేసి పరారైన నేపాలీ దంపతులు దేశం విడిచిపెట్టి పోలేదని పోలీసులు తెలిపారు. మూడు ప్రత్యేక బృందాలు దేశ సరిహద్దు ప్రాంతాలలో విస్తృతంగా గాలింపులు చేపట్టాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ వంటి నాలుగు రాష్ట్రాలలో నిఘా పెట్టామని చెప్పారు. ఇప్పటికే పలు కీలక సాంకేతిక ఆధారాలు లభ్యమయ్యాయని.. వచ్చే రెండు రోజుల్లో నిందితులు ఇద్దరినీ పట్టుకొని హైదరాబాద్‌కు తీసుకొస్తామని ఓ పోలీస్ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. మరిన్ని వివరాలను సేకరించే ప్రయత్నం చేయగా.. ‘తినబోతూ రుచులు ఎందుకని’ సదరు ఉన్నతాధికారి సంబోధించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలికంనగర్‌లోని వ్యాపారి బీరం గోవిందరావు ఇంట్లో పనిచేసే నేపాలీ దంపతులు లక్ష్మణ్ (34), పవిత్ర (30)లు గత ఆదివారం 120 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు చోరీ చేసి పరారైన విషయం తెలిసిందే. కేసు నమోదు కాగానే వెంటనే అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు నేపాల్ దంపతులు దేశం దాటకుండా చర్యలు చేపట్టారు. నేపాల్‌కు పారిపోకుండా దేశ సరిహద్దు భద్రతా దళాలకు నిందితుల ఫొటోలు పంపి అప్రమత్తం చేశారు. చోరీ చేయగానే ప్రైవేట్ క్యాబ్‌లో నేరుగా ముంబైకి వెళ్లి అక్కడ్నుంచి విమానంలో నేపాల్‌కు పారిపోవాలని నిందితులు ప్లాన్ వేశారు. కానీ పోలీసుల నిఘా ఉండటంతో ప్లాన్ ఫలించలేదు. నిందితులు ఇద్దరు ముంబై విమానాశ్రయం వద్దే తిరిగినట్లు కీలక సమాచారం పోలీసులకు లభించింది. ఇద్దరు నిందితులతో పాటు వీరికి సహాయపడిన పలువురుని అదుపులోకి తీసుకొని విచారించినట్లు సమాచారం. చదవండి: Gachibowli: భారీ చోరీకి పాల్పడిన ‘నేపాల్’ వాచ్మెన్ దంపతులు -
దారుణం: విద్యార్థిని చితక్కొట్టిన వాచ్మెన్
గాజువాక: సెలవు రోజున విద్యార్ధి గోడ దూకి పాఠశాలలోకి వచ్చాడనే కోపంతో విద్యార్థిని ఓ వాచ్మెన్ చితక్కొట్టాడు. వీపు, చేతులు, కాళ్లపై తీవ్రంగా కొట్టడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. వెంటనే వాచ్మెన్పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా గాజువాకలో జరిగింది. అయితే వాచ్మెన్ దాడి చేసిన విషయం ఆ విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పలేదు. రాత్రి చొక్కా తీసి నిద్రిస్తున్న సమయంలో ఒంటిప్తె ఉన్న దెబ్బలు చూసి తల్లి అడగడంతో ఈ విషయం బయటపడింది. గాజువాక బీసీ రోడ్డులో ఉన్న మార్వెల్ పాఠశాలలో చ్తెతన్య ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కొంతమంది విద్యార్థులతో కలసి ఆడుకునేందుకు పాఠశాలకు వచ్చాడు. అయితే వాచ్మెన్ అనుమతి తీసుకుని లోనికి వెళ్లి ఆడుకుంటున్న సమయంలో వేరే అబ్బాయి వచ్చాడు. పాఠశాలలలో ఉన్న బస్సు ఎక్కి హారన్ కొట్టడంతో వాచ్‌మెన్‌కు ఆగ్రహం తెప్పించింది. వెంటనే కర్రతో చితకబాదాడని బాధిత విద్యార్థి ఆరోపించాడు. ఇంటికెళ్లినా విద్యార్థి వాచ్మెన్ కొట్టిన విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే రాత్రి నిద్రిస్తుండగా తల్లి సత్యగౌరి చూసి ప్రశ్నించగా ఈ విషయం బయటకు వచ్చింది. తెల్లారి వెంటనే పాఠశాలకు వెళ్లి ఆందోళన చేశారు. బాధిత విద్యార్ధి తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్‌ను నిలదీశారు. తప్పు చేస్తే ఇంత దారుణంగా వాచ్మెన్ కొడతారా అని అడిగారు. విద్యార్ధుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా.. అంటూ నిలదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్‌తో మాట్లాడి వాచ్‌మెన్‌ను పిలిపించారు. అయితే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే వాచ్మెన్ దారుణంగా కొట్టాడని వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. చదవండి: ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్లో ఆత్మహత్య చదవండి: ముగ్గురి గ్యాంగ్ రూ.3 కోట్ల మోసం -
లూనాను ఢీకొట్టిన కారు..∙ వాచ్మెన్ మృతి
ధారూరు: లూనా(ద్విచక్ర వాహనం)పై వెళుతు న్న ఓ వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో వ్యక్తి దుర్మరణం చెందాడు. కారుతో సహా పారిపోతున్న డ్రైవర్‌ను అక్కడే ఉన్న యువకులు వెంబడించి పట్టు కుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ధారూరు మండలంలోని రాంపూర్‌తండా బస్‌స్టేజీ వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... పెద్దేముల్ మండలం రేగొండి గ్రామానికి చెందిన మొయినుద్దీన్(55) వికారాబాద్ పట్టణ సమీప శేఖర్‌రెడ్డి క్రషర్ మిషన్ వద్ద నైట్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ సాయంత్రం ఇంటి నుంచి క్రషర్ మిషన్ వద్దకు వెళ్లి తిరిగి ఉదయం పూట ఇంటికి చేరుకుంటాడు. ఆదివారం రాత్రి విధులు నిర్వహించి ఉదయం తన లూనాపై ఇంటికి వస్తున్నాడు. ధారూరు మండలం రాంపూర్‌తండా బస్‌స్టేజీ వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి వస్తున్న కారు లూనాను బలంగా ఢీకొట్టింది. లూనాపై నుంచి మోయినుద్దీన్ కారుపై ఎగిరిపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. లూనాను కారు కొద్దిదూరం అలాగే లాక్కెళ్లింది. ఇది గమనిస్తున్న ఇద్దరు యువకులు కారును పట్టుకునే ప్రయత్నం చేయగా వారి నుంచి తప్పించుకునేందుకు వేగంగా తాండూర్ వైపు పరుగు తీసింది. ఓ యువకుడు వెంటనే తన సెల్ ద్వారా ముందు స్టేజీ వద్ద మిత్రునికి సమాచారం ఇవ్యగా అతను గ్రామస్తులతో కలిసి కారును రోడ్డుపై నిలిపివేశారు. కారులో ఉన్న ఓ మహిళ, డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు. బైక్‌లపై కారును వెంబడించిన యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చి కారును అప్పగించారు. కుటుంబానికి పెద్ద దిక్కు మృత్యువాత పడటంతో కుటుంబీకులు శోక సంద్రంలో మునిగారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి శవ పంచానామ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం మోయినుద్దీన్‌కు ఇద్దరు భార్యలు, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు భార్యలు మృతి చెందగా.. కొడుకులు కూలీ పనులు చేస్తున్నారు. ఇతర ఆదాయ వనరులు లేకపోవడంతో కుటుంబం అంతా తండ్రి సంపాదనపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆ పిల్లలు అనాథలయ్యారు. -
కరెంట్ కాటేసింది
నిడదవోలు రూరల్: నిడదవోలు మండలంలోని శెట్టిపేట శివారులో కాకరపర్రు రెగ్యులేటర్ కాంట్రాక్టర్ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఖమ్మం గోపాలకృష్ణ (66) అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతిచెందినట్టు పట్టణ ఎస్సై జి.సతీష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆచంట గ్రామానికి చెందిన గోపాలకృష్ణ ఏడేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం భార్య రాధమ్మతో వచ్చి రెగ్యులేటర్ వద్ద వాచ్‌మెన్‌గా చేరాడు. అప్పటినుంచి రెగ్యులేటర్ నిర్మాణానికి వినియోగించే సామాన్లను భద్రంగా చూడటంతో పాటు కాకరపర్రు లాకుల వద్ద పనిచేసే ఇరిగేషన్ సిబ్బందికి చేదోడువాదోడుగా ఉంటూ అక్కడే నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోజుమాదిరిగానే మంగళవారం ఉదయం రెగ్యులేటర్ కార్యాలయం ముందు ఉన్న కొండాలమ్మవారిని దర్శించుకుని లైట్లు ఆపడానికి స్వీచ్ ఆన్‌చేయగా షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మృతదేహం వద్ద భార్య రాధమ్మ, బంధువులు గుండెలవిసేలా రోదించారు. గోపాలకృష్ణ మంచి వ్యక్తిని, నమ్మకంతో పనిచేసేవాడని ఇరిగేషన్, రెగ్యులేటర్ కాంట్రాక్టర్లు గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలకృష్ణకు ఇద్దరు కుమార్తెలు. లాక్ సూపరింటెండెంట్లు చిక్కాల బ్రహ్మజీ, రాజు, నీటిసంఘం అధ్యక్షుడు బూరుగుపల్లి శ్రీనివాసరావు శవపంచానామ కార్యక్రమాలను పర్యవేక్షించారు. భార్య రాధమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సతీష్ చెప్పారు. -
టీడీపీ కార్యకర్తల దాష్టీకం
రిజర్వాయర్ వాచ్‌మన్, భార్య, కుమార్తెపై దాడి ఇరిగేషన్ కార్యాలయం ధ్వంసం, రికార్డులు దహనం కేసు మాఫీకి టీడీపీ నేత హుకుం, ఇరిగేషన్ డీఈ మౌనం ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ ఏఈ బుచ్చిరెడ్డిపాళెం : మద్యం మత్తులో టీడీపీ కార్యకర్తలు క్రూరంగా ప్రవర్తించారు. రిజర్వాయర్ వాచ్‌మెన్‌ను, అతని భార్య, కుమార్తెలను మహిళలని చూడకుండా పైనబడి చితకబాదారు. తింటున్న అన్నం ప్లేటును కాలితో కొట్టి నానా రభస చేశారు. ఈ ఘటన మండలంలోని కనిగిరి రిజర్వాయర్ వద్ద ఈ నెల 25న జరిగింది. తొలుత కేసును మాఫీ చేసేందుకు టీడీపీ నేత రంగంలోకి దిగాడు. ఇందుకు ఇరిగేషన్ డీఈ మద్దతు ప్రకటించారు. అయితే ఈ ఘటనపై ఏఈ ఆలస్యంగా ఫిర్యాదు చేయడంతో 27న పోలీసులు కేసు నమోదు చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మంగళకట్టకు చెందిన టీడీపీ కార్యకర్తలు హరి, మరి కొంతమంది మద్యం తాగేందుకు ఈ నెల 25న కనిగిరి రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. రాత్రి కావస్తున్నా తాగుతూనే ఉన్నారు. అక్కడ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న సంజీవయ్య వారిని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న హరి, మరికొందరు సంజీవయ్యపై దాడి చేశారు. అక్కడే ఉన్న సంజీవయ్య భార్య రామమ్మ, కుమార్తె సంధ్య, అల్లుడు శేషయ్యపై దాడికి దిగారు. కంపచెట్లలోకి ఈడ్చుకుని వెళ్లి కొట్టారు. దీంతో భయపడి సంజీవయ్య రోడ్డుపైకి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడి వెళ్లేలోగా వారు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు వెళ్లిన వెంటనే మళ్లీ హరి, మరో 9 మంది యువకులను తీసుకువచ్చి విచక్షణా రహితంగా సంజీవయ్యను కొట్టాడు. అంతటితో ఆగక ఇరిగేషన్ కార్యాలయం తలుపును పగలగొట్టాడు. కార్యాలయంలోని రికార్డులను బయటవేసి తగులపెట్టారు. కేసు లేకుండా చూడండి సంజీవయ్యపై దాడిచేసిన టీడీపీ కార్యకర్తలు హరి, మరి కొంతమందిపై కేసు లేకుండా చూడాలని టీడీపీ మండల నేత ఒకరు ఇరిగేషన్ అధికారులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇరిగేషన్ ఉన్నతాధికారులు గుర్రు మన్నా.. డీఈ శంకర్‌నారాయణ మాత్రం తొలుత టీడీపీ నేతల మాటకు తలూపినట్లు ఆరోపణలున్నాయి. అందుకే 25వ తేదీ రాత్రి సంఘటన జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా రోజులు దాటవేశారని గిరిజన సంక్షేమ సంఘం నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ రికార్డులు తగలబెడితే ఎంత నేరమో తెలిసి మౌనంగా రెండు రోజులు ఆలస్యం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మృగాల్లా వ్యవహరించారు తాగి ఉన్నారు... వెళ్లిపోండి అంటూ కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదని, మృగాల్లా వ్యవహరించారని సంజీవయ్య భార్య, కుమార్తె వాపోయారు. తన కుమార్తె వద్దకు రావడం, పైన పడబోవడం, నానా దుర్భాషలాడడం చేశారని కన్నీరుమున్నీరయ్యారు. దీనిపై ఎస్ఐ సుధాకర్ రెడ్డిని సంప్రదించగా ఇరిగేషన్ డీఈ ఈ నెల 27వ తేదీన ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కఠినంగా శిక్షించాలి : కల్లూరు చిన్న పెంచలయ్య, రాష్ట్ర యానాది సంఘం జిల్లా అధ్యక్షుడు పూట గడిచేందుకు వాచ్‌మన్‌గా పనిచేస్తున్న సంజీవయ్య అతని కుటుంబంపై మృగాల్లా వ్యవహరించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. వారిపై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలి. -
హత్యకేసులో వాచ్‌మన్‌కు యావజ్జీవం
హిందూపురం అర్బన్: పుట్టపర్తిలో సత్యసాయి సేవ కోసం వచ్చిన ఆస్ట్రేలియాకు చెందిన టోనీబెర్లి (75)ని హత్య చేసి, తన పొలంలోనే పాతిపెట్టిన సాయిగౌరి అపార్ట్మెంట్ వాచ్‌మన్ భగవంతుకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సోమవారం హిందూపురం జిల్లా అదనపు జడ్జి రాములు తీర్పు చెప్పారు. ఈ కేసును పబ్లిక్‌ప్రాసిక్యూటర్ రాజశేఖర్ వాదించగా జడ్జి పలువురు సాక్షులను విచారణ చేసి వాచ్‌మెన్‌కు యావజ్జీవంతోపాటు రూ.10వేల జరిమానా విధించారు. సాక్షులను తారుమారు చేసిన కేసులో 203 సెక్షన్ కింద మరో 2సంవత్సరాలు జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజశేఖర్ తెలిపారు. -
అప్పుల బాధతో వాచ్‌మన్ ఆత్మహత్య
చేవెళ్ల రూరల్: అప్పుల బాధ తాళలేక ఓ ప్రైవేట్ పాఠశాల వాచ్‌మన్ పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పెద్దనందిపాడు గ్రామానికి చెందిన జి. వరప్రసాద్ కొంతకాలంగా వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. పదిహేనేళ్ల క్రితం కుటుంబంతో సహా చేవెళ్లకు వలస వచ్చాడు. ఇటీవలే చేవెళ్లలో కొత్తగా ఇల్లు నిర్మించుకున్నాడు. వరప్రసాద్‌కు భార్య ప్రమీల, కూతుళ్లు శ్వేత, అనూషలు ఉన్నారు. కుటుంబ పోషణకు, ఇంటి నిర్మాణానికి ఆయన తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. వాటికి వడ్డీలు పెరిగిపోయాయి. కుమార్తెలు పెళ్లీడుకు రావడం, అప్పులు తీరే మార్గం కనిపించకపోవడంతో వరప్రసాద్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆయన పనిచేస్తున్న పాఠశాలలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహానికి చేవెళ్ల ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని పాఠశాల యాజమాన్యం హామీ ఇచ్చింది. వరప్రసాద్ భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
హైదరాబాద్ క్రైం: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మలక్‌పేట ఏసీపీ కార్యాలయం ఎదుట శుక్రవారం జరిగింది. వివరాలు.. కర్ణాటకకు చెందిన అబ్దుల్ నబీ సాహెబ్(55) సైదాబాద్‌లోని నూరో హైస్కూల్లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. కాగా, శుక్రవారం రోడ్డు దాటుతుండగా ఇబ్రహీంపట్టణం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు(ఏపీ 29 పీఏ 0113) ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కర్ణాటకలోని సాహెబ్ బంధువులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేజీబీవీల్లో వెలుగుచూడని ఉదంతాలెన్నో
సాక్షి, నల్లగొండ: జిల్లాలో మొత్తం 45 కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) ఉన్నాయి. ఆర్వీఎం, ఏపీ గురుకుల సొసైటీ పరిధిలో 18 చొప్పున, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 9 ఉండగా.. వీటిలో దాదాపు 700 మంది ఆరు నుంచి పదోతరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. వాస్తవంగా ప్రతి కేజీబీవీలో మహిళలే పనిచేయాలి. ప్రత్యేకాధికారి నుంచి వాచ్‌మన్ వరకు వారే తప్పనిసరి. ప్రత్యేకాధికారిగా మహిళ అందుబాటులో లేకుంటే విశ్రాంత పురుష ఎంఈ ఓలు, 45 ఏళ్ల వయసు దాటిన వారు విధులు నిర్వహించవచ్చు. ఈ మేరకు జూన్ 20న ఆర్వీఎం రాష్ట్ర ప్రాజెక్ట్ డెరైక్టర్ నుంచి సర్క్యులర్ జారీ అయ్యింది. వారిదే ఇష్టారాజ్యం గుండాల, తుంగతుర్తిలో ఇటీవలే ఇద్దరు విధుల నుంచి తప్పుకోగా,ప్రస్తుతం పదిమంది పురుషులు కేజీబీవీల్లో అకౌంటెంట్లుగా పనిచేస్తున్నారు. వీరిలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఉన్నతాధికారుల అండదండలతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేజీబీవీలపై ఉన్నతాధికారుల అజమాయిషీ కొరవడడంతో బిడ్డల వయస్సున్న విద్యార్థినుల పట్ల కొందరు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆ విద్యాలయాలకే మాయని మచ్చ తెస్తున్నారు. ఇలా కొంతకాలంగా జరుగుతోంది. ఇటీవల అర్వపల్లి కేజీబీవీలో బయటపడిన ఉదంతం ద్వారా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చీటికి మాటికి దగ్గరికి పిలవడం, శరీరంపై చేతులు వేయడం, చెప్పరాని చోట తాకడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. తమకు ఎక్కడ ఏంచేస్తారోనని ఎవరికీ చెప్పకుండా విద్యార్థినులు మథనపడుతున్నారు. ఈ విషయం సీఆర్టీలకు తెలిసినా... సదరు అకౌంటెంట్లకు ఉన్నతాధికారుల అండదండలు ఉండ డంతో వీరూ బయటపెట్టడానికి సాహసించడం లేదు. మొత్తంగా కొన్ని కేజీబీవీలు వేధింపులకు నిలయాలుగా మారాయి. సిబ్బంది నిర్వాకం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో బాలికలు భయపడుతున్నారు. ఆ అధికారికి రక్త సంబంధీకుడే... ఓ కేజీబీవీలో ఓ ఉన్నతాధికారి బంధువే అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. వాస్తవంగా కామర్స్‌లో పట్టా ఉన్న మహిళలే ఆ స్థానంలో ఉండాలి. కానీ ఎంఏ చేసిన పురుషుడు అకౌం టెంట్‌గా విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. అంతేగాక ఇతను స్థానికేతరుడు. వరంగల్ జిల్లాకు చెందినవాడు. జిల్లాలో అర్హులైన ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నా.. వారిని పక్కనబెట్టి నిబంధనలు ఉల్లంఘించి అయిన వారికి పట్టం కట్టడం విశేషం. అంతేగాక సదరు అకౌంటెంట్ భార్య కూడా అదే కేజీబీవీలో గతేడాది గెస్ట్ టీచర్‌గా పనిచేసింది. ఈ ఏడాది ఆమెను అక్కడే సీఆర్టీగా నియమించారు. అదికూడా నోటిఫికేషన్ సమయంలో అక్కడ ఖాళీ పోస్టు చూపించకుండా గుట్టుచప్పుడు కాకుండా భర్తీ చేశారని ఆరోపణలు పెద్దఎత్తున వస్తున్నాయి. వీటితోపాటు నూతన్‌కల్‌లో పనిచేస్తున్న అభ్యర్థి కూడా ఓ ఉన్నతాధికారికి బంధువేనని సమాచారం. నిబంధనలకు పాతర అకౌంటెంట్‌గా పనిచేయాలంటే 18-35 ఏళ్ల వయసు ఉండి, తప్పనిసరిగా కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. కానీ ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా నిబంధనలకు నీళ్లొదిలారనే ఆరోపణలున్నాయి. అకౌంటెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేసిన సమయంలో పెద్ద ఎత్తున మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎంకాం చేసిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. అన్ని అర్హతలున్నా వీరిని పక్కనబెట్టి నిబంధనలకు విరుద్ధంగా పురుషులకు పోస్టులు అప్పజెప్పారనే ఆరోపణలు వస్తున్నాయి. కోర్టును ఆశ్రయించారు మూడేళ్ల కిందట విడుదలైన జీఓలో పురుషులను నియమించుకోవద్దని లేదు. పురుషుల నియామకాలు చేపట్టకూడదని ఇటీవల వచ్చిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. దీన్ని బట్టి ఆయా కేజీబీవీల్లో పనిచేస్తున్న పురుషుడిని వెళ్లిపోవాలని ఆదేశించాం. దీంతో వారు కోర్టుకు వెళ్లారు. స్టే కోసం ప్రయత్నిస్తున్నారు. మూడేళ్లుగా లేని వేధింపులు.. ఇప్పుడెలా వచ్చాయి? వేధింపులు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. - బాబూ భూక్యా, ఆర్వీఎం పీఓ