60 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ
సీపీఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి
జన్నారం, న్యూస్‌లైన్ : జిల్లాలో 60 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ స్థానాల్లో సీపీఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి తెలిపారు. సోమవారం పొన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆ పార్టీ డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రజల పక్షాన అనేకసార్లు పోరాటాలు చేసి, వారి ఇబ్బందులు తొలగించేలా కృషి చేశామన్నారు. కార్మికులు, రైతులకు మద్దతుగా ఎన్నోసార్లు పోరాడమని తెలిపారు.
క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. జిల్లాలో అనేక వనరులు ఉన్న వాటిని వినియోగించుకోవడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. ఏజెన్సీలో ఏటా గిరిజనులు పిట్టల్లా రాలిపోతున్నా ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు.
జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 17 మధ్య తరగతి ప్రాజెక్టులు మంజూరు చేసినా వాటిని నిర్మించడంలో పాలకులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల పక్షాన పోరాడేందుకు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అంతకుముందు రేండ్లగూడకు చెందిన ఆకుల జయంత్, ర వి సీపీఎం పార్టీలో చేరారు. ీ
సపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కె.రాజన్న, డివిజన్ కార్యదర్శి పోతు శంకర్, మండల కార్యదర్శి పిల్లి అంజన్న, నాయకులు గోపాల్, కే.లింగన్న, నాగెల్లి నర్సయ్య, చుంచు నారాయణ, గందం రవి పాల్గొన్నారు.