నల్లగొండ, న్యూస్‌లైన్,ప్రాదేశిక ఎన్నికల్లో 18 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 835 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, వీటిల్లో నామినేషన్ల ఉపసంహరణ నాటికి 18 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే ఎన్నికల నిబంధనలకు లోబడి ఆయా స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు నిర్ధారించిన తర్వాత ఆదివారం తుది జాబితాను వెల్లడించారు.
వీటిల్లో కాంగ్రెస్-11, స్వతంత్రులు-5, టీడీపీ-1, సీపీఎం-1 స్థానం ఏకగ్రీవమయ్యాయి. కాగా 2006 ఎన్నికల్లో 9 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి అత్యధిక సంఖ్యలో ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం గమనార్హం. ఇదిలావుంటే ఇటీవల హత్యకు గు రైన మునగాల మండలం నర్సింహుల గూడెం సీపీఎం సర్పంచ్ పులీందర్ రెడ్డి భార్య విజయలక్ష్మిని ఆ స్థానం నుంచి ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. టీడీపీ, సీపీఎం పొత్తులో భాగంగా ఆమె ను ఎంపీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. మెజా ర్టీ స్థానాలు వారు సాధించినట్లయితే మున గా ల మండల ఎంపీపీగా ఆమె ఎన్నిక వుతారు.
18 ఎంపీటీసీలు ఏకగ్రీవం
Published Mon, Mar 31 2014 1:19 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement