జన్నారం: ఈ చిత్రంలో కనిపిస్తున్న రెండు జీవులదీ ఒకటే లక్ష్యం. ఓ జీవిది బతుకుబాట అయితే.. మరో జీవిది ఆకలివేట. జన్నారం అటవీ డివిజన్‌లో కనిపించిన ఈ దృశ్యాన్ని ఎఫ్‌డీవో తన కెమెరాలో బంధించారు. దుప్పిని వేటాడేందుకు అడవికుక్క కాచుకుని ఉండగా.. కుక్క నుంచి తప్పించుకు పరుగుతీసేందుకు దుప్పి సిద్ధంగా ఉంది. కాగా, ఒకప్పుడు అటవీలో పచ్చదనంగా ఉంటూ అనేక జంతువులు ఉండేవి. అదే ఇప్పుడు పచ్చదన కరువైంది. దాంతో శాఖాహర జంతువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
ఇక వాటిపైనే ఆధారపడే మాంసాహర జంతువులు కూడా ఈమధ జనావాసాల్లోకి ప్రవేశించి ప్రమాదాల బారిన పడుతొన్నాయి. ఇక, వేసవీ సమీపిస్తొన్న కొలది నీటిజాడ కరువైంది. అందుకే జంతువులన్ని ఆహరం కోసం, నీటి అన్వేషనలో ఒక చోటు నుంచి మరొ చోటుకు వలన పోతున్నాయి. కరీనంనగర్, జన్నారం, అడవీ, జంతువులు, వలసలు
Comments
Please login to add a commentAdd a comment