
వేడుకుంటున్న వృద్ధ దంపతులు
సాక్షి, జన్నారం(ఖానాపూర్): కనిపించకుండా పోయిన తమ కుమారుడిని అప్పగించాలని జన్నారం మండలం పొన్కల్‌కు చెందిన బచ్చల రాజం దంపతులు పోలీసు అధికారులను వేడుకుంటున్నారు. రాజం రెండవ కుమారుడు బచ్చల సతీశ్ కొన్నేళ్లుగా ఉట్నూర్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఉట్నుర్‌లో జరిగిన దొంగతనం కేసులో సతీశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈనెల 17 పోలీసులు ఇంటికి వచ్చి సతీశ్ గురించి అడిగే వరకు తమకు విషయం తెలియదన్నారు. గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన తమ కుమారుడి ఆచూకీ తెలపాలని కోరారు. ఈ విషయంపై జన్నారం ఎస్సై తహసీనోద్దీన్‌ను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, ఉట్నూర్‌లో జరిగిన ఓ దొంగతనం కేసులో సతీశ్ నిందితుడని తెలిసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment