జన్నారం : అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ ప్రణాళికబద్ధంగా ఉండాలని దూలపెల్లి ఫారెస్ట్ అకాడమీ డెప్యూటీ డెరైక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్, మేనేజ్‌మెంట్‌పై జన్నారం అటవీ శాఖ కమ్యూనిటీ హాలులో ఇస్తున్న మూడు రోజుల శిక్షణలో భాగంగా సోమవారం ఫారెస్ట్ లా పై అధికారులకు అవగాహన కల్పించారు. వన్యప్రాణులు వేటాడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నిందితుడికి శిక్ష పడాలంటే ఎలాంటి సెక్షన్లతో కేసులు పెట్టాలో వివరించారు.
అలాగే కలప స్మగ్లింగ్‌కు పాల్పడిన వారిపై ఎలాంటి కేసులు పెట్టాలో, కలప అక్రమ రవాణా నిరోధానికి ఏం చేయాలో తెలిపారు. ఒక్కోసారి కేసు ఏ సెక్షన్ కింద నమోదు చేయాలో తెలియక కేసులు నీరుగారిపోయే ప్రమాదం ఉన్నందున, ఆచి, తూచి వ్యవహరించాలని సూచించారు. తెలియకపోతే వేరే వారి సహాయం తీసుకోవాలని స్పష్టం చేశారు. దోషులకు శిక్ష పడేలా చూడాలని తెలిపారు. హెక్ట్‌కాస్ సంస్థ నిర్వాహకుడు ఇమ్రాన్, వివిధ డివిజన్లకు చెందిన రే ంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు పాల్గొన్నారు.
ప్రణాళిక ప్రకారం రక్షణ కల్పించాలి
Published Tue, Sep 23 2014 2:35 AM | Last Updated on Thu, Oct 4 2018 6:10 PM
Advertisement