జన్నారం : మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే ఆసరా కల్పించి..పేదలను విస్మరించారని మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ విమర్శించారు. ఒక ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇవ్వమని చెప్పిన సీఎం.. తన ఇంటో మాత్రం నలుగురికి ఎందు కు పదవులు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం జన్నారం మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
గంటపాటు అంబేద్కర్‌చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాథోడ్ రమేశ్ మాట్లాడుతూ..తెలంగాణ వస్తే ఇంటిం టికీ ఉద్యోగం ఇప్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ తన కుటుంబంలో కొడుకు, కూతురు, అల్లుడు, వియ్యంకుడికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. పేదల కడుపు కొట్టి పెద్దలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. కళ్లు, కాళ్లు లేని వారి పింఛన్లు తొలగించి తీరని అన్యాయం చేశారన్నారు.
కేసీఆర్‌ను గద్దె దించితేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. టీఆర్‌ఎస్ నాయకులను ఊళ్లలోకి రానివ్వకుండా అడ్డుకుంటే పింఛన్లు వస్తాయన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట కూడా ధర్నా చేశారు. అధికారులు సమాధానం చెప్పే వరకు కదలమని కూర్చున్నారు. దీంతో తహశీల్దార్ శ్రీనివాస్ వచ్చి ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిం చారు. కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు కొంతం శంకరయ్య, సుధాకర్‌నాయక్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్ రియాజొద్దీన్, ఎంసీపీఐ యూ మండల కార్యదర్శి కట్టెకోల నాగరాజు, టీడీపీ రాష్ట్ర నాయకుడు రాజేశ్వర్, జిల్లా నాయకులు కాసెట్టి లక్ష్మణ్, నాయకులు నర్సింహులు, బద్రినాయక్ పాల్గొన్నారు.
ఖానాపూర్‌లోనూ ధర్నా, రాస్తారోకో
ఖానాపూర్ : పింఛన్ల కోసం మండల పరిషత్ కార్యాలయం ఎదుట శనివారం టీడీపీ ధర్నా నిర్వహించింది. ఇందులోనూ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ పాల్గొని మాట్లాడారు. ఖానాపూ ర్ మండలంలో గతంలో 8 వేల పింఛన్లు ఉండ గా ఇప్పుడు నాలుగు వేలే ఉన్నాయని, ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పింఛన్లు తొలగించారో అర్థమవుతుందన్నారు.
ఇంటికో ఉద్యోగం, అర్హులందరికీ పింఛన్లు, రైతులకు నిరంతరం విద్యుత్ వంటి కల్లబొల్లి మాటలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని టీడీపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్ పేర్కొన్నారు. తహశీల్దార్ నరేందర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ రాథోడ్ రాము, పీఏసీఎస్ చైర్మన్ వెంకాగౌడ్, ఉపసర్పంచ్ కారింగుల సుమన్, కడెం మాజీ ఎంపీపీ రాజేశ్వర్‌గౌడ్, నాయకులు శ్రీనివాస్, రాజేందర్, రాజేశ్వర్, నయిం, నిట్ట రవి, వీరేశ్, లక్ష్మణ్, గంగన్న పాల్గొన్నారు.
సీఎం కుటుంబానికే ఆసరా
Published Sun, Nov 23 2014 2:50 AM | Last Updated on Mon, Aug 20 2018 6:02 PM
Advertisement
Advertisement