సాక్షి, హైదరాబాద్: ‘57 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ల’కు సోమవారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు అన్ని ‘మీ’సేవా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటారు. వృద్ధాప్య పించన్ల వయసును 57ఏళ్లకు తగ్గించినా చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారని పలువురు ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో అర్హులైన వారందరికీ ఈ పింఛన్లు అందుతాయని సీఎం వారికి హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలతో శనివారం సమీక్ష నిర్వహించిన సీఎస్... దరఖాస్తు తేదీలను పొడిగించాలని సంబంధిత అధికారులైన పీఆర్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, టీఎస్‌టీఎస్ ఎండీ జీటీ వెంకటేశ్వర్‌రావులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment