సాక్షి, హైదరాబాద్: ఇంటింటా ఇన్నోవేటర్ 2024 కార్యక్రమం కోసం దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వెల్లడించింది. ఆవిష్కర్తలు తమ ఎంట్రీలను సమర్పించడానికి ఈ నెల 10 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది 6వ ఎడిషన్‌తో ముందుకు వచ్చిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం గ్రామీణ తెలంగాణలో ఆవిష్కరణ, వ్యవస్థాపకతను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
స్థానిక సవాళ్లకు పరిష్కారాలను తీసుకువచ్చే ఉద్దేశంతో, తమ ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు తయారు చేసిన ప్రజలను రాష్ట్ర ప్రజలకు పరిచయం చేస్తూ, ఆ ఆవిష్కరణలను ఆగస్టు 15న ప్రదర్శించే అవకాశాన్ని అందిస్తుంది.
దరఖాస్తులను వాట్సాప్ ద్వారా 9100678543కు పంపించాలి. పేరు, వయస్సు, ఫోటో, వృత్తి, గ్రామం, మండలం, ఆవిష్కరణ పేరు, ఆవిష్కరణ గురించి 100 పదాల వివరణ, నాలుగు అధిక-రిజల్యూషన్ చిత్రాలతో పాటు రెండు వీడియోలు (2నిమిషాలలోపు) పంపించాలని ఇన్నోవేషన్ సెల్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment