ఐదేళ్ల చిన్నారికి పింఛన్ | pension sanctioned for 5 year old child | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల చిన్నారికి పింఛన్

Published Sun, Nov 9 2014 2:26 AM | Last Updated on Mon, Aug 20 2018 6:02 PM

ఐదేళ్ల చిన్నారికి పింఛన్ - Sakshi

ఐదేళ్ల చిన్నారికి పింఛన్

హైదరాబాద్: చిన్న వయసులోనే పింఛన్ అందుకొని అయిదేళ్ల సిరిప్రియ రికార్డులకెక్కింది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని నందినగర్ గ్రౌండ్‌లో శనివారం ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పుట్టు అంధురాలైన సిరిప్రియకు వికలాంగుల జాబితాలో ఈ పింఛన్ అందజేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, షేక్‌పేట తహసీల్దార్ కె.చంద్రకళ చేతుల మీదుగా ఈ చిన్నారి రూ. 1500 నగదుతో పాటు పింఛన్ అర్హతా పత్రాన్ని అందుకుంది. నూర్‌నగర్‌లో నివసించే వీర వెంకటసత్యనారాయణ-లక్ష్మి దంపతుల కుమార్తె అయిన సిరిప్రియ ఒకటో తరగతి చదువుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement