Ramesh Rathod
-
బీజేపీలో విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత
-
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
ఆదిలాబాద్: మాజీ ఎంపీ, బీజేపీ నేత రాథోడ్ రమేష్ కన్నుమూశారు. నిన్న రాత్రి ఉట్నూరులో తన నివాసంలో అస్వస్థకు గురికాగా.. కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రమేష్‌ను హైదరాబాద్ తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. రమేష్ రాథోడ్ మృతదేహాన్ని ఆయన స్వస్థలం ఉట్నూరుకు తరలించారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్‌ను పార్టీ నుంచి టీపీసీసీ సస్పెండ్ చేయడంతో.. లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అనతంరం ఆయన బీజేపీలో చేరారు. రమేష్ రాథోడ్ 2009లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2018లో ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీచేసి ఓడిపోయారు.రాథోడ్ రమేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నర్నూర్ జడ్పీటీసీగా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన భార్య సుమన్ రాథోడ్‌ను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఖానాపూర్ నియోజకవర్గం నుంచి గెలిపించుకున్నారు. ఆయన మృతి పట్ల అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా రాజకీయ నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.రమేష్ రాథోడ్ మృతి పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతిఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అదిలాబాద్ ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా రమేష్ రాథోడ్ అందించిన సేవలు మరువలేనివి. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి రమేష్ రాథోడ్ ఎంతో కృషి చేశారు. రమేష్ రాథోడ్ చనిపోయారంటే నమ్మలేకపోతున్నా. రమేష్ రాథోడ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాథోడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’అని సంతాపం తెలిపారు. -
నేడు ఈటల రాజీనామా.. బీజేపీలోకి రాథోడ్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ శాసన సభ్యత్వంతో పాటు టీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ శనివారం రాజీనామా చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈనెల 14న బీజేపీలో చేరికకు సంబంధించి ముహూర్తం ఖరారు కావడంతో శనివారం అధికారికంగా రాజీనామా సమర్పించనున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ శివారులోని శామీర్‌పేటలో ఉన్న ఆయన నివాసం నుంచి బయల్దేరి ఉదయం 10.30 గంటలకు అనుచరులతో కలసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తారు. అనంతరం అసెంబ్లీకి చేరుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని వ్యక్తిగతంగా కలిసే అవకాశం లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి ఈటల రాజేందర్ తన రాజీనామా లేఖ అందజేసే అవకాశముంది. టీఆర్ఎస్కు రాజీనామా పత్రాన్ని తన దూత ద్వారా లేదా ఈ–మెయిల్ ద్వారా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు పంపనున్నారు. ఈటల రాజీనామాకు సంబంధించి శుక్రవారం రాత్రి వరకు ఎలాంటి సమాచారం లేదని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. 14న బీజేపీలో చేరిక.. ఈ నెల 14న రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో కలసి ఈటల రాజేందర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. అదేరోజు సాయంత్రం బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, తరుణ్ ఛుగ్ తదితరుల సమక్షంలో ఈటల రాజేందర్ ఆ పార్టీలో చేరుతారు. ఇటీవల రెండు రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఈటల.. వర్షాల కారణంగా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల షెడ్యూలు సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌ఛుగ్, రాష్ట్ర పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం షామీర్పేటలోని ఈటల నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. బీజేపీలోకి రాథోడ్ నిర్మల్: ఆదిలాబాద్ మాజీ ఎంపీ, ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడు రమేశ్ రాథోడ్ బీజేపీలో చేరడం ఎట్టకేలకు ఖరారైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి ఈ నెల 14న ఆయన కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీలో చేరిన అనంతరం ఖానాపూర్ నియోజకవర్గంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. టీడీపీలో సుదీర్ఘకాలంపాలు పనిచేసిన రమేశ్ రాథోడ్.. 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా, 2009లో ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. 2017లో టీఆర్ఎస్లో చేరిన ఆయన.. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖానాపూర్ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఖానాపూర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చేరికతో బీజేపీకి మరింత పట్టు పెరగనుందని భావిస్తున్నారు. ఆయన భార్య సుమన్ రాథోడ్ రెండుసార్లు ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
రమేశ్ రాథోడ్‌కు తీవ్ర గాయాలు
ఆదిలాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ లోక్‌సభ అభ్యర్థి రమేశ్ రాథోడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్‌కు వస్తుండగా మావల గ్రామ సమీపంలో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రమేశ్ రాథోడ్ తలకు, ఛాతి, కాలేయానికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యులు రమేశ్ రాథోడ్‌కు చికిత్స అందిస్తున్నారు. -
ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా రమేశ్‌రాథోడ్, పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా ఏ.చంద్రశేఖర్‌ను ప్రకటించింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనప్పటికీ ఆదిలాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ నగేశ్‌కే స్థానం దక్కనుంది. పెద్దపల్లిలో ఎమ్మెల్యేల వ్యతిరేకత ఉండడంతో వివేక్‌కు స్థానం దక్కుతుందా.. లేదా.. అన్న సందిగ్ధం నెలకొంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీయే ఇప్పటికీ తమ అభ్యర్థుల జాబితాను వెల్లడించలేదు. ఆదిలాబాద్ స్థానం కోసం సోయం బాపూరావు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అసమ్మతికి ఆజ్యం పోసింది. ఆ పార్టీకి సీనియర్ నాయకుడు నరేశ్‌జాదవ్ రాజీనామా చేశారు. సాక్షి, మంచిర్యాల: లోకసభలో బరిలో తలపడే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. రాష్ట్రానికి సంబంధించి వెలువరిచిన తొలి జాబితాలోనే ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. సామాజిక సమీకరణలే ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ లోకసభ అభ్యర్థిగా రమేష్ రాథోడ్, పెద్దపల్లి స్థానానికి ఎ.చంద్రశేఖర్‌ల అభ్యర్థిత్వాలకు పార్టీ ఓకే చెప్పింది. ఈ రెండు స్థానా లకు అభ్యర్థుల ప్రకటనతో ఆ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. ఆదిలాబాద్ టికెట్‌ను ఆశించిన నరేశ్‌జాదవ్ కాంగ్రెస్ పార్టీకి శనివారం రాజీనామా చేశారు. అదేబాటలో సోయం బాపురావులు పార్టీని వీడనున్నట్లు సమాచారం. ఇక పెద్దపల్లి నియోజకవర్గానికి అంతగా పరిచయం లేని చంద్రశేఖర్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడం ప్రస్తుతం ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. రమేష్ రాథోడ్‌కే ఆదిలాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జరిగిన విపరీత జాప్యం కూడా ఓటమికి కారణమని బలంగా విశ్వసిస్తున్న కాంగ్రెస్ పార్టీ, లోకసభ ఎన్నికల్లో ఆ పొరపాటుకు తావివ్వకుండా ముందుగానే అభ్యర్థులను వెల్లడించింది. రాష్ట్రానికి సంబంధించి ఎనిమిది మందితో కూడిన జాబితాను వెల్లడించగా, అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాలు ఉండడం విశేషం. ఆదిలాబా ద్ నియోజకవర్గం నుంచి రమేష్ రాథోడ్‌కు పార్టీ టికెట్ దక్కింది. ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ నుంచి సోయం బాపురావు, లంబాడ నుంచి రమేష్ రాథోడ్, నరేష్ జాదవ్‌లు పోటీపడ్డారు. రాష్ట్రవ్యా ప్త సమీకరణలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల ను బేరీజు వేసుకొని లంబాడ తెగకు చెందిన రమేష్‌రాథోడ్ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. ఉట్నూరుకు చెందిన రమేష్ రాథోడ్ టీడీపీ నుంచి 1995లో నార్నూర్ జెడ్పీటీసీగా ఎన్నిక, 1999 నుంచి 2004 వరకు ఖానాపూర్ ఎమ్మెల్యేగా, 2006 నుంచి 2009 వరకు ఆదిలాబా ద్ జెడ్పీ చైర్మన్‌గా, 2009 నుంచి 2014 వరకు ఆది లాబాద్ ఎంపీగా ఉన్నారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చవి చూశారు. 2018లో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మ న్గా గెలిచినా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఖానా పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆదిలాబాద్ లోకసభ స్థానం నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఎవరీ చంద్రశేఖర్..? పెద్దపల్లి నియోజకవర్గానికి అసలు పరిచయం లేని చంద్రశేఖర్‌కు పార్టీ టికెట్ ఇవ్వడం ఇప్పుడు కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి చంద్రశేఖర్‌కు టికెట్ ఇచ్చారని మీడియాలో చూసిన ఆ పార్టీ శ్రేణులే... ఎవరీ చంద్రశేఖర్ అంటూ ఆరా తీసే పనిలో పడ్డారు. ముఖ్యనేతలకు తప్ప, ముఖపరిచయం కూడా లే ని చంద్రశేఖర్‌కు ఎలా టికెట్ ఇస్తారంటూ మండిపడుతున్నారు. ఈ స్థానం నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ విప్ ఆరెపల్లి మోహన్, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఊట్ల వరప్రసాద్ టికెట్ ఆశించారు. వీరిని కాద ని వికారాబాద్‌కు చెందిన చంద్రశేఖర్‌కు ఇవ్వడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్‌లో ముసలం అధికార టీఆర్ఎస్ కన్నా ముందే లోకసభకు అభ్యర్థులను ప్రకటించామన్న ఉత్సాహం కాంగ్రెస్‌కు మిగలడంలేదు. టికెట్ ప్రకటించిన వెంటనే ఆ పార్టీలో ముసలం పుట్టింది. ఆదిలాబాద్ స్థానం నుంచి టికెట్ ఆశించిన నరేష్ జాదవ్, సోయం బాపూరావులు పార్టీపై తిరుగుబాటు చేశారు. రమేష్ రాథోడ్‌కు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నరేష్ జాదవ్ ఏకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే తీవ్ర అసంతృప్తితో ఉన్న సోయం బాపూరావు ఎట్టిపరిస్థితుల్లోనూ లోకసభకు పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. బీజేపీ నుంచి బరిలోకి దిగే అంశాన్ని కూడా ఆయన అనుచరులు కొట్టిపారేయడం లేదు. ఇక పెద్దపల్లి స్థానంలో చంద్రశేఖర్‌కు ఇవ్వడాన్ని స్థానిక నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థి పోటీలో ఉండనున్న క్రమంలో, ఎక్కడో వికారాబాద్ నుంచి తీసుకొచ్చిన నాయకుడిని పోటీకి పెట్టడాన్ని పార్టీ శ్రేణులు తప్పు పడుతున్నాయి. టికెట్ ఆశించిన ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్‌లో నెలకొన్న ముసలం సమసిపోతుందో, ఎన్నికల్లో పుట్టి ముంచుతుందో వేచిచూడాలి. -
‘ఈయన చేరికతో కాంగ్రెస్‌కు మరింత బలం’
సాక్షి, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆదిలాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ నేత రమేష్ రాథోడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా, జానారెడ్డి సమంక్షలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి రమేష్ రాథోడ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో ఎంపీగా పనిచేసిన రమేష్ రాథోడ్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు.. రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం టీడీపీకి గుడ్‌బై చెప్పి కారెక్కిన రమేష్ రాథోడ్... టీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ టికెట్ ఆశించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో ఖానాపూర్ టికెట్ ఆయనకు దక్కకపోవడంతో... టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.. కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలి రమేష్ రాథోడ్ చేరికతో ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలం పెరిగి పదికి పది స్థానాలు గెలుస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలు నియంతృత్వ పోకడలకు పోతున్న కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజల మధ్యనేనని తేల్చిచెప్పారు. దళిత గిరిజనులను అణచి వేస్తున్నారని, మొదటి నుంచి ఆ వర్గాలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. అమరుల త్యాగాలతో కుర్చీ ఎక్కిన కేసీఆర్ వారిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు తరిమి కొట్టాల్సిన సమయం వచ్చిందని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర కల్సిస్తామని హామీ ఇచ్చారు. ఆ ముగ్గురు కుమ్మకయ్యారు.. నవంబర్ లేక డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్ కుమ్మక్కై హడావుడిగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలు జరిగాయని, ముగ్గురు కుమ్మక్కై 21 లక్షల ఓట్లు తగ్గించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. -
టీఆర్ఎస్లో ముసలం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారు తిరుగుబావుటా ఎగరేస్తున్నారు. వరంగల్ తూర్పు టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ టీఆర్ఎస్పై బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో గులాబీ నేత టీఆర్ఎస్పై తిరుగబాటు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ టికెట్ తనకు కేటాయించకపోవడంతో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్దమైయ్యారు. ఈ మేరకు శనివారం స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశమైన రాథోడ్.. ఖానాపూర్‌లో సీఎం కేసీఆర్ పోటీచేసినా.. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తానాని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన కొడుకు రితీష్ రాథోడ్‌ను జోగు రామన్నకు వ్యతిరేకంగా బరిలో నిలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఖానాపూర్ టికెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆ మాట ప్రకారమే తాను గతంలో టీఆర్ఎస్లో చేరినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌లోకి వలసల జోరు మరోవైపు రమేష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న వార్తలు వస్తున్నాయి. త్వరలో కాంగ్రెస్ నేతలతో చర్చించి.. అసెంబ్లీ స్థానంపై క్లారిటీ తీసుకుని హస్తం గూటికి చేరుతారని సమాచారం. దీనిపై స్పందించిన రాథోడ్ తన అభిమానులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. మరోవైపు టీఆర్ఎస్ అసంతృప్తులను చేరదీసేందుకు కాంగ్రెస్ రంగంలోని దిగింది. టీఆర్ఎస్పై తిరుగుబాటు ఎగరేసిన కొండా దంపతులను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ దూతలను పంపినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీఎస్, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి త్వరలో హస్తం గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. బీజేపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు సమరసింహరెడ్డి, నందీశ్వర్ గౌడ్ శనివారం కమళానికి గుడ్‌బై చెప్పి హస్తంకు చేయందించిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో దగ్గరపడుతున్నకొద్ది మరెంతమంది అసంతృప్త నేతలు కారుదిగుతారోనని టీఆర్ఎస్ శిబిరంలో ఆందోళన మొదలైంది. -
ఆయన నుంచి నాకు ప్రాణహాని: మహిళా ఎమ్మెల్యే
ఖానాపూర్: మంత్రి సమక్షంలోనే టీఆర్ఎస్ నేతలు బాహాబాహీకి దిగారు. ప్రజా ప్రతినిధులు అనే ఆలోచన లేకుండా గొడవకు దిగారు. వివరాల్లోకి వెళ్తే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలోనే ఎమ్మెల్యే రేఖానాయక్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా రమేశ్ రాథోడ్ తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని ఎమ్మెల్యే రేఖా నాయక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక మహిళా ఎమ్మెల్యేతో అనుచితంగా ప్రవర్తించిన రాథోడ్‌ను వెంటనే అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్యే ఆందోళనకు దిగారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పనుల శంకుస్థాపనకు ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడి కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వచ్చారు. -
చంద్రబాబు మోసం చేశారు: కేసీఆర్
-
టీఆర్ఎస్లో చేరిన రమేష్ రాథోడ్
హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోసం చేశారని, అందుకే తెలంగాణలో ఆ పార్టీ ఉనికి లేకుండా పోయిందని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. వాస్తవాలను గమనించకుండా విపక్షాలు మాట్లాడుతున్నాయంటూ ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత పైడిపల్లి రవీందర్ రావు సోమవారం టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈసారి ఆదిలాబాద్ జిల్లాలో 70వేల ఎకరాలకు నీళ్లిచ్చామని, బంగారు భూములు ఉన్న ఆదిలాబాద్‌లో అద్భుతాలు జరగబోతున్నాయని అన్నారు. కొన్ని పార్టీల నేతలకు ఏమీ అర్ధం కావటం లేదని, అవాకులు చెవాకులు పేలుతున్నారని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలి, 60 ఏళ్లు ఏం చేశారో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ఏం చెప్పుకొని ఓటు అడుగుతారు. మీ పాలన తెలియదనిదా.. మీరు పైనుంచి దిగొచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులకు గెలుస్తామనే విశ్వాసం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలు పోండని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ఎవరేంటో తెలుస్తుందని చెప్పారు..ఒక్క నిమిషం కూడా పోకుండా కరెంట్ ఇస్తున్నామన్నారు. ఈ ఒక్క విషయం చాలు టీఆర్‌ఎస్‌కుకు ఓటు వేయటానికి అని అన్నారు. కొన్ని చరిత్రాత్మక రాజకీయ సందర్భలుంటాయంటూ ఆయన ఉద్యమంలో తాను చెప్పిన మాటలు నిజమవుతున్నాయన్నారు. తమకు 111 సీట్లు వస్తాయని సర్వేలో తేలిందని, అయితే వాస్తవాలు గ్రహించకుండా విమర్శలు చేయడం సరికాదని కేసీఆర్ అన్నారు. విపక్షాలకు డిపాజిట్ కూడా రాదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు ఆగవని అన్నారు. త్వరలో రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతులకు విత్తనాలు, ఎరువులకు కొరత లేకుండా చూస్తున్నామని అన్నారు. దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం ఓ చరిత్ర అని కేసీఆర్ అన్నారు. మీ బుర్రలు బోగస్.. బీజేపీపై ఫైర్ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేస్తుందన్న తమ సర్వేను బీజేపీ నేతలు విమర్శించటంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి 46 శాతం ప్రజలు మద్దతుందని తమ సర్వే చెప్పిందని బీజేపీ నేతలు అంటున్నారు.. మరి మా సర్వే బోగస్ అయితే వాళ్ల సర్వే కూడా అంతేనని కేంద్రమంత్రి దత్తాత్రేయ ఒప్పుకుంటారా అని సవాల్ విసిరారు. వారి బుర్రలు బోగస్ అని ఎద్దేవా చేశారు. -
టీడీపీకి రమేశ్ రాంరాం
-
టీడీపీకి రమేశ్ రాంరాం
- మహానాడు జరుగుతుండగానే పొలిట్‌బ్యూరో సభ్యుడి సంచలన నిర్ణయం - సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరికు సిద్ధం.. కేడర్ కూడా హైదరాబాద్: ఇప్పటికే తెలంగాణలో ఆగమైన తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్. ఆ పార్టీ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ టీడీపీకి రాజీనామాచేశారు. సోమవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ చేరికతో ఆదిలాబాద్జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ సందర్భంగా రమేశ్ రాథోడ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అమలుచేస్తోన్న పథకాలు నచ్చడంతోపాటు కేసీఆర్ ఆహ్వానించడం వల్లే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు రమేశ్ రాథోడ్ చెప్పారు. తనతోపాటు టీడీపీ క్యాడర్ మొత్తం టీడీపీ నుంచి బయటికి వచ్చేసిందని తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు నచ్చే పార్టీ మారానని వివరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మధ్యవర్తిత్వం వహించి టీఆర్‌ఎ్‌సలో చేరేలా రమేశ్ రాథోడ్‌ను ఒప్పించారనే వార్తలపై స్పందిస్తూ ‘నాగేశ్వర్రావు నాకు ఆప్తమిత్రుడు’అని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలలోపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్తగా ఏర్పడే ఉట్నూర్ లేదా ఖానాపూర్ నుంచి రమేశ్ రాథోడ్ పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, ప్రస్తుత ఎంపీ జి.నగేశ్ ఒకవేళ బోథ్ నియోకవర్గం నుంచి బరిలో దిగితే ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో రమేశ్ రాథోడ్ పోటీ చేయవచ్చునని జిల్లా రాజకీయవర్గాల్లో చర్చజరుగుతున్న నేపథ్యంలో తాను ఏదో ఆశించి పార్టీ మారడంలేదని రాథోడ్ స్పష్టం చేశారు. -
యథేచ్ఛగా చెట్ల నరికివేత
► కడెం అడవులకు రక్షణ కరువు ►పట్టించుకోని అధికారులు కడెం : నిర్మల్ డివిజన్లోని కడెం అటవీ క్షేత్రంలో క్రమంగా అడవులకు రక్షణ కరువైంది. స్మగ్లర్లు పెట్రేగిపోతున్నారు. కడెం అటవీ క్షేత్ర కార్యాలయానికి కూతవేటు దూరంలోనే అడవికి రక్షణ లేదు. అటవీక్షేత్ర కార్యాలయానికి అతి సమీపంలో పెద్దూర్ సెక్షన్లో కొద్దిరోజుల క్రితం టేకుచెట్లు యథేచ్ఛగా నరికివేతకు గురయ్యారుు. అటవీ క్షేత్రంలో ఎక్కువ విస్తీర్ణంలో అడవి ఉందంటే అది గంగాపూర్ సెక్షన్లోనే. టైగర్‌జోన్ పరిధిలోని ఈ అడవిని కోర్ ఏరియా అంటారు. ఈ అడవిలో పులితో సహా అనేక వన్య ప్రాణులు ఆవాసం ఉంటారుు. అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇక్కడికి సందర్శనకు వస్తుంటారు. అరుుతే, కొద్దిరోజుల క్రితం గంగాపూర్ సమీపంలో కొందరు నాలుగైదు చెట్లు నరికారు. కొద్దిరోజులుగా పెద్దూర్ సెక్షన్లోనే చెట్లు నరికివేతకు గురవుతున్నారుు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న చెట్లను స్మగ్లర్లు నిర్భయంగా నరికివేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. సిబ్బంది కొరత రేంజిని కడెం, ఉడుంపూర్‌గా రెండుగా విభజించారు. కడెం రేంజి అధికారికే అదనంగా ఉడుంపూర్ బాధ్యతలు అప్పగించారు. ఇక పాండ్వాపూర్ గ్రామం వద్ద గల అటవీ చెక్‌పోస్టు గతంలో జన్నారం డివిజన్లోని అటవీ సిబ్బంది నిర్వహించారు. కానీ, జిల్లాల పునర్విభజన తర్వాత ఆ చెక్‌పోస్టును కడెం రేంజి పరిధిలోకి తెచ్చారు. దీంతో ఈ చెక్‌పోస్టు వద్ద గంగాపూర్ సెక్షన్ సిబ్బందికి అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో ఆ సిబ్బంది అసలు విధులు పక్కకు పోయారుు. ఇటు చెక్ పోస్టు వద్దే ఎక్కువ సమయం గడపాల్సి రావటం, తమ విధులు కాగానే అలసిపోవటంతో డ్యూటీ పక్కకుపోతుంది. ప్రస్తుతం చెక్‌పోస్టు వద్ద గంగాపూర్ సెక్షన్ సిబ్బంది అందరూ షిప్టు ప్రకారంగా డ్యూటీలు చేస్తున్నారు. ఎక్కువ అటవీ ఉన్న గంగాపూర్ సెక్షన్ పరిధిలో ఉన్న ఈ చెక్‌పోస్టు వద్ద ఎఫ్ఎస్వో, ఎఫ్బీవోలుకాకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించాల్సింది. పెద్దూర్ సెక్షన్లో ఈ బీటు పెద్దదే. మద్దిపడగ, చిట్యాల, ధర్మాజీపేట బీట్లు ఉన్నారుు. ఇంకా, మద్దిపడగలో కడెంలో అటవీ నర్సరీలు ఉన్నారుు. వీటన్నింటినీ ఒక్క ఎఫ్ఎస్వో, ఎఫ్బీఓనే బాధ్యతలు నిర్వహిస్తోంది. దీంతో విధుల నిర్వహణకు అనేక ఇబ్బందులవుతున్నారుు. సంబంధిత ఉన్నతాధికారులు ముందు లోటుపాట్లను సవరించాలి. అడవిపై రక్షణను మరింత కట్టుదిట్టం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. పకడ్బందీగా వ్యవహరిస్తాం కడెం క్షేత్ర పరిధిలోని అడవిని రక్షించే విషయంలో దృష్టిసారిస్తాం. విధి నిర్వహణలో మరింత పకడ్బందీగా వ్యవహరిస్తాం. స్మగ్లింగ్‌ను పూర్తిగా నివారిస్తాం. సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులకు నివేదించాం. రాథోడ్ రమేశ్, ఎఫ్ఆర్వో, కడెం -
సీఎం కుటుంబానికే ఆసరా
జన్నారం : మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే ఆసరా కల్పించి..పేదలను విస్మరించారని మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ విమర్శించారు. ఒక ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇవ్వమని చెప్పిన సీఎం.. తన ఇంటో మాత్రం నలుగురికి ఎందు కు పదవులు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం జన్నారం మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. గంటపాటు అంబేద్కర్‌చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాథోడ్ రమేశ్ మాట్లాడుతూ..తెలంగాణ వస్తే ఇంటిం టికీ ఉద్యోగం ఇప్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ తన కుటుంబంలో కొడుకు, కూతురు, అల్లుడు, వియ్యంకుడికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. పేదల కడుపు కొట్టి పెద్దలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. కళ్లు, కాళ్లు లేని వారి పింఛన్లు తొలగించి తీరని అన్యాయం చేశారన్నారు. కేసీఆర్‌ను గద్దె దించితేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ నాయకులను ఊళ్లలోకి రానివ్వకుండా అడ్డుకుంటే పింఛన్లు వస్తాయన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట కూడా ధర్నా చేశారు. అధికారులు సమాధానం చెప్పే వరకు కదలమని కూర్చున్నారు. దీంతో తహశీల్దార్ శ్రీనివాస్ వచ్చి ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిం చారు. కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు కొంతం శంకరయ్య, సుధాకర్‌నాయక్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్ రియాజొద్దీన్, ఎంసీపీఐ యూ మండల కార్యదర్శి కట్టెకోల నాగరాజు, టీడీపీ రాష్ట్ర నాయకుడు రాజేశ్వర్, జిల్లా నాయకులు కాసెట్టి లక్ష్మణ్, నాయకులు నర్సింహులు, బద్రినాయక్ పాల్గొన్నారు. ఖానాపూర్‌లోనూ ధర్నా, రాస్తారోకో ఖానాపూర్ : పింఛన్ల కోసం మండల పరిషత్ కార్యాలయం ఎదుట శనివారం టీడీపీ ధర్నా నిర్వహించింది. ఇందులోనూ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ పాల్గొని మాట్లాడారు. ఖానాపూ ర్ మండలంలో గతంలో 8 వేల పింఛన్లు ఉండ గా ఇప్పుడు నాలుగు వేలే ఉన్నాయని, ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పింఛన్లు తొలగించారో అర్థమవుతుందన్నారు. ఇంటికో ఉద్యోగం, అర్హులందరికీ పింఛన్లు, రైతులకు నిరంతరం విద్యుత్ వంటి కల్లబొల్లి మాటలతో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని టీడీపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్ పేర్కొన్నారు. తహశీల్దార్ నరేందర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ రాథోడ్ రాము, పీఏసీఎస్ చైర్మన్ వెంకాగౌడ్, ఉపసర్పంచ్ కారింగుల సుమన్, కడెం మాజీ ఎంపీపీ రాజేశ్వర్‌గౌడ్, నాయకులు శ్రీనివాస్, రాజేందర్, రాజేశ్వర్, నయిం, నిట్ట రవి, వీరేశ్, లక్ష్మణ్, గంగన్న పాల్గొన్నారు. -
‘దేశం’ కోటకు బీటలు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : టీడీపీకి ఆయువు పట్టుగా ఉన్న ఖానాపూర్ నియోజకవర్గంలో దేశం కోటకు బీటలు పడ్డాయి. సాధారణ ఎన్నికల్లో పార్టీ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రితీశ్ రాథోడ్, ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన రాథోడ్ రమేశ్ ఓటమి పాలు అవ్వడంతో టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంది. టీడీపీ నుంచి 1999లో రాథోడ్ రమేశ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గాన్ని పార్టీకి కంచు కోటలా మార్చాడు. 2004లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా రాథోడ్ రమేశ్ ఓటమి పాలైనా మరుసటి ఏడాదిలో ఆసిఫాబాద్ జెడ్పీటీసీగా గెలుపొంది జిల్లా జెడ్పీ పీఠం సాధించడం, అటు తర్వాత ఎంపీగా గెలుపొందడం, ఆయన సతీమణి రెండుసార్లు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గంలో పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేశారు. కంచు కోట బద్దలు పంచాయితీ, ప్రాదేశిక ఎన్నికలకు ముందు ఖానాపూర్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటలా ఉండెది. తర్వాత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. పంచాయ ఎన్నికలకు ముందు నియోజకవర్గంలోని మూడు మేజర్ గ్రామ పంచాయతీలు ఉండగా రెండింట్లో టీడీపీ సర్పంచులు, ఒక పంచాయతీలో టీఆర్ఎస్ సర్పంచ్ అధికారంలో ఉండేవారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఒక మేజర్ గ్రామ పంచాయతీని టీడీపీ కైవసం చేసుకోలేకపోయింది. ఖానాపూర్, ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, పొన్కల్ పంచాయతీని స్వతంత్ర అభ్యర్థి కైవసం చేసుకుంది. ప్రాదేశిక ఎన్నికలకు ముందు టీడీపీ మూడు ఎంపీపీ స్థానాలు, నాలుగు జెడ్పీటీసీ స్థానాలతో బలంగా ఉండేది. అయితే మొన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో సైతం టీడీపీ అనుకున్న ఎంపీటీసీ స్థానాలు కూడా సాధించలేకపోయింది. నియోజకవర్గంలో 80 ఎంపీటీసీ స్థానాలకు గాను కేవలం 22 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలువగా ఐదు జెడ్పీటీసీ స్థానాలుండగా ఒక్క దానినీ దక్కించుకోలేక చతకిలపడింది. దీంతో టీడీపీ ప్రభావం తగ్గుతూ టీఆర్ఎస్ బలంగా పుంజుకుంది. ప్రస్తుతం జరిగిన ప్రాదేశిక ఎన్నికల ఫలితాలతో నియోజకవర్గంలో ఐదింటికి ఐదు ఎంపీపీ స్థానాలు, నాలుగు జెడ్పీటీసీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ సాధించనుంది. అదీ కాక సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రితీశ్ రాథోడ్, ఎంపీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్ ఓటమి చెందడంతో కంచుకోటకు బీటలు వారినట్లు అయ్యింది. ఇదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పార్టీ తన బలాన్ని పెంచుకుందని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ తీవ్రతతో.. 2009లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఎంపీగా ఉన్న రాథోడ్ రమేశ్, టీడీపీ శ్రేణులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన లేకపోయారనే అపవాదును మూటకట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమంతో టీఆర్ఎస్ నియోజకవర్గంలో క్రమక్రమంగా బలం పుంజుకోవడంతో పంచాయతీ, ప్రాదేశిక, సాధారణ ఎన్నికల్లో టీడీపీ అనుకున్న విజయం సాధించలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తాడని పార్టీకి పునర్వైభవం వ స్తుందని శ్రేణులు అనుకున్నప్పటికీ ఆశలు గల్లంతు అవ్వడంతో పార్టీ కంచు కోటకు బీటలు వారినట్లు అయ్యింది. -
శోభానాగిరెడ్డి పేరును తొలగించండి: టీడీపీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శోభానాగిరెడ్డి పేరును బ్యాలెట్ పేపర్ నుంచి తొలగించాలని టీడీపీ ఎంపీ రమేశ్‌రాథోడ్ కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి గురువారం ఓ వినతిపత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం చనిపోయిన వ్యక్తిపేరు బ్యాలెట్ పేపర్లలో ఉండరాదని పేర్కొన్నారు. అదేవిధంగా చంద్రబాబు ఓటు చెల్లదంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రకటించడం బాధ్యతా రాహిత్యంగా ఉందని వ్యాఖ్యానించారు. -
నట్టేట ముంచాడు చంద్రబాబుపై మండిపాటు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ జిల్లా నాయకత్వం ఇక కమలం సహకారం ప్రశ్నార్థకం సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సీమాంధ్రలో బీజేపీతో పొత్తు ఉండదన్న చంద్రబాబు ప్రకటనపై జిల్లాలోని బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దేశ ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని ప్రకటించిన చంద్రబాబు.. రాజకీయ అవకాశం కోసం తమ పార్టీకి కూడా వెన్నుపోటు పొడవడాన్ని బీజేపీ నాయకత్వాన్ని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. చంద్రబాబు తన నైజాన్ని మరోమారు రుజువు చేసుకున్నారని బీజేపీ జిల్లా ముఖ్య నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఫలితం అనుభవిస్తారని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నిర్ణయంపై జిల్లాలోని టీడీపీ అభ్యర్థులకు ఇస్తున్న తమ మద్దతు ఉపసంహరించుకునే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బీజేపీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కోకన్వీనర్ రావుల రాంనాథ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. తాజా పరిణామాలపై రాష్ట్ర పార్టీ తీసుకునే నిర్ణయం మేరకు వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. కాగా రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ.. జిల్లాలో మొదటి నుంచి బీజేపీ-టీడీపీ నాయకులు ఎడమొహం పెడమొహం మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. పైగా సిట్టింగ్ ఎంపీ రాథోడ్ రమేష్ వద్ద ముడుపులు తీసుకుని జిల్లాలోని గిరిజనుల సీట్లన్నింటిని టీడీపీకి కట్టబెట్టారని బీజేపీ జిల్లా నాయకులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యనగారి భూమయ్యపై ఏకంగా దాడికి యత్నించిన విషయం సంచలనం సృష్టించిన విషయం విధితమే. ఈ ఘటన ఆ రెండు పార్టీల ముఖ్య నేతల మధ్య తెర వెనుక జరిగిన వ్యవహారాలను బట్టబయలు చేసింది. పైగా టీడీపీకి రాజీనామా చేసి.. బీజేపీలో కొత్తగా చేరిన పాయల్ శంకర్, రమాదేవి వంటి నాయకులకు బీజేపీ సీట్లు కట్టబెట్టడం.. ఈ అభ్యర్థులు సీనియర్ నాయకులను పక్కన బెట్టడం పట్ల తీవ్ర మనస్థాపం చెందిన బీజేపీ సీనియర్ నాయకులు బుధవారం మూకుమ్మడి రాజీనామాలు ప్రకటించారు. తాజాగా ఇప్పుడు చంద్రబాబు వెన్నుపోటుతో బీజేపీ శ్రేణులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. జిల్లా కోర్ కమిటీ సమావేశం మద్దతు విషయంలో చంద్రబాబు మాటమార్చిన నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరిపై నిర్ణయం తీసుకునేందుకు బీజేపీ జిల్లా కోర్ కమిటీ సమావేశం కావాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాగా కొందరు ముఖ్య నాయకులు టీడీపీకి ఈ ఎన్నికల్లో మద్దతు కొనసాగించాలనే భావనలో ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్‌తో సన్నిహిత సంబంధాలున్న బీజేపీ నాయకులు మద్దతు కొనసాగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారం బీజేపీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. -
రాథోడ్‌కు ఓటమి భయం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్‌కు ఓటమి భయం పట్టుకుందా? ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం బరిలో దిగితే పరాజయం పాలవుతానని ఆందోళన చెందుతున్నారా? ఎంపీ స్థానం కంటే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే స్థానం సురక్షితమని భావిస్తున్నారా? ఆయ న వేసిన నామినేషన్లను పరిశీలిస్తే అవుననే విషయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తొలి అంకం నామినేషన్ల పర్వం బుధవారం ప్రారంభమైంది. తొలిరోజే రాథోడ్ రమేష్ ఆదిలాబాద్ ఎంపీ స్థానంతోపాటు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే స్థానాలకు నామినేషన్లు వేశారు. ఖాళీ అయిన జిల్లా టీడీపీలో మిగిలిన ఒకరిద్దరు ముఖ్యనేతల్లో రాథోడ్ రమేష్ ఒకరు. రెండు కళ్ల సిద్ధాం తం, అప్పుడే రాష్ట్ర విభజనకు తొందరెందుకంటూ తెలంగాణ అడ్డుకునేందుకు కేంద్రంలో పావులు కదిపిన చంద్రబాబుకు రాథోడ్మ్రేష్ ఆది నుంచి అండగా నిలుస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గోడం నగేష్‌తోపాటు, ముఖ్యనేతలంతా టీడీపీని వీడినా, రాథోడ్ రమేశ్ మా త్రం చంద్రబాబునే అంటి పెట్టుకున్నారు. దీంతో తెలంగాణవాదుల్లో రాథోడ్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ అంశమే అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపనుండటంతో రాథోడ్ అం తర్మథనంలో పడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆయన ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు బీజేపీతో పొత్తుల చర్చలు కొలిక్కి వస్తున్నా, సీట్ల పంపకాల విషయంలో స్పష్టత రాలేదు. జిల్లాలో ఏ సీటు బీజేపీకి వెళుతుందో, టీడీపీకి ఏఏ స్థానాలు దక్కుతాయో తేలక ముందే ఆయన ఆఘమేఘాలపై ఆసిఫాబాద్‌కు నామినేషన్ వేయడం ఈ రెండు పార్టీల శ్రేణుల్లో కలకలం రేగింది. బీజేపీతో పొత్తుపైనే ఆశలు వరుస వలసలు, తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత, చంద్రబాబు వైఖరి కారణంగా తీవ్ర సంక్షోభంలో పడిన టీడీపీ జిల్లాలో ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఘోర పరాజయం పాలవుతామనే నిర్ణయానికి వచ్చిన ‘దేశం’ నేతలు బీజేపీతో పొత్తుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీ పొత్తు ఉంటుందని రాథోడ్ రమేష్ మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. కానీ జిల్లాలోని బీజేపీ శ్రేణులు టీడీపీతో పొత్తుకు ససేమిరా అం టున్నాయి. ఇందులో భాగంగా టీడీపీకి ధీటుగా బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఎంపీగా ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎంపీగా పోటీ చేసేందుకు రాథోడ్ పునరాలోచనలో పడటంతో టీడీపీ ప్రత్యామ్నాయ అభ్యర్థి వేటలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన సోయం బాపురావును ఎంపీగా బరిలో దించాలని భావిస్తోంది. సోయం బాపురావు మాత్రం బోథ్ ఎమ్మెల్యే స్థానానికి మాత్రమే పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. పొత్తులో భాగంగా ఈ ఎంపీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాను మాత్రం బోథ్ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని, ఒకవేళ ఎంపీగా పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే ఎంపీగానే బరిలోకి దిగుతానని సోయం బాపురావు తన సన్నిహితుల వద్ద పేర్కొంటున్నారు. -
ట్రిపుల్ ఐటీ ఎదుట టీడీపీ ఎంపీ ఆందోళన
బాసర ట్రిపుల్ ఐటీ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి నాగరాజు కుటుంబానికి రూ. 10 లక్షల నష్ట పరిహారం అందజేయాలని స్థానిక ఎంపీ రమేష్ రాథోడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ట్రిపుల్ ఐటీ భవనం ఎదుట ఆయన ఆందోళన చేపట్టారు. నాగరాజు ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్ట్ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రంలోని పలు ట్రిపుల్ ఐటీలలో ఇటీవల విద్యార్థులు తరచుగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. రమేష్ రాథోడ్ చేపట్టిన ఆందోళనలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కనగరి మండలం గౌరారం గ్రామానికి చెందిన నాగరాజు బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు బీహెచ్-1 భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థులు వెంటనే స్పందించి కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. అయితే నాగరాజును ఆసుపత్రికి తరలించేందుకు కళాశాల యాజమాన్యం ఆలసత్వం వహించింది. దాంతో నాగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. -
ఎంపీలను చంపేందుకు లగడపాటి కుట్ర: రాథోడ్
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. సభలో చర్చించకుండా దాడులకు దిగడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా పార్లమెంట్లో చర్చిద్దామంటూ సూచించారు. పెప్పర్ స్ప్రే చేసి సభ్యులను ఇబ్బంది పెట్టారని అన్నారు. ఎంపీలపై దాడి ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. పార్లమెంట్‌ను బజారుస్థాయి ఘర్షణకు వేదికగా కాంగ్రెస్ మార్చిందని నామా విమర్శించారు. ఎంపీలను చంపేందుకు లగడపాటి రాజగోపాల్ కుట్ర పన్నారని మరో టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆరోపించారు. మిరియాల పొడి స్ప్రే చేయడంతో సభలో చాలా మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. లగడపాటిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. -
పనుల పంపకాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎంపీలు పనుల పంపకాల్లో బిజీబిజీ అయ్యారు. కేడర్‌ను కాపాడుకునేందుకు వారికి కాంట్రాక్టు పనులు కట్టబెడుతున్నారు. నాలుగున్నరేళ్లపాటు ఆచితూచి అరకొరగా పనులు ప్రతిపాదించిన పార్లమెం ట్ సభ్యులు ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడటంతో ఆగమేఘాలపై ఎంపీ లాడ్స్ నిధులను వెచ్చిస్తున్నారు. గ్రామస్థాయి నాయకులతోపాటు, ద్వితీయ శ్రేణి నేతలకు పనులను కేటాయిస్తున్నారు. ఎన్నికల్లో గట్టెక్కేందుకు అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు. మరో పక్షం రోజుల్లో ‘కోడ్’ అమలులోకి రానుంది. దీంతో కొత్తగా పనులకు మంజూరు లభించే అవకాశాలు లేవు. దీంతో జిల్లాకు చెందిన ఎంపీలు రాథోడ్ రమేష్, జి.వివేక్ ఒక్కసారిగా పనులు ప్రతిపాదించడంతో ఎంపీడీవోలు తలలు పట్టుకుంటున్నారు. 40 పనులకు రాథోడ్ రమేష్ తాజా ప్రతిపాదనలు తెలంగాణ ఏర్పాటు విషయంలో చంద్రబాబు సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు చాలా మంది పార్టీకి దూరమయ్యారు. మిగిలిన కాస్త కేడర్‌ను కాపాడుకునే పనిలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు తలమునకలయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ఇటీవల రూ.69.25 లక్షలు అంచనా వ్యయం కలిగిన 40 అభివృద్ధి పనులు అప్పగించారు. ఈ మేరకు ఆయన పంపిన ప్రతిపాదనలకు ఈనెల 7న కలెక్టర్ అహ్మద్‌బాబు ఆమోదముద్ర వేశారు. ప్రొసిడింగ్ నెం.ఐ/10/ఎంపీ లాడ్స్ లోక్‌సభ కింద రూ.69.25 లక్షల పనులకు 60 శాతం నిధులు రూ.41.55 లక్షలు ఆయా మండలాల ఎంపీడీవోలకు విడుదల చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఊట్నూర్, జన్నారం, ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, తలమడుగు, కడెం, దిలావర్పూర్, గుడిహత్నూర్, లక్ష్మణచాంద మండలాల పరిధిలోని గ్రామాల్లో చిన్నచిన్న కాంట్రాక్టు పనులను నేతలకు, కార్యకర్తలకు అప్పగించనున్నారు. సీసీ రోడ్లు, మట్టి రోడ్లు, తాగునీటి పథకాలకు బోర్వెల్లు, కమ్యూనిటీ హాళ్లు, కల్వర్టుల నిర్మాణం వంటి పనులు తాజా ప్రతిపాదనల్లో ఉన్నాయి. రూ.కోటి పనులకు వివేక్ పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ కూడా తాజాగా రూ.1.01 కోట్ల విలువ చేసే 62 పనులకు ప్రతిపాదనలు పంపారు. తాజాగా శుక్రవారం వీటికి పరిపాలన అనుమతి లభించింది. పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే లక్సెట్టిపేట, దండేపల్లి, చెన్నూరు, జైపూర్, మందమర్రి మండలాల పరిధిలో రూ.82 లక్షల అంచనా వ్యయం కలిగిన 43 అభివృద్ధి పనులకు, రూ.28.91 లక్షలు అంచనా వ్యయం కలిగిన మరో 19 పనులు మంజూరయ్యాయి. ఇందులో దాదాపు అన్ని పనులు రూ.లక్ష, రూ.2 లక్షల లోపు అంచనా వ్యయం కలిగిన పనులే ఉండటం గమనార్హం. -
బీజేపీ గూటికి ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాధోడ్
-
రైల్వే బడ్జెట్‌పై కసరత్తు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మమతా బెనర్జీ.. దినేష్ త్రివేది.. పవన్‌కుమార్ బన్సాల్.. కేంద్ర రైల్వేశాఖ మంత్రులు ఎవరైనా వారి బడ్జెట్లో జిల్లాకు ఒరిగింది శూన్యం. మన ఎంపీలు కసరత్తు చేసి పంపిన ప్రతిపాదనలు రెండేళ్లుగా బుట్టదాఖలు అవుతున్నాయి. 2013-14 రైల్వే బడ్జెట్లో ఆదిలాబాద్ ఎంపీ రమేశ్ రాథోడ్, పెద్దపెల్లి ఎంపీ వివేక్ 80కి పైగా ప్రతిపాదనలు పంపించారు. ఇందులో ఒక్క రైలు, ఓ రైలు మార్గం మినహాయిస్తే ఆ రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఒరిగిందేమి లేదు. మంచిర్యాల-ఆదిలాబాద్ కొత్త రైలు మార్గానికి గ్రీన్‌సిగ్నల్ లభించగా, సికింద్రాబాద్ నుంచి వయా ముత్కేడు, ఆదిలాబాద్‌కు డబ్లింగ్ పనులకు ఓకే చెప్పారు. హైదరాబాద్ నుంచి బెల్లంపల్లి ఎక్స్‌ప్రెస్‌ను సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు పొడిగించారు. ఇవి మినహాయిస్తే జిల్లాకు 2013-14 బడ్జెట్లో ఒరిగిందేమీ లేదు. మంచిర్యాల-ఆదిలాబాద్ కొత్త రైలు మార్గం కోసం రూపాయి కేటాయించలేదు. పెండింగ్ ప్రతిపాదనలకు మోక్షం కలుగుతుందనుకుంటే ఆశలు నిరాశలే అయ్యాయి. కొత్త రైళ్ల ప్రతిపాదనలు గట్టెక్కని వైనం 2011లో మమతా బెనర్జీ, 2012లో దినేష్ త్రివేది, 2013లో పవన్‌కుమార్ బన్సాల్ మూడేళ్ల రైల్వే బడ్జెట్లో జిల్లాకు అడుగడుగునా అన్యాయమే జరిగింది. పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు వివేక్, రమేశ్ రాథోడ్ సమస్యలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నా ప్రయోజనం కలగడం లేదు. ఆదిలాబాద్-గఢీచందూర్, పటాన్చెరు-ఆదిలాబాద్లతోపాటు నాలుగు కొత్త రైల్వేలైన్ల నిర్మాణం కోసం గతంలో చేసిన ప్రకటన అమలు కాలేదు. కొత్తగా మంచిర్యాల-ఆదిలాబాద్‌కు రైలుమార్గంను మంజూరు చేయడం హాస్యాస్పదంగా ఉంది. హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఆదిలాబాద్-పటాన్చెరు వయా నిర్మల్, ఆర్మూరు, కామారెడ్డిల మీదుగా రైల్వేలైను 2010-11 బడ్జెట్లో మంజూరు కాగా కేవలం సర్వేలకే పరిమితమైంది. మైసూర్-హౌరా వయా గొండియా, ఆదిలాబాద్ మీదుగా రైలును బడ్జెట్లో మంజూరు చేసి చివరకు మరో మార్గానికి మళ్లించారు. హైదరాబాద్-బెల్లంపల్లి ఎక్స్‌ప్రెస్‌ను సిర్పూరు కాగజ్‌నగర్ వరకు ఈసారి పొడిగించినా, నాందేడ్-దౌడ్ ప్యాసింజర్, ఆదిలాబాద్-పర్లి, నాందేడ్-పూణే-నాందేడ్ తదితర రైళ్ల పొడిగింపు ప్రస్తావనకు రాలేదు. ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలు బాసర పుణ్యక్షేత్రంలో ఆపాలని, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను రెబ్బన, ఆసిఫాబాద్‌లలో ఆపాలన్న ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. నాందేడ్-జైపూర్ రైలును ఆదిలాబాద్ మీదుగా నడపాలన్న డిమాండ్ నెరవేర లేదు. ఇలా అనేక కొత్త లైన్లు, రైళ్ల ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉండగా. రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, వసతులు కరువయ్యాయి. 2014-15 బడ్జెట్‌కు ప్రతిపాదనల కోరిన ప్రభుత్వం రైల్వే బడ్జెట్లో జిల్లాకు ప్రాతినిధ్యం కలిగేలా ప్రతీసారి ఎంపీలు ప్రతిపాదనలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. కొత్త రైలు మార్గాలు, ప్రధాన రైలు మార్గాల ఆధునికీకరణ, నాలుగు లైన్ల విస్తరణ, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ తదితర అంశాలు ప్రతిపాదనలకే పరిమితం అవుతున్నాయి. పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీలు ప్రతీసారి రైల్వే బడ్జెట్ సమయంలో కేంద్రానికి ప్రతిపాదనలు చేస్తున్నామని చెప్తున్నా కేంద్ర ప్రభుత్వస్థాయిలో ఒత్తిడి లేని కారణంగా జిల్లా సమస్యలు బుట్టదాఖలు అవుతున్నాయన్న చర్చ ఉంది. ఫలితంగానే జిల్లా నుంచి వెళ్లిన ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదని అంటున్నారు. అయితే 2014-15 రైల్వే బడ్జెట్ కోసం ఇప్పటినుంచే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఇటీవలే ఎంపీలను కోరింది. ఈ ప్రభుత్వ హయాంలో ఇదే ఆఖరి బడ్జెట్ కానుండటం, ఆ తర్వాత సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కీలకంగా మారాయి. రెండు నెలల ముందుగానే పార్లమెంట్ సభ్యులు తమ ప్రతిపాదనలు రాష్ర్ట ప్రభుత్వానికి సమర్పించాలని తాజాగా సమాచారం అందడంతో జిల్లాకు చెందిన ఎంపీలు వివేక్, రమేశ్‌లు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. నాలుగేళ్లలో చేసిన ప్రతిపాదనలు, అందులో పరిష్కారానికి నోచుకున్న అంశాలు వదిలేసి కీలకమైన సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే పనిలో నిమగ్నం అయినట్లు వారి అనుచరులు చెప్తున్నారు. తాజా ప్రతిపాదనల తయారీ నేపథ్యంలో ఎంపీలు తమ తమ అనుచరులను కూడా రైల్వేసమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. మరో ఐదారు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మన ఎంపీలు సమర్పించే ప్రతిపాదనలు కీలకం కాగా, ఈసారైనా ఆ ప్రతిపాదనలు గట్టెక్కుతాయా? అన్న సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
టీడీపీ అధికారంలోకి వస్తే రుణమాఫీ
నార్నూర్, న్యూస్‌లైన్ : రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, తాము అధికారంలోకి వచ్చిన తొలి సంతకం రైతుల రుణ మాఫీ ఫైల్‌పైనే చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్ అన్నారు. ఎంపీ చేపట్టిన 100 రోజుల పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని మహగావ్, గుండాల, చోర్గావ్, ఖైర్‌డట్వా, ఖడ్కి, లొకారి(కె), ఝరి, గాదిగూడ, పర్సువాడ తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. శేకుగూడ గ్రామంలో రైతులు ఎండ బెట్టిన సోయా విత్తనాలను పరిశీలించి, ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం గురించి అడిగారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రేమ్‌సాగర్‌కు తొత్తుగా మారి గిరిజనులను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, ఎంపీ వెంట తహశీల్దార్ సూర్యనారాయణ, ఐటీడీఏ డీఈ తానాజీ, హౌసింగ్ డీఈ నజీమొద్దీన్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ శ్రీనివాస్, పీఆర్ జేఈ లింగన్న, ట్రాన్స్‌కో ఏఈ రవీందర్, ఈజీఎస్ ఏపీవో రజనీకాంత్, మాజీ జెడ్పీటీసీ జాలంసింగ్, సహకార సంఘం చైర్మన్ కాంబ్లె నాందేవ్, టీడీపీ మండల అధ్యక్షుడు మోతె రాజన్న, సర్పంచులు రాథోడ్ మధుకర్, రాజునాయక్, దాదారావ్, నాయకులు పాల్గొన్నారు. -
తెలంగాణలో టీడీపీకి తెలంగాణ వ్యక్తే అధ్యక్షుడు
శ్రీరాంపూర్: ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ర్టంలో తెలంగాణ వ్యక్తే ఉంటారని ఆదిలాబాద్ ఎంపీ రమేశ్ రాథోడ్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కిరణ్ తన తమ్ముడికి దోచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ ఒక్కరికి కూడా సరిగా ఉద్యోగం ఇప్పించలేదన్నారు. తాను ఏ పార్టీలో చేరనని ఉంటే టీడీపీలోనే ఉంటానని తప్పితే వ్యవసాయం చేసుకుంటాను తప్ప.. మరే పార్టీలో చేరమన్నారు. బీజీపీకే టీడీపీ అవసరమన్నారు. టీడీపీ విడిచివెళ్లిన వారందరు తిరిగి వస్తే స్వాగతిస్తామన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉండి డబ్బులు వసూలు చేస్తాడని ఆరోపించారు. -
కలెక్టర్, ఎమ్మెల్యేలతో ఎంపీ రాథోడ్ రమేశ్ వాగ్వాదం
ప్రభుత్వ పథకాల అమలు తీరు, పరిశీలన కోసం మంగళవారం మందమర్రిలోని ఇల్లందు క్లబ్లో నిర్వహించిన జిల్లా సమీక్ష మండలి (డీఆర్సీ) సమావేశం ఆద్యంతం మొక్కుబడిగా సాగింది. ఉదయం 11.10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.40 గంటలకు ముగిసింది. ఈ సమావేశంలో కీలకమైన పది శాఖల పరిధిలోని 23 అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా కేవలం విద్యా, వ్యవసాయంపైనే విస్తృతస్థాయి సమీక్ష జరిగింది. హౌసింగ్, పంచాయతీరాజ్, వైద్యం, ఉపాధిహామీ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కాగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కాతలేని పత్తి, మొలకొచ్చిన సోయా మొక్కలతో సమావేశానికి వచ్చారు. తక్షణమే అతివృష్టితో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో నాన్ ట్రైబల్స్‌కు పహాణీతోపాటు పంటలకు నష్టపరిహారం ఇప్పించాలని ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్ కలెక్టర్ అహ్మద్ బాబుతో వాగ్వాదానికి దిగారు. ఏజెన్సీలో గిరిజనేతరులకు భూముల పట్టాలు, పరిహారం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎంపీ రాథోడ్ రమేశ్ వాగ్వాదం జిల్లా సమీక్ష సమావేశం ప్రారంభించే ముందు ఇన్చార్జి మంత్రి సారయ్య సమావేశాన్ని ప్రారంభిద్దామా? అంటూ సభ్యుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ముందుగా తెలంగాణ అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అంటూ ఎమ్మెల్యే రామన్న ప్రతిపాదించారు. మౌనం పాటించిన అనంతరం ప్రధాన అంశాలపై చర్చిద్దామని మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు వ్యవసాయశాఖ నుంచి సమీక్ష మొదలు పెట్టారు. డీఆర్సీకి ఆలస్యంగా వచ్చిన ఎంపీ రాథోడ్ రమేశ్ ఏజెన్సీ ప్రాంతంలో వరదల కారణంగా నష్టపోయిన గిరిజనేతరులకు పంట నష్ట పరిహారం ఎందుకివ్వడం లేదని వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ రోజ్లీలను ప్రశ్నించాడు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గిరిజనేతరులకు నష్టపరిహారం ఇవ్వడం కుదరని చెప్పడంతో గతంలో ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడు ఎందుకు ఇవ్వరంటూ నిలదీశారు. ఎంపీ వాదనపై స్పందించిన కలెక్టర్ బాబు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు సాగు చేస్తున్నా వారికి పట్టాలు, పహాణీలు, నష్టపరిహారం ఇవ్వడం చట్టపరంగా కుదరదన్నారు. ఈ విషయమై కలెక్టర్ అహ్మద్‌బాబు ఎంపీకి న చ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో ఎమ్మెల్యేలు అరవిందరెడ్డి, జోగు రామన్న ఎంపీకి అసలు విషయం చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో ఎంపీ ఇరువురు ఎమ్మెల్యేల పైనా మండిపడ్డారు. ఎమ్మెల్యే రామన్న స్పందిస్తూ డీఆర్సీ పరిధిలోని అంశాలు ప్రస్తావించి సమయం వృథా కాకుండా చూడాలే తప్ప మరొకటి కాదని, అవసరమైతే తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుదామని పేర్కొన్నారు. దీంతో ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పి వెళ్లిపోయారు. మంత్రి, కలెక్టర్ వెళ్లొద్దని చెప్పినా వినిపించుకోలేదు. విద్య, వ్యవసాయంపై విస్తృత చర్చ డీఆర్సీలో విద్య, వ్యవసాయంపై విస్తృత చర్చ జరిగింది. మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు వ్యవసాయశాఖ నుంచి సమీక్ష మొదలు పెట్టాలన్నారు. జిల్లాలో అతివృష్టి వల్ల దెబ్బతిన్న పంటలపై వెంటనే సర్వే జరిపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని మెజార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. మొదటగా ఎమ్మె ల్సీ బి.వెంకట్రావు మాట్లాడుతూ మూడు నెలలకోసారి జరగాల్సిన డీఆర్సీ ఏడాదిన్నర తర్వాత నిర్వహించడం బాధాకరమన్నారు. కనీసం ఆరు నెలలకోసారైనా డీఆర్సీ జరిగేలా చూడాలని కోరారు. క్యాతనపల్లి శివారులో 40 ఎకరాల్లో అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు అందేలా చూడాలని, మంత్రి సారయ్య సీఎంతో మాట్లాడి జిల్లా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి విద్యాశాఖకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. మేలో ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ జరిగినా వారిని రిలీవ్ చేయడం లేదని, 1,141 పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీకి నోచుకోవడం లేదన్నారు. డీఎస్సీ జరగక, విద్యావలంటీర్ల నియామకం లేక విద్యావ్యవస్థ కుంటుపడుతోందన్నారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఎస్.వేణుగోపాలాచారి, గోడం నగేశ్, గడ్డం అరవిందరెడ్డి, సుమన్ రాథోడ్, నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్య తదితరులు విద్యాశాఖ సమస్యలపై స్పందించారు. నాణ్యత లోపించిన పాఠశాల భవనాల నిర్మాణం, నాసిరకం పనులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయశాఖ, పంటరుణాలు, యాంత్రీకరణ, రైతుల ఆత్మహత్యల నివారణపై స్పందించాలని కోరారు. 67,987 హెక్టార్లలో రూ.61.88 కోట్ల నష్టం జరిగినట్లు ఇదివరకే ప్రభుత్వానికి నివేదిక పంపామని, రీసర్వే కూడా చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంకా సమావేశంలో జేసీ సుజాత శర్మ, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉమా మహేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్‌రావు, కె.పోచయ్య, వినయ్‌కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, షేక్ మీరా, హంసారెడ్డి, అంకం శంకర్, యాదయ్య, సుధాకర్‌రావు, డీఎఫ్‌వో శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. తీర్మానాలు ఇవే.. తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరుల ఆత్మశాంతి కలగాలని పేర్కొన్నారు. జిల్లాలో కలెక్టర్ నాయకత్వంలో అధికార యంత్రాంగం ఒక్క టీమ్‌గా చేస్తున్న అభివృద్ధి ప్రశంసనీయమంటూ అభినందన తీర్మానాన్ని సభ ఆమోదించింది. జిల్లాలో జరిగిన పంటల నష్టంపై రీ సర్వే చేసి సుమారు 3 లక్షల ఎకరాల్లో పత్తి, సోయా, ఇతర పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందేలా చూడాలి. పంట నష్టం, అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడిన ఒక్కో రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. తక్షణమే ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక పంపించాలి. రాజీవ్ విద్యామిషన్‌లో రూ.118 కోట్లతో నిర్మించిన భవనాల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై క్వాలిటీ కంట్రోల్ ద్వారా విచారణ జరపాలి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి.