మంత్రి సమక్షంలోనే టీఆర్‌ఎస్ నేతలు బాహాబాహీకి దిగారు.
ఖానాపూర్: మంత్రి సమక్షంలోనే టీఆర్‌ఎస్ నేతలు బాహాబాహీకి దిగారు. ప్రజా ప్రతినిధులు అనే ఆలోచన లేకుండా గొడవకు దిగారు. వివరాల్లోకి వెళ్తే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలోనే ఎమ్మెల్యే రేఖానాయక్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా రమేశ్ రాథోడ్ తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని ఎమ్మెల్యే రేఖా నాయక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆయనతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక మహిళా ఎమ్మెల్యేతో అనుచితంగా ప్రవర్తించిన రాథోడ్ను వెంటనే అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్యే ఆందోళనకు దిగారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పనుల శంకుస్థాపనకు ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడి కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వచ్చారు.