Rekha Nayak
-
నడిరోడ్డుపై నిలబెట్టి కొడతా: రేఖా నాయక్
సాక్షి, నిర్మల్ : ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్.. తన పార్టీ తరుపున ఆ నియోజకవర్గ అభ్యర్థి జాన్సన్ నాయక్‌కు సాలిడ్ వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గంలో రేఖా నాయక్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. తాను గెలిచాక చేస్తానని జాన్సన్ ప్రచారం చేస్తుండడంపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలు గనుక ప్రచారం చేస్తే.. నడిరోడ్డుపై కొట్టేందుకు కూడా వెనకాడబోనని హెచ్చరించారామె. తానింక బీఆర్ఎస్లోనే ఉన్నానని రేఖా నాయక్.. రెబల్‌గా అయినా పోటీ చేసి తీరతానని స్పష్టం చేశారు. ప్రజలు ఇప్పటివరకు రెండు సార్లు ఆశీర్వదించి గెలిపించారని.. చేసిన సేవలు నచ్చితే మూడోసారి రెబల్‌గా కూడా తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారామె. ‘‘రాథోడ్ రమేష్ నాపై దాడి కోసం వస్తే.. ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు కేవలం అభ్యర్థి అయిన జాన్సన్ నాయక్ విషయంలో ఏ హోదాతో సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎందుకు ప్రొటోకాల్ పాటిస్తున్నారు. ఆయన కేవలం అభ్యర్థి మాత్రమే కదా’’ అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారామె. జాన్సన్ నాయక్‌కు ఏం తెల్వదు. కేవలం కేటీఆర్‌కు క్లోజ్ ఫ్రెండ్ అనే టికెట్ ఇచ్చారు. ఈ విషయంలో కేటీఆర్‌ను కలిసినప్పుడు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ఖానాపూర్ విషయంలో తనకు టికెట్ ఇవ్వనప్పుడు.. స్థానికులకు ఎవరికైనా టికెట్ ఇచ్చి ఉంటే బాగుండేది. అలా కాకుండా జాన్సన్‌కు ఇవ్వడం అభ్యంతరకరంగా ఉంది. నేను అభివృద్ధి చేయలేదని ప్రచారం చేస్తే ఊరుకోను.నేను ఏమి అభివృద్ధి చేశానో ప్రజలకు తెలుసు. అసెంబ్లీలో కేటీఆర్ సమక్షంలోనే.. డిగ్రీ కాలేజ్.. రెవెన్యూ డివిజన్ అడిగింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారామె. ఈ క్రమంలోనే.. అబద్దాలు ప్రచారంచేస్తే జాన్సన్ నాయక్‌ను నడిరోడ్డు పై నిలబెట్టి కొట్టడానికి వెనకాడబోనని హెచ్చరించారామె. న్నారు. జాన్సన్‌ను ప్రశ్నిస్తే రౌడీయిజం చేస్తున్నాడని.. ప్రశ్నించినవాళ్లపై దాడులు చేస్తున్నాడని రేఖా నాయక్ ఆరోపించారు. తనకు సెక్యూరిటీని తగ్గించేశారని.. తన అనుచరులనూ బైండోవర్లు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. ఇప్పుడేం కాలేదు బిడ్డా.. ఎన్నికలలో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమంటూ జాన్సన్ నాయక్‌కు ఉద్దేశించి రేఖా నాయక్ ఘాటు వ్యాఖ్యలే చేశారు. -
భయపడేది లేదు: ఎమ్మెల్యే రేఖా నాయక్
‘‘కాంగ్రెస్‌లో చేరతా.. బీఆర్ఎస్ను ఓడిస్తా.. ప్రతీకారం తీర్చుకుంటా’’.. టికెట్ దక్కకపోవడంపై ఖానాపూర్(నిర్మల్) ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ సెన్సేషన్ రియాక్షన్ ఇది. అంత స్వరం పెంచినా.. బుజ్జగింపులకు బీఆర్ఎస్ అధిష్టానం దిగింది. అయినా ఆమె చల్లారలేదు. దీంతో ‘ప్రతీకార చర్యలకు’ దిగిందనే ఆరోపణలు తలెత్తుతున్నాయి. మొదట కూతురు భర్త.. ఇప్పుడు తన భర్తనే టార్గెట్ చేయడంపై ఎమ్మెల్యే రేఖా నాయక్ స్పందించారు కూడా. సొంత ఎమ్మెల్యే రేఖనాయక్‌ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది!. అత్తమీద కోపం అల్లుడి మీద ప్రదర్శించింది. మహబూబ్ బాద్ ఎస్పీగా పని చేస్తున్నా శరత్ చంద్రపవార్‌ను.. ఉన్నపళంగా ఏమాత్రం ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసింది. ఈ రివెంజ్ ఇక్కడితోనే ఆగిపోలేదు. రేఖా నాయక్ దూకుడు తగ్గించేందుకు మరో అడుగు ముందుకేసింది. రేఖా నాయక్ కుటుంబ అక్రమాలను తవ్వే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె భర్త. శ్యామ్ నాయక్‌పై ఉన్న కేసును ఏసీబీ ద్వారా తిరగదోడేందుకు సిద్దమవుతోందని సమాచారం. తద్వారా రేఖానాయక్‌కు చెక్ పెట్టడంతో పాటు ఆసిఫాబాద్‌లో ఆమె భర్త పోటీ చేయకుండా ఉండేందుకు ఎత్తుగడ వేస్తోందనే ప్రచారం నడుస్తోంది. బహిరంగంగా దూకుడు.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్‌కు బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. ఆ టిక్కెట్‌ను ఆమె రాజకీయ ప్రత్యర్ధిగా భావించే జాన్సన్ నాయక్‌కు కేటాయించింది బీఆర్ఎస్ అధిష్టానం. దీంతో.. ముచ్చటగా మూడోసారి పోటీ చేయాలని బావించిన రేఖనాయక్ ఆశలు అవిరయ్యాయి. టిక్కెట్ దక్కలేదనే ప్రస్ట్రేషన్‌లో రేఖానాయక్.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై అగ్రహం వెల్లగక్కింది. కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు కూడా. ఈ క్రమంలో.. పార్టీ బుజ్జగింపులు చేసిన దారిలేదు. పైగా పార్టీ తిరుగుబాటు చేయడం పార్టీ పెద్దలకు నచ్చలేదట!. పైగా ఖానాపూర్‌తో పాటు ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడించి తీరతామని ప్రకటనలు చేయడం మరింత మండిపోయేలా చేసింది. అందుకే ఆమెను దారికి తేవడానికి ఎత్తుగడలు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. భార్యభర్తలపై.. రేఖా నాయక్ భర్త ఇప్పటికే శ్యామ్ నాయక్ కాంగ్రెస్‌లో చేరారు. మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పని చేసిన శ్యామ్.. ఈ మధ్యే వీఆర్ఎస్ తీసుకున్నారు. అయితే.. భోరజ్ చెక్‌పోస్ట్ వద్ద ఎంవీఐగా పని చేసే సమయంలో ఆయనపై ఏసీబీ ఓ కేసు నమోదు చేసింది. ఆ కేసును ఇప్పుడు బయటకు తీయించాలనే ప్రయత్నాల్లో ఉంది. అలాగే.. రేఖా నాయక్ సైతం ఎమ్మెల్యేగా పలు అక్రమాలకు పాల్పడ్డారని.. ప్రధానంగా మిషన్ భగీరథ, దళిత బందు, వివిద పథకాల విషయంలో ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై విచారణ ద్వారా ఆమె దూకుడుకు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ సర్కార్ భావిస్తోందట. అయితే ఇదంతా బీఆర్ఎస్ శ్రేణుల ద్వారా చేయిస్తున్న ప్రచారమని.. బెదిరింపుల ద్వారా రేఖా నాయక్, ఆమె భర్తను లొంగదీసుకునే ప్రయత్నమనే ఆమె అనుచరులు మండిపడుతున్నారు. కుట్ర అంతా.. అవినీతి, అక్రమ ఆరోపణలను రేఖ, శ్యామ్‌లు సైతం కోట్టిపారేస్తున్నారు. ‘‘సర్కార్ బెదిరింపులకు భయపడేది లేదు. ఎలాంటి అక్రమాలకు పాల్పపడలేదు. ఎలాంటి విచారణకైనా సిద్ధం’’ అని ఆమె చెబుతున్నారు. అదేవిధంగా శ్యామ్ నాయక్ సైతం తాను వీఆర్ఎస్ తీసుకునేటప్పుడు ఏసీబీ క్లియరెన్స్ ఇచ్చిందని, కేసు కొట్టిపారేసిన తర్వాతనే వీఆర్ఎస్కు ప్రభుత్వం అమోదం ఇచ్చిందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్న ఆయన.. కేసుతో అయ్యేది లేదంటున్నారు. ‘‘ప్రజల్లో మాకు పెరుగుతున్న అదరణ చూసి బీఆర్ఎస్ కుట్రలు పన్నుతోంది’’ అని మండిపడుతున్నారు ఈ భార్యభర్తలు. ఏది ఏమైనా.. సర్కార్ బెదిరింపులకు ఆ భార్యాభర్తలు తలొగ్గుతారా? లేదంటే ఈ వేధింపులు వాళ్లపై సింపథీ క్రియేట్ చేస్తాయా?.. చూడాలి. -
అత్తమీద కోపం.. అల్లుడిపై ప్రతాపం
సాక్షి, మహబూబాబాద్: జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్‌ను రాష్ట్ర పోలీస్ అకాడమికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్లో ఎస్పీగా పనిచేస్తున్న చంద్రమోహన్‌ను బదిలీపై జిల్లాకు పంపారు. ఈ మేరకు మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆకస్మిక బదిలీపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. 2021 డిసెంబర్ 26న జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ.. ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా 20 నెలల్లో బదిలీ కావడం.. దీని వెనుక ఏం జరిగింది అనేది అటు అధికారులు.. ఇటు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఆకస్మిక బదిలీతో షాక్.. జిల్లా పోలీస్‌బాస్ ఆకస్మిక బదిలీతో ఆశాఖ అధికారులు విస్మయానికి గురయ్యారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు జిల్లా ఎస్పీని బదిలీ చేయలేదు. దీంతో ఆయన ఎన్నికల వరకు ఉంటారని అందరు భావించారు. అయితే కుటుంబ సభ్యుల్లో జరిగిన రాజకీయ పరిణామాలే ఆయన బదిలీకి కారణం అని కొందరు చెబుతుండగా.. ఎస్పీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శాఖ తీసుకున్న నిర్ణయం అని మరికొందరు చెబుతున్నారు. కుటుంబ రాజకీయ పరిణామాలే కారణమైతే ఎస్పీ బదిలీతోనే ఆగిపోతుంది. అలా కాకుంటే ఎస్పీతో పాటు మరికొందరిపై బదిలీ వేటు పడే అవకాశం ఉందని పలువురు సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఎస్పీ బదిలీ వార్తతో ఆయనకు అనుకూలంగా ఉండే అధికారులు మాత్రం ఆందోళనగానే ఉన్నట్లు సమాచారం. ఆ కోపమేనా..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ తన బిడ్డను ఎస్పీ శరత్చంద్ర పవార్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వడం లేదు. ఇటీవల విడుదల చేసిన జాబితాలో కూడా ఆమె పేరు లేదు. దీంతో ఆమె మనస్తాపం చెందిగా.. భర్త శ్యాం నాయక్ ఉద్యోగం వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈమేరకు నేడో రేపో రేఖానాయక్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆమె పార్టీ మారకుండా ఉండేందుకు పలువురు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. అయినా చర్చలు ఫలించలేదు. దీంతో రేఖానాయక్‌పై కోపంతో ఆమె అల్లుడు ఎస్పీ శరత్ చంద్రపవార్‌ను ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసినట్లు మానుకోటలో ప్రచారం జరుగుతోంది. -
బీఆర్ఎస్లో టికెట్ ఎఫెక్ట్.. కాంగ్రెస్‌లోకి సీనియర్ ఎమ్మెల్యే!
సాక్షి, నిర్మల్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు స్పీడ్ పెంచాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ తొలి విడతలో భాగంగా అభ్యర్థులను ప్రకటించింది. దీంతో, టికెట్ పొందని అభ్యర్థులు అధిష్టానంపై సీరియస్ అవుతున్నారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలు ఇప్పటికే జంప్ అయ్యారు. తాజాగా ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె బీఆర్ఎస్ను వీడుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలిపారు. కాగా, రేఖానాయక్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. నా భర్త కూడా కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాను. ప్రజలందరూ నాతో పాటు ఉన్నారు. నాయకులు పోయినంత మాత్రాన నాకు ఏలాంటి నష్టం లేదు. ఓటర్లు మాత్రం నాతోనే ఉన్నారు. నా ప్రాణం ఉన్నంత వరకు వారికి సేవ చేస్తూనే ఉంటాను. ఎక్కడి నుంచో వచ్చిన నాయకుడికి ఇక్కడి ప్రజలు ఓట్లు వేయరు. ఓటర్లు నాతోనే ఉన్నారు. సదరు వలస నాయకుడిని ప్రజలు ఓడిస్తారు. నా నియోజకవర్గంలో పన్నెండు సంవత్సరాల పాటు ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉన్నాను. నన్ను ఎవరూ ప్రజలు నుండి దూరం చేయలేరు. సరైన సమయంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి తిట్ల పురాణం.. సహనం కోల్పోయి జనంపై చిందులు -
ఖానాపూర్ (ST) నియోజకవర్గం చరిత్ర...
ఖానాపూర్ నియోజకవర్గం ఖానాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన రేఖా నాయక్ మరో సారి గెలిచారు. కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన మాజీ ఎమ్.పి, మాజీ ఎమ్మెల్యే రమేష్ రాధోడ్ పై ఈమె విజయం సాదించారు. రమేష్ గతంలో టిడిపిలో ఉండేవారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసు తర్వాత టిడిపి బాగా దెబ్బతినిపోవడంతో ఆ పార్టీ నాయకులు కొందరు కాంగ్రెస్ ఐలోకి, మరికొందరు టిఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. రమేష్ మొదట టిఆర్ఎస్ లో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసినా ఫలితం దక్కలేదు. రేఖా నాయక్ కు 66974 ఓట్లు వస్తే, రమేష్ రాధోడ్‌కు 45928 ఓట్లు వచ్చాయి. రేఖా నాయక్‌కు 21046 ఓట్ల ఆధిక్యత వచ్చింది. కాగా బిజెపి అభ్యర్ధి సత్తా అశోక్‌కు 23656 ఓట్లు వచ్చి మూడోస్థానంలో ఉన్నారు. అనేక చోట్ల డిపాజిట్లు కోల్పాయినా, బిజెపికి ఇక్కడ గణనీయంగా ఓట్లు రావడం విశేషం. 2014లో ఖానాపూర్ రిజర్వుడ్ నియోజకవర్గంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే సుమన్ రాదోడ్, ఆదిలాబాద్ మాజీ ఎమ్.పి రమేష్ రాదోడ్ల కుమారుడు అయిన రితేష్ రాధోడ్ పోటీచేసి ఓడిపోయారు. ఆజ్మీరా రేఖ 2014లో మొదటిసారి శాసనసభకు 38511 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఖానాపూర్‌లో టిడిపి పక్షాన సుమన్ రాధోడ్ రెండుసార్లు గెలిచారు. మరో నేత గోవిందనాయక్ ఈ నియో జకవర్గం నుంచి 1985లో ఇండిపెండెంటుగా, 1994లో టిడిపి పక్షాన, 2004లో టిఆర్ఎస్ తరుఫునగెలవగా, తెలంగాణ సాధనలో భాగంగా రాజీనామా చేసిన 16 మంది టిఆర్ఎస్ సభ్యులలో ఈయన ఒకరు. కాని 2008 ఉప ఎన్నికలో గెలుపొంద లేకపోయారు. ఖానాపూర్ 1978లో ఏర్పడగా, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు మూడుసార్లు, టిడిపి నాలుగుసార్లు గెలుపొందగా, ఒకసారి ఇండిపెండెంటు, రెండుసార్లు టిఆర్ఎస్ ఇక్కడ గెలిచాయి. ఇక్కడ గెలిచిన కె.భీమ్రావు గతంలో పి.వి. చెన్నారెడ్డి, జనార్ధనరెడ్డి,కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో పనిచేసారు. భీమ్రావు ఇక్కడ ఒకసారి, మూడుసార్లు అసిఫాబాదులో గెలిచారు. ఇక్కడ రెండోసారి గెలిచిన సుమన్‌రాథోడ్ ఆదిలాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన రమేష్రాధోడ్ భార్య, రమేష్ గతంలో ఎమ్మెల్యేగా కూడా ఒకసారి గెలుపొందారు. ఆయన జడ్పి చైర్మన్ పదవి కూడా నిర్వహించారు. ఖానాపూర్ ఎస్టిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
నీ సంగతి చూస్తా..
కడెం(ఖానాపూర్): కలెక్టర్ వరుణ్‌రెడ్డి, గ్రామస్తుల సమక్షంలో ఎమ్మెల్యే రేఖానాయక్..సర్పంచ్ నరేందర్‌రెడ్డి నువ్వెంత.. అంటే నువ్వెంత.. అని గొడవకు దిగారు. మంగళవారం మండల కేంద్రంతో పాటుగా కన్నాపూర్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన డబుల్‌బెడ్ రూం ఇళ్ల గ్రామసభలో ఎమ్మెల్యే రేఖా నాయక్ స్థానిక సర్పంచ్(బీఆర్ఎస్ పార్టీ) నరేందర్‌రెడ్డి పేరును ప్రస్తావించలేదు. దీంతో సర్పంచ్ నా ఊరికి వచ్చి నా పేరు ప్రస్తావించకుండా ఎలా మాట్లాడుతున్నావ్ అని ఎమ్మెల్యేను నిలదీశాడు. దీంతో ఆవేశానికి లోనైనా ఎమ్మెల్యే రేఖానాయక్ నేను నియోజవర్గానికి ఎమ్మెల్యేను..నీ పేరు చెప్పలేదు కావచ్చు అయితే ఏంది.. నేను ఎస్టీ మహిళ అని నువ్వు రెచ్చిపోతున్నావ్..రేపు నీ సంగతి చూస్తా.. అని సర్పంచ్‌ను బెదిరింపులకు గురిచేసింది. -
నువ్వేం ఏం చేస్తవ్ నన్ను? సర్పంచ్‌పై ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రతాపం
-
నువ్వు ఏం చేస్తవ్ నన్ను? సర్పంచ్‌పై ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రతాపం
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక వివాదస్పదంగా మారింది. కడెం మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం మంగళవారం ఖన్నపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్, గ్రామ సర్పంచ్‌తో సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈక్రమంలో ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ.. వేదిపై ఉన్న వారి పేర్లు చెబుతూ సర్పంచ్ పేరు పలకడం మర్చిపోయారు. ఈ విషయాన్ని గమనించిన సర్పంచ్ నరేందర్ రెడ్డి తన పేరు ప్రస్తావించలేదని ఎమ్మెల్యేకు తెలిపారు. సర్పంచ్ పేరు చెప్పకుండా ప్రోటోకాల్‌న ఉల్లంఘించారని అన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సర్పంచ్ సీరియస్‌గా స్పందించారు. రేపు నీ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఎమ్మెల్యే మాటలకు బయపడని సర్పంచ్.. మీరు నన్నేం చేస్తారు మేడం, ఏం చేస్తారో చేసుకోండని అని బదులిచ్చారు. దీంతో సర్పంచ్‌పై ఎమ్మెల్యే తన ప్రతాపం చూపించారు. నువ్వు నన్నేం చేస్తావ్?. ఎస్టీ మహిళ అని మాట్లాడుతున్నావా. ఒక ఎమ్మెల్యే కలెక్టర్‌ను తీసుకొస్తే.. ఇది నా ఊరు అని ఎలా అంటావ్. మా పార్టీ తరపునే మీ ఊరు డెవలప్ అవుతుంది. మా పార్టీ వల్లే రోడ్లు, ఇళ్లు వచ్చాయి’ అని సర్పంచ్‌పై విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై సర్పంచర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తన పేరు పలకలేదని అడిగినందుకు ఎమ్మెల్యే దుర్బాషాలాడారని అన్నారు. ప్రోటోకాల్ పాటించలేదని చెప్పినందుకు బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పక్షాల సర్పంచ్‌లపై రేఖనాయక్ చిన్న చూపు చూస్తుందనడానికి ఇదొక నిదర్శనమని అన్నారు. -
వ్యవసాయ కూలీలతో భోజనం చేసిన ఎమ్మెల్యే రేఖానాయక్
సాక్షి, ఆదిలాబాద్: ప్రజా జీవితంలో, పార్టీ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉండే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ శుక్రవారం పంట పొలాల్లో కనిపించారు. ఇంద్రవెల్లి మండలంలోని దనోర బి గ్రామానికి వెళ్తున్న సమయంలో పంట చేలల్లో పనిచేస్తున్న వారిని చూసి వారి వద్దకు వెళ్లారు. కూలీలతో కలిసి భోజనం చేశారు. తాను చిన్నప్పుడు అమ్మమ్మతో కలిసి చేనులోకి వెళ్లి సరదగా పని చేసిన పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా అక్కడ పని చేస్తున్న మహిళలు ఎమ్మెల్యేతో పలు సమస్యలను విన్నవించారు. తాము ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారమని, పేదరికంలో ఉన్నామని చెప్పడంతో.. స్పందించిన ఎమ్మెల్యే రెండో దశ దళితబంధులో మీకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంపీపీ పోటే శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతి డోంగ్రె, సర్పంచ్ కోరెంగా గాంధారి, ఎంపీటీసీ సభ్యులు జాదవ్ స్వర్ణలత, గిత్తే ఆశాబాయి ఉన్నారు. చదవండి: ‘చీకోటి’ వెనుక ఉన్న చీకటి మిత్రులెవరూ? -
గంగాపూర్ గ్రామానికి తెప్పలపై వెళ్లిన ఎమ్మెల్యే రేఖా నాయక్
-
టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్‌పై ట్విస్ట్
సాక్షి, నిర్మల్ : జిల్లాలోని ఖానాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్ దాఖలు చేసిన నామినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. గత బుధవారం ఆమె మూడు సెట్లు నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అయితే మూడు సెట్లలోని ఒక కాలమ్‌ను ఖాళీగా ఉంచారు. దీంతో రిటర్నింగ్ అధికారి ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఉట్నూరుకు చెందిన రితేష్ రాథోడ్ అనే వ్యక్తి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ప్రతిపక్షాలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రేఖానాయక్ నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. -
మున్సిపాలిటీగా ఖానాపూర్
సాక్షి, ఖానాపూర్ : ప్రస్తుతం మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ (తిమ్మాపూర్)ను ప్రభుత్వం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా 28 మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తుండగా.. ఆ జాబితాలో ఖానాపూర్ కూడా ఉంది. సంబంధిత అధికారులు జిల్లా నుంచి ఖానాపూర్ (తిమ్మాపూర్) మున్సిపాలిటీ కోసం ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపారు. 15వేల జనాభా ఉన్న మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలను చేయనున్న నేపథ్యంలో ఖానాపూర్‌లో ఇప్పటికే 20వేల పైచిలుకు జనాభా ఉండడంతో ఖానాపూర్ మున్సిపాలిటీగా మారడం ఖాయమైంది. మొదట్లో నగర పంచాయతీ ఏర్పాటవుతుందన్న క్రమంలో ప్రస్తుతం మున్సిపాలిటీ ఏర్పాటు కోసం ప్రక్రియ పూర్తికానుంది. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావడమే తరువాయిగా ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ముందుగా ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వేగం కానున్న అభివృద్ధి.. మేజర్ గ్రామపంచాయతీల కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలకే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాయి. దీంతో ఖానాపూర్ ప్రజల చిరకాల కోరిక సెంటర్ లైటింగ్, రోడ్డు వెడల్పుతో పాటు ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలు మెరుగుపడి ఖానాపూర్ మరింత అభివృద్ధికి నోచుకోనుంది. ఇదివరకే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో పాటు పంచాయతీ ఎన్నికలకు ముందే మున్సిపాలిటీలా ఏర్పాటు ప్రక్రియ ఉపందుకోవడంతో ఇదివరకు వార్డు మెంబర్, సర్పంచ్‌గా బరిలోకి దిగుతామన్న నేతలు, ప్రస్తుతం కౌన్సిలర్‌గా పోటీ చేస్తామనే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం మేజర్ గ్రామపంచాయతీలో ఉన్న 20వార్డుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. సమీపంలోని ఇతర గ్రామాలను విలీనం చేస్తే వాటి సంఖ్య రెట్టింపు కానుంది. సామాన్యుల్లో ఒకింత ఆందోళన.. మున్సిపాలిటీ కావడంతో పేదలు ఇక్కడ భూమి కొనలేని పరిస్థితులు ఏర్పడనుండడంతో పాటు పన్నుల భారం కూడా పెరుగుతుందనే ఆందోళన సామాన్యుల్లో మొదలైంది. మున్సిపాలిటీ అయ్యాక భూముల ధరలు మరింత పెరిగి సామాన్యులకు సొంతింటి కల నెరవేరదేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మున్సిపాలిటీ ఏర్పాటు నేపథ్యంలో ఇక్కడి భూములకు ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే కొద్ది నెలలుగా ఈ విషయం తెరమీదికి రావడంతో ఖానాపూర్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఖానాపూర్ మరింత అభివృద్ధి ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. 15వేల జనాభా దాటిన మేజర్పంచాయతీలను మున్సిపాలిటీ చేస్తుండడం హర్షనీయం. ఖానాపూర్‌ను మున్సిపాలిటీ చేస్తున్నందుకు సీఎంతో పాటు మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వ నిర్ణయం ద్వారా ఖానాపూర్ మరింత అభివృద్ధి చెందనుంది. – రేఖానాయక్, ఎమ్మెల్యే -
ఆయన నుంచి నాకు ప్రాణహాని: మహిళా ఎమ్మెల్యే
ఖానాపూర్: మంత్రి సమక్షంలోనే టీఆర్ఎస్ నేతలు బాహాబాహీకి దిగారు. ప్రజా ప్రతినిధులు అనే ఆలోచన లేకుండా గొడవకు దిగారు. వివరాల్లోకి వెళ్తే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలోనే ఎమ్మెల్యే రేఖానాయక్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా రమేశ్ రాథోడ్ తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని ఎమ్మెల్యే రేఖా నాయక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక మహిళా ఎమ్మెల్యేతో అనుచితంగా ప్రవర్తించిన రాథోడ్‌ను వెంటనే అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్యే ఆందోళనకు దిగారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పనుల శంకుస్థాపనకు ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడి కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వచ్చారు. -
నేడు ‘కడెం’ ఆయకట్టుకు నీటి విడుదల
కడెం : కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతన్నలకో శుభవార్త. ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు గురువారం నీటిని వదలనున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఈ సారి కాస్త ఆలస్యంగా కడెం ప్రాజెక్టులోకి నీరు చేరింది. ప్రాజెక్టు మీద ఆశతో ఆయకట్టు రైతులు ఖరీఫ్‌లో వరినారు పోసుకున్నారు. సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవక.. ప్రాజెక్టులోకి నీరు చేరక నారుమడులు ఎండిపోయాయి. మరికొన్ని మడులు ముదిరి పశువులకు మేతగా మారాయి. బావుల కింద సాగు చేస్తున్న చేలు సైతం ఎండిపోయే దశకు చేరా యి. ఈ క్రమంలో వారం రోజుల నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి భారీగానే వరద నీరు చేరింది. ప్రాజెక్టు నీటిమట్టం 692 అడుగులకు చేరింది. జలాశయంలో 5.5 టీఎంసీల నీరుంది. దీంతో పంటలకు ప్రాజెక్టు నీటిని వదిలి ఆదుకోవాలని రైతులు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ జగన్మోహన్, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావులను ఎమ్మెల్యే రేఖానాయక్ కలిసి పరిస్థితి వివరించారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం కడెం ఆయకట్టు పరిధిలోని నీటి సంఘాల చైర్మన్లతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి, నీటి విడుదలపై చర్చించారు. చివరికి జలాశయంలో ఉన్న నీటిని కేవలం డీ-10(కలమడుగు) వరకు మాత్రమే వదలాలని, మిగతా ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు నింపాలని తీర్మానించారు. ఈ మేరకు కడెం ప్రాజెక్టు ఆయకట్టు కిందనున్న డీ-10 వరకు గురువారం ఉదయం 8.30 గంటలకు నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు డీఈ నూరొద్దీన్ తెలిపారు. ఎడమ కాలువ ద్వారా 4 అడుగులు, కుడి కాలువ ద్వారా 15 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి దశల వారీగా ప్రవాహాన్ని పెంచుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు రేఖానాయక్, దివాకర్‌రావు హాజరుకానున్నారని తెలిపారు.