ఖానాపూర్ నియోజకవర్గం
ఖానాపూర్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పక్షాన పోటీచేసిన రేఖా నాయక్ మరో సారి గెలిచారు. కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన మాజీ ఎమ్.పి, మాజీ ఎమ్మెల్యే రమేష్ రాధోడ్ పై ఈమె విజయం సాదించారు. రమేష్ గతంలో టిడిపిలో ఉండేవారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసు తర్వాత టిడిపి బాగా దెబ్బతినిపోవడంతో ఆ పార్టీ నాయకులు కొందరు కాంగ్రెస్ ఐలోకి, మరికొందరు టిఆర్‌ఎస్ లోకి వెళ్లిపోయారు.
రమేష్ మొదట టిఆర్‌ఎస్ లో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసినా ఫలితం దక్కలేదు. రేఖా నాయక్ కు 66974 ఓట్లు వస్తే, రమేష్ రాధోడ్‌కు 45928 ఓట్లు వచ్చాయి. రేఖా నాయక్‌కు 21046 ఓట్ల ఆధిక్యత వచ్చింది. కాగా బిజెపి అభ్యర్ధి సత్తా అశోక్‌కు 23656 ఓట్లు వచ్చి మూడోస్థానంలో ఉన్నారు. అనేక చోట్ల డిపాజిట్లు కోల్పాయినా, బిజెపికి ఇక్కడ గణనీయంగా ఓట్లు రావడం విశేషం. 2014లో ఖానాపూర్ రిజర్వుడ్ నియోజకవర్గంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే సుమన్ రాదోడ్, ఆదిలాబాద్ మాజీ ఎమ్.పి రమేష్ రాదోడ్‌ల కుమారుడు అయిన రితేష్ రాధోడ్ పోటీచేసి ఓడిపోయారు.
ఆజ్మీరా రేఖ 2014లో మొదటిసారి శాసనసభకు 38511 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఖానాపూర్‌లో టిడిపి పక్షాన సుమన్ రాధోడ్ రెండుసార్లు గెలిచారు. మరో నేత గోవిందనాయక్ ఈ నియో జకవర్గం నుంచి 1985లో ఇండిపెండెంటుగా, 1994లో టిడిపి పక్షాన, 2004లో టిఆర్‌ఎస్ తరుఫునగెలవగా, తెలంగాణ సాధనలో భాగంగా రాజీనామా చేసిన 16 మంది టిఆర్‌ఎస్ సభ్యులలో ఈయన ఒకరు. కాని 2008 ఉప ఎన్నికలో గెలుపొంద లేకపోయారు. ఖానాపూర్ 1978లో ఏర్పడగా, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు మూడుసార్లు, టిడిపి నాలుగుసార్లు గెలుపొందగా, ఒకసారి ఇండిపెండెంటు, రెండుసార్లు టిఆర్‌ఎస్ ఇక్కడ గెలిచాయి. ఇక్కడ గెలిచిన కె.భీమ్‌రావు గతంలో పి.వి. చెన్నారెడ్డి, జనార్ధనరెడ్డి,కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో పనిచేసారు. భీమ్‌రావు ఇక్కడ ఒకసారి, మూడుసార్లు అసిఫాబాదులో గెలిచారు. ఇక్కడ రెండోసారి గెలిచిన సుమన్‌రాథోడ్ ఆదిలాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన రమేష్‌రాధోడ్ భార్య, రమేష్ గతంలో ఎమ్మెల్యేగా కూడా ఒకసారి గెలుపొందారు. ఆయన జడ్‌పి చైర్మన్ పదవి కూడా నిర్వహించారు.
ఖానాపూర్ ఎస్టిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment