సాక్షి, నిర్మల్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు స్పీడ్ పెంచాయి. అధికార బీఆర్‌ఎస్ పార్టీ తొలి విడతలో భాగంగా అభ్యర్థులను ప్రకటించింది. దీంతో, టికెట్ పొందని అభ్యర్థులు అధిష్టానంపై సీరియస్ అవుతున్నారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలు ఇప్పటికే జంప్ అయ్యారు.
తాజాగా ఖానాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలిపారు. కాగా, రేఖానాయక్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. నా భర్త కూడా కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాను. ప్రజలందరూ నాతో పాటు ఉన్నారు. నాయకులు పోయినంత మాత్రాన నాకు ఏలాంటి నష్టం లేదు. ఓటర్లు మాత్రం నాతోనే ఉన్నారు. నా ప్రాణం ఉన్నంత వరకు వారికి సేవ చేస్తూనే ఉంటాను.
ఎక్కడి నుంచో వచ్చిన నాయకుడికి ఇక్కడి ప్రజలు ఓట్లు వేయరు. ఓటర్లు నాతోనే ఉన్నారు. సదరు వలస నాయకుడిని ప్రజలు ఓడిస్తారు. నా నియోజకవర్గంలో పన్నెండు సంవత్సరాల పాటు ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉన్నాను. నన్ను ఎవరూ ప్రజలు నుండి దూరం చేయలేరు. సరైన సమయంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి తిట్ల పురాణం.. సహనం కోల్పోయి జనంపై చిందులు
Comments
Please login to add a commentAdd a comment