పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. సభలో చర్చించకుండా దాడులకు దిగడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా పార్లమెంట్లో చర్చిద్దామంటూ సూచించారు. పెప్పర్ స్ప్రే చేసి సభ్యులను ఇబ్బంది పెట్టారని అన్నారు. ఎంపీలపై దాడి ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. పార్లమెంట్ను బజారుస్థాయి ఘర్షణకు వేదికగా కాంగ్రెస్ మార్చిందని నామా విమర్శించారు.
ఎంపీలను చంపేందుకు లగడపాటి రాజగోపాల్ కుట్ర పన్నారని మరో టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆరోపించారు. మిరియాల పొడి స్ప్రే చేయడంతో సభలో చాలా మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. లగడపాటిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.