సభలో అసలేం జరిగింది? | this is what happened in loksabha today | Sakshi
Sakshi News home page

సభలో అసలేం జరిగింది?

Published Thu, Feb 13 2014 1:50 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

this is what happened in loksabha today

లోక్సభలో యుద్ధవాతావరణం మధ్య మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం

  • బిల్లు ప్రవేశపెట్టేందుకు స్పీకర్ మూజువాణి పద్ధతిలో అనుమతి తీసుకున్నారు.
  • సభ్యుల ఆందోళనల మధ్యే షిండే పొడిపొడిగా బిల్లును చదివారు. ఆ తతంగం క్షణాల్లోనే ముగిసింది.
  • ఇంతలో స్పీకర్‌ పోడియం వద్ద ఒక్కసారిగా యుద్ధవాతావరణం వాతావరణం నెలకొంది.
  • స్పీకర్‌ వద్ద మైకులను తొలగించేందుకు సీమాంధ్ర ఎంపీలు ప్రయత్నించగా, వారిని అడ్డుకునేందుకు తెలంగాణ ఎంపీలు కలబడ్డారు.
  • ఇరు ప్రాంత ఎంపీల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ నెలకొంది. ఈలోగా లగడపాటి రాజగోపాల్ పెప్పర్‌ స్ప్రే చల్లారు.
  • ఎంపీలు, మీడియా ప్రతినిధులు ఉక్కిరి బిక్కిరై దగ్గుతూ పరుగులు తీశారు.  
  • లోక్సభ సెక్రటరీ బల్లపై ఉన్న ఫైళ్లను మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చిందరవందరగా చేశారు.
  • తెలంగాణ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలపై పిడిగుద్దులు కురిపించారు.
  • వెంటనే స్పీకర్‌ మీరాకుమార్‌ సభను వాయిదా వేశారు.
  • తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినట్టేనని లోక్‌సభ అధికారులు తెలిపారు.
  • లోక్‌సభలో ఘర్షణకు దిగిన ఎంపీలపై చర్యలు ఉంటాయని ఆ తర్వాత హోం మంత్రి షిండే తెలిపారు.
  • తప్పులు చేసిన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కపిల్‌ సిబల్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement