Telangana MPs
-
మంత్రి పదవి ఎవరెవరికి ?
-
పార్లమెంటులో ‘జై తెలంగాణ’
సాక్షి, న్యూఢిల్లీ : 17వ లోక్‌సభ కొలువుదీరిన రెండోరోజు(మంగళవారం) తెలంగాణ ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 17 మంది సభ్యులకుగాను కిషన్‌రెడ్డి సోమవారమే ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన 16 మందిలో పది మంది తెలుగులో, నలుగురు ఇంగ్లిష్‌లో, ఒకరు హిందీలో, మరొకరు ఉర్దూ లో ప్రమాణం చేశారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు(బీజేపీ), పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత(టీఆర్ఎస్) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. జై తెలంగాణ, జైజై భారత్ అంటూ ముగించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్(బీజేపీ) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి, భారత్ మాతా కీ జై అంటూ ముగిం చారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (బీజేపీ) ఆంగ్లంలో దైవసాక్షిగా ప్రమాణం చేసి, భారత్ మాతా కీ జై అంటూ ముగించారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్(టీఆర్ఎస్) హిందీలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి, జై తెలంగాణ అంటూ నినదించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (టీఆర్ఎస్) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి(కాంగ్రెస్) తెలుగులో, తన ఫోన్లో ఉన్న ప్రమాణ స్వీకార ప్రతిని చదివారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి(టీఆర్ఎస్), మహబూబ్‌నగర్ ఎంపీ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి(టీఆర్ఎస్), నల్ల గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(కాంగ్రెస్) ఇంగ్లిష్ లో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. భువనగిరి, నాగర్‌కర్నూలు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్), పోతుగంటి రాములు (టీఆర్ఎస్) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. వెంకట్‌రెడ్డి (కాం గ్రెస్) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేస్తుండగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి బీజేపీలోకి స్వాగతం అంటూ పిలిచారు. వెంకట్‌రెడ్డి తో మంత్రి కిషన్‌రెడ్డి కరచాలనం చేశారు. వరంగల్లు ఎంపీ పసునూరి దయాకర్(టీఆర్ఎస్), మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత (టీఆర్ఎస్) తెలుగు లో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు(టీఆర్ఎస్) తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అసదుద్దీన్ రాకతో హోరెత్తిన నినాదాలు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉర్దూలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు తన స్థానం నుంచి అసదుద్దీన్ వస్తుండగా బీజేపీ సభ్యులు బండి సంజయ్ కుమార్ తదితరులు భారత్ మాతా కీ జై, జై శ్రీరాం, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. మరింత గట్టిగా అరవం డి అంటూ అసదుద్దీన్ చేతులతో సైగ చేశారు. ప్రమాణ స్వీకారాన్ని ముగిస్తూ ‘జై భీమ్, జై మీమ్, తక్బీర్ అల్లా హో అక్బర్, జై హింద్’అంటూ నినదించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసదుద్దీన్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘నన్ను చూడగానే వారికి ఆ నినాదాలు గుర్తొచ్చినందుకు సంతోషం. వారు రాజ్యాంగాన్ని, ముజఫర్‌పూర్ చిన్నారుల మరణాలను కూడా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నా’అంటూ పేర్కొన్నారు. తరలివచ్చిన కుటుంబ సభ్యులు, నేతలు ప్రమాణ స్వీకారానికి ఎంపీల కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గస్థాయి నేత లు తరలివచ్చారు. ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబసభ్యులు, వెంకట్‌రెడ్డి సోదరుడు, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి గ్యాలరీ నుంచి ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఆయన తండ్రి డి.శ్రీనివాస్ రాజ్యసభ సభ్యుల గ్యాలరీ నుంచి వీక్షించారు. నామా, పోతుగంటి కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, సురేందర్‌రెడ్డి,మాణి క్రావు, తదితరులు ఎంపీ బీబీ పాటిల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ లోక్‌సభ స్థానం పరిధి లోని నియోజకవర్గ నేతలు భారీగా తరలివచ్చి కొత్త ప్రభాకర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. -
లోక్‌సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ : 17వ లోక్‌సభలో తెలంగాణకు చెందిన సభ్యులు మంగళవారం ఎంపీలుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. టీఆర్ఎస్ నుంచి 9 మంది, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒక ఎంపీలుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. మొదట పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని ప్రమాణం చేయగా.. ఆ తర్వాత వరుసగా బండి సంజయ్ కుమార్, అరవింద్ ధర్మపురి, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, డాక్టర్ రంజిత్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటిరాములు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పసునూరి దయాకర్, మాలోతు కవిత, నామా నాగేశ్వర్రావు ప్రమాణం చేశారు. వీరిలో కొత్త ప్రభాకర్ రెడ్డి, రాములు, నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వెంకటేశ్ నేత మాతృభాష తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. బీబీ పాటిల్ హిందీలో, అసదుద్దీన్ ఓవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. ఇక అరవింద్ ధర్మపురి, రంజిత్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంగ్లీష్ భాషలో ప్రమాణం చేశారు. -
గాంధీ భవన్లో తెలంగాణ ఎంపీలకు సన్మానం
-
‘కేంద్రంలో తెలంగాణ ఎంపీల పాత్ర కీలకం’
సిరిసిల్ల: లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో తెలంగాణ ఎంపీలు కీలక పాత్ర పోషిస్తారని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జాతీయ పార్టీలు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలు సొంతంగా ప్రభుత్వా న్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు. 35 ఏళ్ల కిందటే కాంగ్రెస్ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసే సామర్థ్యాన్ని కోల్పోయిందని వినోద్‌కుమార్ అన్నారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటమితప్పదన్నారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ వస్తే.. టీఆర్ఎస్ ఎంపీల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. తెలంగాణకు అనేక ప్రయోజనాలు దక్కుతాయని తెలిపారు. -
విప్ గండం నుంచి గట్టెక్కిన ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో సోమవారం తమతమ పార్టీలు జారీచేసిన విప్ గండం నుంచి ముగ్గురు తెలంగాణ ఎంపీలు గట్టెక్కగలిగారు. లోక్‌సభలో జీఎస్టీ బిల్లుకు సంబంధించి ఓటింగ్ కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. అందులో భాగంగానే కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ, టీఆర్ఎస్ పార్టీలు కూడా తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీడీపీ నుంచి మల్లారెడ్డి, వైఎస్సార్ సీపీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఇటీవల టీఆర్ఎస్లో చేరిన సంగతి విదితమే. సాంకేతికంగా ఆ ముగ్గురు ఎంపీలు తాము ఎన్నికల్లో గెలిచిన పార్టీకి చెందిన సభ్యులుగానే లోక్‌సభలో కొనసాగుతున్నారు. అయితే ఏఐడీఎంకే మినహా అన్ని రాజకీయ పార్టీలు జీఎస్టీ బిల్లుకు మద్దతు ప్రకటించడంతో గుత్తా, మల్లారెడ్డి, పొంగులేటిలు విప్ గండం నుంచి తప్పించుకోగలిగారు. కాగా తాను రెండు, మూడు నెలల్లో లోక్‌సభకు రాజీనామా చేస్తానని గుత్తా పార్లమెంట్లో సహచర ఎంపీలకు తెలిపారు. -
ప్రత్యేక హైకోర్టుపై తేల్చండి
లోక్‌సభలో ప్రభుత్వాన్నినిలదీసిన టీఆర్ఎస్ ఎంపీలు గతంలో రాష్ట్రాల విభజన జరిగిన వెంటనే కొత్త హైకోర్టులు ఏర్పాటు చేశారు ప్లకార్డులతో మౌన ప్రదర్శన చేసిన ఎంపీలు న్యూఢిల్లీ: ప్రత్యేక హైకోర్టు అంశంపై వెంటనే తేల్చాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు నిలదీశారు. గతం లో రాష్ట్రాల విభజన జరిగిన వెంటనే హైకోర్టుల విభజన కూడా జరిగిందని... ఇక్కడ మాత్రం జాప్యం చేయడం వెనుక ఏదో దురుద్దేశమున్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. ఈ అంశంపై చర్చించేందుకు టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి మంగళవారం లోక్‌సభలో వాయిదా తీర్మానానికి నోటీసులివ్వగా.. వాటిని స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, కవిత, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎ.ఎస్.ఆర్.నాయక్, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, నగేశ్, వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇదే సమయంలో అటు ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఏపీ ఎంపీలు వెల్‌లో ఆందోళన చేపట్టారు. ఈనేపథ్యంలో 11.30 సమయంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఒక ప్రకటన చేశారు. న్యాయమంత్రితో మాట్లాడాను.. ‘‘ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఈరోజు సభలో ఏ అంశంపై ఆందోళన చేస్తున్నారో.. ఆ విషయంలో ఏపీకి న్యాయం జరుగుతుంది. అన్యాయం జరగనివ్వబోం. అలాగే తెలంగాణ విషయంలోనూ ఇందాకే నేను కేంద్ర న్యాయశాఖ మంత్రితో మాట్లాడాను. ఈ సమస్యకు పరిష్కారం చూపడంలో ఆయన తన పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోం..’’ అని పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం కూడా టీఆర్ఎస్ ఎంపీలు తిరిగి నిరసన కొనసాగించారు. జీరోఅవర్‌లో నిలదీసిన జితేందర్‌రెడ్డి లోక్‌సభలో మధ్యాహ్నం ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత స్పీకర్ జీరో అవర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ అవకాశం ఇవ్వడంతో జితేందర్‌రెడ్డి మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం ఏపీకి, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలి. ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు విభజన జరిగిన రోజునే వేర్వేరు హైకోర్టులు ఏర్పడ్డాయి. కానీ ఇక్కడ ఏదో దురుద్దేశం ఉన్నట్టు కనిపిస్తోంది. గత నాలుగు సెషన్లలో కేంద్రం హామీ ఇచ్చింది, కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మా సీఎం కేసీఆర్ ప్రధానమంత్రిని కూడా కలిశారు. రాష్ట్రపతిని కూడా కలిశారు. అందరూ హామీ ఇచ్చారు. న్యాయవాదులు కూడా ప్రత్యేక హైకోర్టు కోసం ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఉమ్మడి హైకోర్టులో ఉన్న మొత్తం 29 మంది న్యాయమూర్తుల్లో 25 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే. తెలంగాణ వారు న్యాయం విషయంలో వెనకబడి ఉన్నారు. దీన్ని చాలా సార్లు ప్రస్తావించాం. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుంది. ప్రత్యేక హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి..’’ అని జితేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. న్యాయమంత్రితో మాట్లాడతా... దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమాధానమిస్తూ.. ‘‘విభజన అనంతరం ఇరు రాష్ట్రాలకు అనేక సమస్యలు వచ్చాయి. హైకోర్టు ఏర్పాటుపై న్యాయమంత్రితో మాట్లాడతా..’’ అన్నారు. దీనికి టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అభ్యంతరం చెప్పారు. ‘‘సెక్షన్ 31 ప్రకారం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి నోటిఫికేషన్ అవసరం. ఆ నోటిఫికేషన్ రావాలంటే ముందు కేంద్ర కేబినెట్ ఆమోదించాలి. ఇదొక రాజకీయ నిర్ణయం. మా సీఎం ఏపీ హైకోర్టుకూ హైదరాబాద్‌లో వసతులు ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఇంకా జాప్యమెందుకు?’’ అని ప్రశ్నించారు. కాగా, మధ్యాహ్నం ఒంటి గంటకు సభ వాయిదాపడిన అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. -
తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు ఒక్కటైన వేళ
* శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరుపై రాజ్యసభలో కొనసాగిన ఆందోళన సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పేరు పెట్టడంపై రాజ్యసభలో మూడో రోజూ ఆందోళన కొనసాగింది. గురువారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యుడు వి.హనుమంతరావు మాట్లాడుతూ తాను విమానాశ్రయ పేరు మార్పు అంశంపై నోటీసు ఇచ్చానని, మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. సభాపతి స్థానంలో కూర్చున్న ఉప సభాపతి కురియన్ తొలుత నిరాకరించినా, వీహెచ్ పదే పదే కోరడంతో అనుమతించారు. ‘అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఆరేడేళ్ల తరువాత వాళ్లు ఈ పనికి దిగారు. వాళ్లు రాజకీయ ప్రయోజనాలను కాంక్షించే ఈ చర్యకు దిగారు..’ అని వివరించబోతుండగా డిప్యూటీ చైర్మన్ కల్పించుకుని ‘నేను చెప్పేది ఒకసారి వినండి’ అంటూ పలుమార్లు వీహెచ్‌కు సూచించారు. ‘ముందురోజు ఆర్థిక మంత్రి దీనిపై వివరణ ఇచ్చారు. మీరు ఇప్పుడు జీరో అవర్‌లో తిరిగి చర్చించలేరు. అవసరమైతే మీరు మరో నోటీసుతో రండి’ అని కోరారు. అయినప్పటికీ వీహెచ్ వినలేదు. ఆయనకు తోడు ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్, ఎం.ఎ.ఖాన్ తదితర తెలంగాణ ఎంపీలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు కె.చిరంజీవి, కె.వి.పి. రామచంద్రరావు, జేడీ శీలం, ఇతర రాష్ట్రాల ఎంపీలు సైతం పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. పేరును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. దీంతో 11.07 గంటలకు పది నిమిషాలపాటు వాయిదావేశారు. తిరిగి సభ ప్రారంభమైన తరువాత కూడా ఆందోళన కొనసాగింది. ఈ సమయంలోనే టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మాట్లాడుతూ కేంద్రం ప్రజల సెంటిమెంట్లను గౌరవించాలని కోరారు. 12 గంటలకు ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే మళ్లీ ఆందోళనను కొనసాగించారు. సభాకార్యకలాపాలకు అడ్డుతగిలారు. దీంతో సభను 12.30 గంటలకు వాయిదా వేశారు. తిరిగి రెండు గంటలకు సభ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగింది. కాగా సాయంత్రం ఇదే అంశమై ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి స్పెషల్ మెన్షన్ కింద మాట్లాడుతూ తక్షణం శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
హేమాహేమీలకు ప్రత్యర్థుల సవాల్
తెలంగాణ జిల్లాల్లో బరిలో నిలిచిన సీనియర్ నాయకులు గెలుపుకోసం ప్రత్యర్థులతో హోరాహోరీగా పోరాడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన పలువురు ఉద్దండులు ఈ దఫా ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. రాజకీయంలో తలపండిన వీరంతా.. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం చెమటోడుస్తున్నారు. వీరి భవితవ్యం తేలే సమయం దగ్గరపడడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. - సాక్షి నెట్వర్క్ తెలంగాణ జిల్లాలో.. ఎంపీ అభ్యర్ధులు ‘ఫ్యాన్’గాలిలో... ఖమ్మం లోక్‌సభ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల అభ్యర్థుల కన్నా ముందున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అమలుచేసిన సంక్షేమ పథకాలే ఆసరాగా ఆయన ప్రజల్లోకి వెళ్లారు. ముఖ్యంగా ఈయన స్థానికుడు కావడం బాగా కలిసి వచ్చే అంశం. టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు.. వరంగల్, సీపీఐ అభ్యర్థి నారాయణ చిత్తూరు జిల్లాలకు చెందిన వారు కావడం, పొంగులేటి ఖమ్మం వాసి కావడంతో ‘స్థానికత’ అంశం ఓట్లు రాలుస్తుందనే భావనలో ఆయన ఉన్నారు. పార్లమెంటు స్థానం పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్సార్సీపీ బలంగా ఉండడం, వైఎస్ పథకాల వల్ల లబ్ధిపొందిన వారు లక్షల సంఖ్యలో ఉండడం ఈయనకు కలిసివచ్చే అంశం. ఉత్కంఠ పోరులో... తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఎంపీ పొన్నం ప్రభాకర్ రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఆకర్షించారు. కరీంనగర్ ఎంపీ సీటుకు రెండోసారి పోటీ చేస్తున్న ఆయన.. టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్, బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్‌రావు, వైఎస్సార్సీపీ అభ్యర్థి మీసాల రాజిరెడ్డిలతో తలపడుతున్నారు. ఈ సెగ్మెంట్లో 56 శాతం బీసీ ఓటర్లున్నారు. పాత పరిచయాలు, నరేంద్ర మోడీ గాలి తనకు అనుకూలిస్తుందనే ధీమాతో విద్యాసాగర్‌రావు ఉన్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని వైఎస్సార్ సీపీ అభ్యర్థి మీసాల రాజిరెడ్డి ఆశగా ఉన్నారు. అటు... ఇటూ... సిట్టింగ్ ఎంపీ డాక్టర్ వివేకానంద పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ పడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ వైఖరిని నిందించి టీఆర్ఎస్ లో చేరిన వివేక్.. తీరా ఎన్నికలకు ముందు మళ్లీ సొంత గూ టికి చేరి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీఆర్ఎస్ నుం చి విద్యార్థి జేఏసీ నాయకుడు బాల్క సుమన్, టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ శరత్.. వివేక్‌తో పోటీ పడుతున్నారు. రాజకీయ అనుభవంతో పాటు సింగరేణిలో తనకున్న పట్టు, తండ్రి వెంకటస్వామి (కాకా)కి ఉన్న పరిచయాలు, పారిశ్రామికవేత్త కావడం వివేక్‌కు అనుకూలిస్తున్నాయి. ‘వరం’గల్లేనా... టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పదేళ్లపాటు జిల్లాలో చక్రం తిప్పిన కడియం శ్రీహరి ప్రస్తుతం వరంగల్ లోక్‌సభకు టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగారు. లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లోని అన్ని పార్టీల నేతలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఈ సెగ్మెంట్ ఈ పార్టీకి అనుకూలంగానే ఉంటోంది. సిట్టింగ్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యపై వ్యతిరేకత శ్రీహరికి అనుకూలంగా మారవచ్చు. జైపాల్‌కు సవాలే... మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి సుదీర్ఘ విరామం తర్వాత కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తున్నారు. తొలిసారిగా లోక్‌సభ బరిలో బీజేపీ అభ్యర్థిగా నాగం జనార్దన్‌రెడ్డి టీడీపీ మద్దతుతో పోటీ చేస్తుండడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో చేవెళ్లలో జైపాల్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జితేందర్‌రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయనతోనే మళ్లీ పోటీ పడుతున్నారు. జైపాల్‌రెడ్డి ప్రధానంగా మైనార్టీ ఓట్లపై ఆశ పెట్టుకున్నప్పటికీ వైఎస్సార్సీపీ నుంచి హెచ్ఏ రహమాన్ బరిలో ఉండడంతో ఓట్లు చీలే అవకాశం ఏర్పడింది. ఎమ్మెల్యే అభ్యర్థులు సవాలు విసురుతూ... కల్వకుర్తిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డి ప్రత్యర్థి శిబిరాల్లోని గందరగోళాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్ దక్కని నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. వంశీ చందర్ రెడ్డి (కాంగ్రెస్) ఓట్లను కసిరెడ్డి నారాయణరెడ్డి (స్వతంత్ర) భారీగా చీల్చుతున్నారు. టీఆర్ఎస్ టికెట్ దక్కని బాలాజీ సింగ్ అధికారిక అభ్యర్థి జైపాల్ యాదవ్ ఓట్లకు గండికొడుతున్నారు. టీడీపీ శ్రేణులు వలస వెళ్లడంతో బీజేపీ అభ్యర్థి ఆచారి సొంత బలాన్నే నమ్ముకున్నారు. పటిష్ట క్యాడర్‌తో ధీమా... కొత్తగూడెం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా మంచి పేరుంది. కొత్తగూడెంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్న అభిప్రాయం ఉంది. కాగా, కూనంనేని సాంబశివరావు (సీపీఐ) తాజా మాజీ ఎమ్మెల్యే కావడంతో ఆయనపై సహజంగానే కొంత అసంతృప్తి ఉంది. టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న జలగం వెంకట్రావు తన కుటుంబానికి ఉన్న పరిచయాలు, తెలంగాణవాదంపైనే ఆధారపడ్డారు. అయితే ఎన్నికల తర్వాత ఈయన జిల్లాలో ఉండరనే ప్రచారం జరుగుతోంది. ముప్పై ఏళ్లుగా కొత్తగూడెం కేంద్రంగా రాజకీయాల్లో ఉండడం, పటిష్టమైన కేడర్ వనమాకు కలిసి రానున్నాయి. ఆయన వైఎస్సార్సీపీలోకి వచ్చిన తర్వాత కొత్తగూడెంలో కాంగ్రెస్ కనుమరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెమటోడుస్తున్న... తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జనగామలో ఏడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నుంచి వి.శంకరాచారి బరిలో ఉన్నారు. పోటీ ప్రధానంగా కాంగ్రె స్, టీఆర్ఎస్ మధ్యే ఉంది. 1999 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న పొన్నాల పదేళ్లు మంత్రిగా పనిచేశారు. ఇపుడు సొంత నియోజకవర్గంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. తెలంగాణ తెచ్చింది తామేనని చెబుతున్న పొన్నాల ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో జిల్లాలోనే లేకపోవడం టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా మారింది. 2009 ఎన్నికల్లో పొన్నాల కేవలం 236 ఓట్లతోనే గెలిచారు. అప్పటికంటే ఇప్పుడు వ్యతిరేకత పెరగడంతో గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. ‘సిరి’ ఎవరిదో... టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తనయుడు కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం రాష్ట్ర ప్రజలను ఆకర్షిస్తోంది. గతంలో ఇక్కడి నుంచే రెండుసార్లు గెలిచిన కేటీఆర్ పార్టీ కేడర్‌తో సంబంధాలు మెరుగుపరుచుకున్నా రు. కానీ స్థానికేతరుడు కావ డం ప్రతికూలంగా మారింది. ఈ తరుణంలో కేటీఆర్ కాంగ్రె స్ అభ్యర్థి, కేడీసీసీబీ అధ్యక్షు డు కొండూరి రవీందర్రావు, బీజేపీ అభ్యర్థి ఆకుల విజయతో త్రిముఖ పోరు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్ సీపీ తరఫున శ్రీధర్‌రెడ్డి ఇక్కడ పోటీలో ఉన్నారు. సమస్యలతో సహజీవనం చేస్తున్న నేత కార్మికులు ఎవరిని ఆదరిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. సెంటిమెంటే... టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి, క్లాస్ వన్ కాంట్రాక్టర్ కేతిరి సుదర్శన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి ముద్దసాని కశ్యప్రెడ్డితో తల పడుతున్నారు. వైఎస్సార్ సీపీ తరఫున సందమల్ల నరేశ్ ఇక్కడి పోటీలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో ఈటెలకు ఉన్న గుర్తింపు, టీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత నాయకుడనే ప్రచారం ఆయనకు అనుకూలిస్తుండగా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం ఆయనకు ప్రతికూలాంశంగా మారింది. ఓటమి మరచి... 1999, 2004 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి వరుసగా గెలుపొందిన డీఎస్ 2009, 2010 ఉప ఎన్నికల్లో ఓటమి చెందారు. దీంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో నిజామాబాద్ రూరల్‌లో పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. బీజేపీ కూటమి అభ్యర్థి గడ్డం (కేశపల్లి) ఆనందరెడ్డి, వైఎస్సార్ సీపీ నుంచి బొడ్డు(సిర్పూరు)గంగారెడ్డి పోటీలో ఉన్నారు. ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నా ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గట్టెక్కేదెలా... చక్కెర ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్న బోధన్ రాజకీయాలు చివరకు ఎవరిని గట్టెక్కిస్తాయోనన్న చర్చ జరుగుతోంది. 1999 నుంచి వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి నాలుగోసారి బరిలో ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్, టీడీపీలు కూడా దృష్టి సారించాయి. కేసీఆర్ ఇటీవలే భారీ ప్రచారసభ నిర్వహించగా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బోధన్ సభలో ప్రసంగించారు. సుదర్శన్‌రెడ్డికి ఈ దఫా ఎన్నిక సవాల్‌గా మారింది. టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు షకీల్, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, కాటిపెల్లి సుధీప్‌రెడ్డి పోటీలో ఉన్నారు. సురేఖ వర్సెస్ సారయ్య బస్వరాజు సారయ్య మళ్లీ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 1999 నుంచి గెలుస్తూ వస్తున్న ఆయనను ప్రస్తుత ఎన్నికలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. గత మూడు ఎన్నికల్లోనూ సులభంగా గెలిచిన సారయ్యకు ఈసారి గట్టిపోటీ ఎదురైంది. టీఆర్ఎస్ నుంచి మాజీమంత్రి కొండా సురేఖ, బీజేపీ నుంచి రావు పద్మ పోటీలో ఉన్నారు. సారయ్యపై స్వతహాగా ఉన్న వ్యతిరేకతతోపాటు కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఈసారి ఆయనకు పెద్ద సమస్యగా మారాయి. రాజకీయంగా రెండో ఇన్సింగ్ ప్రారంభించిన కొండా సురేఖకు, సారయ్యకు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. వ్యూహ ప్రతివ్యూహాలతో రోజురోజుకు ఇక్కడ సమీకరణలు మారుతున్నాయి. ఇక్కడ 40వేల మందికిపైగా ఉన్న మైనార్టీలు ఎవరికి మద్దతు ఇస్తారనేదానిపైనే వీరి రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఈసారైనా...? ఆర్మూర్ నియోజకవర్గంలో మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి ఈసారి కూడా గట్టి పోటీని ఎదుర్కొంటున్నా రు. 1989 నుంచి 2004 వరకు బాల్కొండ నుంచి నాలుగుసార్లు గెలుపొందిన సురేష్‌రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనతో ఆర్మూరు బాట పట్టా రు. 2009లో ఆర్మూరులో ఓట మి చెందిన ఆయన ఈసారి కూడా అక్కడి నుంచే బరిలో ఉన్నారు. ఆశన్నగారి జీవన్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్మూరులో దూసుకెళ్తున్నారు. టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్ పోటీలో ఉన్నారు. దీంతో త్రిముఖపోరులో సురేష్‌రెడ్డి పరిస్థితి ఏమిటన్న చర్చ సాగుతోంది. నువ్వా... నేనా... మంథనిలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఈసారి గడ్డు పరిస్థితి చవిచూస్తున్నారు. తన చిరకాల ప్రత్యర్థి పుట్ట మధు (టీఆర్ఎస్)తో నువ్వా.. నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. వరుసగా ఇక్కడే మూడు సార్లు గెలిచిన అనుభవం శ్రీధర్ బాబుకు అనుకూలించనుంది. అయితే ఆయన అనుచరుల హల్చల్, అభివృద్ధి పనుల్లో వారిపై అవినీతి ఆరోపణలు రావడం వల్ల కొంత వ్యతిరేకత ఏర్పడింది. టీడీపీ తరఫున కర్రు నాగయ్య, టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థి సునీల్‌రెడ్డి పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ఇద్దరి మధ్యే ఉండవచ్చు. ఈ ఒక్కసారి... తనకు చివరిసారి అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి జగిత్యాల ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఎనిమిదిసార్లు పోటీ చేసి అయిదుసార్లు గెలిచారు. ఎన్టీఆర్, వైఎస్ మంత్రి వర్గా ల్లో పనిచేశారు. ఇపుడు మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలోకి దిగారు. తన పాత ప్రత్య ర్థి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్.రమణతో తలపడుతున్నారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో పోటీకి దిగిన టీఆర్ఎస్ తరఫున డాక్టర్ సంజయ్‌కుమార్ బరిలో ఉండడం తో త్రిముఖ పోటీ తప్పదని విశ్లేషకుల అంచనా. వైఎస్సార్ సీపీ తరఫున కట్టా సంధ్యారాణి పోటీ చేస్తున్నారు. ఎదురీత... తెలుగుదేశం తెలంగాణ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకరరావు పాలకుర్తి నుంచి మళ్లీ బరి లోకి దిగారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు, టీఆర్ ఎస్ నుంచి మరో మాజీ ఎమ్మెల్యే ఎన్.సుధాకర్‌రావు పోటీలో ఉన్నారు. వీరు ముగ్గురూ సీనియర్ నేతలే కావడంతో ఇక్కడ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నా యి. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచిన దయాకర్‌రావు ప్రస్తుత ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. తెలంగాణవాదం బలంగా ఉన్నందున జనం వైఖరిపైనే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ముచ్చెమటలు... 2009లో కామారెడ్డిలో, 2010 ఉప ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో అపజయం పొందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఈసారి మళ్లీ కామారెడ్డి నుంచి తలపడుతున్నారు. టీపీసీసీలో కీలక బాధ్యతలు పొందిన ఆయన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నియోజకవర్గంలో పోటీచేస్తున్న అభ్యర్థులందరూ తెలంగాణ నినాదం వినిపిస్తుండగా, తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ షబ్బీర్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. బీజేపీ,టీడీపీ కూటమి అభ్యర్థి సిద్ధిరాములు, వైఎస్సార్ సీపీ నుంచి పైలా కృష్ణారెడ్డి ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. అధిగమిస్తేనే... డిప్యూటీ స్పీకర్ హోదాలో మధిర అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మల్లుభట్టి విక్రమార్క ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందనే భావనలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌కు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తుండగా, నల్లగొం డ జిల్లా నుంచి వలస వచ్చిన మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ, సీపీఎం రెండూ నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల కేడర్ కలిసి పనిచేస్తే కమల్‌రాజ్ విజయం నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు. గట్టి పోటీ ఖమ్మం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన కూరాకుల నాగ భూషణ (వైఎస్సార్సీపీ), పువ్వాడ అజయ్‌కుమార్ (కాంగ్రెస్) నుంచి గట్టిపోటీ ఎదురవుతోం ది. టీఆర్ఎస్ నుంచి పోటీచేస్తున్న గుండాల కృష్ణ (ఆర్జేసీ) చాపకింద నీరులా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్, జగన్ అభిమానులతో పాటు పటిష్టంగా ఉన్న వైఎస్సార్ సీపీ కేడర్, బీసీ వర్గాలకు చెందిన ఓట్లపై కూరాకుల ఆశలు పెట్టుకోగా, తన తండ్రి ఛరిష్మా, కాంగ్రెస్ కేడర్‌ను నమ్ముకుని అజయ్ ముందుకెళ్తున్నారు. కలిసొచ్చేనా... తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన శ్రీనివాస్‌గౌడ్‌ను మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ నిలబెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి (బీజేపీ), ఒబేదుల్లా కొత్వాల్ (కాంగ్రెస్), బెక్కరి శ్రీనివాస్‌రెడ్డి (వైఎస్సార్సీపీ) నడుమ బహుముఖ పోటీ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు. తెలంగాణ వాదంపైనే శ్రీనివాస్‌గౌడ్ ఆశలు పెట్టుకున్నారు. 2012 ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెన్నంకు మద్దతు ఇచ్చిన వర్గాలు ప్రస్తుతం దూరంగా ఉండడం కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. తెలంగాణవాదంపైనే వైరా నుంచి గత శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన బానోతు చంద్రావతికి ఈసారి సీపీఐ టికెట్ ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగారు. ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నా పరిపూర్ణ రాజకీ య నాయకురాలు కాలేకపోవడం ఈమెకు మైనస్‌పాయింట్. తెలంగాణవాదంపైనే ఆమె ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ వైఎస్సార్సీపీ నుంచి బరిలో ఉన్న బానోతు మదన్‌లాల్‌పై కూడా ప్రజల్లో మంచి అభిమానం ఉంది. టీడీపీ అభ్యర్థి బాలాజీనాయక్ ప్రచారంలో శ్రమిం చారు. సీపీఐ నుంచి బరిలో ఉన్న మూడు నారాయణకు కాం గ్రెస్ కేడర్ ఏ మేరకు సహకరిస్తుందనే అనుమానాలున్నాయి. నోముల గండం నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి జానారెడ్డికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి మల్లు రవీందర్‌రెడ్డి వైఎస్ అభిమాన ఓటుపై ఆశలు పెట్టుకోగా టీడీపీ అభ్యర్థి కడారి అంజయ్య యాదవ్ సొంత ఓటుబ్యాంకునే నమ్ముకుంది. ఇక్కడ బీసీ, ఓసీ ఫీలింగ్ తీసుకొచ్చి ఓట్లను చీల్లే ప్రయత్నం విజయవంతంగా సాగుతుండడంతో జానారెడ్డి ఒకింత గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. మొత్తంగా గట్టి పోటీ ఎదుర్కొంటున్న జానారెడ్డి స్వతహాగా తనపై ఉన్న వ్యతిరేక ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తమ్‌కు చెమటలు హుజూర్నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి రూపంలో పెద్ద గండమే పొంచి ఉంది. కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి కాసోజు శంకరమ్మ సెంటిమెంటు ఓటుపై ఆధారపడుతుండగా వైఎ స్సార్సీపీ వైఎస్ అందించిన అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్న వారి ఓట్లపై నమ్మ కం పెట్టుకుంది. టీడీపీ అభ్యర్థి వంగాల స్వామిగౌడ్ ఉనికికోసం పాకులాడుతుండగా అభివృద్ధి ఎజెండాతో కాంగ్రెస్ ముందుకెళ్తోంది. నియోజకవర్గంలో పరిష్కారం కాని సమస్యలు మాజీ మంత్రికి ప్రతికూలంగా మారాయి. -
టికాంగ్ ఎంపీ అభ్యర్థుల ఖరారు
-
ఆత్మీయ సమ్మేళనంలో కేకపుట్టించిన టిఎంపిలు
-
రేణుకా చౌదరిని తొలగించాలని లేఖ
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి తెలంగాణ ప్రాంత ఎంపీలు లేఖ రాశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నుంచి రేణుకా చౌదరిని తొలగించాలని వారు తమ లేఖలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని కించపరిచేలా రేణుకా చౌదరి మాట్లాడారని టీ.ఎంపీలో పేర్కొన్నారు. మరోవైపు రేణుకా చౌదరిని ఎన్నికల కమిటీ సభ్యురాలిగా నియమించడం పట్ల ఎంపీలు మండిపడుతున్నారు. రేణుక తెలంగాణ ద్రోహి అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరుస్తూ మాట్లాడిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి ఆమెను ఎన్నికల కమిటీలో సభ్యురాలిగా ఎలా నియమిస్తారని కమిటీని ప్రశ్నించారు. గత కొంతకాలంగా రేణుకా చౌదరి వ్యవహార శైలిపై తెలంగాణ ప్రాంత ఎంపీలు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలో తెలంగాణ పీసీసీ ఎన్నికల సమావేశంలోనే ఈ విషయంపై తెలంగాణ ప్రాంత ఎంపీలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
సభలో అసలేం జరిగింది?
లోక్‌సభలో యుద్ధవాతావరణం మధ్య మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం బిల్లు ప్రవేశపెట్టేందుకు స్పీకర్ మూజువాణి పద్ధతిలో అనుమతి తీసుకున్నారు. సభ్యుల ఆందోళనల మధ్యే షిండే పొడిపొడిగా బిల్లును చదివారు. ఆ తతంగం క్షణాల్లోనే ముగిసింది. ఇంతలో స్పీకర్ పోడియం వద్ద ఒక్కసారిగా యుద్ధవాతావరణం వాతావరణం నెలకొంది. స్పీకర్ వద్ద మైకులను తొలగించేందుకు సీమాంధ్ర ఎంపీలు ప్రయత్నించగా, వారిని అడ్డుకునేందుకు తెలంగాణ ఎంపీలు కలబడ్డారు. ఇరు ప్రాంత ఎంపీల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ నెలకొంది. ఈలోగా లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లారు. ఎంపీలు, మీడియా ప్రతినిధులు ఉక్కిరి బిక్కిరై దగ్గుతూ పరుగులు తీశారు. లోక్‌సభ సెక్రటరీ బల్లపై ఉన్న ఫైళ్లను మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చిందరవందరగా చేశారు. తెలంగాణ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలపై పిడిగుద్దులు కురిపించారు. వెంటనే స్పీకర్ మీరాకుమార్ సభను వాయిదా వేశారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినట్టేనని లోక్‌సభ అధికారులు తెలిపారు. లోక్‌సభలో ఘర్షణకు దిగిన ఎంపీలపై చర్యలు ఉంటాయని ఆ తర్వాత హోం మంత్రి షిండే తెలిపారు. తప్పులు చేసిన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కపిల్ సిబల్ అన్నారు. -
మెత్తబడ్డ సీమాంధ్ర ఎంపీలు
న్యూఢిల్లీ: రెండున్నర గంటల పాటు సాగిన కాంగ్రెస్ వార్ రూమ్ సమావేశం ముగిసింది. కీలక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉభయ సభలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కాంగ్రెస్ పెద్దలు కోరారని తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు తెలిపారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందని ఆ ప్రాంత ఎంపీలు నమ్మకం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టవద్దని కోరామని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. బిల్లు పెడితే వ్యతిరేకంగా ఓటెస్తామని చెప్పారు. బిల్లు పెడితే తమ సత్తా చూపుతామని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. సభను క్షణం కూడా నడవనీయబోమన్నారు. అయితే వార్ రూమ్ భేటీ చాలా బాగా జరిగిందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. సమావేశంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారని వెల్లడించారు. సీమాంధ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేసేలా తెలంగాణ బిల్లు ఉంటుందన్నారు. సీమాంధ్రుల సమస్యలపై దిగ్విజయ్, జైరాం రమేష్ హామీయిచ్చినట్టు తెలిసింది. విద్య, ఉపాధి, ఆరోగ్యం, పోలవరం, వనరుల పంపిణీ అంశాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం. దీంతో సీమాంధ్ర ఎంపీలు కాస్త మెత్తబడినట్టు ప్రచారం జరుగుతోంది. -
లగడపాటి ఆస్తులపై విచారణ చేయాలి
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు 8వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను రీషెడ్యూల్ చేయడంపై చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌కు, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. రాజస్థాన్‌లో సోలార్ కుంభకోణంపై విచారణ చేయాలని, అలాగే లగడపాటి లాంటి వారి ఆస్తులపై విచారణ చేయాలని వారు డిమాండ్ చేశారు. లగడపాటి లాంటివారు అవినీతితో సంపాదించిన డబ్బుతోనే తమపై పెత్తనం చేయాలని చూస్తున్నారని వారు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకుంటున్నామని సీమాంధ్ర ఎంపీలు చెప్పడం అవివేకమని, అసలు వాళ్లు ఇప్పటివరకు సీడబ్ల్యుసీ, జీవోఎం, తెలంగాణపై కేబినెట్.. ఇలా ఏ ఒక్కదాన్నీ అడ్డుకోలేకపోయారని, ఇక రాష్ట్ర ఏర్పాటును ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. -
లోక్‌సభ మళ్లీ వాయిదా
-
లోక్‌సభ మళ్లీ వాయిదా
లోక్‌సభలో వాయిదాల పర్వం శుక్రవారం కొనసాగుతుంది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్‌సభ తిరిగి ప్రారంభమైంది. దాంతో అటు సీమాంధ్ర ఎంపీలు,ఇటు తెలంగాణ ఎంపీలు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. తమ తమ ప్రాంతాలకు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తుంన్నారు. ఇరుప్రాంతాల ఎంపీలకు నచ్చ చెప్పేందుకు స్పీకర్ ప్రయత్నించారు. ఎంపీలు ఎంతకు తమ పంతాలను విడకపోవడం, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులతోపాటు బీజేపీ సభ్యులు జస్టిస్ గంగూలీని పదవి నుంచి తొలగించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశాయి. దాంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో మధ్యాహ్నం 1.00 గంట వరకు వాయిదా వేసినట్లు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. -
అవిశ్వాసం అంటే తల్లి శవాన్ని కోరుకోవడమే: టీ ఎంపీలు
యూపీఏ సర్కారు మీద సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై తెలంగాణ ప్రాంత ఎంపీలు మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం అనైతికమని, మందా జగన్నాథం అన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారని, అప్పట్లో సీమాంధ్ర ఎంపీలు కూడా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారని, ఇక రేపో, ఎల్లుండో రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే రాజీనామా చేయాలని, విభజన వల్లే రెండు రాష్ట్రాలకు లాభం జరుగుతుందని మరో ఎంపీ వివేక్ అన్నారు. కాగా, సొంత పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అంటే తల్లి శవాన్ని కోరుకోవడమేనని, సోనియాగాంధీపై అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలని ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, పొన్నం ప్రభాకర్ అన్నారు. సమన్యాయం ఏమిటో చంద్రబాబు చెప్పాలని వాళ్లు డిమాండ్ చేశారు. -
తెలంగాణ ఎంపీల మధ్య జల వివాదం
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు ముందే తెలంగాణ ఎంపీల మధ్య జల వివాదం రాజుకుంది. కంతాన పల్లి ప్రాజెక్టు డిజైన్ వ్యవహారంకు సంబంధించి టీ. ఎంపీల మధ్య రగడ మొదలైంది. ఎంపీ పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్వాయి గోవర్థన్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్యల మధ్య వివాదం చోటు చేసుకుంది. గత కొన్నిరోజుల నుంచి కంతాన పల్లి ప్రాజెక్టు డిజైన్ పై వ్యతిరేకిత వ్యక్తం చేస్తున్నఎంపీ పాల్వాయి తిరిగి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కంతానపల్లి ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే కేంద్రాన్ని డిజైన్ మార్చాలని కోరినట్లు పాల్వాయి తెలిపారు. ఆ డిజైన్ వల్ల ఒక్క చుక్క నీరు కూడా ఉపయోగపడదని తెలిపారు. కాగా, ఇప్పడున్న డిజైన్ తో లాభం చేకూరందని సిరిసిల్ల వ్యాఖ్యానించారు. దీంతో ఇరువురి మధ్య అభిప్రాయబేధాలు చవిచూశాయి. గత కొన్ని రోజుల నుంచి కంతానపల్లి ప్రాజెక్టు డిజైన్ తో పాటు, పోలవరం ప్రాజెక్టు , దమ్ముగూడెం ప్రాజెక్టు డిజైన్లపై ఎంపీ పాల్వాయి వ్యతిరేకిస్తూవస్తున్నారు. తాజాగా మరోమారు కంతానపల్లి ప్రాజెక్టు డిజైన్ ను పాల్వాయి వ్యతిరేకించడంపై రాజయ్య సమావేశం నుంచి లేచివెళ్లిపోయారు. -
దిగ్విజయ్‌కు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల లేఖ
దిగ్విజయ్‌సింగ్‌కు లేఖ రాసిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు లేఖ రాశారు. ఏపీఎన్జీవోల సభ సజావుగా జరగకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న తెలంగాణ ఎంపీలను నియంత్రించాలని లేఖలో కోరారు. జాగో, బాగో ప్రకటనలతో టీఆర్ఎస్ నాయకులు ఉద్రిక్తతలు తెస్తున్నారని దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమ సభకు రాజకీయ నాయకులను ఆహ్వానించలేదని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. ఏపీఎన్జీవోలు తలపెట్టిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' అవగాహన సదస్సుకు విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమైక్యవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కేవలం స్టేడియం లోపలికి ఉద్యోగులకే అనుమతి ఉన్నందున ప్రాంగణం బయట ఉండి సంఘీభావం ప్రకటించాలని కోరారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
ఉండవల్లి ప్రసంగాన్ని అడ్డుకున్న టీ.ఎంపీలు
న్యూఢిల్లీ : సీమాంధ్రలో ఉదృతంగా సాగుతోన్న సమైక్య ఉద్యమాన్ని గురించి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం లోక్‌సభలో ప్రస్తావించారు. ఆయన తన ప్రసంగంలో ముల్కీ నిబంధనల అంశాన్ని ప్రస్తావించడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉండవల్లి ప్రసంగాన్ని వారు అడ్డుకున్నారు. సీమాంధ్ర ఉద్యమం దేశంలోనే పెద్దదని ఉండవల్లి అన్నారు. రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని విడదీయటం చరిత్రలో ఇదే మొదటిసారి అని తెలిపారు. ఈ నేపథ్యంలో సభ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుండటంతో టి కాంగ్ ఎంపీలను కూర్చోవాలని స్పీకర్ మీరాకుమార్ కోరారు. దీంతో గొడవ సద్దు మణిగింది. -
‘ఎకో టూరిజం ప్రాజెక్టును రద్దు చేయండి’
హెదరాబాద్ సమీపంలోని 274 ఎకరాలను ఎకో టూరిజం ప్రాజె క్టుకు బదలాయించకుండా చూడమని 12 మంది తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రధాని మన్మోహన్సింగ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. కొత్తగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో 274 ఎకరాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఎకో టూరిజం ప్రాజెక్టుకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. -
హస్తినలో వేడెక్కుతున్న రాష్ట్ర రాజకీయం
ఒకవైపు వర్షాలతో అంతా చల్లగా ఉంటే, హస్తినలో మాత్రం రాష్ట్ర రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులు, ఎంపీలు కలిసి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఇంట్లో సమావేశమయ్యారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో, సభలో వ్యవహరించాల్సిన తీరుపై వారు చర్చించినట్లు సమాచారం. సోమవారం సభలో సీమాంధ్ర ఎంపీలు తీవ్రస్థాయిలో ఆందోళన చేయడం వల్లే సభ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే మంగళవారానికి వాయిదాపడిన విషయం తెలిసిందే. ఉభయ సభల్లోనూ కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు ఒత్తిడి వ్యూహాన్ని పటిష్ఠంగా అమలుచేయడంతో ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభ కూడా వాయిదా పడ్డాయి. అందువల్ల, మంగళవారం కూడా సభలో గట్టిగా ఒత్తిడి తేవాలని, అవసరమైతే అసలు తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కూడా వీల్లేకుండా అడ్డుకోవాలని వారు చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఎంపీల వ్యూహాలకు దన్నుగా తమవంతు పాత్ర పోషించేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, సాకే శైలజానాథ్, కోండ్రు మురళీమోహన్ హస్తిన పయనమయ్యారు. హస్తినలో అధిష్ఠానం పెద్దల వద్ద మరోసారి తమ వాదన గట్టిగా వినిపించాలని వీరు భావిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉధృతంగా సాగుతున్న నిరసనల వివరాలను వారికి వివరించాలని అనుకుంటున్నారు. కనీసం సెల్ఫోన్లు రీచార్జి చేయించుకోడానికి కూడా దుకాణాలు తెరవట్లేదంటే ఆగ్రహం ఎంత తీవ్రస్థాయిలో ఉందో చూడాలని సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు మంత్రులకు ముందే చెప్పి పంపించినట్లు సమాచారం. జైపాల్ ఇంట్లో టీ-ఎంపీలు ఇలా ఉంటే, మరోవైపు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు కూడా హస్తినలో వ్యూహరచన సిద్ధం చేసుకుంటున్నారు. కేంద్రం తెలంగాణ ప్రక్రియను ప్రారంభించిందని, ఆ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ఒక ప్రకటన కూడా చేయడంతో కాస్త సంతోషంగానే ఉన్నా, సీమాంధ్ర ఎంపీలు సభను అడ్డుకుంటున్న తీరు చూసి కాస్త ఆందోళన చెందారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలని వారంతా నిర్ణయించారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నేతృత్వంలో ఈ మేరకు తగిన వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నారు. సభలో తమ సొంత పార్టీకే చెందిన సీమాంధ్ర ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు తాము ఎలా వ్యవహరించాలన్న విషయంపై కూడా వారు చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఇరు ప్రాంతాలకు చెందిన పార్లమెంటు సభ్యులు వ్యూహ ప్రతివ్యూహాలు రచించుకుంటూ ఢిల్లీ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు.