దిగ్విజయ్కు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల లేఖ
దిగ్విజయ్‌సింగ్‌కు లేఖ రాసిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు లేఖ రాశారు. ఏపీఎన్జీవోల సభ సజావుగా జరగకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న తెలంగాణ ఎంపీలను నియంత్రించాలని లేఖలో కోరారు. జాగో, బాగో ప్రకటనలతో టీఆర్‌ఎస్ నాయకులు ఉద్రిక్తతలు తెస్తున్నారని దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమ సభకు రాజకీయ నాయకులను ఆహ్వానించలేదని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు.
ఏపీఎన్జీవోలు తలపెట్టిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' అవగాహన సదస్సుకు విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమైక్యవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కేవలం స్టేడియం లోపలికి ఉద్యోగులకే అనుమతి ఉన్నందున ప్రాంగణం బయట ఉండి సంఘీభావం ప్రకటించాలని కోరారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.