digivjay singh
-
ప్రజల ఖాతాల్లోకి 15 లక్షలు ఎప్పుడు..?
న్యూఢిల్లీ: విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షల చొప్పున జమ చేస్తామని బీజేపీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. తాజగా నల్లధన వెల్లడి పథకంలో భాగంగా తొలిసారిగా దేశంలో రూ. 65 వేల కోట్ల బ్లాక్‌మనీ వెలుగులోకి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజల ఖాతాల్లో రూ. 15 లక్షల చొప్పున నరేంద్రమోదీ ప్రభుత్వం ఎప్పుడు జమచేయబోతున్నదని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. ‘కేంద్ర ఆర్థికమంత్రికి అభినందనలు. జన్‌ధన్ యోజన కింద ప్రజల ఖాతాల్లో డబ్బు బదిలీ చేయడం ఆయన ప్రారంభించాలి. లేకుంటే మోదీ, బీజేపీ హామీ ఉట్టిదేనా?’ అంటూ దిగ్విజయ్ ట్వీట్ చేశారు. ఆదాయ వెల్లడి పథకం కింద రూ. 65,250 కోట్ల నల్లధనం వెలుగులోకి వచ్చిందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక సర్జికల్ దాడులు నిర్వహించిన సైన్యాన్ని అభినందించిన దిగ్విజయ్.. 1971లో పాకిస్థాన్ ను రెండుగా విడదీసిన ఇందిరాగాంధీ చర్య కంటే.. ఈ సర్జికల్ దాడులు తీవ్రమైనవా? అని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
దిగ్విజయ్‌కు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల లేఖ
దిగ్విజయ్‌సింగ్‌కు లేఖ రాసిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు లేఖ రాశారు. ఏపీఎన్జీవోల సభ సజావుగా జరగకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న తెలంగాణ ఎంపీలను నియంత్రించాలని లేఖలో కోరారు. జాగో, బాగో ప్రకటనలతో టీఆర్ఎస్ నాయకులు ఉద్రిక్తతలు తెస్తున్నారని దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమ సభకు రాజకీయ నాయకులను ఆహ్వానించలేదని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. ఏపీఎన్జీవోలు తలపెట్టిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' అవగాహన సదస్సుకు విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమైక్యవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కేవలం స్టేడియం లోపలికి ఉద్యోగులకే అనుమతి ఉన్నందున ప్రాంగణం బయట ఉండి సంఘీభావం ప్రకటించాలని కోరారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
పదవులను పట్టుకునే ఉంటారా?
ఢిల్లీలో బొత్సకు సమైక్య సెగ మీడియా సమావేశంలోకి చొచ్చుకొచ్చిన విద్యార్థులు, విశాలాంధ్ర మహాసభ నేతలు నెలరోజులుగా ఉద్యమం జరుగుతున్నా పట్టించుకోరేమని మండిపాటు సమైక్యం కోసం 30 కాదు.. మూడు వేల రోజులు ఉద్యమించాల్సి వస్తుంది: బొత్స చంద్రబాబు గుంటనక్క అని విమర్శ సాక్షి, న్యూఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఢిల్లీలో విభజన సెగ తగిలింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన బొత్స మంగళవారం మధ్యాహ్నం ఏపీభవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కొద్దిసేపటికే శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ విద్యార్థులు, విశాలాంధ్ర మహాసభ నేతలు సమావేశ మందిరంలోకి చొచ్చుకువచ్చి, విజయనగరంలో విద్యార్థులపై జరిగిన దాడికి జవాబు చెప్పాలంటూ బొత్సను నిలదీశారు. ‘‘విద్యార్థులను మీరే కొట్టించారు. మీ అనుచరులే దాడులు చేశారు. ప్రజల పక్షాన ఉండాల్సిన మీరు ఏం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజలు నెల రోజులుగా ఉద్యమిస్తున్నా స్పందించరా? పదవులు పట్టుకునే వేలాడతారా? అంటూ నిలదీశారు. బొత్స స్పందిస్తూ.. ‘‘సీమాంధ్ర వారంతా సమైక్యం కోరుకుంటున్నారు. మేమూ మా ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర సమైక్యం కోసం ముైప్పై రోజులు కాదు.. 3,400 రోజులు పోరాడే రోజులు వస్తాయి. తెలంగాణవారు 10 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. వారిలా ఓపిక ఉండాలి’’ అని అన్నారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే చంద్రబాబు యాత్రల పేరిట ప్రజలను మోసగించేందుకు బయల్దేరారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా సోనియా పెంపుడు కుక్కలంటూ బాబు చేసిన విమర్శలపై మండిపడ్డారు. ‘‘పెంపుడు కుక్కలకు విశ్వాసం ఉంటుంది. అవి గుర్తించిన పార్టీకి, ఓటిచ్చిన ప్రజలకు విశ్వాసంగా ఉంటాయి. మరి గుంటనక్కలు అలా ఉండవు. అవి పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడుస్తాయి. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను మరిచి యాత్రలు చేస్తాయి’’ అని విరుచుకుపడ్డారు. ‘‘సమైక్యమే కావాలని పార్టీలు వుళ్లీ లేఖలు ఇస్తే కాంగ్రెస్ తన నిర్ణయూన్ని వూర్చుకునే అంశంపై ఆలోచిద్దాం’’ అని బొత్స ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. -
ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న టీఆర్ఎస్ నేత చంద్రశేఖర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్ర సమితి సీని యర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు ఏ.చంద్రశేఖర్ ఎట్టకేలకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి వల్లే తాను పార్టీకి రాజీ నామా చేస్తున్నట్లు గత వారం ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భావం అనంతరం 2004 ఎన్నికలకు ముందు ఏసీఆర్ టీఆర్ఎస్లో చేరారు. 2004 ఎన్నికల్లో గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. తెలంగాణపై కాంగ్రెస్ నాన్చుడు ధోరణి ప్రదర్శించడం తో పదవికి రాజీనామా చేసిన ఏసీఆర్.. 2008 ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ ఓట మిపాలయ్యారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో కీలక భూమి క పోషించారు. తెలంగాణ ఇస్తే.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ ఇచ్చిన మాట తప్పడంతో తాను ఆవేదనతో పార్టీని వీడుతున్నట్లు ప్రకటించా రు. తాజాగా ఆయన చేరికతో కాంగ్రెస్ లో, ముఖ్యంగా వికారాబాద్ రాజకీయాల్లో సమీకరణాలు మారనున్నాయి.