Seemandhra Congress MPs
-
సీమాంధ్ర ఎంపీలవి తప్పుడు హామీలు: ఆజాద్
తమ పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపీలు తప్పుడు హామీలు ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఏసీసీసీ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలంతా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని చెప్పారని, కానీ తాము నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్లు వెనక్కి తగ్గారని ఆయన అన్నారు. తెలుగు దేశం పార్టీ రాతపూర్వకంగా తాము విభజనకు అనుకూలమని చెప్పిందని, తమ పార్టీ వాళ్లు మాత్రం సహకరించలేదని ఆయన అన్నారు. -
నేటి నుంచి ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల దీక్ష
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లును ఓడించాలని కోరుతూ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో 3, 4 తేదీలలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తలపెట్టిన‘సంకల్ప దీక్ష’కు పోలీసుల అనుమతి లభించింది. అసెంబ్లీ మలివిడత సమావేశాలు కూడా ప్రారంభమవుతుండటంతో దీక్షకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురువారం ధర్నాచౌక్, తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియపై ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌కు అవగాహన లేదని అందుకే అసెంబ్లీలో ఓటింగ్ ఉండదని చెపుతున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని యుూపీఏ ప్రభుత్వం ప్రజావిశ్వాసాన్ని కోల్పోరుుందని, అది ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగేందుకు వీల్లేదన్నారు. శాసనసభలో సభ్యులందరూ సమైక్యానికి వుద్దతుగా వూట్లాడాలని, సవరణలపై ఓటింగ్‌కు పట్టుబట్టాలని కోరారు. సంకల్ప దీక్షలో ఎంపీలు హర్షకుమార్, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, రాయపాటి సాంబశివరావు, సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్‌లు పాల్గొంటున్నారు. అనుమతి రద్దు చేయాలి: సీమాంధ్ర ఎంపీల సంకల్పదీక్షకు అనుమతి రద్దు చేయాలని తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. లేదంటే దీక్షను అడ్డుకుంటామని, జరిగే పరిణామాలకు సర్కారే బాధ్యత వహించాలని సంఘం అధ్యక్షుడు ఒద్యారపు రవికుమార్ హెచ్చరించారు. -
సీమాంధ్ర ఎంపీలు తీవ్రవాదులు: రాజయ్య
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీమాంధ్ర ఎంపీలపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తీవ్రవాదులని సిరిసిల్ల రాజయ్య అన్నారు. సీమాంధ్ర ప్రజలను ఎంపీలు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల భుజాలపై తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిని తమ ప్రాంతంలో అడుగు పెట్టనీయబోమన్నారు. తెలంగాణ టీడీపీ మేలుకోకుంటే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే కేంద్రం నిర్ణయం ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు టీడీపీ ఎంపీలు చేయని ప్రయత్నం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ నేతలు టీడీపీని వదిలి రావాలని సూచించారు. టీడీపీ ఎంపీలు వైఎస్సార్ సీపీతో కల్సిపోయారని అన్నారు. సీమాంధ్ర ఎంపీలు స్వార్థపరులు అంటూ దుయ్యబట్టారు. బీజేపీతో టీడీపీ ఎంపీలు మంతనాలు జరుపుతున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం అనైతికమని మందా జగన్నాథం విమర్శించారు. మావి త్యాగాలు, వారివి భోగాలు అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందే సమయంలో సీమాంధ్ర ఎంపీలు రచ్చ చేయడం మంచిది కాదన్నారు. -
అద్వానీని కలిసిన సీమాంధ్ర ఎంపీలు
న్యూఢిల్లీ: సొంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరారు. సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును మనోహర్ జోషితో కలిసి అద్వానీ దీన్ని పరిశీలించారు. ఇందులో తెలంగాణ పేరు లేనందున అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని సీమాంధ్ర ఎంపీలకు అద్వానీ హామీయిచ్చారు. సుష్మా స్వరాజ్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వారికి తెలిపారు. మరోవైపు మధ్యాహ్నం 2.15 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని 9 సీమాంధ్ర ఎంపీలు కలవనున్నారు. ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న ప్రణబ్ ముఖర్జీకి శుభాకాంక్షలు తెలిపి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎంపీలు కోరనున్నారు. రెబల్ ఎంపీలతో పాటు కనుమూరి బాపిరాజు, అనంత వెంకట్రామిరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాష్ట్రపతిని కలవనున్నారు. -
సస్పెన్షన్లకు భయపడం: ఎంపీ హర్షకుమార్
న్యూఢిల్లీ : సస్పెన్షన్లకు తాము భయపడేది లేదని అమలాపురం కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలు వాయిదా అనంతరం ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినందునే తాము యూపీఏ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పోరాటం చేస్తున్నామన్నారు. పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని హర్షకుమార్ స్పష్టం చేశారు. పార్టీలోనే ఉండే తాము పోరాటం చేస్తామన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందనే నమ్మకం ఉందని... అన్నిపార్టీలు తమకు మద్దతు ఇస్తాయని హర్షకుమార్ ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని అందరి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తాము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదని....యూపీఏ నిర్ణయానికి వ్యతిరేకం అన్నారు. తాము అన్నింటికి సిద్ధపడే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఆరుగురు ఎంపీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఏఐసీసీ ప్రతినిధి పీసీ చాకో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక సీమాంధ్ర ఎంపీలపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల విమర్శలపై హర్షకుమార్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియాగాంధీని టీఆర్ఎస్ నేతలు తిట్టినప్పుడు తెలంగాణ మంత్రులు ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నాడు క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు....నేడు తమ క్రమశిక్షణను అడగటం సరికాదన్నారు. టీఆర్ఎస్లోకి వెళ్లిన మందా జగన్నాధం, వివేక్‌పై ఏం చర్యలు తీసుకున్నారని హర్షకుమార్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నించిన ఎంపీ రాజయ్య తమను ప్రశ్నించే హక్కు లేదన్నారు. 2004లో ఎమ్మెస్సార్‌పై పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ తమను విమర్శించటమా అన్నారు. -
6 కాంగ్రెస్ ఎంపీలపై వేటుకు రంగం సిద్ధం!
-
అవిశ్వాస తీర్మానానికి మద్దతు: బీజేడీ
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని బిజు జనతా దళ్(బీజేడీ) ప్రకటించింది. సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో చర్చకు వస్తే తమ మద్దతు ఉంటుందని బీజేడీ ఎంపీ జయ పాండా తెలిపారు. తెలంగాణ, సీమాంధ్ర అంశాలు తమకు సంబంధంలేదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకమని చెప్పారు. ఒడిశా ప్రజలు యూపీఏ సర్కారు కొనసాగాలని కోరుకోవడం లేదన్నారు. తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రానికి యూపీఏ ప్రభుత్వం అరకొర సాయం అందించి చేతులు దులుపుకుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశానికి చేసింది కూడా ఏమీ లేదని జయ పాండా అన్నారు. లోక్‌సభలో బీజేడీకి 14 మంది ఎంపీలున్నారు. -
ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలపై వేటుకు రంగం సిద్ధం!
న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానం పెట్టిన ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలపై వేటుకు రంగం సిద్ధమైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిపై వేటు వేయనున్నట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో తెలిపారు. పార్లమెంట్ లో సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గదన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు లభించదని చాకో వ్యాఖ్యానించారు. ఎవరూ ముందస్తు ఎన్నికలు కోరుకోవటం లేదని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతో ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు.. సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు అందించారు. కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎ.సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్ సోమవారం ఉదయం ఈమేరకు స్పీకర్ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. -
కిరణ్ పార్టీలోకి సీమాంధ్ర రెబల్ ఎంపీలు?
హైదరాబాద్: అధిష్టానంపై తిరుగుబాబు బావుటా ఎగురవేసిన ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టనున్న పార్టీలో చేరనున్నారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ వార్త ప్రచురించింది. ఈ విషయం తెలిసే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ రేపు హైదరాబాద్‌కు వస్తున్నారని వెల్లడించింది. కిరణ్ కొత్త పార్టీకి సంబంధించిన సమాచారంపై సింగ్ ఆరా తీస్తున్నట్టు తెలిపింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు ఆరుగురు సీమాంధ్ర ఎంపీలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చి కలకలం రేపారు. అవిశ్వాస తీర్మానంపై ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, జీవీ హర్ష కుమార్, సబ్బం హరి, సాయి ప్రతాప్, రాయపాటి సాంబశిరావు సంతకాలు చేశారు. వీరంతా సీఎం కిరణ్ పెట్టే చేరేందుకు ఇదంతా చేస్తున్నారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. వీరంతా కిరణ్ కొత్త పార్టీలో వ్యవస్థాపక సభ్యులుగా ఉంటారని ప్రచారం జరుగుతోంది. సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డి, పితాని సత్యనారాయణ కూడా కిరణ్ పెట్టబోయే పార్టీలో చేరతారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రానికి వస్తున్న దిగ్విజయ్ సింగ్ పార్టీలో నెలకొన్న కుమ్మలాటలను ఏవిధంగా దారికి తెస్తారో అని చర్చించుకుంటున్నారు. -
'సొంత ఎంపీలే అవిశ్వాస తీర్మానం పెడతారనుకోలేదు'
న్యూఢిల్లీ : సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానం పెడతారనుకోలేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానం నోటీసును వారు వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నామని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. కొందరు సీమాంధ్ర ఎంపీలతో ఇప్పటికే మాట్లాడినట్లు దిగ్విజయ్ తెలిపారు. జేసీ దివాకర్ రెడ్డి ఎందుకలా మాట్లాడారో ఆలోచించాల్సి ఉందని దిగ్విజయ్ అన్నారు. సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని జేసీ నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి విరుద్దంగా తిరుగుబాటు చేస్తున్నారని తాము భావించటం లేదన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కొన్ని అంశాలను సీఎం లేవనెత్తుతున్నారని దిగ్విజయ్ తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తామన్న సీఎం వ్యాఖ్యలపై తన వద్ద పూర్తి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. -
ప్రభుత్వంపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల అవిశ్వాసం
న్యూఢిల్లీ: సొంత ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించారు. ఈ మేరకు స్పీకర్ లోక్‌సభ మీరా కుమార్‌కు నోటీసు అందజేశారు. 190 నింబంధన కింద స్పీకర్ మీరా కుమార్‌కు నోటీయిచ్చారు. అవిశ్వాస తీర్మానంపై ఉండవల్లి అరుణ్ కమార్, సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్, సాయిప్రతాప్, హర్షకుమార్, రాయపాటి సాంబశిరావు సంతకాలు చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమైన సీమాంధ్ర ఎంపీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని స్పీకర్‌కు స్వయంగా నోటీసు అందజేసినట్టు ఎంపీ సబ్బం హరి తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి 55 మంది మద్దతు ఉంటే తప్పనిసరిగా చర్చకు అనుమతించాల్సివుంటుందని తెలిపారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఏం నిర్ణయం తీసుకున్నారో తనకు తెలియదన్నారు. అవిశ్వాసం పెట్టాలంటే పార్లమెంట్ సభ్యత్వం ఉండాలని ఆయన చెప్పారు. అందుకే ఇంతకుముందు చేసిన రాజీనామాలను ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. విభజన విషయంలో పార్టీగానీ, ప్రభుత్వం గానీ నైతికంగా వ్యవహరించలేదని విమర్శించారు. విభజనను అడ్డుకునేందుకు సీఎం తమకు అండగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌కు వచ్చి ఆమోదం పొందేంత వరకు అడ్డుకునేందుకు తాము ప్రయత్నాలు చేస్తుంటామన్నారు. విభజనకు వ్యతిరేకంగా అవగింజ అంత అవకాశం దొరికినా ముందుకు వెళతామన్నారు. సమైక్యాంధ్రే తమ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. తమను అనుమానించొద్దని సబ్బం హరి కోరారు. -
'రాజీనామాలపై ఎంపీలు పునరాలోచన చేయాలి'
న్యూఢిల్లీ : సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తమ రాజీనామాల విషయాన్ని పునరాలోచించుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలంతా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఇచ్చిన మాటపై వెనక్కి తగ్గటం మంచిది కాదని దిగ్విజయ్ సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తుపానును అడ్డుకుంటామన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన పట్టించుకోలేదు. సీమాంధ్ర ప్రాంత నేతలు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి తమకు తెలిసిందేనని అన్నారు. ఆ సమస్య నుంచి బయటపడేందుకు పరిష్కారం కనుక్కుందామన్నారు. సీమాంధ్ర ప్రజలను సంతృప్తి పరిచేలా జీవోఎంకు ప్రతిపాదనలు పంపుదామని దిగ్విజయ్ అన్నారు. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తీర్మానం పంపుతామని ఆయన తెలిపారు. షెడ్యూల్లో ఏమైనా మార్పులు ఉంటే మరోకటి ఇవ్వాలని కోరతామన్నారు. -
'రాజీనామాలపై ఎంపీలు పునరాలోచన చేయాలి'
-
మీడియాతో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు
-
ఎంపీల రాజీనామాలకు బ్రేక్!
-
ఎంపీల రాజీనామాలకు బ్రేక్!
* రద్దయిన స్పీకర్ అపాయింట్మెంట్ * రాజీనామాలు వద్దని నచ్చజెప్పిన సీఎం, బొత్స సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చుకొనేందుకు కేంద్రం ఏమాత్రం సిద్ధంగా లేకపోవడంతో ఆగస్టు రెండో తేదీన కొందరు ఎంపీలు పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే వాటిని ఆమోదింపజేసుకునే విషయంలో ఏకాభిప్రాయం కొరవడిన ఎంపీలకు కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం తనదైన శైలిలో పరిష్కారాన్ని చూపింది. బుధ, గురువారాల్లో తన పార్లమెంటరీ నియోజకవర్గ పర్యటనకు, మరో విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు స్వరాష్ట్రం బీహార్ వెళ్లాల్సి ఉన్నందున లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఢిల్లీలోని తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. దీంతో ఎంపీల రాజీనామాల ఆమోదం వ్యవహారం తాత్కాలికంగా వెనక్కువెళ్లింది. కొంతమంది ఎంపీలు మాత్రమే రాజీనామా చేయడం వల్ల ఫలితం ఉండదంటూ వారికి నచ్చజెప్పేందుకు గత 24 గంటల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో సీఎం ఏర్పాటు చేసిన అల్పాహార విందు సమావేశానంతరం పార్లమెంట్ ప్రాంగణానికి వచ్చిన 9 మంది సీమాంధ్ర ఎంపీలకు స్పీకర్ అపాయింట్మెంట్ రద్దయినట్లు తెలిసింది. దీంతో ఉండవల్లి అరుణ్‌కుమార్, జి.వి.హర్షకుమార్, కనుమూరి బాపిరాజు, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, ఎస్పీవై రెడ్డిలతో పాటు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావులు పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లోనే దాదాపు గంటకుపైగా భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించుకొన్నారు. బొత్స, రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, కాసు వెంకటకృష్ణారెడ్డి, వట్టి వసంత కుమార్‌లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్పీకర్ బీహార్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత మరోరోజు కలుసుకొని ఆమోదానికి పట్టుబడతామని పార్లమెంట్ ప్రాంగణం వెలుపల విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడిన ఎంపీలు ప్రకటించారు. రాజీనామాల విషయంలో తాము ఏ క్షణంలోనూ వెనక్కుతగ్గలేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. స్పీకర్ అపాయింట్మెంట్ రద్దు కావడం వెనుక ఏం జరిగిందన్నది తమకు తెలియదని, రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌ను వివాదాల్లోకి లాగడం సమంజసం కాదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించేలా చూసేందుకు రాజీనామాలు పరిష్కారం కాదన్నది సీఎం, పీసీసీ చీఫ్‌ల అభిప్రాయమైతే... అయిదున్నర కోట్ల మంది సీమాంధ్రుల మనోభీష్టాన్ని నెరవేర్చేందుకు ఉత్తమమైన మార్గమేమిటో చెప్పాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంటుందని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. -
రాజీనామాలపై సీమాంధ్ర ఎంపీల వెనకడుగు?
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేస్తారా.. లేదా అన్నది పెద్ద బ్రహ్మ పదార్థంగా మారిపోయింది. వాస్తవానికి ఈరోజు (మంగళవారం) ఉదయమే స్పీకర్ మీరాకుమార్ను ఏడుగురు ఎంపీలు కలవాల్సి ఉంది. ఆమె వారికి ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. వీరంతా తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌కు గతంలోనే లేఖలు రాశారు. అయితే.. వారిలో కొంతమంది మళ్లీ వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మెజారిటీ ఎంపీలు రాజీనామాలకు వ్యతిరేకంగానే ఉన్నారని, ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించిన తర్వాతే రాజీనామాలపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. రాజీనామాలు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండబోదని, ఎంపీలుగా కొనసాగితేనే పార్లమెంట్లో తెలంగాణ బిల్లును వ్యతిరేకించవచ్చని ఆయన చెప్పారు. దీన్ని బట్టి చూస్తే.. మళ్లీ ఎంపీలు వెనకడుగు వేసినట్లే కనిపిస్తోంది. -
రాజీనామాలపై ఊగిసలాట!
* నేడు ఐదుగురు ఎంపీలం స్పీకర్‌ను కలిసి ‘ఆమోదం’ కోరతాం: అనంత * సీఎంతో భేటీ అనంతరం రాజీనామాలపై కొందరు ఎంపీల డైలమా! సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చుకొనే అవకాశాలు కనిపించకపోవటంతో పార్లమెంట్ సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని తనతో సహా సీమాంధ్రకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించుకున్నట్లు అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తనతో పాటు ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఎ.సాయిప్రతాప్‌లు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ను కలసి.. గతంలో తాము సమర్పించిన రాజీనామాలను ఆమోదించాలని కోరతామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించేందుకు తన వంతు కషిచేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా పలువురు కేంద్ర, రాష్ట్ర నాయకులు తొందరపడవద్దని సలహా ఇస్తున్నప్పటికీ ఎవరి ఒత్తిడికి లొంగరాదనే తాము ఐదుగురం నిర్ణయించుకున్నామని అనంత పేర్కొన్నారు. అయితే.. సోమవారం ఢిల్లీలోనే ఉన్న సీఎం పలువురు ఎంపీలతో మాట్లాడటం, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఈ భేటీలో పాల్గొనటం, రాజీనామాలు వద్దంటూ ఒత్తిడి తెస్తుండటంతో ఈ ఐదుగురు ఎంపీల్లోనూ కొందరు డైలమాలో పడ్డట్లు చెప్తున్నారు. ఎంపీలతో సీఎం, బొత్స మంగళవారం మధ్యాహ్న భోజన సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. -
రాజీనామాలపై తలోదారి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రక్రియపై కేంద్రం ముందుకు వెళ్తుండడంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు భవిష్యత్ కార్యాచరణపై శనివారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. మంత్రుల క్వార్టర్లలోని క్లబ్‌హౌస్‌లో ఈ భేటీ జరగనుంది. సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి నిర్వహించాలని మొదట భావించినా చివరకు ఎంపీలు, కేంద్రమంత్రులకు పరిమితం చేశారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలు, సీమాంధ్రలో ఉద్యమం, రాజీనామాలు తదితర అంశాలపై భేటీలో చర్చ జరగనుంది. సమావేశ నిర్వహణ బాధ్యత కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం తదితర మంత్రులు తీసుకున్నారు. అధిష్టానం విభజనపై వెనక్కు తగ్గేది లేదని చెబుతుండడం, సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై వీరంతా తర్జనభర్జన పడుతున్నారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు సమైక్య వాదన గట్టిగా వినిపించినా.. సీడబ్ల్యూసీ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గేది లేదని ఢిల్లీ పెద్దలు ప్రకటిస్తున్నారు. ఎంపీలు, కేంద్రమంత్రులు నిర్లిప్తంగా ఉన్నందునే విభజనపై కేంద్రం ముందుకెళుతోందని ఆగ్రహంతో ఉన్న సమైక్యవాదులు వారు రాజీనామా చేస్తే విభజన ప్రక్రియ నిలిచిపోతుందంటూ.. వారి రాజీనామాలకు పట్టుపడుతున్నారు. ఇప్పటికే ఎంపీలు, కేంద్రమంత్రులను లక్ష్యంగా చేసుకుని ఇళ్ల ముట్టడి తదితర నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు పార్లమెంటు సమావేశాల నెపంతో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు ఢిల్లీలో గడిపారు. సమావేశాలు ముగియడం, ఎన్నికల సంవత్సరం కావడంతో వారు ప్రజల ముందుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసుకున్నారు. ఏపీఎన్జీవోలు సహ ఉద్యమకారుల నుంచి రాజీనామాలపై ఒత్తిడి పెరుగుతుండడంతో ఆ అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. రాజీనామాలు చేసినంత మాత్రాన విభజన ఆగదని, అలాం టప్పుడు రాజీనామాలతో ఫలితమేముంటుందని ఎంపీలు, కేంద్రమంత్రులు ఇప్పటివరకూ వాదిస్తూ వచ్చారు. మంత్రులేగాక ఎంపీల్లోనూ కొందరు రాజీనామాలపై విముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ రాజీనామా చేయనని ముందే ప్రకటించారు. పనబాక లక్ష్మి రాజీనామాపై సందిగ్ధంలో ఉన్నట్టు చెబుతున్నారు. ఎంపీల్లో రాయపాటి సాంబశివరావు కొందరి రాజీనామాలతో ఫలితం ఉండద ని, అందరూ చేస్తేనే విభజన ఆగుతుందని, అలా అయితేనే తాను రాజీనామా చేస్తానని శుక్రవారం విజయవాడలో ప్రకటించారు. అందరూ రాజీనామాలకు అంగీకరిస్తేనే తాను భేటీకి హాజరవుతానని, లేదంటే వెళ్లబోనన్నారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ విభజన వైపే మొగ్గు చూపుతున్నందున ఆయన భార్య, ఎంపీ బొత్స ఝాన్సీ రాజీనామాకు విముఖంగానే ఉంటారని అంటున్నారు. ఎంపీ చింతా మోహన్‌దీ అదేదారి అని పార్టీ వర్గాలంటున్నాయి. ఈ ముగ్గురూ భేటీకి హాజరవుతారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కిశోర్‌చంద్రదేవ్, పనబాక లక్ష్మి కూడా రాకపోవచ్చంటున్నారు. -
రాడికల్, వేర్పాటువాద శక్తులకు అండ తగునా?
టీ మంత్రులు,ఎంపీలపై దిగ్విజయ్‌కు సీమాంధ్ర ఎంపీల లేఖ సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ సహా కొన్ని రాడికల్, వేర్పాటువాద సంస్థలకు వత్తాసు పలికేలా తెలంగాణ మంత్రులు, టీ కాంగ్రెస్ ఎంపీలు ప్రవర్తిస్తున్నారని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు తలపెట్టిన సభను అడ్డుకుంటామని వేర్పాటువాద శక్తులు ప్రకటనలు చేస్తే దానికి టీ కాంగ్రెస్ నేతలు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. సమైక్యంలోనే వివిధ ప్రాంతాలవారి హక్కుల రక్షణకు నాయకులు అండగా నిలవకపోతే.. విడిపోయినపక్షంలో సామాన్య ప్రజల దుస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చుఅని పేర్కొన్నారు. ఈ మేరకు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు శుక్రవారం దిగ్విజయ్‌కు లేఖ రాశారు. దీనిపై ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్, సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, అనంతవెంకట్రామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు సంతకాలు చేశారు. ప్రాంతాలమధ్య వైషమ్యాలు పెంచడంలో తెలంగాణ నాయకులు పోటీపడుతున్నారని ఆరోపించారు. గతంలోనే జాగో భాగో అంటూ టీఆర్ఎస్ నినాదమిచ్చినా దాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ ఖండించకపోవడాన్ని దిగ్విజయ్‌కు వారు గుర్తుచేశారు. కులం, మతం, ప్రాంతం, భాషల ప్రాతిపదికన విభజన రాజకీయాలు చేయడానికి వ్యతిరేకమైన జాతీయ పార్టీలో సభ్యులుగా ఉన్న నాయకులే భారత రాజ్యాంగం కల్పిస్తున్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకోవడం గర్హనీయమన్నారు. ఇప్పటికైనా వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన్ను కోరారు. -
దిగ్విజయ్‌కు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల లేఖ
దిగ్విజయ్‌సింగ్‌కు లేఖ రాసిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు లేఖ రాశారు. ఏపీఎన్జీవోల సభ సజావుగా జరగకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న తెలంగాణ ఎంపీలను నియంత్రించాలని లేఖలో కోరారు. జాగో, బాగో ప్రకటనలతో టీఆర్ఎస్ నాయకులు ఉద్రిక్తతలు తెస్తున్నారని దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమ సభకు రాజకీయ నాయకులను ఆహ్వానించలేదని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. ఏపీఎన్జీవోలు తలపెట్టిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' అవగాహన సదస్సుకు విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమైక్యవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కేవలం స్టేడియం లోపలికి ఉద్యోగులకే అనుమతి ఉన్నందున ప్రాంగణం బయట ఉండి సంఘీభావం ప్రకటించాలని కోరారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
సస్పెన్షన్ ఊహించలేదు: ఎంపీ అనంత
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేస్తున్నామని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. లోక్‌సభ నుంచి సస్పెండయిన తర్వాత మిగతా ఎంపీలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సస్పెన్షన్ ఊహించలేదన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా సమైక్యానికి అనుకూలంగా కేంద్రం నుంచి ప్రకటనచేయించుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు నాయుడు యాత్ర చేపట్టారని ఆయన విమర్శించారు. జాతీయ నాయకురాలైన సోనియా గాంధీని విమర్శించడం తగదని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా తమ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మార్పించేందుకు ప్రత్నిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు 'సమైక్యం' పాట పాడుతుండడం హాస్యాస్పదమని అన్నారు. -
ఆజాద్‌ను కలిసిన సీమాంధ్ర ఎంపీలు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అవసరం అయితే మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సిద్ధమేనని బహిరంగ ప్రకటన చేసిన సీమాంధ్ర ఎంపీలు శుక్రవారం కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను వారు ఈ సందర్భంగా ఆజాద్ దృష్టికి తీసుకు వెళ్లారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో తాము లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపించాలని వారు డిమాండ్ చేశారు. అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ఆజాద్ ఎంపీలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు సీమాంధ్ర కేంద్రమంత్రులు కూడా డైలమాలో పడ్డారు. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలు పునరాలోచనలో పడ్డాయని, కాంగ్రెస్ కూడా ఆలోచించాలని వారు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈమేరకు వారు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. -
ఎన్ని కమిటీలేసినా.. సమైక్యమే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై ఎన్ని కమిటీలు వేసినా సమైక్యవాదాన్నే వినిపిస్తామని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. ‘విభజన విషయంలో ప్రభుత్వ కమిటీ వేస్తారన్న విషయంపై మాకు సమాచారం లేదు. కమిటీ వేసినా అది ఏ ప్రాతిపదికన వేశారు? దాని విధివిధానాలు ఏమిటి? ప్రభుత్వ కమిటీ సైతం ఆంటోనీ కమిటీ వంటిదేనా? అన్న విషయాలను ముందే తేల్చాలి’ అని చెప్పారు. హైదరాబాద్, నీటి సమస్యలు పరిష్కారించాకే విభజనపై నిర్ణయం చేయాలని వారు డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నమిక్కడ కేంద్ర మంత్రి చిరంజీవి ఇంట్లో సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీల విందు సమావేశం జరిగింది. ఈ భేటీకి కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జేడీ శీలం, కిల్లి కృపారాణి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, ఉండవల్లి అరుణ్‌కుమార్, కనుమూరి బాపిరాజు, బొత్స ఝాన్సీ, మాగుంట శ్రీనివాసులరెడ్డి, కేవీపీ రాంచంద్రరావు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. సస్పెన్షన్ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి.. ఆంటోనీ కమిటీని మరోమారు కలిసే అంశాలపై చర్చించారు. సమావేశం జరుగుతుండగా మధ్యలోనే లోక్‌సభకు వెళ్లిన చిరంజీవి సమావేశం ముగిసిన అనంతరం తిరిగొచ్చారు. శుక్రవారం తాను సోనియాగాంధీతో జరిపిన భేటీ విషయాలు నేతలకు ఆయన వివరించారు. ఎంపీలందరూ సోమవారం మరోమారు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలనే నిర్ణయానికి వచ్చారు. అన్ని వర్గాలవారితో ఆంటోనీ కమిటీ భేటీ: పళ్లంరాజు సాక్షి, హైదరాబాద్: అన్నివర్గాల ప్రజలతో ఆంటోనీ కమిటీ భేటీ అవుతుందని కేంద్రమంత్రి పళ్లంరాజు తెలిపారు. త్వరలో హైదరాబాద్‌కు వచ్చే ఈ కమిటీ విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాలవారితో సమావేశమై వారికున్న భయాందోళనలపై వివరాలు తీసుకుంటుందన్నారు. -
నిరసన కొనసాగిస్తాం: సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు ‘కేంద్ర ప్రభుత్వం’ స్పష్టమైన హామీ ఇచ్చేవరకు పార్లమెంటులో నిరసనలు ఆపబోమని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. సీమాంధ్రలో కొనసాగుతున్న ప్రజా ఉద్యమాన్ని జాతీయ పార్టీలు గుర్తించాయన్నారు. గురువారం లోక్‌సభలో తమ నిరసన సందర్భంగా సస్పెన్షన్ వేటు వేయాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ సభ్యులు సహా మెజారిటీ పార్టీలు వ్యతిరేకించాయని చెప్పారు. గురువారం సాయంత్రం సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు ఇంట్లో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జె.డి.శీలం, ఎంపీలు సాయిప్రతాప్, ఉండవల్లి అరుణకుమార్, లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులరెడ్డిలు హాజరయ్యారు. శుక్రవారం లోక్‌సభలో వ్యవహరించాల్సిన తీరు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్న కమిటీ తదితరాలపై చర్చించారు. అనంతరం ఎంపీ అనంత నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ....‘ప్రభుత్వం నుంచి రాష్ట్ర విభజన జరుగదని స్పష్టమైన హామీ కావాలి. హామీ వచ్చే వరకు మా నిరసన కొనసాగుతుంది’’ అని స్పష్టం చేశారు. తమ రాజీనామాలు స్పీకర్ ఫార్మట్‌లో, స్పీకర్‌కే ఇచ్చామని తెలిపారు. తమ రాజీనామాలు ఎందుకు పెండింగ్‌లో ఉంచారనేది స్పీకర్నే అడగండి’’ అని మీడియాతో వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ కొత్త కమిటీ ఎత్తుగడ!
* కీలక బిల్లుల ఆమోదం కోసం వ్యూహం * ‘ఆల్ పార్టీ కమిటీ’ వేస్తామని సీమాంధ్ర ఎంపీల వద్ద ప్రతిపాదన * పార్లమెంటు సమావేశాలకు సహకరించాలన్న కమల్‌నాథ్ * జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్న పలువురు సభ్యులు * అవసరం లేదన్న కాంగ్రెస్.. ఆందోళన విరమణకు నో అన్న ఎంపీలు * నేడు స్పీకర్ సమక్షంలో అఖిలపక్ష పార్లమెంటరీ నేతల సమావేశం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను వ్యతిరేకించే పేరుతో సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటు కార్యక్రమాలను స్తంభింపచేస్తుండటంతో.. కీలకమైన ఆహార భద్రత, భూసేకరణ బిల్లులను పార్లమెంటులో ఆమోదించటానికి కాంగ్రెస్ ‘ఆల్ పార్టీ కమిటీ’ అనే కొత్త ఎత్తుగడను ముందుకు తీసుకువచ్చింది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ బిల్లులకు ఆమోదం పొందలేకపోతున్న యూపీఏ సర్కారు.. గురువారం సభలో ఆందోళన చేస్తున్న సీమాంధ్ర సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. సభ్యుల సస్పెన్షన్‌ను ప్రతిపాదిస్తూ అధికారపక్షం లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పారీలన్నీ వ్యతిరేకించటంతో తీవ్ర గందరగోళం తలెత్తింది. దీంతో సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కొత్త వ్యూహంతో మరో కొత్త కమిటీ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. సీమాంధ్ర సభ్యులు పార్లమెంటులో ఆందోళనను విరమించి సభ సజావుగా సాగటానికి సహకరించాలని.. వారి ఆందోళనలను పరిశీలించటానికి జాతీయ పార్టీల సభ్యులతో ఆల్ పార్టీ కమిటీని ఏర్పాటు చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ప్రతిపాదించారు. విభజన నిర్ణయం తీసుకున్నది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని.. కేంద్రం ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆందోళన విరమించి.. తమ అభ్యంతరాలను ఆల్ పార్టీ కమిటీకి వివరించాలని సూచించారు. ఈ కమిటీ పేరుతో పార్లమెంటు సజావుగా సాగేలా చేసుకుని.. ఆహార భద్రత తదితర బిల్లులకు ఆమోదం పొందవచ్చనేది కాంగ్రెస్ ఎత్తుగడగా తెలుస్తోంది. టీడీపీ, కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీల ఎదుట విడివిడిగా కమిటీ ప్రతిపాదన చేయగా.. తొలుత వారి నుంచి మిశ్రమ స్పందన లభించినట్లు సమాచారం. కొందరు ఆల్ పార్టీ కమిటీ బదులుగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించగా.. అలాంటి కమిటీ అవసరం లేదని కమల్‌నాథ్ పేర్కొన్నట్లు చెప్తున్నారు. ఈ విషయంలో సీమాంధ్ర ఎంపీలతో సీపీఐ తదితర పార్టీల నేతలు గురుదాస్‌దాస్‌గుప్తా వంటి వారు కూడా దౌత్యం నెరపినట్లు తెలిసింది. దీనిపై ఆలోచించి చెప్తామన్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తర్వాత కేవీపీ నివాసంలో సమావేశమై మళ్లీ కమిటీలకు ఒప్పుకుని ఆందోళన విరమిస్తే ప్రజల దృష్టిలో మరింత చులకన అవుతామని భావించి.. ఆందోళన కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపధ్యంలో లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్.. పార్లమెంటులో ప్రతిష్టంభనను తొలగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం ఉదయం పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. -
విప్ ధిక్కరించిన సీమాంధ్ర ఎంపీలు
రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పెద్దలు ప్రకటన చేసిన తర్వాత, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తొలిసారిగా అధిష్ఠానాన్ని ధిక్కరించారు. ఆహార భద్రత బిల్లుపై జరిగే చర్చలో తప్పనిసరిగా పాల్గొనాలని, దానికి అనుకూలంగా ఓటు వేయాలని చెబుతూ కాంగ్రెస్ అధిష్ఠానం విప్ జారీచేసినా... దాన్ని సైతం ధిక్కరించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగానే సమావేశాల మధ్యలోంచి బయటకు వచ్చేశారు. ఆహార భద్రత బిల్లుకు అనుకూలంగానే ఉంటామని కనుమూరి బాపిరాజు, బిల్లును సమర్థించం, ఆమోదించబోమని ఎంపీ హర్షకుమార్ అంతకుముందు తెలిపినా.. చివరకు మాత్రం మళ్లీ వ్యూహం మార్చుకున్నారు. సభలోకి వెళ్లిన తర్వాత వాళ్లు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని, సభ నుంచి బయటకు వచ్చేశారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ అధిష్ఠానవర్గాన్ని ఎంపీలు ధిక్కరించిన దాఖలాలు లేవు. రాజీనామాలు సమర్పించినా, ఇప్పటికీ పార్లమెంటుకు వెళ్తూనే ఉన్నారు. -
హామీతో వెనక్కి తగ్గిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా వారం రోజులుగా పార్లమెంటులో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు తెరపడింది. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకొంటామని, సీమాంధ్ర నేతలతో సంప్రదింపులు జరుపుతామని ఇచ్చిన హామీతో తమ పార్టీ ఎంపీలు ఆందోళనను విరమించారని ఏఐసీసీ అధికార ప్రతినిధి, లోక్‌సభ చీఫ్ విప్ సందీప్ దీక్షిత్ పార్లమెంటు ఆవరణలో విలేకరులతో చెప్పారు. సభా కార్యక్రమాలకు అవరోధం కలిగించకుండా పార్లమెంటు ఆవరణలో వారు నిరసన తెలుపుతున్నారని.. అందువల్ల వారిని అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు. అయితే, మంగళవారం లోక్‌సభ, రాజ్యసభల్లో టీడీపీ ఎంపీలు ‘ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి’ అనే నినాదాలు ముద్రించిన చొక్కాలు ధరించి ఆందోళనను కొనసాగించగా.. కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు మాత్రం సభల్లోకి రాకుండా పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. కాగా.. టీడీపీ సభ్యులు లోక్‌సభలో ఆందోళన కొనసాగించడంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. ఎంతో ముఖ్యమైన ఆహార భద్రత బిల్లుపై చర్చించాల్సిన సమయంలో సభకు అడ్డుతగులుతున్న టీడీపీ సభ్యులపై చర్య తీసుకోవాల్సిందిగా స్పీకర్ మీరాకుమార్ను కోరతామన్నారు. కమల్ నాథ్ మాటలపై రగడ.. గొడవ చేస్తే సభను నడపబోమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ మంగళవారం లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘ఆయన బెదిరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు’ అని బీజేపీ సభ్యుడు యశ్వంత్ సిన్హా ఆక్షేపించారు. దీంతో కమల్‌నాథ్ వెనక్కి తగ్గారు. జోషీ అంటే తనకు గౌరవమని, తన వ్యాఖ్యలతో ఆయన మనసు గాయపడి ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటానని అన్నారు. మరోపక్క.. సుష్మా స్వరాజ్ స్పందిస్తూ, ‘కమల్ నాథ్ వినయం అలవర్చుకోవాలి. ఏం చెబుతున్నామో ముఖ్యం కాదు, ఎలా చెబుతున్నామో ముఖ్యం’ అని చెప్పారు.