రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పెద్దలు ప్రకటన చేసిన తర్వాత, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తొలిసారిగా అధిష్ఠానాన్ని ధిక్కరించారు.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పెద్దలు ప్రకటన చేసిన తర్వాత, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తొలిసారిగా అధిష్ఠానాన్ని ధిక్కరించారు. ఆహార భద్రత బిల్లుపై జరిగే చర్చలో తప్పనిసరిగా పాల్గొనాలని, దానికి అనుకూలంగా ఓటు వేయాలని చెబుతూ కాంగ్రెస్ అధిష్ఠానం విప్ జారీచేసినా... దాన్ని సైతం ధిక్కరించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగానే సమావేశాల మధ్యలోంచి బయటకు వచ్చేశారు.
ఆహార భద్రత బిల్లుకు అనుకూలంగానే ఉంటామని కనుమూరి బాపిరాజు, బిల్లును సమర్థించం, ఆమోదించబోమని ఎంపీ హర్షకుమార్ అంతకుముందు తెలిపినా.. చివరకు మాత్రం మళ్లీ వ్యూహం మార్చుకున్నారు. సభలోకి వెళ్లిన తర్వాత వాళ్లు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని, సభ నుంచి బయటకు వచ్చేశారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ అధిష్ఠానవర్గాన్ని ఎంపీలు ధిక్కరించిన దాఖలాలు లేవు. రాజీనామాలు సమర్పించినా, ఇప్పటికీ పార్లమెంటుకు వెళ్తూనే ఉన్నారు.