
సీమాంధ్ర ఎంపీలవి తప్పుడు హామీలు: ఆజాద్
తమ పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపీలు తప్పుడు హామీలు ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఏసీసీసీ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలంతా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని చెప్పారని, కానీ తాము నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్లు వెనక్కి తగ్గారని ఆయన అన్నారు. తెలుగు దేశం పార్టీ రాతపూర్వకంగా తాము విభజనకు అనుకూలమని చెప్పిందని, తమ పార్టీ వాళ్లు మాత్రం సహకరించలేదని ఆయన అన్నారు.