ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలపై వేటుకు రంగం సిద్ధం! | Congress hints at action against Seemandhra congress MPs! | Sakshi
Sakshi News home page

ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలపై వేటుకు రంగం సిద్ధం!

Published Wed, Dec 11 2013 10:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలపై వేటుకు రంగం సిద్ధం! - Sakshi

ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలపై వేటుకు రంగం సిద్ధం!

న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానం పెట్టిన ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలపై వేటుకు రంగం సిద్ధమైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిపై వేటు వేయనున్నట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో తెలిపారు. పార్లమెంట్ లో  సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గదన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు లభించదని చాకో వ్యాఖ్యానించారు. ఎవరూ ముందస్తు ఎన్నికలు కోరుకోవటం లేదని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతో  ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు.. సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు అందించారు. కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎ.సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్ సోమవారం ఉదయం ఈమేరకు స్పీకర్ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement