సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లును ఓడించాలని కోరుతూ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో 3, 4 తేదీలలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తలపెట్టిన‘సంకల్ప దీక్ష’కు పోలీసుల అనుమతి లభించింది. అసెంబ్లీ మలివిడత సమావేశాలు కూడా ప్రారంభమవుతుండటంతో దీక్షకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురువారం ధర్నాచౌక్, తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియపై ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌కు అవగాహన లేదని అందుకే అసెంబ్లీలో ఓటింగ్ ఉండదని చెపుతున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని యుూపీఏ ప్రభుత్వం ప్రజావిశ్వాసాన్ని కోల్పోరుుందని, అది ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగేందుకు వీల్లేదన్నారు.
శాసనసభలో సభ్యులందరూ సమైక్యానికి వుద్దతుగా వూట్లాడాలని, సవరణలపై ఓటింగ్‌కు పట్టుబట్టాలని కోరారు. సంకల్ప దీక్షలో ఎంపీలు హర్షకుమార్, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, రాయపాటి సాంబశివరావు, సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్‌లు పాల్గొంటున్నారు.
అనుమతి రద్దు చేయాలి: సీమాంధ్ర ఎంపీల సంకల్పదీక్షకు అనుమతి రద్దు చేయాలని తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. లేదంటే దీక్షను అడ్డుకుంటామని, జరిగే పరిణామాలకు సర్కారే బాధ్యత వహించాలని సంఘం అధ్యక్షుడు ఒద్యారపు రవికుమార్ హెచ్చరించారు.
నేటి నుంచి ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల దీక్ష
Published Fri, Jan 3 2014 1:55 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement