Sankalpa deeksha
-
ఎకో ప్రెస్సింగ్... సంకల్ప దీక్షతో ముందడుగు
సంకల్ప దీక్షతో.. అంతా సన్నద్ధమై.. ఓ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. ముందుచూపుతో మొదలైన ప్రస్థానం నేడు మహానగరాన్ని కదిలిస్తోంది. మనకు తెలియకుండానే నగరం వాయు కాలుష్యమయంగా ఎలా అవుతుందో గమనించారు. నెలకు లక్షలాది క్వింటాళ్ల బొగ్గును కేవలం నగరంలోని ఇస్త్రీ వ్యాపారులే వినియోగిస్తున్నారంటే నమ్మగలరా.. ఇలా మనం ఎంత కాలుష్యంలో బతుకుతున్నామో గమనించారా.. బొగ్గురహిత ఇస్త్రీ నగరంలో విస్తరించాలనే సదుద్దేశంతో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్–ది లెజెండ్స్ శ్రీకారం చుట్టింది. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టి ఇస్త్రీ వ్యాపారులకు లాభాలతో పాటు సమయం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతోంది. ప్రాజెక్ట్ ‘ఎకో ప్రెస్సింగ్’ పేరుతో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టింది. ఈ ఉద్యమం ఎలా మొదలైంది? దీనికి సహకరించినవారెవరు? వంటి విషయాలు తెలుసుకుందాం... – శ్రీనగర్కాలనీబొగ్గు రహిత ఇస్త్రీ ఉద్యమం మొదట బెంగుళూరులో ‘ఉద్యమ్ వ్యాపార్’ ఎన్జీఓతో మొదలైంది. రోడ్లపై, అపార్టుమెంట్లలో వాచ్మెన్స్గా పనిచేస్తున్న వారు బొగ్గు ఇస్త్రీపెట్టెలతో ఇస్త్రీ చేసేవారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఈ బొగ్గు ఇస్త్రీపెట్టెలతో వారికి తగ్గ ఆదాయం సమకూరేదికాదు..పైగా వాటిని ఉపయోగించేందుకు ముందస్తుగా చాలా తతంగమే చేయాలి.. పైగా బొగ్గును మండించే క్రమంలో వచ్చే పొగకు ఆరోగ్య సమస్యలు తలెత్తేవి. సమయం కూడా చాలా వృథా అయ్యేది.. ఇదంతా గమనించిన ఓ ఎన్జీఓ సంస్థ ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెలను అందించి వారికి తోడుగా నిలిచింది. బెంగుళూరులో సుమారు 5వేల మందికి, చెన్నైలో 3వేల మందికి ఎల్పీజీ ఇస్త్రీల వాడకాన్ని నేర్పింది. ఇలా బొగ్గు రహిత నగరాలుగా చేయడానికి పూనుకుంది. భాగ్యనగరంలోనూ... గ్రేటర్ హైదరాబాద్‌లోని రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ది లెజెండ్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ మోహనవంశీ ఆలూరి చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన ‘ఉద్యమ్ వ్యాపార్’ దీనికి సంబంధించిన ప్రాజెక్టును వివరించారు. ఉద్యమ్ వ్యాపార్ ప్రతినిధులు కృష్ణన్, జూహీలు నగరానికి వచ్చి వారి ప్రాజెక్ట్‌ను వివరించి, క్లబ్ చేస్తున్న విస్తృత కార్యమాలకు ముగ్ధులై ఈ ప్రాజెక్ట్‌ను మీ క్లబ్ నుండే చేయాలని తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ ‘ఎకో ప్రెస్సింగ్’ ఇస్త్రీ నగరంలో మోతీనగర్ నుండి ప్రారంభమై నేడు సుమారు 200 మందికిపైగా ఎల్పీజీ ఇస్త్రీలను అందించింది.బొగ్గు ఇస్త్రీల వల్ల నష్టాలుమహానగరంలో సుమారు 10 వేల మంది ఇస్త్రీ వ్యాపారులు ఉన్నారు. వీరిలో అధిక శాతం మంది ఇస్త్రీలకు ప్రధాన వనరుగా బొగ్గునే వాడుతున్నారు. ఒక్కొక్కరూ రోజుకు సుమారు రెండు కిలోల బొగ్గును వాడతారు. అంటే రోజుకు సుమారు 20వేల కేజీలు.. నెలకు 6లక్షలు, సంవత్సరానికి 72 లక్షల కిలోల బొగ్గును కేవలం ఇస్త్రీ వ్యాపారులే వినియోగిస్తున్నారంటే అతిశయోక్తికాదు.. నగరంలో వాయుకాలుష్యానికి ఇది కూడా ఒక సవాలుగా మారుతోంది. భారీగా పెరిగిన బొగ్గు ధరలు దీనికితోడు బొగ్గు ఖరీదుకూడా భారీగా పెరిగింది. బొగ్గు వినియోగానికి సుమారు నెలకు 2 నుండి మూడువేల వరకూ ఖర్చు చేస్తున్నారు. ఇస్త్రీ చేసేవారికి బొగ్గు మండా లంటే సుమారు గంటకు పైగా సమయం పడతుంది. పైగా మండించే క్రమంలో వచ్చే పొగ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. బొగ్గు మండించడానికీ సమయం వృథా అవుతోంది. అంతేకాకుండా వీటికి ఉష్ణాన్ని అదుపుచేసే విధానం ఉండదు. దీంతో కొన్నిరకాల బట్టలు త్వరగా రంగుమారడం, ప్రధానంగా దుస్తులపైనున్న లోగోలు చెడిపోవడం, ఒక్కోసారి తెల్ల చొక్కాలపై మసి అంటి మరకలు పడటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంతా చేస్తే చివరికి మిగిలేది నామమాత్రమే అని పలువురు నిర్వాహకులు వాపోతున్నారు.ఎల్పీజీ, ‘ప్రాజెక్ట్ ఎకో’తో లాభాలుఎల్పీజీ ఇస్త్రీలతో చాలా లాభాలున్నాయి. కమర్షియల్ సిలిండర్ 19 కేజీలు రెండు నుండి మూడు నెలలు వస్తుంది. పైగా దీని ధర రెండు వేలలోపు మాత్రమే.. బొగ్గుతో పోలిస్తే... ఖర్చు తగ్గి లాభాలతో పాటు సమయం కూడా కలిసి వస్తుంది. పర్యావరణానికి ఎటువంటి హానీ కలగదు. వినియోగదారులకు సంతోషకరమైన పనిని అందించవచ్చు. ఎందుకంటే ఇందులో ఇస్త్రీ పెట్టె ఉషో్టగ్రతలను అదుపు చేసే వెçసులుబాటు ఉంటుంది.వినియోగం చాలా సులువుబొగ్గు ఇస్త్రీపెట్టెల కంటే ఎల్పీజీ ఇస్త్రీల వినియోగం చాలా సులువైనది. త్వరగా హీట్ అయి హెచ్చు, తగ్గులను కంట్రోల్ చేసుకోవచ్చు. ఆదాయం పెరిగి సమయం కలిసొస్తుంది. ఇస్త్రీ వ్యాపారులు రోటరీ క్లబ్ సహకారంతో ఎల్పీజీని వాడి పర్యావరణాన్ని కాపాడాలి. –ధర్మ, ఇస్త్రీ వ్యాపారి, మోతీనగర్ప్రాజెక్ట్ ‘ఎకో ప్రెస్’ ఇలా..రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లెజెండ్స్ వారు ‘ఉద్యమ్ వ్యాపార్’ ఆలోచనతో ప్రాజెక్ట్ ‘ఎకో ప్రెస్సింగ్’ను ముందుకు తీసుకెళుతున్నారు. వీరికి తోడుగా రోటరీక్లబ్ ఆఫ్ మద్రాస్, రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్, సైనిక్‌పురి, గ్లోబర్ విజర్డ్స్, స్మార్ట్ హైదరాబాద్, సంస్కార్ స్కూల్స్‌తో పాటు పలు సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయి. ఎల్పీజీ ఇస్త్రీ ఏడువేలకు పైగా ఉంటుంది. కానీ వీరు వీటిని రూ. 2,500 మాత్రమే ఇస్తున్నారు. ఇందులో వాడే ఇత్తడి మెటీరియల్ ఖరీదుకు మాత్రమే వారు తీసుకుంటున్నారు. బొగ్గురహిత గ్రేటర్ హైదరాబాద్ నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పెట్టుకున్నామని, రెండు మూడు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి శ్రమిస్తామని ఎకో ఇస్త్రీ మేన్ ఆఫ్ హైదరాబాద్‌గా పేరున్న మోహనవంశీ తెలిపారు.కోల్ఫ్రీ ఇస్త్రీ నగరంగా... కాలుష్యాన్ని తగ్గించి హైదరాబాద్‌ను బొగ్గురహిత ఇస్త్రీ నిలయంగా చేయాలన్నదే మా సదుద్దేశం. ఈ ఆలోచనకు నాంది ఉద్యమ్ వ్యాపార్ సంస్థ. వారి ఆలోచనను రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్–ది లెజెండ్స్ పూర్తిస్థాయిలో నెరవేర్చడానికి పూనుకున్నాం. నగరంలోని అందరికీ ఈ ఎల్పీజీ ఇస్త్రీపెట్టెల వినియోగంపై అవగాహన కలి్పంచి వారికి అందజేస్తాం. కోల్ఫ్రీ ఇస్త్రీ నగరంగా హైదరాబాద్ నిలుపుతాం. – ఆలూరి మోహనవంశీ, రోటరీక్లబ్ ఆఫ్ హైదరాబాద్ ది లెజెండ్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ -
రాయలసీమకు అన్యాయం చేస్తే ఊరుకోం..
సాక్షి, వైఎస్సార్ కడప: కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రాయలసీమ ప్రజా సంఘాల జేఏసీ నేతలు శుక్రవారం సంకల్ప దీక్షకు పూనుకున్నారు. నాలుగు జిల్లాల నుంచి రాయలసీమ ఉద్యమ నేతలు పెద్ద ఎత్తున ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని నేతలు స్వాగతించారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం పాలన, అభివృద్ధి వికేంద్రీకరణలో రాయలసీమకు సమన్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రాయలసీమకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ దీక్షలో రాయలసీమ జేఏసీ ముఖ్య నేతలు నాగిరెడ్డి, దశరథ రామిరెడ్డి, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పవన్‌తో బీజేపీకి నష్టమే..! -
జమ్మలమడుగులో వైఎస్సార్సీపీ ఉక్కు సంకల్ప దీక్ష
సాక్షి, కడప: కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు వైఎస్సార్పీపీ ఆధ్వర్యంలో ఉక్కు సంకల్ప దీక్ష చేపట్టారు. విభజన చట్టంలో హామీ ఇచ్చినప్పటికీ కడపలో ఇప్పటికీ ఉక్కు పరిశ్రమ రాకపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని పార్టీ నేతలు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ సాధించేంత వరకు తమ పోరాటాన్నిఆపబోమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 23న కడప నగరంలో మహా ధర్నా, 24న బద్వేలు, 25న రాజంపేటలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ దీక్షలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, కమలాపురం సమన్వయకర్త మల్లికార్జునరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి లతో పాటు జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్ సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఉక్కు సంకల్ప దీక్ష కొనసాగనుంది. సీఎం రమేష్‌ది డబ్బు దీక్ష సీఎం రమేష్ చేసేది డబ్బు దీక్ష అని కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ చేసేది జనదీక్ష, జనం కోసం చేసే దీక్ష అని పేర్కొన్నారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకుంది చంద్రబాబే అని మండిపడ్డారు. ఇప్పుడు కపట నాటకాలతో దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. -
గందరగోళం మధ్యన ఎమ్.పిలు దీక్ష విరమణ
-
తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి
హైదరాబాద్: తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి, గందరగోళం మధ్య సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల సంకల్పదీక్ష ముగిసింది. శుక్రవారం ప్రారంభించిన దీక్షను ఈ రోజు మంత్రి శైలజానాథ్ విరమింపజేశారు. ఆ సమయంలో కొందరు తెలంగాణవాదులు వచ్చి తెలంగాణ నినాదాలు చేశారు. దాంతో తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి చేశారు. ఎంపిలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, జి.వి.హర్ష కుమార్‌లు నిన్న ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో సంకల్ప దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్‌లు గైర్హాజరు కాగా, రాయపాటి సాంబశివరావు మాత్రం నిన్న సాయంత్రం నాలుగు గంటలకు దీక్షకు హాజరయ్యారు. సంకల్ప దీక్షకు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సమైక్యవాదులు మద్దతు తెలిపారు. -
సంకల్ప దీక్ష కాదది...
-
సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్ష ప్రారంభం
-
'సంకల్ప దీక్ష కాదది... ఉత్తుత్తి దీక్ష'
రాష్ట్ర అసెంబ్లీలో విభజన బిల్లును ఓడించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సీమాంధ్ర ఎంపీలు చేపట్టిన సంకల్ప దీక్ష... ఉత్తుత్తి దీక్ష మాత్రమే అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద దేవినేని ఉమా మాట్లాడుతూ... సంకల్ప దీక్ష అంటూ హైదరాబాద్‌లో దీక్ష చేపట్టిన ఆ ఎంపీలకు దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా ఇంటి ముందు ధర్నాలు, దీక్షలు చేపట్టాలని ఆయన సీమాంధ్ర ఎంపీలకు సూచించారు. ఓట్లు, సీట్లు కోసమే సోనియా రాష్ట్ర విభజనపై నాటకాలాడుతుందని ఆయన ఆరోపించారు. శాసనసభ వ్యవహారాల శాఖ బాధ్యతలు శ్రీధర్ బాబు నుంచి సీఎం కిరణ్ తప్పించడాన్ని పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబు రాజీనామా చేసి తెలంగాణ ప్రజల్లో హీరోగా నిలిచారని అన్నారు. సీఎం మాత్రం సమైక్యవాది అంటు నాటకాలాడుతున్నారని ఆరోపించారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా నాయకత్వంలో ఈ తతంగమంతా జరుగుతుందని దేవినేని ఉమా పేర్కొన్నారు. -
సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్ష ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరు విడదీయలేరని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లును ఓడించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో సీమాంధ్ర ఎంపీలు శుక్రవారం సంకల్ప దీక్ష చేపట్టారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఆ దీక్షలో పాల్గొన్నారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని అమలాపురం ఎంపీ జి.వి.హర్షకుమార్ పేర్కొన్నారు. సంకల్ప దీక్షలో ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, జి.వి.హర్ష కుమార్, సాయి ప్రతాప్, రాయపాటి సాంబశివరావులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే వరకు తమ సంకల్ప దీక్ష కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. సీమాంధ్ర ఎంపీలు చేపట్టిన సంకల్ప దీక్షకు పలువురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలతోపాటు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సంకల్ప దీక్ష స్థలి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. -
నేటి నుంచి ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల దీక్ష
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లును ఓడించాలని కోరుతూ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో 3, 4 తేదీలలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తలపెట్టిన‘సంకల్ప దీక్ష’కు పోలీసుల అనుమతి లభించింది. అసెంబ్లీ మలివిడత సమావేశాలు కూడా ప్రారంభమవుతుండటంతో దీక్షకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురువారం ధర్నాచౌక్, తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియపై ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌కు అవగాహన లేదని అందుకే అసెంబ్లీలో ఓటింగ్ ఉండదని చెపుతున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని యుూపీఏ ప్రభుత్వం ప్రజావిశ్వాసాన్ని కోల్పోరుుందని, అది ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగేందుకు వీల్లేదన్నారు. శాసనసభలో సభ్యులందరూ సమైక్యానికి వుద్దతుగా వూట్లాడాలని, సవరణలపై ఓటింగ్‌కు పట్టుబట్టాలని కోరారు. సంకల్ప దీక్షలో ఎంపీలు హర్షకుమార్, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, రాయపాటి సాంబశివరావు, సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్‌లు పాల్గొంటున్నారు. అనుమతి రద్దు చేయాలి: సీమాంధ్ర ఎంపీల సంకల్పదీక్షకు అనుమతి రద్దు చేయాలని తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. లేదంటే దీక్షను అడ్డుకుంటామని, జరిగే పరిణామాలకు సర్కారే బాధ్యత వహించాలని సంఘం అధ్యక్షుడు ఒద్యారపు రవికుమార్ హెచ్చరించారు. -
సంకల్ప దీక్షకు పోలీసుల అనుమతి
హైదరాబాద్: సీమాంధ్ర ఎంపిలు చేయతలపెట్టిన సంకల్ప దీక్షకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇందిరా పార్కు వద్ద ఎల్లుండు ఈ దీక్షను ప్రారంభిస్తారు. ఈ దీక్షలో ఆరుగురు ఎంపిలు పాల్గొనవలసి ఉంది. అయితే ప్రస్తుతం అయిదుగురు ఎంపిలు మాత్రమే పాల్గొననున్నారు. కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులు హర్షకుమార్, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, సాయిప్రతాప్ సంకల్ప దీక్ష చేస్తారు. ఆరోగ్య కారణాల రీత్యా ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ దీక్షలో పాల్గొనడంలేదని తెలిసింది. ఈ దీక్ష సందర్భంగా ఇందిరా పార్కు పరిసర ప్రాంతాలలో పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే దీక్ష రోజున భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా, ఎంపిలు చేయతలపెట్టిన సంకల్ప దీక్షకు కేంద్ర మంత్రి పల్లంరాజు మద్దతు పలికారు.