రాయలసీమకు అన్యాయం చేస్తే ఊరుకోం.. | Rayalaseema JAC Leaders Sankalpa Deeksha In YSR Kadapa | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట సంకల్ప దీక్ష

Published Fri, Jan 17 2020 2:39 PM | Last Updated on Fri, Jan 17 2020 2:52 PM

Rayalaseema JAC Leaders Sankalpa Deeksha In YSR Kadapa - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: కడప జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట రాయలసీమ ప్రజా సంఘాల జేఏసీ నేతలు శుక్రవారం సంకల్ప దీక్షకు పూనుకున్నారు. నాలుగు జిల్లాల నుంచి రాయలసీమ ఉద్యమ నేతలు పెద్ద ఎత్తున ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని నేతలు స్వాగతించారు. శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం పాలన, అభివృద్ధి వికేంద్రీకరణలో రాయలసీమకు సమన్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. రాయలసీమకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ దీక్షలో రాయలసీమ జేఏసీ ముఖ్య నేతలు నాగిరెడ్డి, దశరథ రామిరెడ్డి, సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: పవన్‌తో​ బీజేపీకి నష్టమే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement