తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి | Samaikya activists attacks on telangana activists | Sakshi
Sakshi News home page

తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి

Published Sat, Jan 4 2014 3:24 PM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM

తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి

తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి

హైదరాబాద్: తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి, గందరగోళం మధ్య సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీల సంకల్పదీక్ష ముగిసింది. శుక్రవారం ప్రారంభించిన దీక్షను ఈ రోజు మంత్రి  శైలజానాథ్‌ విరమింపజేశారు. ఆ సమయంలో  కొందరు తెలంగాణవాదులు వచ్చి తెలంగాణ నినాదాలు చేశారు. దాంతో తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి చేశారు.

ఎంపిలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, జి.వి.హర్ష కుమార్లు నిన్న ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో సంకల్ప దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్‌లు గైర్హాజరు కాగా, రాయపాటి సాంబశివరావు మాత్రం నిన్న సాయంత్రం నాలుగు గంటలకు దీక్షకు హాజరయ్యారు.  సంకల్ప దీక్షకు పలువురు  రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సమైక్యవాదులు మద్దతు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement