Samaikya activists
-
దాడులు ఆగాలంటే బిల్లు పాస్ చేయండి: కోదండరాం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి వస్తున్న సమైక్య ఉద్యమకారులు హింసాత్మక ఘటనలకు తెగబడే అవకాశం ఉన్నట్టు తమకు సమాచారం అందుతోందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. వారు దాడులకు పాల్పడకుండా తమకు తెలిసిన విషయాలను ఢిల్లీ పోలీసులకు లిఖితపూర్వకంగా ఇచ్చామన్నారు. ఆధిపత్యం కోసం సీమాంధ్ర నాయకులు ఓవైపు దాడులకు పాల్పడుతుంటే, మరోవైపు తెలంగాణ ఏర్పడదేమోనన్న ఆవేదనతో తెలంగాణ విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇవన్నీ ఆగాలంటే తెలంగాణ బిల్లును కాంగ్రెస్, బీజేపీలు త్వరగా పాస్ చేయాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలోని ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ నివాసంలో జరిగిన టీజేఏసీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు స్పీకర్‌పైనే పెప్పర్ చల్లేందుకు వెనుకాడని కొందరు సీమాంధ్ర ఎంపీలు డబ్బులతో మిగతా ఎంపీలను మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఢిల్లీలో ధర్నాకు వచ్చే ఏపీఎన్జీవో, వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోందని దేవీప్రసాద్ ఆరోపించారు. లోక్‌సభలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పరువుతీసిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ వారసులు కొందరు ఢిల్లీకి పయనమయ్యారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే జరిగే పరిణామాలకు సీమాంధ్ర నాయకులే బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ బిల్లును అడ్డుకుంటే హైదరాబాద్ అగ్గి అవుతుందని ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ హెచ్చరించారు. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుందని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌ను సీమాంధ్ర పెట్టుబడిదారులు దోచుకున్నారని, యూటీ చస్తే పూర్తిగా లూటీ అవుతుందని అన్నారు. సీమాంధ్రులు ఫైవ్ స్టార్ హోటళ్లు కట్టుకుంటే తెలంగాణ వాళ్లు పాన్‌డబ్బాలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. లోక్‌సభలో పథకం ప్రకారమే సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టించారని చెప్పారు. తాము కూడా దౌర్జన్యాలకు దిగదలచుకుంటే వారు ఉండరని హెచ్చరించారు. లోక్‌సభలో బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీలు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారని, వారు అన్నంత పనీ చేస్తారేమోనని అడ్డుకోబోయామని చెప్పారు. తాము ఎవరిపైనా దాడులు చేయలేదన్నారు. -
కేంద్ర కార్యాలయాలు మూత
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదముద్ర వేస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఏపీఎన్జీవో నేతలతో పాటు సమైక్యవాదులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. అనంతపురంలో ప్రభుత్వ వైద్యులు సర్వజనాసుపత్రిలో ఓపీ విభాగాన్ని మూసివేసి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఎన్జీవోనేతలు కలెక్టరేట్లో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అనంతపురంలో టీడీపీ నేతలు రాష్ట్రపతి బొమ్మతో శవయాత్ర నిర్వహించి.. పిండ ప్రదానం చేశారు. కడప జిల్లాలోని పోస్టల్, టెలికాం, పీఎఫ్, ఐఓసీతో పాటు అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. పులివెందులలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేరుగా ఆందోళన చేపట్టారు. చిత్తూరు జిల్లాలో తిరుపతి, మదనపల్లె, చిత్తూరు ఆర్డీవో కార్యాలయాల్లో, కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. గ్రీవెన్స్ సెల్ నిర్వహించలేదు. చిత్తూరు, మదనపల్లె, తిరుపతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏపీ ఎన్జీవోలుకొంతసేపు నిరసన తెలిపారు. కర్నూలులోని ఆదాయపు పన్ను కార్యాలయం, సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయం, పాతబస్టాండ్, బి.క్యాంప్‌లోని ప్రధాన పోస్టల్ కార్యాలయాలు, రివర్వ్యూ కాలనీలోని ఎల్ఐసీ, వివిధ టెలికాం కార్యాలయాలను ఉద్యోగులు ముట్టడించారు. ప్రజాదర్బార్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా కలెక్టర్ జోక్యంతో వెనుదిరిగారు. శ్రీకాకుళంలో సమైక్యవాదులు పోస్టాఫీసు, బీఎస్ఎన్ఎల్, బీమా సంస్థల కార్యాలయాల వద్దకు వెళ్లి విధులు నిర్వహించకుండా సిబ్బందిని అడ్డుకున్నారు. అనంతరం వారిని బయటకు పంపి కార్యాలయాలను మూసివేయించారు. జిల్లా పరిషత్ ఉద్యోగులు విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట మానవహారం చేపట్టారు. రె వెన్యూ ఉద్యోగులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద దీక్ష చేశారు. విజయనగరం జిల్లాలో ఉద్యోగులు పోస్టల్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలను మూయించారు. కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌సెల్‌ను అడ్డుకున్నారు. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట తెలుగు జాతి దుష్టశక్తులకు శాంతి హోమం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, చింతలపూడిలో బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, సెంట్రల్ ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్ తదితర కార్యాలయూలకు సమైక్యవాదులు తాళాలు వేరుుంచారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎన్జీఓలు తపాలా, ఎల్ఐసీ, ఎఫ్‌సీఐ, బీఎస్ఎన్ఎల్ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూయించి వేశారు. కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజమండ్రిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు సీటీఆర్ఐ, ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల కార్యాలయాల ఎదుట ఎన్జీఓలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్రేటర్ విశాఖ మున్సిసిపల్ కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట జీఓఎం సభ్యుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. -
గందరగోళం మధ్యన ఎమ్.పిలు దీక్ష విరమణ
-
తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి
హైదరాబాద్: తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి, గందరగోళం మధ్య సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల సంకల్పదీక్ష ముగిసింది. శుక్రవారం ప్రారంభించిన దీక్షను ఈ రోజు మంత్రి శైలజానాథ్ విరమింపజేశారు. ఆ సమయంలో కొందరు తెలంగాణవాదులు వచ్చి తెలంగాణ నినాదాలు చేశారు. దాంతో తెలంగాణవాదులపై సమైక్యవాదుల దాడి చేశారు. ఎంపిలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, జి.వి.హర్ష కుమార్‌లు నిన్న ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో సంకల్ప దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్‌లు గైర్హాజరు కాగా, రాయపాటి సాంబశివరావు మాత్రం నిన్న సాయంత్రం నాలుగు గంటలకు దీక్షకు హాజరయ్యారు. సంకల్ప దీక్షకు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సమైక్యవాదులు మద్దతు తెలిపారు.