
సిరిసిల్ల: లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో తెలంగాణ ఎంపీలు కీలక పాత్ర పోషిస్తారని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జాతీయ పార్టీలు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలు సొంతంగా ప్రభుత్వా న్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు. 35 ఏళ్ల కిందటే కాంగ్రెస్ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసే సామర్థ్యాన్ని కోల్పోయిందని వినోద్‌కుమార్ అన్నారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటమితప్పదన్నారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ వస్తే.. టీఆర్‌ఎస్ ఎంపీల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. తెలంగాణకు అనేక ప్రయోజనాలు దక్కుతాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment