national parties
-
జగన్‌కు ఫస్ట్ టైం... అయినా సూపర్ సక్సెస్
వైఎస్సార్సీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన భారీ ధర్నా రెండు లక్ష్యాలను నెరవేర్చిందని చెప్పాలి.ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న ఆటవిక పాలన తీరుతెన్నులను రాజధాని ఢిల్లీ వేదికగా దేశ ప్రజలందరికి వెల్లడించగలిగారు. అదే టైంలో ఇంతకాలం దాదాపు ఒంటరియానం చేసిన వైఎస్సార్సీపీకి తోడు ఎవరైనా వస్తారా?అన్న డౌటు వచ్చినవారికి ఒక సమాధానం లభించినట్లయింది. మొత్తం.. తొమ్మిది రాజకీయ పార్టీల ప్రముఖులు ఈ ధర్నాకు వచ్చారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజవాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ ధర్నాకు వచ్చి సంఘీభావం తెలపడం హైలైట్ అని చెప్పాలి.డిల్లీ ధర్నాలో ఫోటో ఎగ్జిబిషన్‌ను ఈ నేతలు తిలకించారు. ఏపీలో టీడీపీ గూండాలు అరాచకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలను నరికి చంపడం, ఆస్తులు విధ్వంసం, ఎంపీ కార్లను సైతం ద్వంసం చేయడం వంటి సన్నివేశాలను చూసి ఈ నేతలంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఇంత ఘోరంగా ఉందా?ఆయన కుమారుడు లోకేష్ ఇంత అరాచకంగా రెడ్ బుక్ అని పెట్టి ప్రత్యర్ధి రాజకీయ పార్టీలవారిని బెదిరించడం, ఆయన మనుషులు దాడులకు పాల్పడడం వంటివి చేస్తుంటే చర్యలు తీసుకునే పరిస్థితి లేదా? అని విస్తుపోయారు. అసలు రెడ్ బుక్ కాన్సెప్ట్ అన్నదే కొత్తది అయితే,అలాంటివాటిని అమలు చేస్తున్నవారిపై కేసులు పెట్టవలసిన పరిస్థితి ఉండగా, టీడీపీ రాక్షసపాలనను అడ్డుకునేవారే లేకుండా పోయారని ఆయా పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో.. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వ డొల్లతనం బయట రాష్ట్రాల నేతలకు కూడా కళ్లకట్టినట్లు చెప్పినట్లయింది. జగన్ వీరందరికి దగ్గరుండి ఆ వివరాలు తెలియచేయడమే కాకుండా వీడియో క్లిప్పింగ్ లను కూడా ప్రదర్శించారు. అదే సమయంలో.. జగన్ ఢిల్లీ ధర్నాను తక్కువ చేసి చూపడానికి మద్యం పై శ్వేతపత్రం డ్రామాను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఢిల్లీ ధర్నాకు మొదటి పేజీలో కవరేజీ ఇవ్వకుండా , చంద్రబాబు శ్వేతపత్రానికే ప్రాధాన్యం ఇచ్చి, ఎప్పటికీ తాము చంద్రబాబు భజనలోనే తరిస్తామని తేటతెల్లం చేసింది.చంద్రబాబు పత్రం గురించి వార్తలు ఇవ్వడం తప్పుకాదు. కానీ, ఒక ప్రధాన పార్టీ ఢిల్లీలో అంత పెద్ద ధర్నా చేపడితే కవరేజీ ఇవ్వడానికి వారికి మనసు రాలేదు. జర్నలిజం ప్రమాణాలను రోజురోజుకు దిగజార్చుతున్న వైనం కనిపిస్తూనే ఉంది. ఇక వైఎస్సార్సీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలంతా ఈ ధర్నాలో పాల్గొనడం,రాష్ట్రం నలుమూలల నుంచి ముఖ్యమైన నేతలు, కార్యకర్తలు తరలివెళ్లడం ద్వారా పార్టీలో నైతిక స్పూర్తి వచ్చినట్లయింది.దీంతో రాష్ట్రంలో ఈ దాడుల పర్వం కాస్త ఆగే అవకాశం ఉంది.అలాగే పోలీసులు కూడా తాము మరీ అప్రతిష్ట పాలవుతున్నామన్న భావనతో దాడులకు పాల్పడ్డవారిపై కొంతమేర అయినా చర్యలు తీసుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేశ వ్యాప్తంగా దాదాపు ఈ నేతలందరితో పరిచయాలు ఉన్నాయి. గతంలో ప్రత్యేక హోదా అంశం సమయంలో డిల్లీలో ఆయన కూడా ధర్నాలు నిర్వహించి ,ఆయా రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. అటు కాంగ్రెస్ తోను, ఇటు బీజేపీతోను ఆయన కూటమి కట్టిన అనుభవం ఉంది. అందువల్ల వారందరి దృష్టిలో చంద్రబాబు పాలనపై తక్కువ అబిప్రాయం కలుగుతుంది. అది కూడా ఆయనకు అప్రతిష్ట అవుతుంది. ఈ రకంగా వైసిపి ధర్నా ఎపిలో సాగుతున్న దమనకాండకు ముగింపు పలకడానికి ఉపయోగపడుతుంది. మరో కోణం చూద్దాం.. ఇంతకాలం వైఎస్సార్సీపీ వివిధ కారణాల రీత్యా ఏ ఇతర రాజకీయపార్టీలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోలేదు. ఒకప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నా, ఆ తర్వాత పరిణామాలలో జగన్ ను ఆ పార్టీ ఇబ్బంది పెట్టినందున దానికి దూరం అయ్యారు. బీజేపీ వారికి సానుభూతి ఉన్నా, గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ మద్దతు ఏదో రకంగా తీసుకున్నా.. ఇప్పుడు వారు టీడీపీతో ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నందున వైఎస్సార్సీపీకి సహకరించే పరిస్థితి లేదు. కనీసం సంఘీభావం ప్రకటించలేదు. దీంతో అటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీయే కూటములకు సమదూరంలో ఉంటూనే వైఎస్సార్సీపీ తోడు ఎవరు వస్తారా? అని ప్రశ్న తలెత్తింది. ఆ తరుణంలో సమాజ్‌వాదీ పార్టీతో సహా తొమ్మిది పార్టీలు ధర్నాకు హాజరై వైఎస్సార్సీపీ మద్దతు ఇవ్వడం , చంద్రబాబు పాలనను తప్పు పట్టడం, అధికారం ఎవరికి శాశ్వతం కాదని చెప్పడం వంటివాటితో జగన్ కు జాతీయ స్థాయిలో మంచి పట్టే ఉందనే భావన కలుగుతోంది. జగన్‌ను తొమ్మిది పార్టీలు కలిస్తే, వాళ్లలో ఒక్క అన్నాడీఎంకే తప్ప మిగిలినవన్నీ ఇండి కూటమిలోనే పార్టీలే. ఉద్దావ్ ధాక్రే వర్గానికి చెందిన శివసేన నేత అయితే నేరుగా వైస్సార్సీపీని ఇండియా కూటమిలో చేరాలని పిలుపు ఇచ్చారు. అలా చేస్తారన్న గ్యారంటీ లేదు. కాని,జగన్ భవిష్యత్తులో ఆయా రాజకీయ పక్షాలతో సత్సంబంధాలు నెరపడానికి అవకాశం ఉంది. బీజేపీ,కాంగ్రెస్ తో పాటు వామపక్షాలవారు కూడా ఈ ధర్నాకు రాలేదు. వామపక్షాలవారు కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా.. మొదలైన పార్టీల నేతలు వచ్చారు. లోక్ సభ మాజీ స్పీకర్ తంబిదురై ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ లెక్కన.. జాతీయ కూటమిలో చేరడమో,లేక ప్రాంతీయ పార్టీలను కలుపుకుని కొత్త శక్తిగా తయారవడమో అనే అంశాలపై జగన్ ఆలోచిస్తారేమో చూడాల్సి ఉంది. అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమిలో అత్యంత కీలకమైన నేతగా ఉన్నారు. ఆయన ఈ ధర్నాకు రావడంతో ఉత్తరాది రాష్ట్రాలలో రాజకీయ పక్షాల దృష్టి ఇటువైపు పడుతుంది. ఆ రకంగా వైఎస్సార్సీపీకి ఇది ఉపయోగపడుతుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ రావడంతో పశ్చిమబెంగాల్ లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సానుభూతి కూడా లభించినట్లయింది. డీఎంకే అధినేత స్టాలిన్ వంటివారు తమ ప్రతినిధిని పంపించి ఉండాల్సింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక ఎంపీని పంపించి ఉంటే రాజకీయంగా చాలా ప్రాధాన్యత వచ్చేదేమో!. కాని ఇంకా ఆ పరిస్థితి రాలేదు. రాజకీయాలలో ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటారు. ప్రస్తుతం బీజేపీ-కాంగ్రెస్ ఆ దశలోనే ఉన్నాయి. ఈ రెండు కూటములలో వైఎస్సార్సీపీకి స్థానం లేకుండా చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జగన్ ప్రజలను నమ్ముకుంటే.. చంద్రబాబు వ్యూహాలపై ఆదారపడి రాజకీయాలు చేస్తుంటారు. అయితే జగన్ ఇప్పటికైనా వాటన్నింటిని గమనించి మొదటిసారి జాతీయ స్థాయిలో తన రాజకీయం చేసి సఫలం అయ్యారని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మూడు పార్టీలకు జాతీయ హోదా రద్దు చేసిన కేంద్రం ఎన్నికల సంఘం
-
దేశంలో ప్రస్తుతం ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయంటే..
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: సీపీఐకి జాతీయ హోదాను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుపట్టారు. దీనిపై అప్పీలుకు వెళతామని ప్రకటించారు. త్వరలో జాతీయ హోదా పునరుద్ధరణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వందేళ్ల చరిత్ర ఉన్న సీపీఐ స్వాతంత్య్ర ఉద్యమంలోనూ పాల్గొన్నదని, ఈసీ నిర్ణయం విచారకరమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఈసీ కేవలం సాంకేతిక అంశాలనే పరిగణనలోకి తీసుకుందన్నారు. అయినా సీపీఐ ప్రజల్లో ఉంటుందని, ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటుందని ప్రకటించారు. ఇక సీపీఐకి జాతీయ హోదా రద్దు, ఆప్‌కు హోదా ఇవ్వడంలో రాజకీయ కుట్ర కోణం దాగి ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే ఆప్‌కు జాతీయ పార్టీ హోదా కట్టబెట్టారని ఆరోపించారు. జాతీయ పార్టీగా సీపీఐకి ప్రజల్లో గుర్తింపు ఉంటుందని, దాన్ని ఎవరూ చెరిపివేయలేరని పేర్కొన్నారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తించిన విషయం తెలిసిందే. ఢిల్లీ, గోవా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కనబర్చిన పనితీరు ఆధారంగా ఆప్‌కు జాతీయ పార్టీ హోదా కల్పిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లకు ఇప్పటిదాకా ఉన్న జాతీయ పార్టీ హోదాను ఉపసంహరించుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్కు, ఉత్తరప్రదేశ్‌లో ఆర్ఎల్డీ, మణిపూర్‌లో పీడీఏ, పుదుచ్చేరిలో పీఎంకే, పశ్చిమబెంగాల్లో ఆర్ఎస్సీ, మణిపూర్‌లో ఎంపీసీ పార్టీలకు ఇప్పటివరకు ఉన్న రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక నాగాలాండ్‌లో ఎన్సీపీ, మేఘాలయలో టీఎంసీలకు త్వరలో రాష్ట్ర పార్టీ హోదా కల్పించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. నాగాలాండ్‌లో లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్), మేఘాలయలో వాయిస్ ఆఫ్ ద పీపుల్ పార్టీ, త్రిపురలో తిప్రా మోతా పార్టీలకు ‘గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీ’ హోదా ఇస్తున్నట్టు వెల్లడించింది. సంబంధిత పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు, సమీక్షల తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు వివరించింది. ప్రస్తుతం జాతీయ పార్టీలు ఆరు ఎన్నికల సంఘం తాజా చర్యల మేరకు ప్రస్తుతం దేశంలో ఆరు పార్టీలకు జాతీయ హోదా ఉన్నట్టయింది. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ఆమ్ ఆద్మీ పార్టీ ఈ జాబితాలో ఉన్నాయి. ► జాతీయ హోదా పొందిన ఆప్‌ను అరవింద్ కేజ్రీవాల్ 2012లో స్థాపించారు. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. అతి తక్కువ సమయంలోనే తమ పార్టీకి జాతీయ హోదా దక్కడం పట్ల కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ►1925లో ఏర్పాటైన సీపీఐ 1989లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినడం, దేశవ్యాప్తంగా కూడా తగిన సంఖ్యలో లోక్‌సభ సీట్లను సాధించలేకపోవడంతో జాతీయ హోదాను కోల్పోయింది. ►జాతీయ హోదా కోల్పోయిన టీఎంసీని 1998లో మమతా బెనర్జీ స్థాపించారు. టీఎంసీ 2004లో రాష్ట్ర పార్టీ హోదా పొందింది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపురకూ విస్తరించగా.. 2016లో జాతీయ పార్టీ హోదా వచి్చంది. కానీ తర్వాత పెద్దగా ప్రభావం చూపకపోవడంతో హోదా కోల్పోవాల్సి వచ్చింది. ►శరద్‌పవార్ 1999లో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి ఎన్సీపీని స్థాపించారు. వివిధ ఎన్నికల్లో విజయం సాధించడంతో 2000 సంవత్సరంలో జాతీయ హోదా లభించింది. తర్వాత ప్రభావం తగ్గిపోయింది. ఏపీలో పోటీ చేయకపోవడంతో బీఆర్ఎస్కు హోదా రద్దు తెలంగాణ ఏర్పాటు నినాదంతో 2001లో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) ఏర్పాటైంది. 2004 సాధారణ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న నేపథ్యంలో.. రాష్ట్ర పార్టీ హోదా కోసం తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ 16 చోట్ల బరిలోకి దిగింది. తెలంగాణలో ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడంతోపాటు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకశాతం ఓట్లు సాధించింది. ఈ నేపథ్యంలో 2004 ఎన్నికల తర్వాత రాష్ట్ర పార్టీ హోదా దక్కింది. 2009 సాధారణ ఎన్నికలతోపాటు తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఏ ఇతర ఎన్నికల్లోనూ ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. అయినా ఉమ్మడి రాష్ట్రంనాటి రాష్ట్ర హోదా గుర్తింపు.. విభజన తర్వాత కూడా ఏపీలో కొనసాగింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం సమీక్షలో ఆ హోదాను కోల్పోయింది. -
జాతీయ పార్టీలకు రూ.15,077 కోట్లు.. ఎవరిచ్చారో అస్సలు తెలియదు!
న్యూఢిల్లీ: జాతీయ పార్టీలు 2004 నుంచి 2021 వరకు వివరాలు వెల్లడించని వ్యక్తులు, సంస్థల నుంచి సుమారు రూ.15,077.97 కోట్లు విరాళాలు అందుకున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్-ఏడీఆర్ నివేదిక తెలిపింది. అయితే.. ఒక్క 2020-21 ఆర్థిక ఏడాదిలోనే జాతీయ, ప్రాంతీయ పార్టీలు గుర్తు తెలియని వారి నుంచి రూ.690.67 కోట్లు విరాళంగా స్వీకరించినట్లు పేర్కొంది. ఈ నివేదికలో.. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ వంటి ఎనిమిది జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకుని వివరాలు వెల్లడించింది ఏడీఆర్. 2004-05 నుంచి 2020-21 వరకు ఎన్నికల సంఘానికి పార్టీలు సమర్పించిన విరాళాలు, ఆదాయపన్ను రిటర్న్‌ల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది ఏడీఆర్. ఎలాంటి వివరాలు వెల్లడించని వ్యక్తులు, సంస్థల నుంచి జాతీయ పార్టీలు సుమారు రూ.15,077.97 కోట్లు విరాళంగా అందుకున్నట్లు స్పష్టం చేసింది. ‘2020-21 ఆర్థిక ఏడాదిలో 8 జాతీయ పార్టీలు గుర్తుతెలియని వారి నుంచి రూ.426.74 కోట్లు అందుకోగా.. 27 ప్రాంతీయ పార్టీలు రూ.263.928 కోట్లు విరాళంగా పొందాయి.’అని తెలిపింది ఏడీఆర్. తొలిస్థానంలో కాంగ్రెస్.. 2020-21లో కాంగ్రెస్ పార్టీ రూ.178.782 కోట్లు వివరాలు వెల్లడించని వ్యక్తులు, సంస్థల నుంచి పొందిందని, అది మొత్తం జాతీయ పార్టీలు పొందిన దాంట్లో 41.89 శాతమని తెలిపింది ఏడీఆర్. ఇదే అత్యధికమని పేర్కొంది. మరోవైపు.. బీజేపీకి రూ.100.502 కోట్లు అందాయి. అది మొత్తం వివరాలు లేని వారి నుంచి అందిన దాంట్లో 23.55 శాతంగా తెలిపింది. మరోవైపు.. వివరాలు లేని సోర్స్‌ల నుంచి ఎక్కువ మొత్తంలో విరాళాలు అందుకున్న మొదటి ఐదు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ రూ.96.2507 కోట్లు, డీఎంకే రూ.80.02 కోట్లు, బీజేడీ రూ.67 కోట్లు, ఎంఎన్ఎస్ రూ.5.773 కోట్లు, ఆప్ రూ.5.4కోట్లుగా నివేదిక తెలిపింది. ఇదీ చదవండి: Cartoon Today: రాజకీయ పార్టీలకు కోవిడ్ దెబ్బ.. 41 శాతం తగ్గిన విరాళాలు -
రాజకీయ పార్టీలకు కోవిడ్ దెబ్బ.. 41 శాతం తగ్గిన విరాళాలు
రాజకీయ పార్టీలకు కోవిడ్ దెబ్బ.. 41 శాతం తగ్గిన విరాళాలు -
తెలంగాణ: 7 జాతీయ, 4 ప్రాంతీయ పార్టీలు
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో 7 జాతీయ, నాలుగు ప్రాంతీయ పార్టీలకు గుర్తింపు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో 4 శాతం ఓట్లు సాధిస్తే జాతీయ పార్టీగా, ఏదైనా పార్టీ ఒక రాష్ట్రం లేదా ప్రాంతంలో 4 శాతం ఓట్లు సాధిస్తే దాన్ని రాష్ట్ర లేదా ప్రాంతీయ పార్టీగా పరిగణిస్తారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎన్నికల గుర్తులను ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. సిద్ధాంత రీత్యా లేదా వ్యక్తుల వల్ల పార్టీలు చీలిపోయినప్పుడు ఆ పార్టీ గుర్తు ఏ వర్గానికి కేటాయించాలన్న వివాదం ఏర్పడడం సహజమే. అలాంటప్పుడు సమస్య పరిష్కార చర్య ఎన్నికల సంఘమే తీసుకుంటుంది. రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీలు సాధారణంగా ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పాటు రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీలు పోటీలో ఉంటాయి. ఈ పార్టీలను కొందరు వ్యక్తులు లేదా సంస్థలు ఎన్నికల సంఘంలో నమోదు చేసుకుంటాయి. ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకపోయినా అవి అలాగే కొనసాగుతుంటాయి. ఒకవేళ పోటీ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులకు ఎన్నికలప్పుడు ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌గా ఉంచిన వాటిలో నుంచి గుర్తులు కేటాయిస్తుంది. వారికి స్వతంత్య్ర అభ్యర్థుల కన్నా ముందు గుర్తులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తారు. దేశంలో సుమారు 1,983 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీలు ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో 73 వరకు ఉంటాయి. తెలంగాణ జన సమితి, జనసేన, లోక్‌సత్తా, ఏఐఎఫ్బీలను ఇదే కోవలో పరిగణిస్తారు. రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించేందుకు ఎన్నికల సంఘం 164 ఫ్రీ సింబల్స్‌ను సిద్ధంగా ఉంచింది. జాతీయ పార్టీలు దేశంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు కేటాయించిన గుర్తులను ఇతర పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంది. దేశంలో ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ), కమ్యూనిస్టు పార్టీ ఇండియా(సీపీఎం), ఆలిండియా కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీలుగా గుర్తించింది. ప్రాంతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సంఘం గుర్తింపు పొందాయి. మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం–పతంగి గుర్తు), తెలంగాణ రాష్ట్ర సమితి (కారు గుర్తు), తెలుగుదేశం పార్టీ(సైకిల్ గుర్తు), వైఎస్సార్సీపీ (సీలింగ్ ఫ్యాన్ గుర్తు)లను ఎన్నికల సంఘం గుర్తించింది. -
ఆ పార్టీలకు రూ 11,234 కోట్ల అజ్ఞాత విరాళాలు
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ పార్టీలు 2004-05 నుంచి 2018-19 వరకూ అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి రూ 11,234 కోట్ల విరాళాలను అందుకున్నాయని ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఏడు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీలు ఈసీకి సమర్పించిన వివరాలను పరిశీలించిన మీదట ఏడీఏ ఈ నివేదికను రూపొందించింది. రూ 20000 కంటే తక్కువ విలువైన విరాళాలను పార్టీలు అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చిన నిధులుగా ఆయా పార్టీలు ఐటీ రిటన్స్‌లో పేర్కొంటాయి.ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు, కూపన్ల అమ్మకాలు, రిలీఫ్ ఫండ్, ఇతర ఆదాయం, స్వచ్ఛంద విరాళాలు, సమావేశాలు, మోర్చాల్లో వసూలైన మొత్తాలు వంటి రాబడిని అజ్ఞాత మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణిస్తారు. 2004-05 నుంచి 2018-19 వరకూ జాతీయ రాజకీయ పార్టీలు రూ 11,234 కోట్లు ఈ మార్గాల ద్వారా సమీకరించినట్టు ఏడీఆర్ వెల్లడించింది. ఇక 2018-19లో రూ 1612 కోట్లు ఈ మార్గం ద్వారా వచ్చినట్టు బీజేపీ వెల్లడించింది. ఆ ఏడాది రాజకీయ పార్టీలకు వచ్చిన అజ్ఞాత నిధుల్లో (రూ 2512 కోట్లు) ఇవి 64 శాతం కావడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ రూ 728.88 కోట్లు అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి నిధులను సమీకరించినట్టు పేర్కొంది. ఇక 2004-05 నుంచి 2018-19 వరకూ కాంగ్రెస్, ఎన్సీపీలు కూపన్ల అమ్మకం ద్వారా ఉమ్మడిగా ఆర్జించిన మొత్తం రూ 3902.63 కోట్లని ఏడీఆర్ పేర్కొంది. చదవండి : ఆ మంత్రులంతా కోటీశ్వరులే.. -
గెలిస్తేనే ఆ పార్టీలు నిలిచేది..!
సాక్షి, హైదరాబాద్: ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జీవన్మరణ సమస్యగా మారుతాయనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో జరిగిన వరుస ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పరాజయం పాలవుతూ వస్తున్నాయి. మే 23న రానున్న లోక్‌సభ ఫలితాలు ఆయా పార్టీల మనుగడపై ప్రభావం చూపుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ దూకుడు ముందు నిలబడలేకపోతున్న రెండు ప్రధాన జాతీయ పక్షాలకు లోక్‌సభ ఎన్నికల్లోనూ కనీసస్థాయి ఫలితాలు కూడా రాని పక్షంలో రాష్ట్రంలో ఆ పార్టీలు ఇప్పట్లో కోలుకోవడం కష్టమేననే చర్చ జరుగుతోంది. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కొద్దో గొప్పో నెట్టుకురావచ్చని, ఫలితాలు తారుమారై అది కూడా జరగకపోతే మాత్రం రెండు జాతీయ పార్టీలపై ఈసారి తీవ్ర ప్రభావం ఉంటుందనే వాదన వినిపిస్తోంది. భవిష్యత్తుపై ఆశలు ‘గల్లంతే’ మరో ప్రధాన జాతీయపార్టీ బీజేపీకి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తును కూడా లోక్‌సభ ఎన్నికలు నిర్దేశించనున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన ఏ ఎన్ని కల్లోనూ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన ఆ పార్టీ ఈసారి బ్యాలెట్ బాక్సుల ముందు బొక్కాబోర్లా పడితే రాష్ట్రంలో నిలదొక్కుకోవడమే కష్టమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఆ పార్టీకి ఉన్న గట్టిపట్టు సడలిపోయిందని, ఈసారి లోక్‌సభ ఫలితాల్లో కనీసస్థాయిలో ఓట్లు రావడంతోపాటు జంటనగరాల్లో ఒక పార్లమెంటు స్థానం కూడా గెలవలేకపోతే కమలనాథులకు కష్టకాలమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోదీ సారథ్యంలో మళ్లీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైతే కొంత మనుగడ సాధ్యమవుతుందని, అది కూడా రూటు మారితే మాత్రం ఇక దక్షిణాదిలో, ముఖ్యంగా తెలంగాణలో ఔటయినట్టేనని బీజేపీనేతలే అంటున్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజకీయ వ్యూ హం నిర్దేశించడంలో జాతీయ నాయకత్వం, అమలు చేయడంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమయ్యాయి. కేంద్రంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రాన్ని రాజకీయంగా చేతుల్లోకి తీసుకోవాల్సి ఉంది. 2014 ఎన్నికలు ముగిసిన తొలినాళ్లలో ఆ దిశలో కొంత కసరత్తు చేసిన జాతీయ నా యకత్వం ఆ తర్వాత చేతులెత్తేసింది. మొక్కుబడి వ్యూహాలను మాత్రమే అమలు చేసింది. అప్పుడే ఇత ర పార్టీల్లోని గట్టినేతలను పార్టీలోకి తీసుకుని 2018 ఎన్నికలను పటిష్టంగా ఎదుర్కొని ఉంటే ఇప్పుడు కీలకంగా ఉండేవాళ్లం. కానీ అది జరగలేదు. ఈ ఎన్నికల్లోనూ ప్రతిభ చూపెట్టకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగే పార్టీ పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు’అని బీజేపీ రాష్ట్రస్థాయి నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తంమీద ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ స్థాయి రాజకీయ వ్యూహం చేస్తున్న ప్రాంతీయపార్టీ టీఆర్ఎస్ ముందు ఈ రెండు జాతీయపార్టీలు నిలుస్తాయా? లోక్‌సభ ఎన్నికల్లో కనీసస్థాయిలో అయినా ఫలితాలు సాధించి కొంతమేరైనా నిలదొక్కుకుంటా యా? పేరుకే జాతీయ పార్టీలుగా మిగిలిపోతాయా? ఓటరన్న ఏం చేస్తాడన్నది మే 23న తేలాల్సిందే! కాంగ్రెస్.. ఖల్లాసే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం, ఆ పార్టీ నుంచి పెద్దఎత్తున టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతుండటంతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో చాలాచోట్ల కాంగ్రెస్‌కు కేడర్ లేకుండా పోయింది.లోక్‌సభ ఫలితాలు ప్రతికూలంగా వచ్చి కనీస ప్రతిభ కనబర్చకపోతే మాత్రం ఖల్లాసయినట్టేనని ఆపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం 2 స్థానాల్లో గెలవడంతోపాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు గౌరవప్రదమైన సీట్లు వస్తేనే పార్టీ మనుగడ సాధ్యమవుతుందనే చర్చ పార్టీలో బహిరంగంగానే జరుగుతోంది. ‘అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీలోని ముఖ్యులంతా వెళ్లిపోతున్నారు. ఇప్పుడు మా పార్టీలో వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మంది మాత్రమే కీలక నేతలున్నారు. వారిలో దాదాపు అందరూ ఈ సారి లోక్‌సభ బరిలో దిగారు. ఇప్పుడు వారు కూడా గెలవకపోతే ఇక రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న నేతలు లేనట్టే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే తీవ్ర నైరాశ్యంలో ఉన్న పార్టీ కేడర్ నిలబడే పరిస్థితి ఉండదు. మరికొందరు నేతలు కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతారు. లోక్‌సభ ఫలితాలు ఏమాత్రం తారుమారైనా మా ఉనికి గల్లంతే’అని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, లోక్‌సభ ఫలితాల్లో చేదు అనుభవం ఎదురైతే మాత్రం ఇంకొంత మంది జంప్ అవుతారనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. మొత్తంమీద లోక్‌సభ ఎన్నికల్లో కనీస స్థాయిలో సీట్లు, ఓట్లు రాకపోతే మాత్రం పార్టీకి సారథ్యం వహించడం కూడా సాధ్యం కాదని, అలాంటి పరిస్థితుల్లో పార్టీ కోలుకునేందుకు ఏళ్లు పడుతుందని, లేదంటే తమిళనాడు తరహా పరిస్థితులు ఏర్పడతాయనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలోనే వ్యక్తమవుతోంది. -
‘కేంద్రంలో తెలంగాణ ఎంపీల పాత్ర కీలకం’
సిరిసిల్ల: లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో తెలంగాణ ఎంపీలు కీలక పాత్ర పోషిస్తారని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జాతీయ పార్టీలు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలు సొంతంగా ప్రభుత్వా న్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు. 35 ఏళ్ల కిందటే కాంగ్రెస్ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసే సామర్థ్యాన్ని కోల్పోయిందని వినోద్‌కుమార్ అన్నారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటమితప్పదన్నారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ వస్తే.. టీఆర్ఎస్ ఎంపీల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. తెలంగాణకు అనేక ప్రయోజనాలు దక్కుతాయని తెలిపారు. -
విరాళాల్లో బీజేపీనే టాప్
న్యూఢిల్లీ : 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను బీజేపీనే అధిక మొత్తంలో విరాళాలు అందుకుంది. 2017 - 18 కి గాను జాతీయ పార్టీలన్నీ కలిపి మొత్తం రూ.469.89 కోట్లు విరాళాలుగా అందుకున్నాయి. అందులో ఒక్క బీజేపీకే 93 శాతం అనగా రూ.437.04 కోట్లు వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) వెల్లడించింది. ప్రతి ఏడాది జాతీయ పార్టీలన్ని తమకు వచ్చిన విరాళాల గురించి ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తాయి. ఈ సమాచారం ప్రకారం ఏడీఆర్ ఈ నివేదికను విడుదల చేసింది. రూ.20 వేలకు పైగా విరాళాలు అందుకున్న జాతీయ పార్టీల వివరాలను ఈ నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీకి రూ.26.658 కోట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రూ.2.087 కోట్లు, సీపీఐ(ఎం) రూ.2.756 కోట్లు, సీపీఐ రూ.1.14 6కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రూ.20 లక్షలు విరాళాలుగా అందుకున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)కి కనీసం రూ.20వేలు కూడా రాలేదని తెలిసింది. కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అందుకున్న విరాళాల కంటే బీజేపీకి వచ్చిన విరాళాలు 12 రెట్లు ఎక్కువ. మొత్తం 4,201 మంది జాతీయ పార్టీలకు విరాళాలు ఇవ్వగా.. అందులో 2,977 మంది బీజేపీకి, 777 మంది కాంగ్రెస్‌కు, 42 మంది ఎన్సీపీకి, 196 మంది సీపీఎమ్‌కు, 176 మంది సీపీఐకి, 33 మంది తృణమూల్‌కు విరాళాలు ఇచ్చినట్లు సదరు నివేదిక తెలిపింది. 2016-17తో పోల్చుకుంటే ఈ ఏడాది జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలు 20 శాతం తగ్గినట్లు ఏడీఆర్ పేర్కొంది. ఆ ఏడాది అన్ని పార్టీలకు కలిపి రూ.589.38 కోట్లు విరాళాలు రాగా.. 2017 - 18 ఏడాదికి గాను రూ.469.89 కోట్ల విరాళాలు వచ్చాయని తెలిపింది. -
రెండు జాతీయ పార్టీలతో అన్యాయం
సాక్షి, హైదరాబాద్: రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం జరిగిన రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం డైరీ, కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మూడో పంట కోసం పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారని, కానీ కరువు కాటకాలతో నిరంతరం ఇబ్బందులు పడుతూ ఒక్క పంటకే గత్యంతరం లేని తెలంగాణకు మాత్రం ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీ య హోదా ఇవ్వలేదని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ కూడా రాష్ట్రానికి అన్యాయం చేశాయని విమర్శించారు. మహారాష్ట్రలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం రూ.4 వేల కోట్ల గ్రాంట్లు ఇచ్చిందన్నారు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ, మహారాష్ట్రలోనూ అదే పార్టీ అధికారంలో ఉండటంతో సాయం చేసిందన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా పట్టించుకోలేదని గుర్తుచేశారు. అందువల్ల 17 ఎంపీ సీట్లూ టీఆర్ఎస్ గెలిస్తే కేంద్రం నుంచి అవసరమైన నిధులు సాధించుకోవచ్చన్నారు. దీంతో వచ్చే పార్లమెంటు ఎన్నికలు అత్యంత కీలకమన్నారు. అన్ని ఎంపీ సీట్లూ గెలిస్తే కేంద్రాన్ని శాసించవచ్చన్నారు. రైతు ఆత్మహత్యలు తగ్గాయి.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా తదితర వ్యవసాయ పథకాలతో తెలంగాణలో రైతు ఆత్మహత్యలు 90 శాతం పైగా తగ్గాయని హరీశ్‌రావు అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు రైతుల పరిస్థితి ఘోరంగా ఉండేదన్నారు. రోజూ పత్రికల్లో రైతు ఆత్మహత్యల సంఖ్యను చూసి బాధపడేవారమన్నారు. కానీ ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల పనితీరు దేశానికే ఆదర్శంగా ఉందన్నా రు. దేశం మొత్తం మన పథకాలనే కాపీ కొడుతోం దని పేర్కొన్నారు. వ్యవసాయం చేసే రైతే సీఎం కావడం వల్లే వ్యవసాయానికి ఆదరణ పెరిగిందన్నారు. ఒకవైపు తమిళనాడు, మరోవైపు మహారాష్ట్ర, ఇంకో వైపు ఢిల్లీలో రైతుల ఉద్యమాలు జరుగుతుంటే, మన రాష్ట్రంలో రైతు సంక్షేమం జరుగుతోందని చెప్పారు. మండలానికో గోదాం కట్టి ఎరువుల కొరత లేకుండా చేశామన్నారు. తెలంగాణలో చేపడుతున్న రైతు అనుకూల విధానాలను మెచ్చుకొని ప్రముఖ వ్యవసాయ నిపుణులు ఎంఎస్ స్వామినాథన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అవార్డు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. స్వామినాథన్‌ను తిట్టిపోసిన ఘనత కాంగ్రెస్ నేతలదని, అందుకే వారికి ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలు, జిన్నింగ్ మిల్లులు, క్రాప్ కాలనీలు రావాల్సి ఉందన్నారు. బంగారు తెలంగాణకు జీడీపీలు ముఖ్యం కాదని, రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలు ఉండటమే నిజమైన అభివృద్ధి అని సీఎం చెప్పారని, అదే స్ఫూర్తితో పనిచేయాలని అధికారులను కోరారు. దేశం తెలంగాణ వైపు చూస్తుంది: పోచారం దేశం యావత్తూ తెలంగాణ వైపు చూస్తోందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్టంలో వ్యవసాయశాఖ ప్రత్యేక స్థానం సంపాదించడంలో కీలక భాగస్వామ్యం వ్యవసాయ శాఖ అధికారులదేనన్నారు. పేదలు, రైతుల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారు. ఏ రాష్ట్రంలో చేయని పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పారు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు వచ్చిందన్నారు. రైతు చనిపోతే వారి కుటుంబీకుల ఖాతాల్లో మూడు రోజుల్లో రూ.5 లక్షలు జమవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్ల ధాన్యం ఎకరాకు పది బ్యాగులు అదనంగా ఈ ఏడాది వచ్చిందన్నారు. పదేళ్లలో దేశంలోనే ధనవంతులైన రైతులు తెలంగాణలోనే ఉంటారన్నారు. వచ్చే 15, 20 ఏళ్ల వరకు టీఆర్ఎస్, కేసీఆర్ మారరని జోస్యం చెప్పారు. వచ్చే ఏడాది నుంచి 42 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. రైతు కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసిందని చెప్పారు. వరి నాటు యంత్రాలను కూడా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయాధికారుల సంఘం చైర్మన్ కృపాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్‌రెడ్డి, నాయకులు కరుణాకర్ పాల్గొన్నారు. -
జాతీయ.. ప్రాంతీయ పార్టీల గుర్తులు
సాక్షి, ఆలేరు : జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు మంజూరు చేస్తుంది. అదే విధంగా వివిధ పా ర్టీలకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తుంది. ఒక సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఏవైనా నాలుగు రాష్ట్రాల్లో ఓట్లలో నాలుగు శాతం సంపాదించ గలిగితే దానిని జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. ఒక పార్టీ రాష్ట్రం, లేదా ఒక ప్రాంతంలో నాలుగుశాతం ఓట్లు సాధిస్తే దాన్ని ప్రాంతీయ పార్టీగా చెబుతారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎన్నికల గుర్తులను కూడా ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. సిద్ధాంత రీత్యాగానీ.. వ్యక్తుల వల్లగానీ పార్టీ చీలిపోయినప్పుడు ఆ పార్టీ గుర్తును ఏ వర్గానికి కేటాయించాలన్న వివాదం ఏర్పడ్డ సమయంలో ఎన్నికల సంఘం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. జాతీయ పార్టీలు.. దేశంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ఏడు ఉన్నాయి. వీటికి ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు ఇతర పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించదు. దేశంలోని జాతీయ పార్టీలు.. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్‌పార్టీ, భారతీయ జనతాపార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎం), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ , నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. రిజిస్టర్డ్, అన్ రికగ్నైజ్డ్ పార్టీలు ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పాటు రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పార్టీలు కూడా పోటీల్లో ఉంటాయి. ఈ పార్టీలను కొందరు వ్యక్తులు, సంస్థలు పార్టీ పేరుతో ఎన్నికల సంఘంలో నమోదు చేస్తుంటాయి. ఎన్నికల్లో పోటీ చేసినా.. చేయకపోయినా అవి అలాగే కొనసాగుతుంటాయి. ఒక వేళ పోటీ చేసినట్లయితే ఆ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌గా ఉంచే వాటి నుంచి గుర్తులు కేటాయిస్తుంది. అయితే వారికి ఇండిపెండెంట్ అభ్యర్థులకన్నా ముందు గుర్తులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం మన దేశంలో సుమారు 1983 రిజిస్టర్డ్, ఆన్ రికగ్నైజ్డ్ పార్టీలు ఉన్నాయి. తెలంగాణలో 73 వరకు ఉన్నాయి. అదే విధంగా 164 ఫ్రీ సింబల్స్‌ను సిద్ధంగా ఉంచుతారు. -
అగ్ని పరీక్ష జాతీయపార్టీలకే!
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో కీలక ఘట్టానికి తెర లేచింది. రాజకీయ యుద్ధ మేఘాలు దట్టంగా అలముకున్నాయి. తదుపరి లోక్‌సభ ఎన్నికలకు అతి సమీపంలో జరుగుతున్న ఈ ఎన్నికలు ముఖ్యంగా జాతీయ పార్టీలకు అగ్ని పరీక్ష. హస్తినలో పాగా వేయడానికి అవసరమైన పోరాడే స్థైర్యం, నైతిక బలం ఇచ్చే ఈ ఎన్నికల ఫలితాలపై బీజేపీ, కాంగ్రెస్ ఆశలు పెట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఆయా రాష్ట్రాల పార్టీ నాయకత్వం కన్నా మోదీ, రాహుల్ నాయకత్వాలకు ఈ ఎన్నికలే లిట్మస్ పరీక్ష. మిజోరం, తెలంగాణ మినహా మిగతా మూడు రాష్ట్రాలు బీజేపీ పాలనలో ఉన్నాయి. వాటిని నిలుపుకోవడం వారికి అత్యవసరం. అయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావంతో అది కష్టసాధ్యంగా కనిపిస్తోంది. మరోవైపున ఆ మూడు రాష్ట్రాలను చేజి క్కించుకోవడం చెయ్యి గుర్తు కాంగ్రెస్‌కి అత్యంత కీలకం. రాజకీయ అవసాన దశలో ఉన్న ఆ పార్టీ ఐదు రాష్ట్రాల్లో కనీసం మూడు, హీనపక్షం రెండు, రాజస్తాన్, మధ్యప్రదేశ్ అయినా గెలుచుకుంటేనే వచ్చే సాధారణ ఎన్నికల్లో జాతీయ పార్టీగా మనగలుగుతుంది. లేదంటే ప్రాంతీయ పార్టీ స్థాయికి కుచించుకుపోతుంది. ప్రస్తుతానికి ఇతర పార్టీలు దానితో కలిసి రాకున్నా ఆ మూడు రాష్ట్రాల్లో వాతావరణం దానికే అనుకూలంగా ఉంది. తెలంగాణలో కూటమిగా అధికార తెరాసకు బలమైన పోటీదారు. కాబట్టి నాయకుడిగా రాహుల్ గాంధీకి ఇక్కడ గెలుపు చాలా అవసరం. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ప్రస్తుతానికి మోదీకి నష్టం ఏమీ లేకున్నా, నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. వ్యతిరేక కూటమి బలోపేతం కావడానికి ఊతం దొరుకుతుంది. కాబట్టి హస్తిన పార్టీలు రెండూ ఈ ఐదు ఊళ్ళు ఇమ్మంటున్నాయి. తెలంగాణలో మాత్రం ఎన్నికల ఫలితాలు అటు కాంగ్రెస్‌కూ, ఇటు తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా అగ్నిపరీక్షే. అన్నిపక్షాల్లో అపరిమితంగా ఆశలు రేపుతున్న ఈ ఎన్నికల్లో తెలం గాణ ప్రజల మొగ్గు ఎటువైపు అన్నది తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది. కానీ ప్రజలకు మాత్రం మళ్లీ లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకూ కునుకు పట్టదు. ఎన్నికల కోడ్ ఫలితంగా ఇక ప్రచారాలు, హామీలు, తిట్లూ, దీవెనలే తప్ప నిఖార్సయిన పనులు, పథకాలకు బ్రేకులు పడ్డట్టే. నర్సింగ్ యాదవ్, నాచారం, హైదరాబాద్ -
ఆ ఐదు పార్టీల్లో బీఎస్పీ టాప్!
న్యూఢిల్లీ: దేశంలోని ఐదు జాతీయ పార్టీల ఆదాయం(కాంగ్రెస్, బీజేపీ మినహా) కలిపి రూ.299.54 కోట్లు కాగా, బీఎస్పీ రూ.173.58 కోట్లతో సింహభాగంలో ఉంది. రూ.100.25 కోట్లతో సీపీఎం తర్వాతి స్థానంలో ఉందని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం వెల్లడించింది. అయితే, 2016–17 కాలానికి ఆడిట్ నివేదిక సమర్పణ గడువు ముగిసినా కాంగ్రెస్, బీజేపీ ఇంకా ఆదాయ వివరాలను సమర్పించలేదంది. -
తెలుగోడి దయ కోసం...
* జాతీయ పార్టీల తరఫున ప్రచారబరిలో ఆంధ్ర, తెలంగాణ నాయకులు * సినీనటులను నమ్ముకుంటున్న ఎన్సీపీ * స్థానిక నాయకులతో నెట్టుకొచ్చేస్తున్న శివసేన * తెలుగు ఓట్లు చీలడం ఖాయమంటున్న విశ్లేషకులు సాక్షి, ముంబై: బహుముఖ పోటీ నెలకొన్న ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ సీట్లు సాధించేందుకు రాజకీయ పార్టీలు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అభ్యర్థుల భవితవ్యాలను తేల్చే సత్తా ఉన్న తెలుగువారిని ఆకర్షించేందుకు సైతం పార్టీలు ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఈ విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ముందున్నాయనే చెప్పవచ్చు. ముంబైతోపాటు పలు జిల్లాల్లో స్థిరపడిన తెలుగువారిని తమ పార్టీ అభ్యర్థుల వైపు ఆకర్షించేందుకు ఈ రెండు పార్టీలూ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలను ప్రచార బరిలో దింపాయి. వారు ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండేప్రాంతాలలో పర్యటిస్తూ తమ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాలంటూ కోరుతున్నారు. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో తెలుగు నాయకులు తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. మహారాష్ట్రలో ఈ నెల 15న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయిడు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు కృష్ణంరాజు, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, గురవారెడ్డి, కాంగ్రెస్ తరఫున పొన్నం ప్రభాకర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మధుయాష్కి గౌడ్ తదితర నాయకులు గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలోని షోలాపూర్, మరాఠ్వాడాలోని నాందేడ్, విదర్భలోని చంద్రాపూర్లతోపాటు ముంబై, భివండీలపై వీరు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. దీంతో తెలుగు వారుండే పలు ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న అనుభూతి కలుగుతోందని చెప్పవచ్చు. ఫ్లకార్డుల నుంచి వేదికపై బ్యానర్లు తదితరాలన్నీ దాదాపు తెలుగులోనే దర్శనమిస్తున్నాయి. హామీల వర్షం... తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగు నాయకులందరు హామీల వర్షం కురిపిస్తున్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంతోపాటు తెలుగు వారికి అండగా ఉంటామని చెబుతున్నారు. తమ పార్టీలు అధికారంలోకి వస్తే తెలుగు ప్రజల కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తామని కొందరు వాగ్దానాలు చేస్తుండగా తెలుగు భవనం, తెలంగాణా భవనం నిర్మిస్తామని మరి కొందరు చెబుతున్నారు. ముంబైలోని కామాటిపురా, వర్లీ, భివండీలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు జరిగిన బహిరంగ సభలు, చిన్నచిన్న సభలకు సైతం భారీ సంఖ్యలో తెలుగు ప్రజలు హాజరవుతుండడం విశేషం. దీంతో తెలుగు నాయకులు కూడా తమ పార్టీలే గెలుస్తాయన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎన్సీపీ తరఫున టాలీవుడ్ నటులు... జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన నాయకులను ఎన్నికల ప్రచారంలోకి దింపడంతో రాష్ట్రీయ పార్టీలు మరోమార్గాన్ని ఎంచుకున్నాయి. ముఖ్యంగా తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్సీపీ టాలీవుడ్ నటులను ప్రచారంలోకి దింపింది. ఆదివారం ఉదయం వర్లీతోపాటు కొన్ని ప్రాంతాల్లో తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచతమైన సోనూ సూద్ ఎన్సీపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. రోడ్ షో నిర్వహించారు. మరోవైపు ఆదివారం రాత్రి నిర్వహిం చిన బహిరంగ సభలో తెలుగు నటుడు ప్రకాష్ రాజ్ ప్రచారం చేసి ఎన్సీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మరోవైపు శివసేన స్థానిక తెలుగువారిని ప్రచారంలోకి దింపింది. తెలుగు వారి కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ శివసేనకే ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. ఇలా తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీలు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. చీలనున్న తెలుగు ఓట్లు...? వివిధ పార్టీలకు చెందిన తెలుగు నాయకులు చేస్తున్న ఎన్నికల ప్రచారం తెలుగు ఓటర్లపై ఎంతమేర ప్రభావం చూపనుందనేది ఇప్పుడే ఎవరూ చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా భివండీ, ముంబైలోని వర్లీతోపాటు పలు నియోజకవర్గాల్లో ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీకి చెందిన తెలుగు నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఎన్సీపీ టాలీవుడ్ నటులను రంగంలోకి దింపింది. దీంతో తెలుగు ప్రజలు కీలకంగా ఉండే అనేక నియోజకవర్గాల్లో ఓట్ల చీలిపోయే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ముంబై, భివండీ లాంటి ప్రాం తాల్లో తెలుగు అభ్యర్థులెవరూ బరిలోలేరు. తెలుగు ఓట్లు కీలకంగా ఉన్న ప్రాంతంలో ఏదైనా పార్టీ తెలుగు అభ్యర్థిని బరిలోకి దింపి ఉంటే తెలుగు ఓట్లలో చీలికశాతం తక్కువగా ఉండే అవకాశం ఉండేది. కాని ప్రస్తుత పరిస్థితిలో తెలుగు ఓట్లు చీలిపోవడం ఖాయమని కొందరు విశ్లేషిస్తున్నారు. -
దేశంలో మూడే జాతీయ పార్టీలు మిగలనున్నాయా?
-
ఆరు పూలకు మూడే కాయలు...
-
పేరేదైతేనేం.. పెట్టెయ్ పార్టీ!
దేశవ్యాప్తంగా నమోదైన పార్టీల సంఖ్య 1,593 చిత్ర విచిత్రమైన పేర్లు, కాగితాలపైనే ఉనికి మేఘదేశం.. టిప్పు సుల్తాన్.. జై మానవతా.. ఆప్కా హమారా... (స్వాతి): ఎన్నికల వేళ సమీపిస్తూనే కొత్త పార్టీలు పుట్టుకు రావడం సహజం. పలు కారణాలతో తెరపైకి వచ్చిన పార్టీలు దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నున్నాయో తెలుసా? ఏకంగా 1,593! అయితే వీటిలో కేవలం 6 మాత్రమే జాతీయ పార్టీలు. మరో 54 పార్టీలకు రాష్ట్ర స్థాయి గుర్తింపుంది. మిగతావన్నీ కేవలం నమోదైన రాజకీయ పార్టీలు మాత్రమే. మరి ఇన్ని పార్టీలకు పేర్లు దొరకాలంటే మాటలా?! అందుకే... విమెనిస్ట్, జాగ్తే రహో లైఫ్ పీస్ఫుల్, అఖిల భారతీయ భారత్‌మాతా-పుత్రపక్ష, లేబర్ అండ్ జాబ్ సీకర్స్, భారతీయ మొహబ్బత్, పిరమిడ్, సర్వే భవంతి సుఖినః, నేషనల్ వరల్డ్ లైఫ్ పంచతత్వ, చిల్డ్రన్ ఫస్ట్, జగత్ తెలుగు మున్నేట్ర కజగం, మనువాద, నేషనల్ టైగర్, బోల్షివిక్, అలీ సేన, థర్డ్ వ్యూ, ఆలిండియా గరీబ్ కాంగ్రెస్... ఇలాంటి చిత్ర విచిత్రమైన పేర్లకు చివర్లో ‘పార్టీ’ అని తగిలించేసుకు న్నాయి. చివరికి పబ్లిక్, ఓటర్స్ పేరుతో కూడా పార్టీలు న్నాయి! కాకపోతే వీటిలో చాలావరకు డమ్మీ పార్టీలే. జాతీయ పార్టీ హోదా ఇలా... అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో అభ్యర్థులను నిలిపి, 6 శాతానికి తగ్గకుండా ఓట్లు సాధించిన పార్టీలకే జాతీయ పార్టీలుగా గుర్తింపు దక్కుతుంది. లేదా కనీసం 3 రాష్ట్రాల నుంచి లోక్‌సభలో 2 శాతం సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నా జాతీయ పార్టీగా గుర్తింపు ఇస్తారు. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, పార్లమెంటు ఎన్నికల్లో కానీ సదరు పార్టీ అభ్యర్థులంతా చెల్లుబాటైన మొత్తం ఓట్లలో 8 శాతానికి తక్కువ కాకుండా తెచ్చుకోవాలి. లేదా మొత్తమ్మీద పోలైన ఓట్లలో ఆ పార్టీ కనీసం 6 శాతం ఓట్లు సాధించాలి. జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే ఉమ్మడి ఎన్నికల గుర్తు కేటాయిస్తారు. వాటికి ప్రభుత్వ ప్రసార మాధ్యమాలలో ఉచితంగా ప్రచారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. అంతేగాక ఎన్నికల సంఘం నిర్వహించే అఖిలపక్ష సమావేశాలకు కూడా వాటిని ఆహ్వానిస్తారు. ఏ ఎన్నికల్లోనైనా నిర్దిష్ట శాతం ఓట్లు రాకపోతే సదరు పార్టీకి ఉన్న జాతీయ, రాష్ట్ర గుర్తింపును ఈసీ రద్దు చేస్తుంది. జాతీయ హోదా పోగొట్టుకున్న రాష్ట్రీయ జనతాదళ్ ఇందుకు ఉదాహరణ. అయితే గుర్తింపుకు ఉప ఎన్నికలు ప్రాతిపదిక కావు. రాష్ట్రంలో 54 పార్టీలు రాష్ట్రంలో కూడా ఈసారి సార్వత్రిక ఎన్నికల బరిలో దిగేందుకు పలు పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. వీటిలో చాలావరకు తెలంగాణ లేదా సమైక్యాంధ్ర పేర్లతో వచ్చినవే. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి, ఆంధ్రనాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి, తెలంగాణ సకల జనుల పార్టీ, తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ, జై తెలంగాణ పార్టీ, మా తెలంగాణ పార్టీ, యువ తెలంగాణ పార్టీ... ఇలా ఉన్నాయి పేర్లు. ప్రస్తుత లోక్‌సభలో 38 పార్టీలకు ప్రాతినిధ్యముంది. వీటిలో 12 పార్టీలకు ఒక్కొక్క సభ్యుడున్నారు. 7 పార్టీలకు ఇద్దరేసి, 10 పార్టీలకు 3 నుంచి 10 మంది వరకు సభ్యులున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు మాత్రమే 5 శాతం (27 సీట్లు) కంటే ఎక్కువ సీట్లున్నాయి. పార్టీలు.. పదనిసలు... 1,027: 2009 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం వద్ద నమోదైన పార్టీల సంఖ్య. 2004లో ఈ సంఖ్య 173 మాత్రమే. 363: 2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీల సంఖ్య. వీటిలో 7 జాతీయ పార్టీలు (తర్వాతి కాలంలో ఆర్జేడీకి జాతీయ పార్టీ గుర్తింపు గల్లంతైంది), 34 రాష్ట్ర పార్టీలు, 242 నమోదవని, గుర్తింపు పొందని పార్టీలున్నాయి. 3,831 మంది స్వతంత్రులుగా పోటీ చేశారు. 54: మన రాష్ట్రంలో ఇప్పుడు పార్టీల సంఖ్య ఇది. 2004లో పార్టీలు 36 కాగా, 2009 నాటికి అవి 40కి పెరిగాయి. -
17న ధర్నాకు జాతీయ పార్టీలకు ఆహ్వానం
ఢిల్లీ: ఈ నెల17న జరిగే ధర్నాకు జాతీయ పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందదన్నారు. కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్ తిరస్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ భూస్థాపితం అవడం ఖాయం అన్నారు. లోక్‌సభ వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని అశోక్‌బాబు కోరారు. -
జగన్ బాటలో జాతీయ పార్టీలు
వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు విభజనవల్ల వచ్చే సమస్యలను అందరికీ వివరించారు అందుకే ఇప్పుడు ఆ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి కిరణ్, ఆదాల సమైక్యవాదులైతే సస్పెండ్ చేయరేం? బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాట 2014లో సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు... విజయం మాదే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో పలు జాతీయ పార్టీలు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరిన బాటలోనే నడుస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. రాష్ట్రా న్ని విభజించడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని జగన్ కొంతకాలం కిందట జాతీయ స్థాయి నేతలను కలసి వివరించిన నేపథ్యంలోనే బిల్లుపై ఇప్పుడు ఆ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన వెంటనే జగన్మోహన్రెడ్డి దేశమంతా తిరిగి విభజన వల్ల తలెత్తే సమస్యలు, ఆర్టికల్-3ను దుర్వినియోగం చేస్తున్న విధానాన్ని అనేక రాజకీయ పార్టీల నేతలను కలసి వివరించారని గుర్తుచేశారు. విభజన ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా భవిష్యత్తులో మీ రాష్ట్రాలకూ ఆ ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. విభజనను వ్యతిరేకించే వారు మాతో కలసిరావాలని కోరారు. జగన్ లేవనెత్తిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీలు విభజనకు వ్యతిరేకంగా పార్లమెంట్లో గళం విప్పనున్నాయి. పార్లమెంట్ సమావేశాలను పురస్కరించుకుని సోమవారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలోనూ సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు విభజనను వ్యతిరేకించాయి. చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన బీజేపీ సైతం ఈ సమయంలో విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం సరికాదని చెప్పింది’’ అని తెలిపారు. ఎలాంటి ప్రాతిపదిక లేకుం డా రాష్ట్రాన్ని విభజించ డానికి జరుగుతున్న ప్రయత్నాలను వివరించి... జాతీయ స్థాయి పార్టీలు సైతం ఆలోచించేలా చేసిన తమ అధినేత ప్రయత్నాలకు తామం తా గర్విస్తున్నామన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ ఏకపక్షంగా జరుగుతున్న ప్రయత్నాలను జగన్ స్వయంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను కూడా కలసి వివరించారని గుర్తుచేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... అసెంబ్లీ తీర్మానాన్ని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బ్రహ్మాస్త్రంగా అభివర్ణించుకుంటే కాంగ్రెస్ మాత్రం చిత్తు కాగితంతో సమానమని తీసిపారేస్తోంది. బ్రహ్మాస్త్రం వేశానని, మౌనదీక్షలు చేస్తానని సీఎం ఇప్పుడు డ్రామాలు చేసే బదులు సీడబ్ల్యూసీ తీర్మానం సమయంలోనే రాజీనామా చేస్తే బిల్లు సభలోకి రావడం, చర్చ జరగడం వంటివి ఉండేవి కావు. సమైక్య సింహ మని చెప్పుకుంటున్న సీఎం ఆ పార్టీ అధినేత సోనియాగాంధీని విభజన దేవతగా విమర్శిస్తుంటారు. అధిష్టానం మాత్రం ఆయనను పదవినుంచి తప్పించదు. దీన్నిబట్టి ఆ పార్టీ నాటకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. విభజనకు పద్ధతి ఉంటుంది. కమిటీలు, కమిషన్ల ద్వారా ఆ నిర్ణయాలు తీసుకుంటారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. అంటే ఆయన విభజనకు వ్యతిరేకం కాదని స్పష్టమవుతోంది. అందర్నీ కూర్చోబెట్టి నిర్ణయం తీసుకోవాలన్న చంద్రబాబు తన పార్టీలోని ఇరు ప్రాంతాల నేతలను వేర్వేరు గదుల్లో కాకుండా ఒక్కచోట ఎందుకు సమావేశపర్చలేకపోతున్నారు? గతంలో బీజేపీని విమర్శించి, సిగ్గులేకుండా తిరిగి ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకునేందుకు ఎందుకు వెంపర్లాడుతున్నారు? సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీని సమావేశపరిచి విభజనకు వ్యతిరేకం అని తీర్మానం చేయమని కోరిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో 90శాతం విజయం సాధించాం. రాబోయే ఎన్నికల్లోనూ మా పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని తెలిసే కావాలనే కాంగ్రెస్, టీడీపీలు విమర్శలు చేస్తున్నాయి. పార్టీని వీడేవారు విమర్శలు చేస్తూ వెళ్లడం రాజకీయాల్లో సహజమే. ఢిల్లీలో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రాష్ట్ర విభజన జరిగేట్లు కనిపించడం లేదు. 2014లో ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయి. రాజ్యసభ ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు లేదు రాజ్యసభ ఎన్నికల్లో మేము ఏ అభ్యర్థికీ మద్దతు ఇవ్వబోమని గతంలో చెప్పిన దానికే కట్టుబడి ఉన్నాం. ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకునే సంఖ్యాబలం లేనందున మా పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం లేదు. ఎవరి బలం మీదనో ఆధారపడి అభ్యర్థిని నిలబెట్టడం అంటే అది కుమ్మక్కు రాజకీయాల్లో భాగ మే అవుతుందని మా పార్టీ అభిప్రాయం. ఆ వైఖరికే పార్టీ కట్టుబడి ఉంటుంది. ఆదాల ప్రభాకరరెడ్డికి మా పార్టీ మద్దతు ఇస్తుందని కాంగ్రెస్‌లోని ఒక బఫూన్ చెప్పారు. ఆదాల సమైక్యవాది అని ఎవరో అంటే నమ్మాలా? పార్టీలోనే ఉండి రాజ్యసభకు పోటీ చేస్తున్నా ఆయన్ను కాంగ్రెస్ ఎందుకు సస్పెండ్ చేయలేదు? -
త్రిశంకు లోక్‌సభ!
ఏడు తూర్పు, దక్షిణాది రాష్ట్రాల తీరు ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ముందంజలో కాంగ్రెస్ సత్తా చాటనున్న ప్రాంతీయ పార్టీలు లోక్‌నీతి-ఐబీఎన్ నేషనల్ ట్రాకర్ పోల్ అంచనా న్యూఢిల్లీ: కొన్ని నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు హంగ్ ఫలితాలు ఇవ్వనున్నాయా? అధికారంలో ఉన్న, లేని ప్రాంతీయ పార్టీలు సత్తా చాటనున్నాయా? జాతీయ పార్టీలకు అగ్నిపరీక్ష ఎదురుకానుందా? లోక్‌నీతి-ఐబీఎన్ నేషనల్ ట్రాకర్ పోల్ ఫలితాలు అవుననే అంటున్నాయి! తూర్పు, దక్షిణ భారతంలోని ఏడు రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో లోక్‌సభ ఎన్నికల్లో త్రిశంకు ఫలితాలు రానున్నట్లు తేలింది. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో ఈ సర్వే నిర్వహించారు. మొత్తం 232 స్థానాలున్న వీటిలో ఏ జాతీయ పార్టీకీ పూర్తి మెజారిటీ రాదని తేలింది. సర్వే ఫలితాల ప్రకారం.. 36 నుంచి 62 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పెద్ద పార్టీగా, 22 నుంచి 40 సీట్లతో బీజేపీ రెండో పెద్ద పార్టీగా అవతరించే అవకాశముంది. కాంగ్రెస్ తాను అధికారంలో ఉన్న కేరళ, కర్ణాటకలో సత్తా చాటనుంది. బీజేపీ బీహార్, కర్ణాటకల్లో మంచి పనితీరు కనబరచనుంది. మిగిలిన పార్టీలు వాటి సొంత రాష్ట్రాలకే పరిమితమై, ఇతర రాష్ట్రాలపై ప్రభావం చూపకపోవచ్చు. నరే ంద్ర మోడీని ప్రధాని రేసులో దింపిన బీజేపీ తాననుకున్న లక్ష్యం సాధించాలంటే ఉత్తర, పశ్చిమ భారతంలోని లోక్‌సభ సీట్లను స్వీప్ చేయాల్సిందే. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లకు సంబంధించి లోక్‌నీతి-ఐబీఎన్ నేషనల్ ట్రాకర్ పోల్ ఫలితాలను ‘సాక్షి’ మంగళవారం వెల్లడించడం తెలిసిందే. 42 సీట్లున్న పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు 20-28, కాంగ్రెస్‌కు 5-9, బీజేపీకి 0-2 వస్తాయని, 21 సీట్లున్న ఒడిశాలో అక్కడి అధికార బీజేడీకి 10-16, కాంగ్రెస్‌కు 3-9, బీజేపీకి 0-4 వస్తాయని సర్వేలో తేలింది. -
రాష్ట్ర విభజన జాతీయ సమస్య: యనమల
ఓ వ్యక్తి అడిగాడని రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే దేశం ముక్కలవుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జాతీయ సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలోని అన్ని పార్టీలతో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకానీ రాష్ట్ర స్థాయిలోని అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తే సరిపోదని అయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాల విభజన విషయంలో జాతీయ విధానం ఉండాలని యనమల రామకృష్ణుడు కేంద్రానికి సూచించారు. -
లోక్‌సభ ఎన్నికలకు జేడీఎస్ రెడీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్రంలోని యూపీఏ సర్కారు వరుస కుంభకోణాలు, రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని జేడీఎస్ నిర్ణయించింది. బెంగళూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన పార్టీ జాతీయ కార్య వర్గ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను సమాన దూరంలో పెట్టాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటితో పొత్తు పెట్టుకోరాదని తీర్మానించారు. బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ నియోజక వర్గాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్న దుష్ర్పచారం వల్లే ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని సమావేశం వాపోయింది. కనుక వచ్చే ఎన్నికల్లో ఇరు జాతీయ పార్టీలను సమాన దూరంలో ఉంచడంతో పాటు వామపక్షాలతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. మొత్తం 28 లోక్‌సభ నియోజక వర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి వచ్చే నెల నుంచే నాయకులందరూ రాష్ర్ట పర్యటన చేపట్టాలని తీర్మానించింది. అభ్యర్థుల ఎంపిక అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు హెచ్డీ. దేవెగౌడకు అప్పగించింది. గత శాసన సభ ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓడిన నియోజక వర్గాలను గుర్తించి, అక్కడ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలను చేపట్టాలని తీర్మానించింది. సమావేశంలో కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి సహా వివిధ రాష్ట్రాల పదాధికారులతో పాటు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఏ. కృష్ణప్ప, ప్రతిపక్ష నాయకుడు హెచ్డీ. కుమారస్వామి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్య వర్గ సభ్యులు పాల్గొన్నారు.