
రాష్ట్ర విభజన జాతీయ సమస్య: యనమల
ఓ వ్యక్తి అడిగాడని రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే దేశం ముక్కలవుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జాతీయ సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలోని అన్ని పార్టీలతో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అంతేకానీ రాష్ట్ర స్థాయిలోని అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తే సరిపోదని అయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాల విభజన విషయంలో జాతీయ విధానం ఉండాలని యనమల రామకృష్ణుడు కేంద్రానికి సూచించారు.