
అశోక్ బాబు
ఢిల్లీ: ఈ నెల17న జరిగే ధర్నాకు జాతీయ పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందదన్నారు. కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
తెలంగాణ బిల్లును పార్లమెంట్ తిరస్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ భూస్థాపితం అవడం ఖాయం అన్నారు. లోక్‌సభ వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని అశోక్‌బాబు కోరారు.