ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ కోరుతూ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ‘ఫోన్‌ట్యా పింగ్’ అంశాన్ని రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం చేయాలని బీజేపీ భావి స్తోంది. ఫోన్‌ట్యాపింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ లేదా సమగ్ర దర్యాప్తు జరిపించాలనే డిమాండ్‌తో ధర్నాలు, వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైంది. ఈ కార్యాచరణలో భాగంగా...శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించనుంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ కొనసా గుతున్న నేపథ్యంలో...ఈ ధర్నా నిర్వహణకు ఎన్ని కల కమిషన్ అనుమతి కోరుతూ రాష్ట్ర పార్టీ లేఖ రాసింది.
ధర్నాచౌక్‌లో నిరసన తెలిపేందుకు పోలీసుల అనుమతి కోరుతూ సంబంధిత అధికారులకు లేఖను అందజేసింది. ఈ ఆందోళనా కార్యక్రమంలో బీజేపీ ఓబీసీమోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను నీరుగార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కేసును తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment