వాటర్షెడ్లతో గ్రామాల అభివృద్ధి
గంభీరావుపేట : వాటర్షెడ్లతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. నేల, నీరు, చెట్లు, పశు సంపద సంరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు. భవిష్యత్‌లో బతుకుదెరువుకు దారులు చూపుతాయన్నారు. నాబార్డ్ నిధులు రూ.3కోట్లతో మండలంలోని గజసింగవరం, దమ్మన్నపేట, ముస్తఫానగర్ వాటర్షెడ్ల నిర్మాణానికి కలెక్టర్ కృష్ణభాస్కర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో కలిసి ఎంపీ సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో మాట్లాడారు. వాటర్షెడ్లను రైతులు సద్వినియోగం చేసుకుని సత్ఫలితాలు సాధించాలని కోరారు. ఉద్యమస్ఫూర్తితోనే రాష్ట్రంలో పాలన కొనసాగుతుందన్నారు. ఇక్కడి ప్రాంతంలో అడవులు ఉన్నప్పటికీ నీళ్లు లేక వ్యవసాయం కుంటుపడిందని..అందుకే వాటర్‌షెడ్ మంజూరు చేయించినట్లు తెలిపారు. యుద్ధప్రాతిపదికన ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. సర్పంచ్ కొండూరి గాంధీ, నాబార్డు ఏజీఎం సుదర్శన్ చందర్, డీడీఎం రవిబాబు, ఎంపీపీ కమ్మరి గంగసాయవ్వ, జెడ్పీటీసీ మల్లుగారి పద్మ, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, వైస్ చైర్మన్ మోహన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.