లోక్సభలో వాయిదాల పర్వం శుక్రవారం కొనసాగుతుంది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్సభ తిరిగి ప్రారంభమైంది. దాంతో అటు సీమాంధ్ర ఎంపీలు,ఇటు తెలంగాణ ఎంపీలు స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లారు. తమ తమ ప్రాంతాలకు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తుంన్నారు. ఇరుప్రాంతాల ఎంపీలకు నచ్చ చెప్పేందుకు స్పీకర్ ప్రయత్నించారు.
ఎంపీలు ఎంతకు తమ పంతాలను విడకపోవడం, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులతోపాటు బీజేపీ సభ్యులు జస్టిస్ గంగూలీని పదవి నుంచి తొలగించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశాయి. దాంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో మధ్యాహ్నం 1.00 గంట వరకు వాయిదా వేసినట్లు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు.